విశ్వ విజ్ఞాన శిఖరం

| సాహిత్యం | క‌విత్వం

విశ్వ విజ్ఞాన శిఖరం

- ఉప్పెన | 21.03.2018 09:54:24am

ఈ విశ్వం
ప్రకృతి పరిణామం
మార్పుల రూపమే ఈ విశ్వం
ఈ విశ్వానికి సృష్టి కర్త
ఎవరో కాదని ! ఎవరో కాదని !!
విశ్వరహస్యాల గుట్టు విప్పిన విజ్ఞాన శిఖరం
మనిషిని సృష్టించింది దేవుడు కానే కాదని
కొందరు మానవులు భయం భీతి వల్ల
తమ అవసరాలకొరకు దేవున్ని సృష్టించుకొని
అందరి పైన రుద్ది వాడుకొని
ఆడుకుంటున్నారన్న మహా విజ్ఞాన గని
దేవుడనే వాడు లేనే లేడని
ఢంకా భజాయించీ చాటిన మేటి మహా కాల జ్ఞాని
మతం మత్తును ఎక్కించిన
కులం కుళ్ళును అంటించిన
మనువాదుల కుట్రల బాగోతాన్ని భయట పెట్టిన
శాస్త్రీయ చైతన్య ఆలోచనల వెలుగుల
మహా మనిషి వైజ్ఞానిక వైతాళికుడు !
శరీరం చచ్చు పడిసహాకరించకపోయిన
యేండ్ల తరబడి చక్రాల కుర్చీలోనే
ఆలోచనలను మండించి
బావాలను సంధించి
ప్రపంచాన్ని సోదించి సాధించిన
తాను కదలకపోయిన ఈ ప్రపంచాన్ని కదిలించి
తాను మెదలకపోయిన ఈ విశ్వాన్ని మెదిలించి
పండించిన ఫలితాలను అందించిన ఖగోళ విజ్ఞాని
నిజాల నిప్పు కణికలను విశ్వమంతా వెదజల్లి
అబద్దాలను కాల్చి బూడిద చేసే
కర్తవ్యాన్ని భూజాన వేసుకొని
అలుపును దరిచేరనీయకుండా
గెలుపుల బాటలో సాగిపోయిన
కృష్ణ బిలాల పరిశోధకుడా
బిగ్ బ్యాంగ్ లో బాగస్వాముడా
ఆది కణం అన్వేషకుడా
నీ మరణం మర్వలేనిది
ఈ విశ్వం చిరంజీవి ! నీవు సదా చిరంజీవివే !!
ఓ విశ్వ శాస్త్ర వేత్తా ఐన్ స్టీన్ స్టీఫేన్ హాకింగ్
మా వినమ్ర నివాలు ! జోహారులు !!

No. of visitors : 279
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఈవ్ టీజింగ్ సాకు తీసుకొని మొత్తం దళితవాడను సాంఘిక బహిష్కరణకు గురిచేయడం అమానుషం
  మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...
  దేశద్రోహ నేరం!
  అగ్ర వుగ్రవాదం!
  ఆదాయం సున్నా ఖర్చు పన్నెండు!
  ఆ పిల్లకు క్షమాపణతో...
  కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
  చిన్న చేపల్ని చంపుతున్న పెద్ద పరిశ్రమ
  నేనూ అర్బన్ మావోయిస్టునే
  సుధా భరద్వాజ్ కు నా సెల్యూట్‌
  గౌతమ్‌నవలఖా సదా సూత్రబద్ధమైన అసమ్మతివాది.
  మానవ హక్కుల పరిరక్షకులపై దాడిని ఖండిస్తూ పంజాబ్‌ మేధావుల సంయుక్త ప్రకటన

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •