ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

| సాహిత్యం | క‌థ‌లు

ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

- మెట్టు ముర‌ళీధ‌ర్‌ | 21.03.2018 10:29:25am

ఆ రోజు ఉదయం నాలుగు గంటలకే చందుకు తెలివి వచ్చింది. అప్పటి నుండి ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు.

అతని మెదడు రకరకాలుగా ఆలోచిస్తోంది.

అంతకుముందు వార్తలమీద శ్రద్ద పెట్టని చందు పెద్దనోట్లు రద్దరుునప్పటినుండి వాటి మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు. పేపరు చదువుతున్నాడు. టి.వి. వార్తలు చూస్తున్నాడు. తెలిసినవారు మాట్లాడుకుంటుంటే వింటున్నాడు.

ఏ పేపరు చూచినా, ఏ వార్త విన్నా నోట్ల రద్దు కారణంగా మామూలు ప్రజలు పడుతున్న కష్టాలే కనిపిస్తున్నారుు, వినిపిస్తున్నారుు. బ్యాంకుల్లో సరిపడా డబ్బులు ఉండడం లేదు. కేవలం రెండు వేల నోట్లే కనిపిస్తున్నాడు. చిల్లర కనబడడం లేదు. ఐదు వందల నోట్లు ఇంకా పంపిణీ కాలేదు.

ఇక ఏ.టి.యం ల విషయం ప్రహసనంలా మారింది. దాదాపు అన్ని ఏ.టి.యం. లు మూత పడే ఉన్నారుు. ఏ.టి.యం.లు లోపల పాతనోట్ల సైజుకే సరిచేయబడి ఉన్నాయట. కొత్తనోట్లు పాత వాటిసైజులో లేవట. అందుకే కొత్తనోట్లను ఎ.టి.యం. లు ఒప్పుకోవడం లేదట. వాటినన్నిటిని కొత్తనోట్లకు అనుగుణంగా సరిచేయాలట. సరిచేసే సిబ్బందిని నియమిస్తారట. వాళ్లు వచ్చి సరిచేస్తారట. బహుశా రెండు మూడు రోజులు పట్టవచ్చట.

సిటీలో వందల కొద్ది ఏ.టి.యం.లుండగా ఒకటి రెండు మాత్రమే తెరచి ఉంటున్నారుు. అక్కడ వందల మంది క్యూ కడుతున్నారు. అందులో పెట్టిన వంద రూపాయల నోట్లు గంటలోనే అరుుపోతున్నారుు.

బ్యాంకుల ముందు కూడా జనం క్యూలు అలాగే కొనసాగుతున్నారుు. వాళ్ళిచ్చే నాలుగు వేలు జనానికి ఏ మూలకూ సరిపోవడం లేదు. అందుకే ఈ రోజు తీసుకున్న వారే మళ్లీ రేపు క్యూ కడుతున్నారు. వారికి తోడు నల్ల కుబేరుల డబ్బులు మార్చే కిరారుు మనుషులు ఉండనే ఉన్నారు. దాంతో ప్రతి బ్యాంకు ముందు ప్రతిరోజు ఏదో ఓ సమయంలో గొడవ జరుగుతూనే ఉంది.

నిన్నటి నుండి నగదు ఉపసంహరణను నాలుగువేల నుండి నాలుగువేల ఐదు వందలకు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కాని ప్రభుత్వ ఉదారత బ్యాంకుల్లో పనిచేయడం లేదు. నాలుగు వేలు అలాగే ఇస్తున్నారు. కొన్ని బ్యాంకుల్లోనైతే రెండు వేలే ఇస్తున్నారు. దాంతో సామాన్యుని కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నారుు.

ఈ పరిస్థితి చూస్తూ విపక్షాలు, ఇతరులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ʹʹఇదంతా జరుగుతుందని ప్రభుత్వానికి తెలియదా?ʹʹ

ʹʹముందస్తు ఏర్పాట్లు లేకుండా ఈ దుందుడుకు చర్య ఎందుకు?ʹʹ అంటూ ప్రతిపక్షాలు

ʹʹరోజువారీ కూలీ పనులు ఆగిపోయారుుʹʹ

ʹʹఇది పేదల వ్యతిరేక ప్రభుత్వంʹʹ అంటూ వామపక్షాలు

ʹʹఆర్‌.బి.ఐ. చేయాల్సిన ప్రకటనలను ప్రభుత్వం చేస్తోందిʹʹ

ʹʹఆర్‌.బి.ఐ. స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వం దిగజార్చిందిʹʹ అంటూ ఆర్ధిక శాస్త్రవేత్తలు

ʹʹఇది నిజంగా హక్కుల ఉల్లంఘనేʹʹ

ʹʹప్రజలు తమ డబ్బు తాము వాడుకునే అవకాశమే లేదుʹʹ అంటూ ప్రజా సంఘాలు

ʹʹరోజుకో రూలుతో ప్రజలను చీకాకుపెడుతున్నారుʹʹ.

ʹʹపెట్టిన రూలు సరిగ్గా అమలు జరగడం లేదుʹʹ అంటూ అందరు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

కాని ప్రభుత్వం వీటన్నిటికీ అతీతంగా ఉంటోంది. మంత్రులు అన్ని పనులు మానేసి ʹనోట్ల రద్దుతో ఎంతో లాభం ఉందిʹ అంటున్నారు. కాని అది ఎలాంటి లాభమో చెప్పడం లేదు.

ʹʹలాభం ఉంటే కదా చెప్పడానికి?ʹʹ అంటూ రద్దు వ్యతిరేకులు ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తున్నారు.

ఇటు ఇంతజరుగుతున్నా అటు పెద్దాయన పర్యటనలు కొనసాగుతూనే ఉన్నారుు. రోజుకో చోట ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నాడు. ʹʹనోట్ల రద్దు ఒక మహత్తరమైన కార్యక్రమం. 50 రోజుల తర్వాత దేశస్వరూపమే మారిపోతుందిʹʹ అని ఉద్ఘాటిస్తూనే ఉన్నాడు.

ఇవన్నీ గమనిస్తున్నాడు చందు. పెద్దగా చదువుకోకపోరుునా ఈ మధ్య ఆర్ధిక వ్యవహారాలు కొద్ది కొద్దిగా తెలుస్తున్నట్టే అనిపిస్తున్నాయతనికి. ఇంతకుముందు పేపరు చదివితే అందులోని హెడ్‌లైన్స్‌ మాత్రమే చదివి వదిలేసేవాడు చందు. అవన్నీ తమకవసరం లేనివని భావించేవాడు.

కాని నోట్లు రద్దరుునప్పటినుండి పేపరు సాంతం చదువుతున్నాడు. వీలైతే ఒకటి కన్నా ఎక్కువ పేపర్లు చూస్తున్నాడు. అందులోని విషయాలన్నీ తమకు అవసరం ఉన్నవే అనుకుంటున్నాడు. ఎడిటోరియల్లు మరియు ఆర్ధిక, సామాజిక విశ్లేషణలు కూడా చదవాల్సినవే అనిపిస్తోందతనికి. మానసిక వికాసానికి అవి దోహదం చేస్తాయని కూడా అనిపిస్తోంది.

రకరకాల కారణాలతో రెండు, మూడు రోజులుగా విలాసరావు డ్యూటీకి పోలేదు చందు. ఈ రోజు ఎలాగైనా పోవాలనుకున్నాడు. రెండు మూడు రోజులు మినహారుుంచాడు గాని, ఇక మీద డ్యూటీకి రాకుంటే ఊరుకోనన్నాడు విలాసరావు. కాని నోట్ల రద్దు తరువాత ఏర్పడిన పరిణామాలతో విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నాడు చందు.

అంతలోనే ఫోన్‌ మోగింది. లత చూసింది. అది జగద్గిరిగుట్ట నుండి.

ʹʹఅన్నయ్యా! జగద్గిరిగుట్ట వాళ్ళుʹʹ అంటూ చందుకిచ్చింది. చందు ఫోన్‌ ఎత్తి అన్నాడు,

ʹʹనమస్తే మామయ్యా!ʹʹ అని

ʹʹఆ చందూ! నమస్తే, బాగున్నారా?ʹʹ అన్నాడు వెంకటయ్య.

ʹʹఅందరూ బాగే మామయ్యా! మీరు బాగున్నారా?ʹʹ

ʹʹఆ బాగే, సరేగాని చందూ! మొన్న నీవు వచ్చినపుడు మనం కలువకపోతిమి. అరుునా అత్తమ్మ అన్ని విషయాలు చెప్పే ఉంటుంది కదా?ʹʹ

ʹʹచెప్పింది మామయ్యా!ʹʹ

ʹʹచందూ! పెళ్ళి పదిహేనురోజులే ఉంది. మీరు డబ్బులు తయారు చేశారో లేదో తెలియదు.ʹʹ

ʹʹడబ్బులు రెడీగా ఉన్నారుు మామయ్యా! మొన్నతెచ్చాను కూడా.ʹʹ

ʹʹతెచ్చావుగాని, అన్నీ పాతనోట్లే నటకదా?ʹʹ

ʹʹఔను మామయ్యా!ʹʹ

ʹʹఅవి మేమేం చేసుకుంటామయ్యా?ʹʹ

ʹʹమీకు బ్యాంకు వ్యవహారాలు తెలుసుగదా మామయ్యా! మీరే ఏదైనా చేయండి.ʹʹ

ʹʹచేసే వాళ్ళమే అరుుతే నిన్నెందుకు వాపసు పంపిస్తాం?ʹʹ

ʹʹమరి ఏం చేయమంటారు మామయ్యా?ʹʹ

ʹʹనన్నడిగితే నేనేం చెపుతాను? మీరే ఏమైనా చెయ్యాలి.ʹʹ

వెంకటయ్య అలా అనేసరికి ఏం చెప్పాలో తెలియక చందు మౌనంగా ఉండిపోయాడు.

ʹʹఇదిగో చందూ! మౌనంగా ఉంటే పనికాదు. ఏదైనా చెయ్యాలి. ఇక దాచుకోవడమెందుకు? అసలు విషయం నేను చెపుతాను విను.ʹʹ

కాసేపు ఆగాడు వెంకటయ్య, చందు ఇంకా మాట్లాడకపోయేసరికి

ʹʹచందూ! వింటున్నావా?ʹʹ అన్నాడు.

ʹʹవింటున్నాను మామయ్యా!ʹʹ

ʹʹపెండ్లి పదిహేను రోజులు మాత్రమే ఉంది. మాకివాల్సిన పైసలు మొత్తం పదిరోజుల్లో ఇవ్వాలి. లేకుంటే పెండ్లి సంగతి ఆలోచించాల్సి వస్తుంది.ʹʹ

ʹʹఅలా అనకండి మామయ్యా!ʹʹ

ʹʹఎలా అనమంటావుమరి?ʹʹ

ʹʹడబ్బులు ఇస్తాం మామయ్యాʹʹ

ʹʹఇవ్వండి మరి.ʹʹ

చందు మాట్లాడలేదు. మళ్ళీ వెంకటయ్యే అన్నాడు.

ʹʹఎక్కువ మాటలద్దు చందూ! పదిరోజుల్లో మాకివ్వాల్సిన పదకొండు లక్షలు ఇవ్వండి. లేకుంటే పెండ్లి జరగదు. అంతే.ʹʹ

ʹʹప్లీజ్‌ మామయ్యా! కొంత టైమివ్వండిʹʹ

ʹʹలేదు లేదు. మీరు అడ్వాన్సుగా ఇచ్చిన రెండు లక్షలు కూడా తిరిగి మీకే ఇచ్చేశాము. దాంతో మన మధ్య జరిగిన ఒప్పందం క్యాన్సల్‌ అరుునట్టే. అరుునా ఇంకా పదిరోజులు చూస్తాము. పదకొండో రోజు నుండి మీకు మాకు సంబంధం లేదు.ʹʹ

అంటూ ఫోన్‌ పెట్టేశాడు వెంకటయ్య.

కాళ్ళ క్రింద భూమి కదులుతున్నట్టనిపించింది చందుకు. పక్కనే ఉన్న మంచం మీద కూర్చున్నాడు.

సాయమ్మ అక్కడే ఉంది. వాళ్ళ మాటలు స్పీకర్‌ ద్వారా విన్నదామె. విషయం పూర్తిగా అర్ధమరుుందామెకు. మంచంలో పడుకొని ఉన్న సాయమ్మ మౌనంగా ఏడుస్తోంది. లత కూడా అమ్మ పక్కనే కూర్చొని ఏడుస్తోంది. చందుకు కూడా ఏడుపస్తోంది.

పది నిమిషాల పాటు గదిలో మౌనం రాజ్యమేలింది.

సాయమ్మ కళ్ళు మూసుకుంది. ఆమె మనసు ఎటో వెళ్ళిపోరుుంది.

సాయమ్మ కళ్ళముందు నాగరాజు కనిపించాడు. వానికి ఓ చేతిలో ఆసిడ్‌ సీసా ఉంది. ఇంకో చేతిలో కత్తుంది. నాగరాజు లత వెంటపడ్డాడు.

ʹʹఅమ్మా! అన్నయ్యా! కాపాడండి, కాపాడండిʹʹ అంటూ అరుస్తూ పరుగెత్తుతోంది లత. నాగరాజు ఆమె వెనుక పరుగెత్తుతున్నాడు.

సాయమ్మ తనూ పరుగెత్తుతోంది. కాని వారివేగాన్ని అందుకోలేకపోతుంది. అంతలోనే సాయమ్మ కాలుకు ఓ రారుు తగిలింది. దాంతో సాయమ్మ పడిపోరుుంది. లేవలేకపోతోంది.

ʹʹఅమ్మా! అమ్మా!ʹʹ అని అరుస్తోంది లత.

నాగరాజు లతను చేరుకున్నాడు.

లత, నాగరాజును ప్రాధేయపడుతోంది.

ʹʹవద్దు, వద్దుʹʹ అంటూ బ్రతిమిలాడుతోంది. అరుునా నాగరాజు ఆగలేదు. ఆసిడ్‌ బాటిల్‌ మూత తీసి లత ముఖం మీద గుప్పించాడు. లత ముఖం బుస బుసమని పొంగుతూ కాలిపోరుుంది. ఇంకా నాగరాజు ఆగలేదు. లత మీదికి కత్తి విసిరాడు. కత్తి లత గొంతులో దిగబడింది.

ʹʹఅమ్మా! అమ్మా!ʹʹ అంటూ లత క్రింద పడిపోరుుంది.

ఇదంతా కళ్ళ ముందే జరిగినట్టు అనిపిస్తోంది సాయమ్మకు.

ʹʹలతా! లతా! బిడ్డా! బిడ్డా!ʹʹ అని అరిచింది.

ʹʹఅమ్మా! అమ్మా!ʹʹ అంటూ లత చందులు ఆమెచుట్టు మూగారు.

సాయమ్మ వణుకుతోంది. ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టారుు.

ʹʹఅమ్మా! అమ్మా!ʹʹ అంటూ లత ఏడుస్తోంది. చందు తట్టుకోలేకపోతున్నాడు.

ఏడుస్తూ, వణుకుతూ, కళ్ళు తెరవకుండానే సాయమ్మ స్పృహతప్పింది. ముఖం మీద నీళ్ళు చల్లి

ʹʹఅమ్మా!ʹʹ అంటూ గట్టిగా పిలిచాడు చందు.

సాయమ్మ కళ్ళు తెరిచింది. లత పక్కనే ఉంది. అదంతా నిజం కాదని తెలిసికూడా ఆమె కళ్ళలో భయం తొలగిపోలేదు.

ʹʹలతా! లతా! నా బిడ్డా!ʹʹ అంటూ లతను దగ్గరగా తీసుకుంది.

ʹʹఅమ్మా! భ్రమలో పడ్డావా?ʹʹ అడిగాడు చందు.

ʹʹబిడ్డా! నాగరాజు కనిపించిండు. లత మీద ఆసిడ్‌ పోసి, కత్తి వేసిండుʹʹ.

ʹʹఅమ్మా! అది భ్రమ. నిజం కాదుʹʹ.

ʹʹఐనా వాన్ని నమ్మెతట్టు లేదు బిడ్డా.ʹʹ

ʹʹవాని సంగతి నేను చూసుకుంటానమ్మా!ʹʹ

ʹʹవాడు రౌడీ ముండాకొడుకు. ఏమన్నా చేస్తాడురా!ʹʹ

ʹʹవాని ముఖం. వాడేం చేయలేడుʹʹ.

ఐనా సాయమ్మలో భయం పోవడం లేదు. వణుకుతూనే ఉంది.

ʹʹఎట్లరుునా వాడు జైలునుండి వచ్చేటప్పటికే లత పెండ్లిచేసి పంపాలె బిడ్డాʹʹ.

ʹʹపంపిద్దామమ్మాʹʹ అన్నాడు చందు, అమ్మకు ధైర్యం చెపుతూ.

ʹʹమరి పైసలు?ʹʹ అడిగింది సాయమ్మ.

ʹʹతయారుచేద్దాంʹʹ. అన్నాడు చందు, ఆనంద్‌ చెప్పిన ప్రైవేటు వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని.

ʹʹచెయ్యాలె బిడ్డా! లేకుంటె దాన్ని బతుకనీయడు వాడుʹʹ

అంటూ కళ్ళు మూసుకుంది సాయమ్మ. ఆమె లత చేరుు విడిచిపెట్టడం లేదు.

చందుకు ఆనాడు కూడా విలాసరావు డ్యూటీకి పోబుద్ధికాలేదు. అమ్మకు ధైర్యంగా అక్కడే కూర్చున్నాడు

No. of visitors : 454
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

మెట్టు మురళీధర్‌ | 02.11.2017 10:33:52am

అత్త అలా ఎందుకందో అర్ధం కాలేదు చందుకు. కట్నం తీసుకోవడం నేరమనే విషయం తెలుసు లక్ష్మికి. ʹకట్నం ఇచ్చుడు, పుచ్చుకోవడం రహస్యంగా జరగాలి. ఈ విషయం కూడా తెలియని అమాయ...
...ఇంకా చదవండి

ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

- మెట్టు ముర‌ళీధ‌ర్‌ | 06.12.2017 12:15:09am

ఈసారి నాగరాజుకు ఒక సంవత్సరం జైలుశిక్ష పడింది. జైలుకు పోతూ వచ్చాక చందును చంపేస్తానని, లతను పెళ్ళి చేసుకుంటానని, ఆమె చేసుకోనంటే ఆమెను కూడా చంపేస్తానని శపథం పూ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •