ప్రత్యేక హేళన

| సాహిత్యం | క‌విత్వం

ప్రత్యేక హేళన

- అరుణ్ | 21.03.2018 10:49:23am

పవన్ లను, బాలయ్యలనూ
బాహుబలులను,కట్టయ్యలను
క్రికెట్ నూ, ప్రత్యెక హోదాను
తెలుగు యువత నిండుగా పలవరిస్తోంది

సబ్ టీక్ హై అంటూ మన చౌకీదారు
సబ్ మిత్రోంకో సబ్ కో వినాష్ వైపు నడిపిస్తునే ఉన్నాడు
ఇటు,
అమరావతి లో సింగపూర్ సుధను సేవిస్తూ
పోలవరం సరోవరంలో క్రీడిస్తున్నాడు చంద్రుడు
ʹప్రజా చైతన్యం ʹపేరిట ప్రజల్ని అచేతనం చేస్తూ
ʹప్రత్యెక హోదాʹ ఎండమావుల వెంట వురకమంటున్నాడు
*దివంగత మహానేత* సుపుత్రుడు
ప్రజల ఆశల మెట్ల పై,
అధికార అందలం ఎక్కాలనుకుంటున్నాడు

మిగతా వారంటారా..?
ʹఆంధ్ర మేధావిʹ నీడలో సేద తీరుతూ,
వెలిసిపోయిన ఎర్రజెండాలు గాలిమేడలు కట్టుకుంటున్నాయి
పవర్ స్టార్ చంకనెక్కి అధికార చనుబాలు
కుడుచాలనుకుంటున్నాయి
ఎన్నికల గోదారి దాటేందుకు
కుక్కతోక కోసం అన్వేషిస్తున్నాయి

లొహ్ పురుషుడు కట్టడాల కూల్చివేస్తే
వికాష పురుషుడు విగ్రహాలనే కాదు
ఉన్నత మానవ ప్రతీకలనే హతమారుస్తున్నాడు
సబ్ టీక్ హై
గుప్పిట్లో ఈశాన్య రాష్ట్రాలతో
ఇక అఖండ్ భారత్ తమదేనంటున్నారు కమలనాథులు
ʹప్రజలకుʹ తప్ప నాయకులకు, వారి అనునాయులకూ
మహర్దసేనంటున్నారు పంచాంగ బ్రాహ్మలు

కాశ్మీర్ మారణ హోమం
ఆపరేషన్ గ్రీన్ హంట్
అడ్డూ అదుపూ లేకుండా సాగుతూనేవుంది
దళితుల అణచివేత, స్త్రీల పై అత్యాచారాలు
ప్రశ్నించే వారిపై దాడులు, ఉద్యమాలపై ఉక్కు పాదం
నిత్య కల్లోలాలు
పాలకులకు నిత్య కళ్యాణాలు

అవును మరిచాను
మీడియా తన స్వామి భక్తిని చాటుకుంటూనే వుంది
వలసల ,ఆత్మహత్యల తో
సీమ దాహం, దాహం అంటూ
అంగలారుస్తూనేవుంది, ఆకాశం వైపు చూస్తూనే వుంది
అమరావతి నుండి అమృతం అందిస్తానని
పోలవరం వైపు చూపుతూనే వున్నారు
ప్రత్యెక హోదా ఎండమావుల్లో
దాహం తీర్చుకోవడానికి
కియా మోటార్స్ లో పయనం చేయమంటున్నారు
హేవిళంబి హేళన చేస్తూ వెళ్ళింది.

No. of visitors : 408
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సీమ పోరాడాల్సింది... ప్రత్యేక హోదాకై కాదు- నికరజలాలు, నిధులకై

అరుణ్ | 04.02.2017 12:52:07am

ʹ ప్రత్యేక హోదాʹ ఎండమావుల వెంట ప్రజల్ని పరుగేట్టించేందుకు తమిళనాడు జల్లికట్టు ఉద్యమం ప్రేరణ కల్గించడం, దానికి అన్ని రాజకీయ పార్టీలు,ఉభయ కమ్యూనిస్టులతో సహా,...
...ఇంకా చదవండి

వీళ్లు చేసిన నేరం ఏంటి?

అరుణ్ | 16.06.2018 10:29:00am

హిందూ ఫాసిజం నగ్నంగా ప్రజల హక్కుల అణచివేస్తున్నప్పుడు, మనవరకు రాలేదు కదా అని మౌనం వహిస్తే ఏం జరుగుతుందో హిట్లర్ పాలన గురించి వీ ముల్లెర్ చెప్పిన మాటలు వాస్...
...ఇంకా చదవండి

నేరమే అధికారమైన వేళ

అరుణ్‌ | 02.03.2019 04:38:04pm

తూర్పుకు చిహ్నం, మార్పుకు సంకేతం అతడు బాంబులను పంచాలేధతడు బావాలను పంచాడతడు బావాలను బంధించాలనుకోకు అవి తేనేటీగలై ఈ వ్యవస్థకు చరమ గీతం పాడుతాయి...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •