బీఎస్ఎఫ్ జ‌వాన్ల చేతిలో నిత్యం వేధింపుల‌కు గుర‌వుతున్న బ‌స్త‌ర్ విద్యార్థినులు

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

బీఎస్ఎఫ్ జ‌వాన్ల చేతిలో నిత్యం వేధింపుల‌కు గుర‌వుతున్న బ‌స్త‌ర్ విద్యార్థినులు

- | 21.03.2018 11:42:12am

బ‌స్త‌ర్‌లోని కాంకేర్ ప్రాంతంలో బార్డ‌ర్ సెక్యురిటీ ఫోర్స్ అరాచ‌కాల‌కు అంతులేకుండా పోతోంది. విద్యార్థిని ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో పాటు అత్యాచారాల‌కూ పాల్ప‌డుతున్నారు. కాంకేర్ ప్రాంతంలో జ‌రుగుతున్న ఈ ఆగ‌డాలు స్కూల్ ప్రిన్సిప‌ల్ జె.ఆర్‌. కంచ‌న్ చొర‌వ‌తో వెలుగులోకి వ‌చ్చాయి. తాము ఎదుర్కొంటున్న వేధింపుల విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యార్థినిలు ప‌లుమార్లు విన్న‌వించుకున్నా ఫ‌లితం లేక‌పోయింది. బీఎస్ఎఫ్ క్యాంప్‌ను అక్క‌డి నుంచి త‌ర‌లించాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

బీఎస్ఎఫ్ జ‌వాన్లు కొంద‌రు త‌మ‌ ఇళ్ల‌లోకి వ‌చ్చి బెదిరించారు. ఈ విష‌యంలో గ్రామ‌స్థులు పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం సామాజిక మాద్య‌మాల ద్వారా బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది. బ‌స్త‌ర్ జిల్లాలోని బండె ప్రాంతంలోని ప్రాథ‌మికోన్న‌త పాఠ‌శాల‌లో చ‌దువుకుంటున్న విద్యార్థినిలు నిత్యం బీఎస్ఎఫ్ జ‌వాన్ల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు. 114వ బెటాయిలియ‌న్‌కు చెందిన జ‌వాన్లు పాఠ‌శాల‌కు వెళ్లే విద్యార్థినుల ప‌ట్ల అస‌భ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్నారు. స‌మీపంలోని ప్ర‌భుత్వ హాస్ట‌ల్‌లోని విద్యార్థినుల ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా ఉంది. ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతంలోని ఆ గ్రామం కాంకేర్ హెడ్ క్వార్ట‌ర్ నుంచి 150 కిలో మీట‌ర్ల దూరంలో ఉండ‌డం వ‌ల్ల నెట్ వ‌ర్క్ ల‌భించ‌డం చాలా క‌ష్టం. జ‌వాన్ల దుశ్చ్య‌ర్య‌ల నుంచి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ర‌క్ష‌ణ ఆశించ‌డం క‌ష్టమే. ఈ ర‌క‌ర‌మైన ప‌రిస్థితుల న‌డుమ విద్యార్థుల వేద‌న‌, స్కూల్ ప్రిన్సిప‌ల్ చొర‌వ‌తో బ‌య‌ప‌డింది. ప్రిన్సిప‌ల్ జె.ఆర్‌. కంచ‌న్ ఆదివాసీ విద్యార్థినుల భ‌ద్ర‌త‌కు భంగం క‌ల్పించే ఈ ప‌రిణామాల‌ను రాత పూర్వ‌కంగా ఫిర్యాదు చేసి ప్ర‌పంచం దృష్టికి తీసుకు వ‌చ్చాడు. అంతేకాకుండా, సెక్యురిటీ ఫోర్స్ క్యాంప్‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. బీఎస్ ఎఫ్ ఇన్స్‌పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ జేబీ సంఘ్వార్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఈ విష‌యంపై ఎంక్వైరీకి ఆదేశించిన‌ట్లు తెలిపారు.

గ‌తంలో ఇలాంటి కంప్లైంట్స్ ఎప్పుడూ అధికారులు సానుకూలంగా స్పందించ‌లేదు. గ‌తంలో... బీఎస్ ఎఫ్ జ‌వాను ఒక‌రు విద్యార్థిని త‌న ఫోన్ నెంబ‌ర్ ఇచ్చి ఫోన్ చేయ‌మ‌ని చెప్పాడు. స్కూల్ యాజ‌మాన్యానికి తెలియడంతో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. కొంత కాలం వేధింపులు ఆగినా... మ‌ళ్లీ కొన‌సాగుతున్నాయి. మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే.. వారిని ఇంత ఇబ్బందికి గురిచేస్తున్న జ‌వాన్ల‌ను గుర్తుప‌ట్ట‌డం క‌ష్ట‌మ‌ని, వారు ముఖాల‌ను క‌ప్పుకొని వ‌స్తార‌ని, వారి మాట‌లను, సైగ‌ల‌ను మాత్ర‌మే విన‌గ‌ల‌మ‌ని విద్యార్థినులు ఫిర్యాదులో పేర్కొన్నారు. హెలికాప్ట‌ర్ ల్యాండింగ్ స‌మ‌యంలో సెక్యురిటీ సాకుల‌తో జ‌వాన్లు స్కూలు ప‌రిస‌రాల‌కు వెళ్లి, విద్యార్థినుల‌తో సంభాష‌ణ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటార‌ని పేర్కొన్నారు.

No. of visitors : 623
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


బ‌స్త‌ర్‌లో సీఆర్‌పీఎఫ్ ఆకృత్యాలు

హిమాంశు కుమార్ | 18.08.2017 09:41:24am

టాయిలెట్లో ఒక బాలిక ఉండగా ముగ్గురు జవాన్లు లోపలి వెళ్లి పదహైదు నిమిషాలకు బయటకు వచ్చారు. బయట ఉన్న జవాన్లు మిగతా బాలికలను బెదిరించి వాళ్ళ నోళ్లు మూయించారు....
...ఇంకా చదవండి

అణిచివేత, అధికార దుర్వినియోగాల అంతులేని విషాద కథ ఛత్తీస్‌ఘ‌డ్‌

ఆల్ ఇండియా పీపుల్స్ ఫోరం నిజనిర్థార‌ణ రిపోర్టు | 03.07.2016 12:33:52am

బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌ని దారుణాలెన్నో దండ‌కార‌ణ్యంలో జ‌రుగున్నాయి. హ‌త్య‌లు, అత్యాచారాలు, గృహ‌ద‌హ‌నాలు, అక్ర‌మ అరెస్టులు, బూట‌క‌పు ఎన్‌కౌంటర్లు నిత్య‌......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019
  ఒక చిన్న అమ్మాయి రాసిన మంచి కథ " భూమి "
  నేను జీవితాన్ని అమితంగా ప్రేమిస్తాను
  సముద్రం ఇంకా బతికేవుంది
  డెన్ ఆఫ్ లైఫ్
  వాళ్ళు
  ప్రజా కళాకారుడా
  వసంతమేఘగర్జన - కార్మికోద్యమాలు
  తెలుగు రాష్ట్రాల వ్యవసాయరంగం - 50 ఏళ్ళ విప్లవోద్యమం
  సీమకవి వినూత్ననిరసన ʹʹలైఫ్‌హాలిడేʹʹ

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •