ప్రజా ప్రత్యామ్నాయ సాహిత్య వేదిక

| సంపాద‌కీయం

ప్రజా ప్రత్యామ్నాయ సాహిత్య వేదిక

- వరవరరావు | 04.04.2018 10:24:46am

బస్తర్‌ సాలిడారిటీ - కలకత్తా చాప్టర్‌ కలకత్తాలో 1990ల నాటి సుప్రసిద్ధ ప్రగతివాద కవి సుకాంత భట్టాచార్య మంచ్‌ (వేదిక)పై మార్చ్‌ 24, 25 శని, ఆదివారాలు పీపుల్స్‌ లిటరరీ ఫెస్టివల్‌ వినూత్నంగానూ, సృజనాత్మకంగానూ నిర్వహించింది. కశ్మిర్‌, ఈశాన్య జాతుల విముక్తి పోరాటాలు, మహిళా విముక్తి ఉద్యమాలు, హిందూ మతోన్మాద వ్యతిరేక ముస్లిం మైనారిటీ, దళిత ఉద్యమాలు, ఆదివాసి పోరాటాలు, కార్పొరేటీకరణ, కాషాయీకరణను ప్రతిఘటిస్తూ, విద్యారంగంలో ప్రయోగాలు, పాలస్తీనా పోరాటం, ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలు, ట్రాన్స్‌జెండర్‌, ʹఅసభ్యʹ రాజకీయాల గురించి మాట్లాడే పోరాటాలు, రైతాంగ పోరాటాలు, జైలు పోరాటాలు, చిన్న ప్రపంచాల పోరాటాలు, విప్లవోద్యమం మొదలైన రంగాలకు ప్రాతినిధ్యం వహించే కవులు, రచయితలు, కళాకారులు, చిత్రకారులు, సంగీతకారులు, డాక్యుమెంటరీలు నిర్మించేవాళ్లు, క్రియాశీల కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. పాటలు, వాయిద్యాలు, రేలా నృత్యాలు, డప్పు నృత్యాలు, నినాదాలు మార్మోగాయి.

సామ్రాజ్యవాదమంటే ప్రపంచాన్నంతా ఒకే మార్కెట్‌ ఆధిపత్యం కిందికి తేవడం. ఆ మార్కెట్ల పంపకాల కోసం, ఆధిపత్యం కోసం యుద్ధాలు చేయడం. యుద్ధాలు అంటే వేల లక్షల సంఖ్యలో మరణాలు. ఆధిపత్యం ఉన్నవాళ్ల చేతుల్లో ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు ప్రాణాలు కోల్పోవడం. ఇటీవల సిరియాలో రష్యా ప్రయోగిస్తున్న విష బాంబుల్లో వేల సంఖ్యలో పసిపిల్లలు చనిపోయిన దృశ్యాలు చూసాం. కనుక సామ్రాజ్యవాదమంటే మార్కెట్‌ విస్తరణ. మార్కెట్‌పై ఆధిపత్యం అందుకోసం యుద్ధం. అందుకే లెనిన్‌ సామ్రాజ్యవాదమంటే యుద్ధం. సామ్రాజ్యవాదమంటే మృత్యువు అని విశ్లేషించి నిర్వచించాడు.

సామ్రాజ్యవాదానికి సంస్కృతి లేదు. మనం సామ్రాజ్యవాద సంస్కృతి అనీ సాంస్కృతిక సామ్రాజ్యవాదం అని పిలుస్తాంగానీ మృత్యుశయ్యపై ఉన్న పెట్టుబడిదారీ విధానానికి, ఎదుగుదలకింక అవకాశం లేని పెట్టుబడికి సంస్కృతిని సృజించే శక్తి ఉడిగిపోయింది ముఖ్యంగా సామ్రాజ్యవాదం - సామ్రాజ్యవాద ప్రపంచీకరణ స్థాయికి వెళ్లి 1991 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉదారీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అమలవుతున్న దశలో అభివృద్ధి పేరిట సామ్రాజ్యవాదం అమలు చేస్తున్నదంతా విధ్వంసమే. హింసనే. అణచివేతయే.

మానవసారాన్ని విధ్వంసం చేయడమంటే మానవ విలువలను, మానవీయ సంస్కృతిని విధ్వరసం చేయడం కూడ. సంస్కృతి విధ్వంసం ద్వారా మానవీయ విలువల విధ్వంసం ద్వారా సామ్రాజ్యవాద పెట్టుబడి మనుషులను వినియోగదారులుగా మార్కెట్‌ చుట్టూ భ్రమించే వ్యసనపరులుగా మారుస్తుంది. ఈ క్రమంలో ఒక సరుకును (అది కంప్యూటర్‌ కావచ్చు, టెలివిజన్‌ కావచ్చు, మొబైల్‌ పోన్‌ కావచ్చు) ప్రచారంలో పెట్టడానికన్నా ముందు భావజాల పరంగా ఆ సరుకుకు ఆమోదాన్ని ప్రచారంలో పెడుతుంది. దీనినే సరుకును ఉత్పత్తి చేయడానికన్నా ముందు ఆమోదాన్ని ఉత్పత్తి చేయడం అంటారు. మానవ సమాజ పురోగమనం ఘర్షణ, మార్పులతో నిర్ణయమయ్యేది కనుక ఈ ఆమోదానికి నిరసన, ప్రతిఘటన కూడ ప్రారంభమయ్యేవరకు సామ్రాజ్యవాద పెట్టుబడి మళ్లీ రంగంలోకి దిగి నిరసన, ప్రతిఘటన స్వరాలను బేరీజు వేసుకొనితానే నిరసనను కూడ కృత్రిమంగా ఉత్పత్తి చేస్తుంది. ప్రతిఘటనకు కూడ తానే పూనుకొని నిర్మాణం చేస్తుంది. ఇప్పుడు సిరియాపై దాడిలో అమెరికా ఆ పాత్ర కూడ నిర్వహిస్తున్నది. విప్లవాలకు ప్రతీఘాతుక విప్లవాలను నిర్మించడం సామ్రాజ్యవాదం చాలకాలంగా చేస్తూనే ఉన్నది.

సామ్రాజ్యవాద దేశాల మార్కెట్‌ పంపకాలు సజావుగా జరగడానికి ఏర్పాటుచేసుకున్న ఐక్య రాజ్యసమితి ముందు జాతుల, ప్రజాస్వామిక దేశాల నిరసనలు ప్రదర్శింపబడే క్రమంలో వాటిని కూడ తనకనుసన్నల్లో నిర్వహించడానికి గ్లోబల్‌ స్థాయిలో-ప్రపంచ సామాజిక వేదిక (వరల్డ్‌ సోషల్‌ ఫోరమ్‌)ను ఆసియా ఖండానికి ఆసియా సోషల్‌ ఫోరమ్‌ను కూడా మనకు ఉదారవాద ప్రజాస్వామ్య వాదులుగా కనిపించే వాళ్లు, వామపక్షాలు, ప్రగతిభావాలు కలవారని భావించబడే వాళ్లు వగయిరా - సామ్రాజ్యవాద పెట్టుబడి కనుసన్నల్లోనే ఏర్పాటు చేశారు. వర్గపోరాటాలను నివారించడానికి, వర్గపోరాట పదను తగ్గడానికి, వర్గ పోరాటాల నుంచి దృష్టి మళ్లించడానికి శాంతియుత సహజీవన వాదులు ఈ భద్రతా చర్య (సేఫ్టీ వాల్వ్‌) ను ఉపయోగిస్తుంటారు.

విప్లవ, ప్రజాస్వామ్య శక్తులకు ఈ రహస్యం అర్థమయి, బండారం బయటపడిన నేపథ్యంలోనే ముంబైలో ఆలిండియా పీపుల్స్‌ రెసిస్టెన్స్‌ ఫోరమ్‌ చొరవతో దళిత, ఆదివాసీ, ముస్లిం మైనారిటీ సామాజిక వర్గాలు, జాతి విముక్తి పోరాటాలు, రైతాంగం, కార్మికులు, స్త్రీలు, విద్యార్థుల సంఘాలు మూడు వందలకు పైగా సంఘటితమై ముంబై-2004 నిర్వహించారు. అదేదో అకడమిక్‌గా అన్నట్లు కాకుండా వరల్డ్‌ సోషల్‌ ఫోరమ్‌ నిర్వహింప బడుతున్న ఆవరణకు అభిముఖంగానే 2004 జనవరిలో అంతే స్థాయిలో ప్రతిఘటనను నిర్వహించారు.

అటువంటిదే ఇప్పుడు కొంతకాలంగా కార్పొరేట్‌ శక్తులు నిర్వహిస్తున్న సాహిత్య ఉత్సవాలకు ప్రజా ప్రత్యామ్నాయంగా ప్రజా సాహిత్య ఉత్సవాలు కలకత్తాలో మార్చ్‌ 24-25 తేదీల్లో నిర్వహించారు. జయపూర్‌, ముంబై, కలకత్తా, హైదరాబాదులో కొన్నాళ్లుగా జరుగుతున్న కార్పొరేట్‌ సాహిత్య ఉత్సవాలకు భిన్నంగానూ, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభలకు భిన్నంగానూ ప్రత్యామ్నాయంగానూ, సృజనాత్మకంగానూ నిర్వహించాలని తలపెట్టారు.

ప్రజా సాహిత్య ఉత్సవ నిర్వాహకులు జనవరిలోనే రూపొందించిన అవగాహనా పత్రం ʹదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సాహిత్య రంగంలో తలెత్తుతున్న విమర్వనాత్మక, ప్రతిఘటనా స్వరాలను ఒకచోటికి తేవాలనిʹ సంకల్పించారు. బస్తర్‌లో అమలవుతున్న ప్రజలపై యుద్ధం గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌కు ప్రతిఘటనా స్వరంగా ఏర్పడిన బస్తర్‌ సాలిడారిటీ నెట్‌వర్క్‌ (కలకత్తా) ఇందుకు పూనుకున్నది. రాజ్యం, రాజ్యాంగ యంత్ర ఏజెన్సీలు, కార్పొరేట్‌ స్వార్థపర శక్తులు ఈ విమర్శనాత్మక, ప్రతిఘటనా స్వరాలను నిర్బంధం, సెన్సార్‌షిప్‌, నిషేధాలు, ప్రత్యక్ష హింస ద్వారా అణచివేస్తున్నవి. అణచివేయాలని చూస్తున్నవి. ఈ అణచివేతకు మానవ ముఖంగా సాహిత్య ఉత్సవాలను ఎంచుకొని భావజాల రంగంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. భావజాలాన్ని అదుపుచేసే పాఠశాల పాఠ్య ప్రణాళిక మొదలు, ప్రచురణ సంస్థలు, మీడియా మొదలైన అన్ని ప్రచార, ప్రసార సాధనాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్రాహ్మణీయ సంస్కృతిని - అంటే పూర్తి విధేయతనో, నయా ఉదారవాద కార్పొరేట్‌ విస్తరణ వాదానికి ఆమోదాన్ని పొందజూస్తున్నాయి.

శక్తివంతమైన ఈ కార్పొరేట్‌ పాలక వర్గాల భావజాల యుద్ధం ముస్లిం వ్యతిరేక ఫాసిస్టు ధోరణులను ప్రమాదకరంగా ముందుకు తెస్తున్నది. అది కార్పొరేట్‌ సాంస్కృతిక బాధ్యత అన్నట్లు నిర్వహిస్తున్నది.

కనుక ప్రజా సాహిత్య ఉత్సవం సాహిత్యానికున్న సామాజిక విమర్శ కర్తవ్యాన్ని కార్యక్షేత్రంలో నిలుపదలచుకున్నది. మన ప్రపంచం కొన్ని ఆధిపత్య నిర్మాణాలతో కూడి ఉన్నది. సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీల పెట్టుబడి సంకెళ్లలో ఆ నిర్మాణాలు పనిచేస్తున్నవి. అవి జెండర్‌, కులం, మతం, ప్రాంతం, మెజారిటేరియనిజం, జాతి విద్వేషం రూపంలో వ్యక్తులుగానూ, సమూహాలు గానూ, సమష్టిగానూ వ్యక్తమయ్యే స్వయం నిర్ణయాధికారాన్ని అణచివేస్తున్నాయి. ఈ సంకెళ్లను తెంచే ప్రతిఘటనా స్వరాలు సంఘటితం కావాలి.

ఈ అవగాహనతో రూపొందించిన కార్యక్రమం మార్చ్‌ 24-25 తేదీల్లో ఆయా అంశాలపై ఇట్లా రూపొందించారు.

24 మార్చ్‌, 2018

ʹʹఇవ్వాళ మీరు బడిలో ఏం నేర్చుకున్నారు?ʹʹ బాలసాహిత్యం పేరుతో వస్తున్న, నేర్పుతున్న పుస్తకాలను, ప్రచార, ప్రసార సాధనాలను విశ్లేషించి వ్యాఖ్యానించడం.
1) సలీల్‌ బిస్వాస్‌ ప్రయోక్తగా రించిన్‌, విషురిటావ్రోచా, అంకుర్‌ ఇందులో గొపాల్గొన్నారు..

2) పాలస్తీనా ప్రతిఘటనా సాహిత్యం - మహమ్మద్‌ నవాజ్‌ ప్రసంగం

3) ʹʹఈ రాత్రి, ఏ కవిత్వమూ చేసేదేమీలేదుʹʹ సంక్షోభకాలంలో మొలకెత్తుతున్న గొంతులు.
ప్రయోక్త - నందినీ ధార్‌
చర్చ : జసింటా కెర్నెట్టా, ఛాయా కోరెగాఁవ్‌కర్‌, ఇన్షామాలిక్‌, ఎస్‌. చంద్రమోహన్‌

4) రేలా సాంస్కృతిక బృందం - సాంస్కృతిక ప్రదర్శన

5) ʹహై హక్‌ హమారీʹ ఆజాదీ పోరాటాల కథనాలు -
ప్రయోక్త : రించిన్‌
చర్చ : హసీనా ఖాన్‌, కళ్యాణరావు, రాజాపున్యానీ, షహనాజ్‌ బషీర్‌

25 మార్చ్‌, 2018

6) ʹʹచీకటి రోజుల్లో పాటలుʹʹ : ఫాసిజం గురించి రాయడం, పాసిజం పారద్రోలే రచనలు.
writting of / off Facism
ప్రయోక్త : వర్నన్‌ గోన్‌సాల్వెస్‌
చర్చ : ఘజాలా జమీల్‌, వరవరరావు, స్కైబాబా

7) గోర్ఖా ల్యాండ్‌ కవితలపై డాక్యుమెంటరీ ప్రదర్శన.

8) ʹనిషిద్ధ రచనల రచనʹ : ʹఅసభ్యʹ రచనల రాజకీయాలు
ప్రయోక్త : నీలాంజనాసేన్‌ గుప్తా
చర్చ : ఇరావీ, హరిప్రియ సోయిదమ్‌, హన్స్‌దా సోవేంద్ర శేఖర్‌, కుట్టి రేవతి.

9) ప్రతిఘటనా ప్రచారం - చిత్రణ (Canvassing Resistence):
చిత్తప్రసాద్‌ చిత్రాల్లో రైతాంగ పోరాట రాజకీయాలు - అశోక్‌ భౌమిక్‌
జైలు చిత్రాలు - అరుణ్‌ ఫెరైరా

10) ʹఛోటోలోక్‌ʹ (చిన్న ప్రపంచాల) సాహిత్యం :
బంగ్లా సాహిత్య ప్రతిస్పందనలు
ప్రయోక్త : మానస్‌ఘోష్‌
చర్చ : అన్సరుద్దీన్‌, కళ్యాణీ ఠాకూర్‌ చరల్‌, నిర్మల్‌ హల్దార్‌, అఫ్సర్‌ అహ్మద్‌, దీపక్‌కుమార్‌ రాయ్‌.

ఈ కార్యక్రమాన్ని బస్తర్‌ సాలిడారిటీ, పీపుల్స్‌ లిటరరీ ఫోరమ్‌ కలకత్తా - సామాజిక మాధ్యమాల ద్వారా ఇంగ్లిష్‌, హిందీ, బెంగాలీలలో విస్త్రతంగా ప్రచారం చేసింది. పాలక వర్గాల ప్రపంచ తెలుగు మహాసభల (డిసెంబర్‌ 2017) ను బహిష్కరించిన విరసం ముందు చాలమంది సాహిత్యాభిమానులు ఇటువంటి ఒక వేరే ప్రత్యామ్నాయాన్ని ఆలోచించమని ప్రతిపాదించారు. కనుక భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకోవాల్సిన ఒక ప్రయోగం బస్తర్‌ సాలిడారిటీ కలకత్తా చాప్టెర్‌ చేసింది.

ఇది ప్రేరణగా తెలుగు ప్రజా ప్రత్యామ్నాయ సాహిత్య వేదికను వినూత్నంగా, సృజనాత్మకంగా నిర్మించే సంభాషణను ప్రారంభిద్దాం.

No. of visitors : 448
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోనీ సోరి నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించండి! ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రచయితలకు విజ్ఞప్తి

వరవరరావు | 17.06.2016 12:32:46pm

తాజాగా సుకుమా జిల్లా గున్పాడ్‌ గ్రామంలో మడ్కం హిడ్మె అనే ఒక ఆదివాసీ మహిళపై స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ జిల్లా రిజర్వ్‌ గార్డ్‌లు చేసిన లైంగిక అత్యాచారం, హ........
...ఇంకా చదవండి

నిజమైన వీరులు నేల నుంచి వస్తారు

వరవరరావు | 16.07.2016 11:10:44am

1980ల నుంచి కూడా విప్లవ ఉద్యమానికి ఆదిలాబాద్‌ ‌జిల్లా బలమైన కేంద్రంగా ఉంది. ఇంద్రవెల్లి మారణకాండ నుంచి అది దండకారణ్య ఉద్యమానికి ఒక ఆయువుపట్టుగా ఉన్నది.......
...ఇంకా చదవండి

చరిత్ర - చర్చ

వరవరరావు | 15.05.2016 01:23:23pm

భగత్‌సింగ్ ఇంక్విలాబ్‌కు ` వందేమాతరమ్‌, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్‌ బాంబ్‌ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ...
...ఇంకా చదవండి

ముగ్గురు దేశద్రోహుల వలన సాధ్యమైన ప్రయాణం

వరవరరావు | 01.06.2016 12:30:00pm

ఆ కూలీ నిస్సందేహంగా దళితుడు, అంటరానివాడు. రోహిత్ వేముల రక్తబంధువు. ముజఫర్‌నగర్ బాకీ హై... అంటూ యాకూబ్ మెమన్‌ను స్మరించుకున్న దేశద్రోహి,...
...ఇంకా చదవండి

దండ‌కార‌ణ్య ఆదివాసీల స్వ‌ప్నాన్ని కాపాడుకుందాం : వ‌ర‌వ‌ర‌రావు

| 21.08.2016 10:46:12am

18 జూలై 2016, అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా వ‌ర‌వ‌ర‌రావు ఉప‌న్యాసం......
...ఇంకా చదవండి

నోటీసుకు జ‌వాబుగా చాటింపు

వ‌ర‌వ‌ర‌రావు | 22.05.2016 04:22:41pm

నిన్న‌టి దాకా ఊరు ఉంది వాడ ఉంది/ వాడ అంటే వెలివాడ‌నే/ అంట‌రాని వాళ్లు ఉండేవాడ‌/ అంట‌రాని త‌నం పాటించే బ్రాహ్మ‌ణ్యం ఉండేది/ ఇప్పుడ‌ది ఇంతింతై ...
...ఇంకా చదవండి

రచయితలేం చేయగలరు?

వ‌ర‌వ‌ర‌రావు | 16.07.2016 09:58:28am

1948లో భారత సైనిక దురాక్రమణకు గురయిన నాటి నుంచి కశ్మీరు ఆజాదీ కోసం పోరాడుతున్నది. ఆర్టికల్‌ 370 ‌మొదలు రాజ్యాంగం నుంచి ఎన్ని ప్రత్యేకమైన హామీలైనా ఆ సూఫీ.......
...ఇంకా చదవండి

రచయితలారా, మీరెటువైపు? వేదాంత వైపా? స్వేద జీవుల వైపా?

వరవరరావు | 03.07.2016 01:08:08am

అరుంధతీ రాయ్‌ ‌మావోయిస్టు పార్టీ ఆహ్వానంపై దండకారణ్యానికి వెళ్లినపుడు ఆమె బస్తర్‌లో ప్రవేశించగానే వేదాంత క్యాన్సర్‌ ఆసుపత్రి కనిపించిందట. దగ్గర్లోనే లోపల......
...ఇంకా చదవండి

వాగ్ధాటి కాశీపతి

వరవరరావు | 16.08.2016 01:29:44pm

1972లో విరసంలో ఆయన ప్రవేశం సాంస్కృతిక రంగంలో విప్లవోద్యమం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రవేశపెట్టినట్లైంది. అప్పటికే కొండప‌ల్లి.... ...
...ఇంకా చదవండి

రాజకీయ ఖైదీలు - చావు బతుకుల్లో కె. మురళీధరన్‌ (అజిత్‌)

వరవరరావు | 11.09.2016 10:16:25am

అజిత్‌గా విప్లవ శిబిరంలో ప్రసిద్ధుడైన కె. మురళీధరన్‌ 61వ ఏట అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు 2015, మే 9న మహారాష్ట్రలోని పూనెకు దగ్గరగా ఉన్న తాలేగాకువ్‌ ధబాడే.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •