సాబ్రే మాండలికంలో రాసే ఆమె సంథాలీ, హిందీలో కూడ రాయగలదు.
కురుఖ్ సామాజిక నేపథ్యం - రక్తసిక్త నదుల పరీవాహక ప్రాంతం. సాల వృక్షాల అడవి.
నగరాల్లో,
ఒక బొగ్గు ముక్క కాలిపోతుంది కాలిపోతుంది
అప్పుడది మసిగా బూడిదగా మిగిలిపోతుంది
గ్రామాల్లో
ఒక అగ్నికణం
ఒక పొయ్యి నుంచి మరొక పొయ్యికి
వ్యాపిస్తుంది
ప్రతి ఇంట్లో అగ్గి రాజుకుంటుంది.
కవితలకు శీర్షికలు పెట్టదు. అవి అనవసర చేర్పులని అనుకుంటుంది. మరాఠీలో రాస్తుంది. ఫూలే అంబేద్కరైట్ స్త్రీవాద రచయిత్రి. ʹʹరాయకపోతే ఊపిరాడదు. మనందరి దగ్గర ఏదో ఉంటుంది. నా దగ్గర కలం ఉందిʹʹ అంటుంది.
జ్యోతిబా,
బావుల్లో అందరూ చేదుకుంటే చాలదు
కొత్తబావి తవ్వాలి
మను రహస్య భావ వారసులను
పాతిపెట్టడానికి
అట్లా చేయకపోతే
శాంతి సందేశకులు కూడ
అయుధాలు పట్టాల్సి వస్తుంది.
కశ్మీరీ రచయిత. ప్రస్తుతం టెహ్రాన్‌లో ఉన్నది. తమను బాధితులుగా మాత్రమే చూసే గుర్తింపును నిరాకరిస్తుంది. మహిళా హక్కులు, ఇతర రాజకీయ హక్కులు, కశ్మీర్లో మరణశోకాల సంస్కృతులు మొదలైన అంశాలపై అధ్యయనం, పరిశోధన చేస్తున్నది. ʹముస్లిం వుమెన్, ఏజెన్సీ అండ్ రెసిస్టెన్స్ పాలిటిక్స్ - ది కేస్ ఆఫ్ కశ్మీర్ (ముస్లిం స్త్రీలు, దళారీ పాలక - ప్రతిఘటనా రాజకీయాలు - కశ్మీర్ ఉదాహరణ) అనే పుస్తకం పాల్ గ్రేవ్ మాక్మిలన్, యుఎస్ఏ ప్రచురణగా ఈ సంవత్సరం వెలువడుతుంది.
కశ్మీర్లో ప్రతినిత్యం సర్వ సాధారణమైపోయిన హింస పట్ల ఆమె స్పందనలకు ఆమె అకడమిక్ అధ్యయనం ఉద్వేగపూరిత వాహిక కాలేని సందర్భాల్లో ఆమె కవిత్వాన్ని వ్యక్తీకరణకు ఎంచుకుంటున్నది. టివి స్టూడియోల విశ్లేషణలు, రాజ్యామోదిత చర్చలు, నిషేధిత ప్రసంగాల మధ్యన ʹపాఠకులకు వాళ్ల స్వీయ నైసర్గిక అక్రోశాలʹ అభివ్యక్తిగా ఆమె ఒక శక్తివంతమైన నూతన స్వరంగా తన కవిత్వాన్ని అందిస్తున్నది.
రెండు వైపులుండాలా?
నాట్యానికి ఇద్దరుండాలా
అది నీకు తెలిసేవరకే
సంఖ్య మూడుకు పెరుగుతుంది
రెప్పపాటులోనే
అత్యాచారానికి గురై
నెత్తురు చారికలు కట్టిన
దేహాల వరుస అవుతుంది
రెప్పలార్పని కెమెరాల ముందు
బీభత్స నగ్న దృశ్యాలు
కసితో కూడిన కామోద్దీపన చర్యలను
ప్రపంచం చూస్తూ ఉంటుంది
ఇదిగో ఇక్కడ జాతి తన
నిధులను గుర్తించడానికి వస్తుంది.
ఈ కవిత ఒక తాజాకలంతో ముగుస్తుంది.
ʹʹఖాజీ గుండ్లో ఇద్దరిని చంపారు. మృతుల సంఖ్య 46కు పెరిగింది...ʹʹ బుర్హాన్ వనీని హత్య చేసిన దగ్గర నుంచి ఆమె కవితలు ఒక గొలుసుగా (ఒక మరణానికి ఒక కవితగా) సాగుతున్నాయి. ప్రతిదానికి ఒక తాజా కలం ఉంటుంది. జీవం లేని వార్తాపత్రికల శీర్షికలకు అవి ప్రతిస్పందనలు. భారత సైన్యం వరుసబెట్టి కశ్మీరీలను చంపుతూ ఉంటే ఇండియా మీడియా చేస్తున్న కవరేజ్‌కు సవాల్‌గా ఆమె వరుసపెట్టి కవితలు రాస్తున్నది. ఒక దురాక్రమణకు గురైన భూభాగంలో రాజ్యహింస అనే చేదు నిజంలో నిలిచి కశ్మీరీలు ఎన్ని రూపాల్లో ప్రతిఘటిస్తున్నారో, ఎంతో సన్నిహితంగానూ, పేగు బంధం వలన నాభి నుంచి వచ్చే వాక్కుగా ఇన్షా రాస్తుంది.
ఇప్పుడిది మళ్లీ ఇవాళ్టి పత్రికలో కశ్మీర్‌లోను సోప్రాన్లో ఏకకాలంలో మూడు ఎన్కౌంటర్ల గురించి, పదుల సంఖ్యల్లో భారత సైనిక హననాల గురించి, గడ్చిరోలీలో భారీ ఎన్కౌంటర్ల గురించి ఆ నెత్తురుతోటే రాస్తున్నట్టుగా లేదూ!
Type in English and Press Space to Convert in Telugu |
సోనీ సోరి నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించండి! ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రచయితలకు విజ్ఞప్తి తాజాగా సుకుమా జిల్లా గున్పాడ్ గ్రామంలో మడ్కం హిడ్మె అనే ఒక ఆదివాసీ మహిళపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్ జిల్లా రిజర్వ్ గార్డ్లు చేసిన లైంగిక అత్యాచారం, హ........ |
నిజమైన వీరులు నేల నుంచి వస్తారు1980ల నుంచి కూడా విప్లవ ఉద్యమానికి ఆదిలాబాద్ జిల్లా బలమైన కేంద్రంగా ఉంది. ఇంద్రవెల్లి మారణకాండ నుంచి అది దండకారణ్య ఉద్యమానికి ఒక ఆయువుపట్టుగా ఉన్నది....... |
చరిత్ర - చర్చభగత్సింగ్ ఇంక్విలాబ్‌కు ` వందేమాతరమ్, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్ బాంబ్ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ... |
ముగ్గురు దేశద్రోహుల వలన సాధ్యమైన ప్రయాణంఆ కూలీ నిస్సందేహంగా దళితుడు, అంటరానివాడు. రోహిత్ వేముల రక్తబంధువు. ముజఫర్‌నగర్ బాకీ హై... అంటూ యాకూబ్ మెమన్ను స్మరించుకున్న దేశద్రోహి,... |
దండకారణ్య ఆదివాసీల స్వప్నాన్ని కాపాడుకుందాం : వరవరరావు18 జూలై 2016, అమరుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ సభ సందర్భంగా వరవరరావు ఉపన్యాసం...... |
నోటీసుకు జవాబుగా చాటింపునిన్నటి దాకా ఊరు ఉంది వాడ ఉంది/
వాడ అంటే వెలివాడనే/
అంటరాని వాళ్లు ఉండేవాడ/
అంటరాని తనం పాటించే బ్రాహ్మణ్యం ఉండేది/
ఇప్పుడది ఇంతింతై ... |
రచయితలేం చేయగలరు?1948లో భారత సైనిక దురాక్రమణకు గురయిన నాటి నుంచి కశ్మీరు ఆజాదీ కోసం పోరాడుతున్నది. ఆర్టికల్ 370 మొదలు రాజ్యాంగం నుంచి ఎన్ని ప్రత్యేకమైన హామీలైనా ఆ సూఫీ....... |
రచయితలారా, మీరెటువైపు? వేదాంత వైపా? స్వేద జీవుల వైపా?అరుంధతీ రాయ్ మావోయిస్టు పార్టీ ఆహ్వానంపై దండకారణ్యానికి వెళ్లినపుడు ఆమె బస్తర్‌లో ప్రవేశించగానే వేదాంత క్యాన్సర్ ఆసుపత్రి కనిపించిందట. దగ్గర్లోనే లోపల...... |
వాగ్ధాటి కాశీపతి1972లో విరసంలో ఆయన ప్రవేశం సాంస్కృతిక రంగంలో విప్లవోద్యమం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రవేశపెట్టినట్లైంది. అప్పటికే కొండపల్లి....
... |
రాజకీయ ఖైదీలు - చావు బతుకుల్లో కె. మురళీధరన్ (అజిత్)అజిత్‌గా విప్లవ శిబిరంలో ప్రసిద్ధుడైన కె. మురళీధరన్ 61వ ఏట అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు 2015, మే 9న మహారాష్ట్రలోని పూనెకు దగ్గరగా ఉన్న తాలేగాకువ్ ధబాడే..... |
Open letter to Krishna BandyopadhyayAs a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol.. |