రజనీతిలక్ లేని లోటు భర్తీ చేయలేనిది

| సంభాషణ

రజనీతిలక్ లేని లోటు భర్తీ చేయలేనిది

- స్వాతి. పి | 04.04.2018 11:47:09am

ప్రముఖ దళిత కవయిత్రి, రచయిత్రి రజని తిలక్ ఢిల్లీ లో మరణించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. మార్చి 30న‌ తుది శ్వాస విడిచారు. దేశంలోని దళిత.. హక్కుల గొంతుక రజనీ తిలక్. రచయితగానే కాక.. దళిత యాక్టివిస్ట్ గా చిరపరిచితులు. రాష్ట్రీయ్ దళిత్ మహిళా ఆందోళన్ సంస్థద్వారా ఉత్తరాది రాష్ట్రాల్లో పనిచేశారు. రాజ‌కీయాల ప‌ట్ల‌ ఆమెతో భిన్నాభిప్రాయం ఉన్నా.. ప్రజాఉద్యమాల్లో ఆమె మమేకత గొప్పది. గుర్తింపదగ్గది.

విద్యార్థి దశలో సీఎల్ఐ (కమ్యునిస్టు లీగ్ ఆఫ్ ఇండియా) తో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆమె తర్వాత దళిత ఉద్యమాల వైపు మొగ్గు చూపారు. భారత కమ్యునిష్టుపార్టీలపై పదునైన విమర్శలు చేస్తూనే.. వివిధ కమ్యునిష్టు సంస్థలతో వర్కింగ్ రిలేషన్స్ కొనసాగించిన అరుదైన మేధావి. హిందీలో అటు కవిత్వం.. ఇటు వచనంలో విస్రతుతంగా రచనలు చేశారు. సావిత్రీ బాయ్ ఫూలే రచనలను మరాఠీ నుంచి హిందీలోకి అనువదించారు.

దేశవ్యాప్తంగా కుల, మత, ఫాసిష్టు శక్తులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలతో సజీవ సంబంధం కలిగి ఉండేవారు. అనారోగ్యంతో ఆస్పత్రి లో ఉండి కూడా.. రానున్న ఎన్నికల్లో ప్రజాసంఘాలు.. ఫాసిస్టు వ్యతిరేక శక్తులను కూడగట్టాల్సిన అవసరాన్ని.. దానికి ఎలాంటి వ్యూహాలు రూపొందించాలో చాలా ఉత్సాహంగా తన సహచరులతో పంచుకుంటూ గడిపారు. ఆస్పత్రినుంచి వచ్చిన వెంటనే ఏడాది పాటు బీజేపీ సంఘ్ పరివార్ శక్తులకు వ్యతిరేకంగా చేయాల్సిన ప్రచార పనులు చేయాల్సి ఉందంటూ.. సహచరులకు కర్తవ్యాన్ని గుర్తుచేస్తూనే ఉన్నారు. దళిత, మహిళా ఉద్యమాలకు రజనీతిలక్ లేని లోటు భర్తీ చేయలేనిది.





No. of visitors : 381
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


యుద్ధగీతం

ప‌ల్ల‌పు స్వాతి | 16.07.2017 08:36:43am

నా కథ అంటే... మా ఆదివాసీల కథ. చీకటితో మొదలైన కథ. భూమి కోసం బలైన బిడ్డల చరిత . మా జాతినంతా అంతం చేస్తున్న రాజ్యం దుర్మార్గ చరిత్ర . మా నేల చెర ...
...ఇంకా చదవండి

పాటై ప‌దునెక్కాలి...

ప‌ల్ల‌పు స్వాతి | 18.06.2017 01:03:17pm

ఇప్పుడీ దుఃఖ‌భ‌రిత కాలాల్లో క‌రిగిన క‌ల‌ల్నీ చెదిరిన గూళ్ల‌నూ క‌న్నీళ్లింకిన మ‌నుషుల్నీ గుండెల‌కు హ‌త్తుకోవాలి...
...ఇంకా చదవండి

స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌

స్వాతి | 02.03.2019 04:24:35pm

ʹదేశభ‌క్తిʹ వ‌ర‌ద‌లై ప్ర‌వ‌హిస్తున్న కాలం ఇది. ఇప్పుడు, స్వేచ్ఛ కోసం నిన‌దించ‌డ‌మూ నేర‌మే ఇక్క‌డ‌. అధికారం నీడ‌లో అమ‌ల‌య్యే అంతులేని హింస‌ను పంటిబిగువున బ‌ర...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార సెప్టెంబర్ 2019

    దళిత భక్త కవి రవిదాస్‌ సంత్‌ ఆలయం కూల్చివేత హిందూ ఫాసిజంలో భాగమే
    The Destruction of Kashmir is a Deathblow to Democracy in India
    నల్లమల యురేనియం గని కాదు, జీవవైవిధ్య కేంద్రం
    అతడు ఆమె అడవి
    మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ
    కన్ ఫామ్... !
    బందిష్
    రాంగూడ ప్రాంతంలో సమిష్టితత్వం, సహకార పద్ధతి
    కళలన్నా, సాహిత్యమన్నా ఫాసిజానికి భయం
    కవులకు సమర స్ఫురణ

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •