భవిష్యత్తును కాల్చేశారు

| సాహిత్యం | క‌విత్వం

భవిష్యత్తును కాల్చేశారు

- అశోక్ కుంబము | 04.04.2018 11:55:33am

వాళ్ళు
మనందరి చిరునామాలు
అక్షర సహచరులు
ఊహాలోకపు అధిపతులు
బాల్యానికి ప్రతినిధులు
భవిష్యత్తుకు వాగ్దానాలు

మనందరిలాగానే
స్వేచ్ఛను పొత్తిల్లలోనే పోగొట్టుకొని
అభద్రత బంధీలయిన్నోళ్ళు
ఉన్మాదం గురిపెట్టగానే
ఉమ్మ నీటి కోసం
ఉరుకులు పరుగులు పెట్టిన
అమ్మ బిడ్డలు వాళ్ళు

రంగుల సీతాకోక చిలుకకు
కసిగా మసి పూస్తారని
రేపటి పొద్దు కంట్లో
ఈ రోజే చీకటి నింపుతారని
భూమిలో తుపాకులు నాటి
వికసించే పూల వనాన్ని
కలగనమంటారని
తెలియని అమాయకపు
అయ్య పిల్లలు వాళ్ళు

అనాగరికపు అంటురోగం
ఆయుధ విచ్చలవిడితనం
హెచ్చరికలేని మృత్యు రూపం
ఎటుగా విరుచుకు పడుతుందో
ఎరుకలేని, అరమరికలు లేని
ఈ యుగపు కొన్నెత్తుటి
స్నేహపు నెమలీకలు వాళ్ళు

వాళ్ళు ఎవరైనా
కారణాలు ఏమైనా
బాల్యాన్ని బలిగొనే
ఏ సమాజమైనా
అర్ధబలం-అంగబలం
ఎంతవున్నా
అంధకారం దిశగా
అడుగులు వేస్తున్నట్లే!

(ఫిబ్రవరి 14న అమెరికాలోని ఫ్లోరిడ రాష్ట్రంలో ఒక ఉన్మాది స్కూల్ లో జరిపిన కాల్పులలో చనిపోయిన 17 మంది విద్యార్థులకు, అద్యాపకులకు నివాళి అర్పిస్తు )





No. of visitors : 503
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    ఈవ్ టీజింగ్ సాకు తీసుకొని మొత్తం దళితవాడను సాంఘిక బహిష్కరణకు గురిచేయడం అమానుషం
    మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...
    దేశద్రోహ నేరం!
    అగ్ర వుగ్రవాదం!
    ఆదాయం సున్నా ఖర్చు పన్నెండు!
    ఆ పిల్లకు క్షమాపణతో...
    కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
    చిన్న చేపల్ని చంపుతున్న పెద్ద పరిశ్రమ
    నేనూ అర్బన్ మావోయిస్టునే
    సుధా భరద్వాజ్ కు నా సెల్యూట్‌
    గౌతమ్‌నవలఖా సదా సూత్రబద్ధమైన అసమ్మతివాది.
    మానవ హక్కుల పరిరక్షకులపై దాడిని ఖండిస్తూ పంజాబ్‌ మేధావుల సంయుక్త ప్రకటన

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •