చెప్పులు కొందాం రండి

| సాహిత్యం | క‌థ‌లు

చెప్పులు కొందాం రండి

- క‌డ‌లి | 04.04.2018 02:47:30pm

మధ్యాహ్నం చెప్పుల షాప్ లో ఓ విషయం గుర్తొచ్చిందోయ్,
వెంటనే చెప్పాలనిపించింది, ఎక్కడా నువ్వు నన్ను పట్టించుకుంటేనేగా.

అవునా! నీకు తెలుసుగా నాకు ఎంత చెప్పుల పిచ్చో!!
పోనీలే ఇప్పుడు చెప్పు.

నేను పీజీ చదివే రోజుల్లో కాలేజీ నుండి ఇంటికి నడిచి వెళ్ళేవాడినిగా , ఈ స్మార్ట్ ఫోన్లు ఎక్కడున్నాయ్ అప్పుడు?! రోడ్డుని చూస్తూనేగా నడవాల్సింది. అన్ని రోజుల్లానే ఆ రోజు కూడా నేను , నా ఫ్రెండూ సాయంత్రం నాలుగు గంటలకు నడకనందుకున్నాం, కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి తార్నాక సిగ్నల్ దాటాం.

చేతిలో రెండు కవర్లేవో పట్టుకుని, మాకు కొంచం దూరంలో ఓ పిల్ల ఆటో దిగింది .

పొడవైన జుట్టు, మంచి ఎత్తు కాస్త సన్నమే ఆ పిల్ల. తాపీగా అటూ ఇటూ చూస్తూ ముందు నడుస్తూవుంది.

మూడు సెకండ్లకోసారి ఆ పిల్లని చూస్తూ నేను, నే వింటున్నాననుకొని ఏదో మాట్లాడుతూ వాడు నడుస్తున్నాం.

అప్పటి వరకూ తల పైకెత్తి నడిచిన పిల్ల ఉన్నట్టుండి తల కిందకు దించి చున్నీ సర్దుకుంది. నేను అంతగా గమనిస్తున్నట్టు అప్పుడే అర్ధమైంది నాకు. వీడేమో ఏదో మాటల్లో పడి ఆ పిల్లని దాటుకుని పోయేలా ఉన్నాడు. ఆ పిల్ల వంక చూస్తూనే కాస్త మెల్లగా నడవరా! అని వాడి చెయ్యి పట్టుకు వెనక్కి లాగి చెప్పాను. అప్పుడు వాడూ ఆ పిల్లని గమనించడం నాకు అర్ధమైంది. అలా చూసాడో లేడో వెంటనే " పోరి హుషారుగుందిరో ... హైట్ ఏమో ఆరుందిరో ... " అని కూనిరాగం తీయడం మొదలెట్టాడు. అనవసరంగా వాడ్ని నెమ్మదించమన్నందుకు నా మనసు ఓ క్షణం చితుక్కుమంది.

ఇంకాసేపటికి ఆ పిల్ల తన అంత పొడవు జుట్టుని ముందుకు తీసుకుని, దేనికో అడ్డంగా పెట్టి సర్దినట్టు నాకు అనిపించింది. రోడ్డుమీద నడవడం కూడా ఇంత ఇబ్బందిగా మారింది అమ్మాయిలకి, అనిʹ అప్పుడు అర్థమైంది.

"ఆ చూపుల్ని తప్పించుకోడం ఎలా? పోని తిట్టొచ్చుగా?

నడక మధ్యలో ఆగి ఈ అమ్మాయి తిట్టిన తిట్లు వినపడతాయి కానీ,
వాడు విసిరిన చూపులెవరికి కనపడతాయ్!

నవ్విన వెకిలి నవ్వులు, వినబడకుండానే పలికిన వంకర మాటలు, ఎవరి చెవిన పడతాయి?

పెద్దవి జరిగితేనేగా ఎవరో ఒకరు స్పందించేది. ఎంతమంది చూసీచూడనట్టు ఊరుకున్నా , ఆ పిల్ల మాత్రం అవమానాన్ని భరించాల్సిందేగా! ఇలాంటి వాటికి కేసులు ఉండరాదా ?! " అనుకుంటూనే తన వెనుక, నా ముందున్న దారిలో నడిచాను.

ఇన్ని ఆలోచనలతో ఉన్న నా మొహం ఎలా మారిందో "ఏంట్రా అలా ఉన్నావ్?" అనిʹ నా ఫ్రెండ్ కదిపే వరకు నాకు తెలియలేదు.

"ఏం లేదురా" అని మాట దాటేసి ఆ పిల్లని చూసాను .

ఈ సారి ఏకంగా ఉన్న చోటే ఆగిపోయింది , ఎవరినో గమనిస్తున్నట్టు.

తెలీకుండానే నేనూ ఆగిపోయాను.

ఆ పిల్ల వెంటనే తన కవర్లో ఉన్న చెప్పు తీసి ఆ ఎదురుగా ఉన్న వాడి మీదకి విసిరింది.
వాడు "ఏయ్!నీయమ్మ! "అనిʹ ఆ పిల్ల మీదకొచ్చాడు.

చుట్టూ జనం చేరారు.
మేము కూడా వాడిని వెనక్కి పట్టుకు లాగే గుంపులో చేరిపోయాం.
అప్పుడా పిల్ల " ఈ పదినిమిషాల్లో, అలా చిల్లర వేశాలేసిన వాళ్లలో నువ్వు మూడో వాడివి. గాల్లో కాదురా, అదిగో ఆ చెప్పుకి పెట్టు ముద్దులు". అని గట్టిగా అరిచి ఆ రెండో చెప్పుని చేతిలో పట్టుకు ముందుకు నడవడం మొదలెట్టింది.

"పోకదలకే ఇంత పొగరు" అని ఓ ఆడమనిషీ,
"ఏం చూసుకొని ఆ బలుపు? అని ఓ పక్క షాపాయనా,
"భరి తెగించిన తిరుగుడ్లు అట్లనే పాడైతాయి" అని ఓ ముసలావిడా ,
"మంచిగ గడ్డి పెట్టినవ్ బిడ్డా" అని ఇంకో ముసలాయన అంటూ.. అక్కడనుండి వెళ్ళిపోయారు.

మేము మా సందు రావడంతో లెఫ్ట్ టర్న్ తీసుకున్నాం.

ఉబ్బితబ్బిబ్బే ఆనందం నుండి తేరుకున్నాక,
నా ఫ్రెండ్ ఎదో మాట్లాడుతుంటే విన్నాను.

"ఏం పిల్లరా! చేసుకుంటే ఇలాంటి దాన్నే పెళ్లి చేసుకోవాలి" అన్నాడు.
పది నిమిషాల్లో ఇంత మార్పా అన్నట్టు, "అదేంటి? "అన్నాను.

"అవునురా! ఇంత తలబిరుసు ఉన్న పిల్ల , రేపు మనం ఏది చెప్తే అది చేస్తుంటే చూడటం ఎలా ఉంటుంది! అబ్బా!!"

అప్పుడు వాడికో మాట చెప్పి, నా నడకకి స్పీడ్ పెంచి ఇంటికెళ్లిపోయాను. మళ్ళీ ఆ తర్వాత వాడిని ఫ్రెండ్ అనడానికి మనసొప్పుకోలే. కాలేజీ అయిపోయాక ఆ పిల్లా, వాడు ఇన్నాళ్లకు గుర్తొచ్చారు.

"ఇంతకీ ఎదో మాట అన్నానన్నావ్? ఏం మాటన్నావ్ ఆ ఫ్రెండ్ తో ?"
"ఇప్పుడు నాకూ ఓ చెప్పుల జత కొనాలనుందిరా ! " అని చెప్పి వెళ్లిపోయానోయ్.

No. of visitors : 730
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఖైదు కవి స్వేచ్చ కోసం పోరాడదాం
  అరుణతార నవంబర్ - 2018
  International Seminar on Nationality Question
  రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
  ప్రభుత్వమే అసలైన కుట్రదారు
  సూర్యాక్షరం
  శ్వాసిస్తున్న స్వ‌ప్నం
  చిరున‌వ్వే ఓ ప్ర‌క‌ట‌న‌
  వెలిసిన రంగులు
  అతనేం చేసిండు?
  సరిహద్దున సముద్రమైనా లేన‌ప్పుడు
  ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •