నక్సల్బరీయే పీడిత ప్రజల విముక్తి పంథా

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

నక్సల్బరీయే పీడిత ప్రజల విముక్తి పంథా

- వి.ఎస్ | 25.05.2016 04:49:40pm

సరిగ్గా ఈ రోజుకి నక్సల్బరీకి 49 ఏళ్ళు. 1967 మే 25కు ముందు నక్సల్బరీ అంటే ప్రపంచానికి తెలియని ఒక కుగ్రామం. ఆ ఊరు పశ్చిమ బెంగాల్ రాష్టంలోని డార్జీలింగ్ జిల్లా సిలిగురి డివిజన్లో భారతదేశపు ఈశాన్య కొసన ఉంది. అన్ని గ్రామాలలాగే అక్కడి ప్రజలు భూస్వాముల పీడనను, పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను చూస్తున్నారు. 1967 మేలో సి.పి.ఐ (ఎం) పార్టీలో ఉన్న కొంతమంది కమ్యూనిస్టు విప్లవకారుల ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో ఒక రైతాంగ తిరుగుబాటు జరిగింది. వారంతా 1967 మార్చి నెలలో ఒక రైతు సమావేశం ఏర్పాటు చేశారు. భూస్వాములపై పోరాడాలి. వారి ఆధిపత్యాన్ని అంతం చేయాలి అని ఆ సమావేశం పిలుపునిచ్చింది.

కానూ సన్యాల్, చారుమజుందారు వంటి నాయకుల ఆధ్వర్యంలో రైతు కమిటీలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ కంతా ఆ కమిటీల్లో 20వేల మందిని సంఘటితపరిచారు. భూస్వాముల భూములు ఆక్రమించుకున్నారు. తమను ఇంతకాలం పీడించిన మోసపు భూమి పత్రాలను, అప్పు కాయితాలను తగులబెట్టారు. కొన్ని గ్రామాలను వారి అధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ పోరాటం సాగుతుండగా నాయకుల్ని పట్టుకోడానికి పోలీసులు గాలిస్తున్నారు. మే 23న ఉద్యమ నాయకులను అరెస్టు చేయడానికి ఓ గ్రామానికి వెళితే స్థానిక ఆదివాసీ ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఘర్షణ జరిగింది. ఆ గొడవలో ఒక పోలీసు చనిపోయాడు. మే 25న పోలీసులు ప్రతీకార దాడికి దిగారు. గ్రామంలోకి మూకుమ్మడిగా పోయి కాల్పులు జరిపారు. తొమ్మిది మంది స్త్రీలు, ఇద్దరు పిల్లలు చనిపోయారు. అనేక మంది రైతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ʹనక్సల్బరీ వెలుగులోʹ పుస్తక రచయిత సుమంతా బెనర్జీ ఆ ఘటనల్ని వివరిస్తూ ఆ ప్రజలు ఎందుకు పోరాటం చేస్తున్నారో ఇలా చెప్తారు. ʹవాళ్ళ నాయకుడెక్కడ దాక్కున్నారో గుచ్చి గుచ్చి అడిగినా ఆ రైతులు మాత్రం మొండిగా క్లుప్తంగా చెప్పిన సమాధానం ఒక్కటే, చల్లని గాలి నిండుగా పీల్చుకునేందుకు.ʹ ఆ పోరాటాన్ని కొన్ని నెలల్లో అణచేశారు.

నాడు అది ఒక గ్రామమే. నేడు అది దేశప్రజల విముక్తి మార్గమై తిరుగుబాటు జెండాయై, పాలకుల గుండెల్లో బాంబు వంటి నక్సలైట్ ఉద్యమమైంది. ఇప్పుడది న‌క్స‌ల్బ‌రీ ఉద్యమంగా పోరాట నావను కొనసాగిస్తుంది. పాలకుల పార్లమెంటరీ విధానానికి ప్రత్యామ్నాయంగా ప్రపంచ మానావళికి మార్గనిర్దేశమై పోరాట బాటను ఎన్నో ఒడిదుడుకుల నడుమ అంటిపెట్టుకుని ఉన్నది.
అప్పటిదాకా సి.పి.ఐ.(ఎం)లో కొనసాగుతున్న విప్లవ కమ్యూనిస్టులు సి.పి.ఐ. (ఎం.ఎల్) పార్టీని ఏర్పాటు చేశారు. కామ్రేడ్ చారుమజుందార్ ʹపార్లమెంటరీ పంథా ద్వార ప్రజలకు మేలు జరగదు, ప్రత్యామ్నాయం సాయుధ రైతాంగ విప్లవమేʹ అని చాటాడు. భారత దేశం అర్థ వలస, అర్థ భూస్వామ్య దేశమని చెప్పి నూతన ప్రజాస్వామిక విప్లవం సాధించాలన్నాడు. ఈ దేశంలో ఉన్న అశేష రైతాంగం, కార్మిక వర్గ నాయకత్వం కింద పోరాటం చేయాలని పిలుపునిచ్చాడు. కమ్యూనిస్టు పార్టీల్లో పాతుకుపోయి ఉన్న రివిజనిజంపై 8 డ్యాకుమెంట్లను సంధించాడు. భారత విప్లవోద్యమాన్ని కీలక మలుపు తిప్పిన రివిజనిస్టు వ్యతిరేక పోరాటానికి నక్సల్బరీ ఆచరణాత్మక దారి వేసింది.

ఈ 8 డ్యాకుమెంటరీలు విప్లవ శ్రేణులకు అత్యవసరమైనవి. ప్రధానంగా 6, 8 డాక్యుమెంట్లు. రివిజనిజానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయడం ద్వారా నిజమైన విప్లవపార్టిని నిర్మించడానికి జరిపే పోరాటమే నేడు ప్రధాన కర్తవ్యం. రివిజనిజానికి వ్యతిరేకంగా పోరాటం ద్వారా రైతాంగ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోవలసి ఉంది. అణిచివేతలకు గురైన ప్రజలు పచ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరీ గ్రామంలో పాలక ప్రభుత్వాల తీరును నిరసిస్తు ఉవ్వేత్తున్న సాగిన ఉద్యమం దేశ ప్రజలను,విద్యార్థులను,మేధావులను ఆలోచింపజేసింది. ఆ న‌క్స‌ల్బ‌రీ మేఘఘర్జనల వెలుగులు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపింది. శ్రీకాకుళం గిరిజన పోరాటం, సిరిసిల్ల - జగిత్యాల పోరాటాలు, గోదారిలోయ ప్రతిఘటనోద్యమం, ఇంద్ర‌వెల్లి ఆదివాసి ఉద్యమం నుండి గోదావరి దాటి విస్తరించిన దండకారణ్య ఉద్యమం దాకా దున్నే వారికే భూమి, జల్- జంగల్ -జమీన్ హమరా అంటూ విముక్తి పోరు నావ నడిపారు. ఎంతో మంది వీరులు పోలీసు కరుకు తూటాలకు బలియై రేపటి సూర్యోదయం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. కాని వారు ఎత్తి పట్టిన పోరు కొనసాగుతున్నది. వివిధ విప్లవ శేణులు పిడిత ప్రజల కోసం ఏకమవుతున్నాయి. విప్లవోద్యమం గొప్ప ఆశాజ్యోతిగా వెలుగుతున్నది.

నక్సల్బరీకి, నక్సలైట్లకు ఉన్న శక్తి పాలకవర్గాలకు బాగా తెలుసు. కల్లోలిత ప్రాంతాల చట్టాలు, ఎమర్జెన్సీలు, ఆటా పాటా, మాటా బందులు, గ్రీన్ హంట్ ఆపరేషన్ల ద్వారా విప్లవాన్ని తుదముట్టించాలని సర్వశక్తులూ ఒడ్డుతున్న వారే, సమయానుకూలంగా నక్సలైట్ల గురించి మాట్లాడతారు. ఒకరు ఓట్ల కోసం నక్సలైట్లే దేశభక్తులంటే, ఇంకొకరు నక్సలైట్లతో శాంతి చర్చలంటారు. మరొకరు వారి పంథాయే మా పంథా అంటారు. పాలకుల మోసపు ముసుగులే కాదు, బూటకపు ప్రజాస్వామ్యమూ రోజురోజుకూ తేటతెల్లమవుతున్నది.

నేడు దేశంలోని రోజురోజుకూ పెరిగిపోతున్న దారిద్ర్యం, నిరుద్యోగం, అసమానతలను, గోముసుగుతొడుక్కొని వచ్చిన పెచ్చరిల్లుతున్న బ్రాహ్మణిజం, కార్పోరేట్ శక్తుల వనరుల దోపిడి, భూమి నుండి, అడవి నుండి ఈ దేశబిడ్డల విస్థాపన వీటన్నిటితో భావజాలపరంగా, రాజకీయంగా రాజీ లేకుండా పోరాడుతున్న నక్సల్బరీ ఈ దేశానికి స్పష్టమైన ప్ర‌త్యామ్నాయాన్ని చూపుతున్నది. ఐక్య ఉద్యమాలకు పిలుపునిస్తున్నది.

No. of visitors : 8395
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


భారత సమాజంపై నక్సల్బరీ ప్రభావాలు : విజయాలు-సవాళ్లు

విప్లవ రచయితల సంఘం | 17.08.2017 01:53:58pm

యాభై ఏళ్లలో సాధించిన విప్లవోద్యమ పురోగతిని, విజయాలను, సమాజంలోని అన్ని జీవన రంగాలపై నక్సల్బరీ వేసిన ప్రభావాలనేగాక అంతిమ విజయం దిశగా సాగవలసిన నక్సల్బరీకి ఎద...
...ఇంకా చదవండి

Naxalbari Politics: A Feminist Narrative

Krishna Bandyopadhyay | 26.08.2017 11:55:46am

hose were terrible days. Like most others in the movement, I had no shelter and was staying anywhere and everywhere. I was toying with the idea of quitting ...
...ఇంకా చదవండి

All India Seminar on The Impact of Naxalbari on Indian Society

Revolutionary Writers Association | 04.09.2017 05:34:12pm

Revolution is really a splendid concept. Itʹs a great confidence. Itʹs a great dream that will not die in the eyes even when the head is severed. Thatʹs why...
...ఇంకా చదవండి

భారతదేశంపై వసంత మేఘ గర్జన

| 21.08.2017 04:23:33pm

డార్జిలింగులో ప్రారంభమయిన గ్రామీణ సాయుధ పోరాటం భారత అభివృద్ధి నిరోధకులకు భయోత్పాతాన్ని కలిగించింది. తమకు కలగబోయే విపత్తును వాళ్ళు పసిగట్టారు. డార్జిలింగు......
...ఇంకా చదవండి

The Impact of Naxalbari on Indian Society, Its Achievements and Challenges

Virasam | 17.08.2017 02:21:11pm

Naxalbari made an indelible impact not only on the revolutionary movement in the country but also has a tremendous influence on the social relations, emanci...
...ఇంకా చదవండి

చారిత్రాత్మక మే 25, 1967

ఫరూక్‌చౌధురి | 23.08.2017 03:09:11pm

ఇది నక్సల్బరీకి యాభైవ వసంతం. భారత - నేపాల్‌సరిహద్దుకు సమాంతరంగా ప్రవహిస్తున్న మేచీ నదీప్రాతంలో ప్రారంభమైన అనన్య సామాన్యమైన ఆ పోరాటానికీ, దాని నిర్మాతలకూ.......
...ఇంకా చదవండి

భార‌త స‌మాజంపై న‌క్స‌ల్బ‌రీ ప్ర‌భావం (అఖిల భార‌త స‌ద‌స్సు)

విర‌సం | 04.09.2017 06:04:15pm

9, 10 సెప్టెంబ‌ర్ 2017 తేదీల్లో హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న ʹభార‌త స‌మాజంపై న‌క్స‌ల్బ‌రీ ప్ర‌భావం : విజ‌యాలు - స‌వాళ్లుʹ విర‌సం అఖిల భార‌త స‌ద‌స్సు ...
...ఇంకా చదవండి

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

| 25.05.2020 02:33:13am

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.....
...ఇంకా చదవండి

Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2

| 26.05.2019 08:21:42pm

Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •