గోడ ఒక ఆయుధం

| సాహిత్యం | క‌విత్వం

గోడ ఒక ఆయుధం

- గీతాంజ‌లి | 04.04.2018 06:21:40pm

మిత్రమా ...
గోడల్ని బద్దలు కొట్టద్దులే..
పోనీ ఇలా రా
గోడల మీద నినాదాలన్నా రాద్దాం!
గోడల చాటు నుంచైనా మాట్లాడుకుందాం!
అటు వైపు నుంచి నువ్వు
ఇటు వైపు నుంచి నేనూ
ఒకరి లోకి ఒకరం ప్రవహిద్దాం!
గోడల్ని కూడా పారదర్శకం చేసుకుందాం!

గోడలు ఉన్న చోటే ఉండవు గా
ఆకాశంలో కి విస్తరించవూ?
గోడలు చీకటి - వెలుగులను మోసే అద్దాలైపోవూ?
నీ చుట్టూతా గోడలు
కట్టు కుంటే కట్టుకున్నావు కానీ
దోస్త్...
తలుపులు కూడా ఎందుకు మూసుకుంటావు?

గోడలు కూడా వదులవుతాయి
కాంతి పుంజాలను ప్రసరిస్తాయి
గోడలు నిశ్శబ్దంగా ఉన్నాయనుకోకు
చెవి ఒగ్గి విను.. మాటల్నెలా ఒదులుతాయో
కొన్ని నిజాలు... మరికొన్ని అబద్దాలు ... చెబుతాయి
మూసిన గదుల వెనకాలి కుట్రలను మోసే సాక్షులవుతాయి

నీ గోడల మధ్య నువ్వే బందీవని తెలియదా...
ఒక్కసారి... నీ గోడలు పగల కొట్టుకొంటూ బయటకు రా!
పోనీ తుప్పు పట్టిన తలుపు గొళ్ళమన్నా తియ్యు
నీ హృదయం కూడా తెరుచుకుంటుంది!
హృదయమేనా?
దేహమంతా పారదర్శక మౌవుతుంది!
గోడలవతలనుంచి... రంగులు రంగులుగా ముఖాలు
మార్చు కుంటూ వస్తే ఎలా చెప్పు?
ఎప్పటికైనా నీ అసలు ముఖ చిరునామాని
నీ గోడలే సాక్షాత్కరిస్తాయి

ఎంత కాలం గోడలా
బిగుసుకు పోతావు చెప్పు?
నీ గోడల మధ్య నీ ఒంటరి దుఃఖాన్ని నేను వినలేదనుకున్నావా?
నీ గోడల మధ్య ఏముందో చెప్పు పోనీ.?

నీ చర్మం పొరలు పొరలుగా విసర్జించే
ముతక వాసన, మగ వాసనా నీకు నువ్వే పీల్చుకోవడం తప్ప
నీ గోడలే నీకు వేసిన సంకెళ్ళ శబ్దాలు
విప్లవ గీతాలని భ్రమపడడం తప్ప
నీ గోడలలోకి, నీ లో లోపలి కి, నీ శ్వాస లోపలికి
అరణ్య మేఘాలు విసిరే వాన తుంపరలు
స్వచ్చమైన పూలపరిమళాలు వద్దా?
శ్వాసించు.. శ్వాసించు...శ్వాసించు..
కొత్తగా శ్వాసించు... పోనీ నా శ్వాస అందుకో మిత్ర మా
గోడల వెనుక..నీ లోపల
పరమాధ్భుతమైన నూతనమానవుడున్నాడని.
గోడలే గుస గుస లాడ్డం వినలేదా??

బయటకు రానియ్యు
శిలవైపోకు!
రా...
గోడల్ని దాటుకొనో..
కూలగొట్టో..
నన్ను తోసేసి గోడల్ని కట్టుకుంటావు కానీ.,
నీ గోడలు నీ మీదే కూలి పోతాయని దోస్త్.,
ఎప్పుడు తెలుసుకుంటావు?
గోడవతల నొప్పి ఉండలా...
ఎంతకని ముడుచుకు పోతావు చెప్పు?
గోడల మధ్య ఎంతకని నీకు నువ్వే
సూక్ష్మ క్రిమిలా విభజన చెందుతూ పోతావు?
దేహాన్ని కలుపు మొక్కల మడి చెక్క లా.,
మొలిపించుకుంటూ పోతావు చెప్పు?

సుత్తో కొడవలో...
తుపాకో... బాణమో..
నీ గోడల్లోనే ఎక్కడో..
మరుగు పడిపోయి ఉంటాయి!
ముందుగా...
నీ గోడలనే పగలగొట్టుకొంటూ పో
పరికరాలు లేవా???
పోగొట్టుకున్నావా???
పోనీ
నేనందిస్తా అందుకుంటూ పో
అర్థం చేసుకో మిత్ర మా!

గోడ
నువ్వు కత్తిరిస్తున్న
నా రెక్కల చప్పుడు వినే శ్రోత!!
నువ్వు నొక్కేస్తున్న నా నగారా పిలుపుని
వెలివాడల నుంచీ అరణ్యాల దాకా
ప్రతిధ్వనించే గుంపు సంగీత వాద్యం!!

గోడ
అమరత్వపు రక్త సిక్త‌
ఛాయా చిత్ర పటం!
గోడ
ఖైదీ రాయ బోయే
కవితా సంకలనం!
గోడ
ఒక యుద్ధ భాషా నిఘంటువు!
గోడ
తనకు తానే ఒక కవి!!
గోడ
విప్లవ నినాదాల్ని మోసే
ఒక యుద్ధ పత్రిక!!

గుర్తు పెట్టుకో... గోడలు కట్టడం కాదు!
గోడల్ని కూల్చడమే మన పని!
గోడలనెందుకు మలినం చేస్తావు చెప్పు?

నా ప్రియమైన మిత్రమా
గోడకి ఆవల కాదు
ఈవలకొచ్చి స్నానం చెయ్యి!
నీ చర్మాన్ని పొరలు పొరలుగా కమ్ము కొన్న
అగ్రహారపు జిడ్డు ఒదులు కునే దాకా!

ఎందుకంటే
గోడ యుద్ధ తంత్రాన్ని రచించే ఒక ఆయుధ మే కాదు
స్పృహలో ఉంచుకో
గోడ
మనుషుల అమరత్వాన్ని
నిలువెత్తుగా నిలబెట్టే
విప్లవ స్థూపం!!

No. of visitors : 304
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నేనొక అర‌ణ్య స్వ‌ప్నం

గీతాంజ‌లి | 16.08.2016 09:11:44am

నిదుర‌లోని స్వ‌ప్నాల్లో మెల‌కువ‌లోని సంభాష‌ణ‌ల్లో నాచూపుల‌కందే దృశ్యాల‌లో నా శ్వాస‌కు చేరే ప‌రిమ‌ళాల్లో ఒక్క నువ్వే అందుతావు ఎందుకు ?...
...ఇంకా చదవండి

ఎవరు అశుద్ధులు

గీతాంజ‌లి | 04.10.2016 11:12:24pm

అమ్మ గ‌ర్భంలోని ప‌రిమళ స‌ర‌స్సులో మునిగి న‌న్ను నేను శుద్ధి చేసుకునే పుట్టాను పుట్టిన‌ప్ప‌ట్నించీ నిన్ను శుద్ధి చేస్తూనే వ‌చ్చాను...
...ఇంకా చదవండి

క‌విత్వం రాయడానికి ఓ రోజు కావాలా?

గీతాంజలి | 22.03.2018 12:45:25am

ఎవరో కడలి అట ఎంత బాగా రాస్తుందో ప్రేమ గురించి ముఖ పుస్తకంలో ...!! ఇప్పుడిప్పుడే, దేహంలో- మనసులో వసంతాలు విచ్చుకుంటున్న అమ్మాయి! ఇక ఒక్క క్షణం కూడా నటించను...
...ఇంకా చదవండి

పడవలైపోదాం

గీతాంజ‌లి | 04.03.2017 09:28:58am

నది ధుఃఖాన్ని ఈడ్చుకెళ్తున్న పడవలను లేదా నదిని మోస్తున్న పడవలను ఎన్నడు తీరం చేరని తనాన్ని నదిని వీడలేని తనాన్ని నది మధ్యలొ నిలిచిపోయి నదుల సామూహిక...
...ఇంకా చదవండి

అమ్మ ఒక పని మనిషా?

గీతాంజలి | 19.05.2018 03:54:37pm

నీకు రేపొచ్చే ఇరవై ఆరెళ్లకి.. నీవు కూడా అమ్మ అనే పని యంత్రంలా మారక ముందే.. నా స్థితి ఇంకా అధ్వాన్నం కాక ముందే.. నేనో నువ్వో.. ఇద్దరి లో ఎవరిమో.. మరి ఇద్దర ...
...ఇంకా చదవండి

నీడ ఒక అంతర్ మానవి !

గీతాంజలి | 03.08.2018 11:31:48am

పోనీ...నువ్వు ఎప్పుడైనా మృత వీరుడి స్తూపపు నీడ పడ్డ భూమి.. ఎఱ్ఱెరని విత్తనమై మొలకెత్తడం చూసావా?? రా... నీడలు చెప్పిన రహస్యాలను .. మనం చేయాల్సిన యుద్ధాలను.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - ఆగ‌స్టు 2018
  శప్తభూమి పరిచయ సభ
  రాపూరు దళితవాడపై పోలీసు దమనకాండను నిర‌సిద్దాం
  నాస్తికోద్యమ నాయకుడు కడుచూరి అయ్యన్నకు నివాళి
  ప్రజాపక్ష రచయిత, అనువాదకులు నిర్మలానందకు జోహార్లు
  Statement from the Indian Writersʹ Forum
  Dream to Dream
  ఊరుకుందామా?
  అమ్మ చెప్పింది
  మౌనం తెగేదెప్పుడు?
  మిగతా కథ
  బ్రాహ్మ‌ణీయ హిందూ ఫాసిజాన్ని ప్ర‌తిఘ‌టిద్దాం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •