యురేనియం కర్మాగారం చేస్తున్న కాలుష్యాన్ని ప్రశించిన ప్రజాసంఘాల నాయకుల అరెస్టులను ఖండిస్తున్నాం

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

యురేనియం కర్మాగారం చేస్తున్న కాలుష్యాన్ని ప్రశించిన ప్రజాసంఘాల నాయకుల అరెస్టులను ఖండిస్తున్నాం

- విరసం | 09.04.2018 11:25:42pm

UCIL మీద విచారణ జరపాలని, తుమ్మలపల్లె పరిసర ప్రాంతంలో కాలుష్యాన్ని నిశ్పక్షపాతంగా పరీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం, వేముల మండలంలోని తుమ్మలపల్లె వద్ద యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) గత పదేళ్ళ నుండి మైనింగ్ చేస్తూ యురేనియం ఖనిజాన్ని వెలికి తీసి, అక్కడే నిర్మించిన శుద్ధి కర్మాగారంలో ముడి యురేనియంను శుద్ధి చేస్తోంది. యురేనియం ప్లాంటు విడుదల చేతున్న వ్యర్థాల వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్ర కాలుష్యం బారిన పడుతున్నాయి. వందల ఎకరాల్లో పంటలు నాశనం అయ్యాయి. నేలంతా ఉప్పు తేలి వ్యవసాయానికి పనికిరాకుండా పోయింది. నీళ్ళు తాగడానికే కాదు ఇతర అవసరాలకు కూడా వాడలేని పరిస్థితి వచ్చింది. ఈ విషయమై ఆ ప్రాంత ప్రజలు, ప్రజాసంఘాలు కొన్నేళ్లుగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. యురేనియం వ్యర్థాలను నిలువ చేసే టైలింగ్ పాండ్ నిర్వహణ పరమ అధ్వాన్నంగా ఉంది. యురేనియన్ వ్యర్థాల నుండి ప్రమాదకరమైన రెడియేయన్ విడుదల అవుతూ ఉంటుంది. అందుకని దాన్ని పకడ్బందీగా నిలువచేయాలి. అయితే అందులోకి వ్యర్థాల్ని మోసుకొచ్చే పైపు లీకేజీ గురించి ఒకసారి రైతులు ఫిర్యాదు చేసారు. అది మాత్రమే కాదు టైలింగ్ పాండ్ అనబడే వ్యర్థాల చెరువుకు కలుషిత నీళ్ళు భూగర్భంలోకి మందపాటి లైనింగ్ వేయాలి. అది వేయలేదు. ఇష్టం వచ్చినట్లు వ్యర్థాల్నికొండగుట్టల నుండి అందులోకి పోస్తున్నారు. ఈ క్రిమినల్ నిర్లక్ష్యాన్ని పదేళ్లుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రశ్నించలేదు.

మబ్బుచింతల పల్లె గ్రామస్తులు కలెక్టరుకు పంటలు ఉప్పు తేలిపోవడం గురించి గత ఏడాది ఫిర్యాదు చేసారు. ఎలాంటి స్పందనా లేదు. ఆరు నెలల తర్వాత కనంకింద కొట్టాల గ్రామంలో వందెకరాల దాకా పొలాలు పాడయ్యాయి. మొక్కలు మొలవకుండా, మొలిచినా కంకి రాకుండా ఉండడం యురేనియం వ్యర్థాల వల్లే అని ఈ గ్రామం వాళ్ళు కాలుష్య నియంత్రణ మండలికి పిర్యాదు చేసారు. ఇన్నేళ్ళూ పట్టించుకోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇక తప్పదనుకుందో ఏమో, పోయిన నెలలో UCIL కు షోకాజ్ నోటీసు ఇచ్చింది. అయితే అక్కడ ఇలాంటిదేమీ జరగడం లేదని ఆ నేలలో ఎక్కువగా లవణాలు ఉండడం వల్ల సహజంగానే అది ఉప్పు తేలిందని, కొంతమంది ఎన్జీవోలు మా పనులు అడ్డుకోడానికి కుట్ర పన్నారని UCIL ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. రైతుల అనుమానాలు నివృత్తి చేయడానికి బాబా అటామిక్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ (BARC) నుండి నిపుణులను పిలిపించి రైతులతో మాట్లాడిస్తామని చెప్పారు. మరి మా తరపున మాట్లాడ్డానికి నిపుణులు ఉండాలి కదా అని రైతుల పర్యావరణవేత్త బాబూరావు, మానవహక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ, ఎన్.ఎ.పి.యం బాధ్యులు రమేష్ లను ఆహ్వానించారు. ఈ రోజు ఈ సమావేశం కోసం వీళ్ళు వెళుతుండగా ఫ్యాక్టరీ పరిసర ప్రాంతంలోనే పోలీసులు వారిని అడ్డుకుని వేముల పోలీస్ స్టేషన్ లో అక్రమంగా నిర్బంధించారు. UCIL అధికారులతో, BARC శాస్త్రవేత్తలతో మాట్లాడ్డం శాంతి భద్రతల సమస్య ఎట్లా అవుతుందో, వారిని కలవడం నేరమెలా అవుతుందో ఎంత అడిగినా పోలీసులు వీళ్ళకు సమాధానం చెప్పలేదు. పై అధికారుల ఆదేశం అని మాత్రమే చెప్పారు. రైతులు తీవ్రంగా ప్రతిఘటించడంతో చివరికి బాబూరావు గార్ని మాత్రం వెళ్ళనిచ్చారు. మానవహక్కుల జిల్లా కన్వీనర్ జయశ్రీ మొదటి నుండి గ్రామస్తుల పక్షాన మాట్లాడుతున్నారు. ఆమెను ససేమిరా అనుమతించమన్నారు. పోలీసుల అత్యుత్సాహాన్ని, దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాయలసీమను సస్యస్యామలం చేయడమంటే ఇదేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఆత్మహత్యల అభివృద్ధిని, విధ్వంసాన్ని, ప్రజల ప్రాణాల పట్ల లెక్కలేనితనాన్ని ఖండిస్తున్నాం. తక్షనం UCIL మీద విచారణ జరపాలని, తుమ్మలపల్లె పరిసర ప్రాంతంలో కాలుశ్యాన్ని నిశ్పక్షపాతంగా పరీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

పాణి, విరసం కార్యదర్శి
వరలక్ష్మి కార్యవర్గ సభ్యురాలు

తేదీ: 9-4-2018





No. of visitors : 347
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి

కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం

| 19.03.2018 03:20:51pm

కామ్రేడ్ మారోజు వీరన్న ప్రభావశీలమైన విద్యార్థి నాయకుడు. ఈ దేశ విప్లవం కోసం కలగన్నాడు. ముఖ్యంగా వర్గపోరాటంలో దళిత బహుజన పీడిత సమూహాల విముక్తి కోసం అనేక ఆలో.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    21వ శతాబ్దంలో మార్క్స్‌
    అరుణతార ఏప్రిల్ - 2018
    యురేనియం కర్మాగారం చేస్తున్న కాలుష్యాన్ని ప్రశించిన ప్రజాసంఘాల నాయకుల అరెస్టులను ఖండిస్తున్నాం
    గోడ ఒక ఆయుధం
    చెప్పులు కొందాం రండి
    ఎలా వెళ్ల‌ను?
    ʹహెచ్‌సీయూ వీసీ హ‌త్య‌కు ప‌థ‌కంʹ బూట‌కం
    భవిష్యత్తును కాల్చేశారు
    రజనీతిలక్ లేని లోటు భర్తీ చేయలేనిది
    కలకత్తా సాహిత్య ఉత్సవాల్లో పాల్గొన్న ముగ్గురు కవయిత్రులు
    కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ప్రైవేటు వర్సిటీలు
    ప్రజా ప్రత్యామ్నాయ సాహిత్య వేదిక

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •