స‌మాజాన్ని విముక్తి చేసే దారిలో వాళ్లు...

| సంపాద‌కీయం

స‌మాజాన్ని విముక్తి చేసే దారిలో వాళ్లు...

- అమ‌రుల బంధు మిత్రుల సంఘం | 17.04.2018 12:05:58am


మార్చి 2వ తేదీ చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని పూజారి కాంకేర్‌ (తడపల గుట్ట) ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది విప్లవకారులు అమరులయ్యారు. కోవర్టు సమాచారంతో దళంపై దాడి జరిపి అనారోగ్యంతో ఉన్న కొద్దీ మంది కామ్రేడ్స్ ను పట్టుకుని చంపారు. మరికొందరు ప్రతిఘటిస్తు అమరులయ్యారు. ఇందులో వరంగల్‌ జిల్లాకు చెందిన స్వామి కాక తొమ్మిది మంది ఆదివాసీ కామ్రేడ్స్‌ ఉన్నారు (కా"జోగాళ్, కా"మల్లేష్, కా"రామె, కా"కోసి, కా"సంఘీత, కా"రత్న, కా"లలిత, కా" సోని, కా"జోగి). మొత్తం అమరులలో 7గురు మహిళలు ఉన్నారు.

దేశ వ్యాప్తంగా వివిధ రకాల ఆపరేషన్లు, అభయాన్లు పేరుతో విప్లవోద్యమాన్ని అణిచివేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. బస్తర్లో ఆపరేషన్ ప్రహార్ - 2, ఎఓబిలో ఆలౌట్ వార్ -2, ఒడిశాలో హంటింగ్ మావోయిస్టు మిషన్, కేరళలో ఆపరేషన్ థండర్ బోల్ట్, జార్ఖండ్లో ఆపరేషన్ హాకా, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ సరండా పేర్లతో దాడులను నిర్వహిస్తున్నది. కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ మావోయిస్టు పార్టీ చివరి దశలో ఉన్నదని ప్రకటించాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఛతీస్ఘడ్లో వైమానిక దాడులకు (డ్రోన్లు, హెలీకాఫ్టర్ గ్రూప్ బాంబింగ్ లు) అనుమతిని ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం ʹఆపరేషన్ సమాధాన్ - 2022 ʹ పేరుతో 2022 నాటికల్లా ఉద్యమాన్ని అంతమొందిస్తామని ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో రక్షణ కారిడార్ పేరుతో డ్రోన్, హెలికాఫ్టర్ దాడులను ఆదివాసులపై చేస్తున్నది. ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలైనప్పటి నుంచి సైనిక బలగాలు చేస్తున్న దాడులు నానాటికి తీవ్రమవుతున్నాయి.

ఆదివాసీ ప్రజలను భయ పెట్టడానికి గ్రామాలను తగలబెడుతూ, ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తున్నది. వాళ్ళు నిర్మించుకున్న పాఠశాలలను కూల్చి వేస్తున్నది. వారిని బలవంతగా బేస్ క్యాంప్ లలో నిర్బంధించింది. వందల మందిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నది. బెయిళ్లు రాకుండా అడ్డుకుంటున్నది.

ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలైనప్పటి నుంచి దేశావ్యాప్తంగా ఈ పరిస్థితి పెరుగుతున్నది. మంద్రస్థాయి యుద్ధతంత్రంలో భాగంగా ఆదివాసి, గ్రామీణ , మైదాన ప్రాంతాల్లో యుద్ధ వాతావణం పెరిగింది. సైనిక, మానసిక పరమైన ప్రతిఘాతుక దాడులతో రాజ్యం పైచేయి సాధించాలనుకుంటోంది.

ఈ నిర్బంధాన్ని ఖండిస్తూ , ప్రజల పక్షాన మాట్లాడుతున్నా ప్రజస్వామిక వాదులను, మేధావులను కట్టడి చేస్తామని అప్పటి బస్తర్ ఐజి కల్లూరి బహిరంగగానే ప్రకటించాడు. నందిని సుందర్, మాలిని సుబ్రహ్మణ్యం , సోనిసోరి,బేల సొమలి (భటియా), శాలిని గేరు వంటి వాళ్ళ మీద దాడులు జరిగాయి. వాళ్ళను బస్తర్ లో పని చేయకుండా నిర్బంధాన్ని ప్రయోగించారు .

బహుళజాతి కంపెనీలకు సహజ సంపదను దోచిపెట్టడంలో భాగంగా ఆదివాసులపై భారత ప్రభుత్వం యుద్దానికి దిగింది. ఈ నేపథ్యంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరిగి పోతున్నాయి. వాకపల్లి, భల్లుగూడ, గొంపాడు నుంచి నేటి ఒడిశాలోని కుండలి అత్యాచార ఘటనలు కొన్ని ఉదాహరణాలు మాత్రమే. ఇది దండకారణ్యం , ఆంధ్ర- ఒడిస్సా సరిహద్దు ప్రాంతం అనే కాక బీహార్, జార్ఖండ్, పశ్చిమ కనుములు... ఇలా చెప్పుకుపోతే అనేక ప్రజా పోరాటాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అణిచివేత కొనసాగుతుంది. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న దాడులలో అనేక వికృత రూపాలలో మహిళలు బలి అవుతున్నారు. చివరికి వృద్దులు, చిన్న పిల్లలపైనా కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి.

మహిళలపై ఇంత తీవ్ర స్థాయిలో దాడులు జరగడానికి విప్లవోద్యమంలో మహిళల భాగస్వామ్యం గణనీయమైనది. దండకారణ్య పోరాటంలో మొదటి నుంచి మహిళల పాత్ర ఉన్నప్పటికీ గత రెండు దశాబ్దాలుగా ఇది సగభాగాన్ని అధిగమించింది. దండకారణ్య విప్లవోద్యమం స్వావలంబన, ప్రత్యామ్నాయ ప్రజాపాలన దిశగా బలపడటం వెనుక ఆదివాసీ మహిళల సృజనాత్మక భాగస్వామ్యం ఉన్నది. పితృస్వామ్య కట్టుబాట్ల నుంచి, తెగల రివాజుల నుంచి మహిళలు విముక్తి చెందుతున్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే మహిళల పాత్ర లేకుండా విప్లవోద్యమం లేదు. వర్గపోరాట ఆచరణ వల్లే మహిళలు కట్టుబాట్లను ఎదిరించి ఉత్పత్తిలో పాల్గొంటున్నారు. ప్రజా పాలనలో భాగమవుతున్నారు. ప్రభుత్వ బలగాలను ప్రతిఘటించి భూకాంల్‌ సేనలో, ప్రజా విముక్తి గెరిల్లా సైన్యంలో మహిళల పాత్ర పెరుగుతున్నది. గత కొన్నేళ్లుగా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలనే లక్ష్యం చేసుకొని యుద్ధం చేస్తున్నది ఇందువల్లే. ఈ ముఖ్యమైన విషయం గుర్తించకపోతే పోలీసులు, రకరకాల సైనిక, అర్ధ సైనిక బలగాలు వందలాది మంది దండకారణ్య ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు ఎందుకు చేస్తున్నారో అర్ధం కాదు. ప్రతి ఎన్‌కౌంటర్‌లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఎందుకు అమరులవుతున్నారో, కొన్ని ఎన్‌కౌంటర్‌ ఘటనల్లో అందరికి అందరు మహిళలలే ఎందుకు ఉంటున్నారో అర్ధం కాదు. మహిళల శరీరాలు, జీవితాలు లక్ష్యం చేసుకొని ఈ పాశవిక యుద్ధం నడుస్తోంది.

మన కళ్లెదుట దండకారణ్యంలో ఆదివాసులు చేస్తున్న ఈ పోరాటాలను, ఈ విజయాలను గుర్తించకుండా కేవలం వాళ్లపై దాడులను వ్యతిరేకించడం కుదరదు. అది చాలా పైపై ఖండనగా మిగిలిపోతుంది. రాజ్యహింసను వ్యతిరేకించడమంటే కేవలం అత్యాచారాలను, హత్యలను ఖండించడమే కాకూడదు. ఇంత దారుణమైన హింసను భరిస్తూ, ఎదుర్కొంటూ దశాబ్దాల తరబడి వాళ్లు చేస్తున్న పోరాటంలోకి తొంగి చూడకుండా, అక్కడి అద్భుతాన్ని గుర్తించకుండా రాజ్యహింసను వ్యతిరేకించడం ఆనవాయితీ వ్యవహారం అవుతుంది. ఒక్క దండకారణ్యమే కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్నా పోరాటాలకు మద్దతుగా, పూజారి కాంకేర్‌ అమరుల స్మృతిలో ఈ సభ జరుపుతున్నాం. విప్లవోద్యమంలో, ముఖ్యంగా దండకారణ్య ఉద్యమంలో ఆదివాసి మహిళల పాత్రను విశ్లేషించడం ఈ సభ ఉద్దేశం. ఆదివాసులపై అమలవుతున్న రాజ్యహింసను ఖండిస్తూ ఈ సభ జరుపుతున్నాం. ఇందులో పాల్గోని విజయవంతం చేయాలని కోరుతున్నాం.

( ఈ నెల 28న ఖమ్మంలో పూజారి కాంకేర్‌ అమరుల స్మృతిలో రాజ్యహింసకు, ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా అమరుల బంధుమిత్రుల సంఘం సభను నిర్వహిస్తున్నది)

No. of visitors : 761
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
  అరుణతార జూన్ 2019
  మహాభారతం - చారిత్రక వాస్తవాలు
  జల వనరుల సాధనకు స్ఫూర్తి
  వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
  నల్లని పద్యం
  పేకమేడలు
  Democratized Poetry
  ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
  ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
  Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
  ఆచ‌ర‌ణే గీటురాయి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •