ఇంద్రవెల్లి జ్ఞాపకమా!

| సాహిత్యం | క‌విత్వం

ఇంద్రవెల్లి జ్ఞాపకమా!

- వడ్డెబోయిన శ్రీనివాస్ | 17.04.2018 12:23:20am

అడవీ
మనిషైయ్యింది
అడవీ
ఆలోచనైంది
అడవీ
చీమూనెత్తుటి స్పర్శైంది

అడవి
మనస్సు పుట్టింది

అడవి
ప్రశ్నైంది
ధిక్కారమైంది
సంఘమైంది
సభాసంరంభమైంది

నక్సల్బరి సంతాల్లా
శ్రీకాకుళం సవరల్లా జాతాపుల్లా
సిరిసిల్లా జగిత్యాల జలలా

అదిలబాదు ఆదివాసి
అరణ్యశంఖం పూరించాడు
అడవి
ఆరనిజ్వాల చేశాడు

అడవి
అయిదు వేల తలలై కదిలింది

గొండులు కొలాములు కోయలు పరదాన్లు

మొగ్గలుకదిలాయి
మొలకలు కదిలాయి
చెట్లు కదిలాయి
పోడుచేన్లు కదిలాయి

పొట్ట నిండని
పోడు చేన్ల పంటలల్ల
పొరకలసార్లు పుట్టారు
చినుకులకై
నోరు తెరిచిన బతుకులల్ల
చెట్లోళ్ళు మొలిచారు
అక్షరాల
అంటరానితనంలో
ఆయుధాక్షరాలు వికసించాయి

బతుకు
చీకట్లో కొట్టుకుంటున్నప్పుడు
పసరు పడితే వెలుగు!
పొరకలసార్లే
అడవికి
కొత్త మూలుగు!!

ఉంటే
తింటారు
లేకుంటే
ఉపాసముంటారు
తమ నేలకీ
నోటికాడి కూటికి ముప్పొస్తున్నా
ఉన్నదాంట్లో
అడిగిన చేతికి
ముద్దందిస్తుంటారు

ఎప్రిల్ 20,1981
పొద్దున్నే
అడవి నిద్ర లేచింది

సభకోసం
సంతకోసం
గూడాలన్నీ
గుండె దరువేసుకుంటూ కదిలాయి కాని
వొక జలియన్ వాలాబాగ్
ఎదురొస్తున్నది తెలియదు

గిరిజనేతరులు వ్యాపారులు సావుకార్లే
తుపాకి పట్టిన పోలీసులైతారని తెలియదు

"దండా_బండా మా సర్కార్ "* 1
దోచుకోబడ్తున్న వాళ్ళనే
దోఖా చేసి
దోపిడిదారులని ప్రచారం చేస్తారని తెలియదు

ʹఏ నిబంధనలకు
లోబడి పనిచేయని బుల్లెట్లుʹ

పడగొట్టిన వాళ్ళకోసం
పరుగెత్తిన వాళ్ళనూ
పగబడ్తాయని

చెట్లకొమ్మల్లోంచి
దాక్కొని దాక్కొని ఉరుకొచ్చి
మనుషుల్నే
మహాభవనంగా
బుల్లెట్లు చేసుకుంటాయని తెలియదు

తూటా తగిల్న దూప
మడుగుల నీళ్ళు తాగి మడుగైతని తెలియదు

అసిఫాబాదు లక్సెట్టిపేట
ఖాన్ పూర్ చెన్నూర్
ఉట్నూర్ అదిలాబాదు తాలూకాలు తాలూకాలే
గిరిజన రైతు కూలి సంఘమై
గిరులను కదిలించాయి

భూస్వాములు మింగేసిన
భూమి గుంజుకున్నారు

టెండుఆకు కూలీరేటు
కూలీలతోనృత్యం చేసింది
అటవిసంపద
ఆదివాసి కళ్ళల్లో నిద్రపోయింది
ఫారెస్టు కాంట్రాక్టర్ల చేతుల్లో
ఊపిరాడని కూలి
గిరిజనుల చేతుల్లోకి ఎగిరొచ్చి
ఆనందఆలింగనం చేసుకుంది
ఫారెస్టోళ్ళపొగరు పొడిపొడిగా రాలిపోయింది

అడవి
ఆకుపచ్చని ఆనందం లో
సంఘం అడవిచెట్ల వేర్లై విస్తరించింది కాని
వొక మిలాయ్*2
తొంగి తొంగి చూస్తోందని తెలియదు

అల్పసంతోషుల
ఆయువు గురిపెట్టిండ్రని తెలియదు
రగల్ జెండాలర్యాలి
రక్త పేరవుతుందని తెలియదు

రాత్రి పారే
పాములు పురుగుల రక్షణకు
సన్నవెదురుబొంగుల గోండులు
రాతిమనుషులకోతగాబోతున్నారని తెలియదు

పసివాళ్ళో పెద్దోళ్ళో
డెబ్భై తలలు భూమిధరిస్తుందని తెలియదు

రగల్ జెండా రాడికల్ల జెండై
చంద్రవంకను
సుత్తె చుట్టమై హత్తుకున్న
వలకిడి కమన వెంకటాపూర్
కొండపల్లె తపాల్ పూర్ లింగాపూరు
రాపల్లె డాబ తిమ్మాపూరు
నాగాపురం పిప్పల్ దారులు
ఖాకీ పడగనీడలో
కలలు రక్తకన్నీరవుతాయని తెలియదు

కొంరంభీమ్ లను
కోవర్టు నిజాం కోండ్రీసుగాళ్ళెత్తుకుపోయినట్టు
నిరాయుధఇంద్రవెల్లీయులను
నియంతింద్రాంజయ్యతుపాకులెత్తుకెళ్ళాయి

పొరకలపార్టీ
గడ్డిపరకలపార్టైపోయింది
ఎర్రబారిన తుడుంమోత
ఎర్రజెండారెపరెపలైఊదిన కొమ్ముబూర
జల్
జంగల్
జమీన్
ఎర్రజెండాలై ఎగిరాయి

"మీ భూములుమీవే"
చట్టం చేసినోళ్ళు
మీభూముల చట్టాన్ని
చుట్టి
చంకలో పెట్టుకున్నారు
చట్టాలమీది
మీ చూపుల్ని నలిపి
చట్టాల భ్రమలసంకెళ్ళు తెంపారు

మీ కన్నీళ్ళను
చెట్టు పాడింది
పుట్ట పాడింది
గుట్ట పాడింది
అడవి అడవే విషాద మాడి పాడింది

పొర్లిపడిన దుఃఖమంతా
పొరకలపార్టైయ్యింది
రగులుకున్న దుఃఖమంతా
రగల్ జెండైయ్యింది
ʹఅదృశ్యాలʹదుఃఖమంతా
ఆదివాసిఆయుధమైంది

ఇనికిన కన్నీళ్ళన్నీ
అడవీ మైదానం అలింగనం చేసుకొనే
ఇంద్రవెల్లి సభైనాయి

అత్యవసరపరిస్థితుల అమ్మ
తోలుబొమ్మ

నక్కజిత్తుల తుపాకుల్నీ
గుండెగుండెకు గుడ్డేలుగుల్నీ పంపాడు

కందకాలు తొవ్వుకొని
కడుపుల దాసుకున్నోళ్ళను
మంచెలు వేసుకొని
మనుషుల కాపాడుకున్నోళ్ళను
నెగళ్ళు వేసుకొని
నెత్తురు దక్కిచ్చుకున్నోళ్ళను

సాత్నాలా యుద్ధభేరి చేసిన
తుడుం సాక్షిగా

గోండులరక్తం
గోదారై పారింది
పురాజీవి నెత్తురు
ప్రాణహితై పొంగింది
ప్రేమలమనిషి
పెన్ గంగై పారాడు

ఇంద్రవెల్లి జ్ఞాపకమా!
వాడు తెల్లరంగేసినా
నీఒళ్ళంతా గోండు నెత్తురే కదా!
పారింది!
అందుకే
మళ్ళీ ఎర్రబడ్డావు
మళ్ళీమళ్ళీ ఎర్రబడ్తావు

తననుతాను విత్తుకున్న
కొమురంభీం గోండ్వానా రాజ్యం నువ్వు
అణిచిన కొద్దీ
అరుణారున అరణ్యమై పోతావు

భూమి భుక్తి విముక్తి కేతనమా!
తల్లీ!
ఇంద్రవెల్లీ!!
హిమాలయాల్లో పుట్టిన గంగ
ఉప్పు సముద్రం కలిస్తే
ఇంద్రవెల్లి నెత్తుటి గంగ
నిప్పు సముద్రం కల్సింది

జగిత్యాల నుండి
జంగల్ మహల్ దాక
దేశందేశమే
దండకారణ్యమై
మళ్ళీ
నీకాలమవుతుంది

1.కర్ర_రాతిబండ_రాజ్యం
2.వియత్నాంలోని మిలాయ్ మీదఅమెరికా హత్యాకాండ


No. of visitors : 611
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


గుర్మేహర్‌

వడ్టెబోయిన శ్రీనివాస్‌ | 06.07.2017 12:21:58am

నాన్న రుచి కోల్పోయిన జ్ఞాపకాలగాయం నీగుండెల్లో రక్తమొడ్తుండవొచ్చు హిందుత్వవిచ్చుకత్తులవిన్యాసం నీమనస్సుపొక్కిలి పొక్కిలి చేయవచ్చు ...
...ఇంకా చదవండి

జలగలంచ, దేవునిగుట్ట ఆదివాసుల్ని బతకనీయండి!

వడ్డెబోయిన శ్రీనివాస్‌ | 05.10.2017 11:16:52pm

వారు నోరు లేనోళ్ళు.అడవిలో అడివై బతికే వాళ్ళను అడవి నుండి బయటకు వెళ్ళమంటే అడివినే అడవిలోంచి వెళ్ళమన్నట్టుంటుంది.అడవిలో ఆకు పెరిగినట్టు, చెట్టు పెరిగినట్టు......
...ఇంకా చదవండి

సూర్యాక్షరం

వడ్డెబోయిన శ్రీనివాస్ | 19.11.2018 04:55:36pm

చీకటియుగానికి పాదులు తొవ్వుతున్న ద్వేషభక్తుల అబద్దాలముసుగు హామీలమత్తులో దేశం ఊగుతున్నప్పుడు అధికారంకౄరమృగమై దేశభక్తుల వేటాడుతూ నెత్తురు...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అతడూ అర్బన్ నక్సలైటే
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •