ప్రజల హృదయ కవాటాలు తెరవడమే రచనా శిల్పం

| సాహిత్యం | స‌మీక్ష‌లు

ప్రజల హృదయ కవాటాలు తెరవడమే రచనా శిల్పం

- విజయ్‌ | 17.04.2018 12:56:59am

జారిస్టు రష్యాలో వచ్చినంత గొప్ప రచనలు ఈనాడు ఎందుకు రావడం లేదు అని 1948లో ఒక యువ ఇంజనీర్‌ రాసిన లేఖ ఇల్యా ఎహ్రెన్‌బర్గ్‌ను రచయితా శిల్పమూ గురించి ఎన్నో విలువయిన విషయాలు చెప్పడానికి ప్రోత్సహించింది.

ఇది ఒక రష్యా సమస్యే కాదు. టాల్‌స్టాయ్‌లు, డాస్టవ్‌స్కీలు మాత్రమే కాదు. ఈనాడు పాశ్చాత్య దేశాల్లో బాల్జాక్‌లూ, డికెన్సులు కూడా లేరు. ఎహ్రెన్‌బర్గ్‌ ఊహించిన కారణాలు నెమ్మదిగా మారుతూ ఉన్న సమాజంలో వాళ్ళు జీవించి వర్ణించారు గనుక వాళ్ళకు రాయడం సులభం అయింది. ఇక సోవియెట్‌ రచయితలకే ప్రత్యేకమైన సమస్య ʹఇది వరకే నెలకొని ఉన్న సమాజ చిత్రాన్ని బట్ట బయలు చేయడంగానీ, లేక ఊరకే వర్ణించడం గానీ ఒక ఎత్తు. చరిత్రలో ఇదివరకెన్నడూ లేని ఒక సమాజాన్ని, ఇప్పుడు నిర్మాణావస్థలో ఉన్న ఒక సమాజాన్ని రచయిత కూడా ఆ నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న సమాజాన్ని చిత్రించడం మరో ఎత్తు. ఈ రెండింటినీ పోల్చడానికి వీలు లేదు.

రష్యాలోనే కాకుండా పాశ్చాత్య సాహిత్యంలో వచ్చిన ప్రామాణిక ప్రాచీన సాహిత్యం గురించి చర్చించి సోవియెట్‌ రచయితలకు టాల్‌స్టాయ్‌ నుంచి గోర్కీ షోలోఖోవ్‌ల దాకా ఉన్న సాహిత్య వారసత్వాన్ని వివరించాడు. ఆయన ప్రధానంగా కల్పనా సాహిత్యంలో నవలలను తన ప్రతిపాదనలకు ప్రాతిపదికగా చేసుకున్నాడు.

రచయిత ఏం రాస్తాడు, ఎప్పుడు రాస్తాడు, ఎందుకు రాస్తాడు, ఎట్లా రాస్తాడు అనే అన్ని ప్రశ్నలకు విస్పష్టంగా (66 పేజీల చిన్న పుస్తకంలోనే) సాహిత్యం నుంచే ఉదహరించాడు గానీ తన బుర్రలో పుట్టిన ఊహలనకు రూళ్ళగర్ర నియమాలుగా చెప్పలేదు.

ʹఈనాటికీ మనలాంటి దేశాల్లో తలెత్తుతున్న వాద వివాదాలను పరిష్కరించేందుకు సహాయపడగల గ్రంథంʹ (పరిచయం-ప్రకాశకులు)గా, అంటే విప్లవం ఇంకా విజయవంతం కాని దేశంలో రచయిత నుంచి పాఠకుడు ఏం ఆశిస్తున్నాడు అనే దృష్టితో ఈ పుస్తకాన్ని సమీక్షించుకుంటే మన సాహిత్యానికి ప్రయోజనం ఉంటుంది.

పీటర్‌ ది గ్రేట్‌ గురించి తెలుసుకోవడానికి పాఠకుడు చదవవలసింది టాల్‌స్టాయ్‌ ʹయుద్ధం-శాంతిʹ కాదు. సహకార వ్యవసాయం గురించి తెలుసుకోవడానికి చదవాల్సింది షోలఖోవ్‌ ʹబీళ్ళు దున్నేరుʹ కాదు. అట్లాగే ఉక్కు, సిమెంటు, వ్యవసాయం వంటి రంగాలకు సంబంధించిన విజ్ఞానం పాఠకునికి సాహిత్యం నుంచి కలగవచ్చుగానీ అందుకోసం కాదు పాఠకుడు సాహిత్యం చదివేది. సాహిత్యం చిత్రించవలసింది ఆయా పని (పని జీవితంలో అత్యంత ప్రధాన భాగం) రంగాలను కాదు; అందులో పాల్గొంటున్న మానవుల అంతరంగాలను, భావోద్రేకాలను, అందువల్ల కలగాల్సింది విజ్ఞానం కాదు. (విజ్ఞానం వద్దని కాదు. అది ఎలాగూ కొద్దో గొప్పో కలుగుతుంది.) జ్ఞానం, సంస్కారం, వివేకం.

చెప్పాల్సింది మానవ అంతరంగం అని తెలుసుకున్నాక ఎందుకు చెప్పాలి అనే ప్రశ్న వస్తుంది. పైననే చెప్పినట్లు జ్ఞానం కోసం. ʹʹసాహిత్యం ప్రజలను జ్ఞానవంతులను చేస్తుంది. వారు ఇతః పూర్వం కన్నా బాగా జీవించడానిక తోడ్పడుతుంది. వారి భావోద్రేకాలను ఉన్నత పథానికి కొనిపోతుంది. తమ బంధువుల, స్నేహితుల, ఇతర ప్రజలందరి గురించి ఎక్కువ ఆలోచించేట్లు చేస్తుంది. నవలలు, కథలు, కవిత సమాజాన్ని బంధించే భావోద్రేక బంధనాలు.ʹʹ

ʹʹరచయిత వినోదం కోసం, పేరు ప్రతిష్ఠల కోసం రాయడు. ప్రజలను బాగు చేయాలని, జీవితాన్ని మరింత ఉన్నత పథాలకు నడపాలని రచయిత భావించుతాడు. ఈ పోరాటంలో పుస్తకాలను ఒక నైతిక ఆయుధంగా అతడు భావిస్తాడు.ʹʹ

ఇది ఎప్పుడు సాధ్యం? ప్రజల్ని ప్రేమించినపుడు. ప్రజలంటే అభిరుచి, ప్రజల్ని గ్రహించే స్వాభావిక లక్షణం, ప్రజల్ని అధ్యయనం చేసి, పరిశీలించి, అనుభవించి వాళ్ళ అనుభవాల్ని తన అనుభవాలుగా (ʹఇతరుల అనుభవాలను తాననుభవించగల శక్తినే రచయిత పరిశీలనా శక్తి అనవచ్చు.) ప్రపంచపు బాధను తన బాధగా చెప్పగలినపుడు. ʹసాంఘిక భావాలు, పరిసరాలు, రచయిత భావాలను, ఇంద్రియ జ్ఞానాలనకు, జీవితాన్ని, రచనలను నిర్ణయించుతాయి. తన పరిసరాలకు, తన సమాజానికి దూరమయితే రచయిత సృజనాత్మక కళ విషయంలో శుష్కించి చచ్చిపోతాడు...ʹ జీవితాన్ని జీవించి వంచుకోవాలనే తపన కావాలి.

అందుకే ఎహ్రెన్‌బర్గ్‌ ఏం రాయాలి, ఎందుకు రాయాలి అని మాత్రమే కాక ఎప్పుడు రాయాలి అనే ప్రశ్న కూడా వేసుకున్నాడు. రాయక తప్పని ప్రసవ వేదన అనుభవించినపుడు. (ʹబిడ్డను కనడంʹ అంటే ఏమిటో ప్రతి తల్లికి తెలుసు. ʹదానిని లియోటాల్‌స్టాయ్‌ కూడా అర్థం చేసుకున్నాడు. అద్భుతంగా దానిని వర్ణించాడు కూడా. కాని దానిని మన విమర్శకులంతా అర్థం చేసుకున్నారా అనేది నాకు తెలియడు.ʹ)

ʹప్రజలకేదో చెప్పాలని అతనికి ఉండబట్టే, ఏదో రాయాలని అతని బుర్రలో పుస్తకం ʹబాధʹ పెట్టబట్టే, ప్రజల్ని, విషయాల్నీ చూచాడు గాబట్టే, తనను వర్ణించమనే భావోద్రేకాలు మస్తిష్కంలో గోలపెట్టబట్టే అతడు రాస్తాడు.ʹ నీకు సైతం అభిరుచి కలిగించని విషయాలు రాయొద్దని నీవు తప్పని సరిగా రాసితీరాలి అన్న భావం నిన్ను నిలవనీయకపోతే తప్ప రాయొద్దని, టాల్‌స్టాయ్‌ చెప్పిన మాటలను బాగా రాయాలని కోరుకునే రచయితల కోసం ఎహ్రెన్‌బర్గ్‌ గుర్తు చేస్తున్నాడు.

అప్పుడు వస్తుంది ఎట్లా రాయాలనే ప్రశ్న. అదే రచనా శిల్పం. ప్రజల హృదయ కవాటాలు తెరవడం రచయిత పని అయితే అవి తెరవడానికి కావలసిన బీగాలు రచనా శిల్పం. అది ప్రధానంగా పరిశీలనా శక్తి వల్ల అబ్బుతుంది. ఈ పరిశీలనా శక్తికి అనుభవం (స్వానుభవం కూడా అవసరమే) అధ్యయనం, గ్రహణ శక్తి కావాలి. వీటికి తోడు ప్రజల్లాగే రచయితకు కూడ కొన్నింటిని ప్రేమించడం కొన్నింటిని ద్వేషించడం సహజమే. ఒక విషయం పట్ల మొగ్గే ఈ పక్షపాత స్వభావాన్ని బూర్జువా రచయితలు నిందార్థంలో వాడుతున్నారు గానీ ఇది ఒక సహజమైన ఉద్వేగం అంటాడు. ఎహ్రెనబర్గ్‌. రచయితకు జీవితానుభవమే ఒక గొప్ప శిల్పం. గాఢావేశమే రచయితకు శిల్పం అని ఒకటికి రెండు సార్లంటాడు.

ఏ కారణం చేతనయినా కానీండి, రచయిత తనకు తెలియని ప్రజలనకు గానీ తాను అర్థం చేసుకోలేని ప్రజలను గాని చిత్రించితే తప్పకుండా ఆ రచన విఫలమై తీరుతుంది. అయితే ప్రజలను, జీవితాన్ని చిత్రించడమంటే కాపీ చేయడం, అనుకరించడం కాదు; ప్రకృతిని మార్చి నూతన రూపాలను సృష్టించడం. నిజమైన కళాకారుడు వ్యక్తి అసలు వ్యక్తిత్వాన్ని బయటపెట్టే సంయోగం (సింథసిన్‌) తయారు చేస్తాడు. సంఘర్షణను ప్రతిఫలిస్తూ చిత్రించడం వాస్తవికత. రచన అనేది రచయిత మానసిక ప్రయోగశాలలో ఆవిష్కరింపబడే ఒక ʹఆల్కెమీʹ (ఈ మాట ఎహ్రెన్‌బర్గ్‌ ఉపయోగించకపోయినప్పటికే ఆయన స్పిరిట్‌ అదే) ఈ ప్రయోగానికి ప్రాచీన రచయితల నుంచి నేర్చుకోవాల్సింది సహజంగా సంపన్నత, అమలిన భాష, వాక్య నిర్మాణం, సాహిత్య విధానాలు. అవే తరచుగా గత కాలపు రచయితలను శిల్పానికి మార్గదర్శకంగా చెప్పాడు.

No. of visitors : 495
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోనీ సోరి నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించండి! ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రచయితలకు విజ్ఞప్తి

వరవరరావు | 17.06.2016 12:32:46pm

తాజాగా సుకుమా జిల్లా గున్పాడ్‌ గ్రామంలో మడ్కం హిడ్మె అనే ఒక ఆదివాసీ మహిళపై స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ జిల్లా రిజర్వ్‌ గార్డ్‌లు చేసిన లైంగిక అత్యాచారం, హ........
...ఇంకా చదవండి

నిజమైన వీరులు నేల నుంచి వస్తారు

వరవరరావు | 16.07.2016 11:10:44am

1980ల నుంచి కూడా విప్లవ ఉద్యమానికి ఆదిలాబాద్‌ ‌జిల్లా బలమైన కేంద్రంగా ఉంది. ఇంద్రవెల్లి మారణకాండ నుంచి అది దండకారణ్య ఉద్యమానికి ఒక ఆయువుపట్టుగా ఉన్నది.......
...ఇంకా చదవండి

చరిత్ర - చర్చ

వరవరరావు | 15.05.2016 01:23:23pm

భగత్‌సింగ్ ఇంక్విలాబ్‌కు ` వందేమాతరమ్‌, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్‌ బాంబ్‌ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ...
...ఇంకా చదవండి

ముగ్గురు దేశద్రోహుల వలన సాధ్యమైన ప్రయాణం

వరవరరావు | 01.06.2016 12:30:00pm

ఆ కూలీ నిస్సందేహంగా దళితుడు, అంటరానివాడు. రోహిత్ వేముల రక్తబంధువు. ముజఫర్‌నగర్ బాకీ హై... అంటూ యాకూబ్ మెమన్‌ను స్మరించుకున్న దేశద్రోహి,...
...ఇంకా చదవండి

దండ‌కార‌ణ్య ఆదివాసీల స్వ‌ప్నాన్ని కాపాడుకుందాం : వ‌ర‌వ‌ర‌రావు

| 21.08.2016 10:46:12am

18 జూలై 2016, అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా వ‌ర‌వ‌ర‌రావు ఉప‌న్యాసం......
...ఇంకా చదవండి

నోటీసుకు జ‌వాబుగా చాటింపు

వ‌ర‌వ‌ర‌రావు | 22.05.2016 04:22:41pm

నిన్న‌టి దాకా ఊరు ఉంది వాడ ఉంది/ వాడ అంటే వెలివాడ‌నే/ అంట‌రాని వాళ్లు ఉండేవాడ‌/ అంట‌రాని త‌నం పాటించే బ్రాహ్మ‌ణ్యం ఉండేది/ ఇప్పుడ‌ది ఇంతింతై ...
...ఇంకా చదవండి

రచయితలేం చేయగలరు?

వ‌ర‌వ‌ర‌రావు | 16.07.2016 09:58:28am

1948లో భారత సైనిక దురాక్రమణకు గురయిన నాటి నుంచి కశ్మీరు ఆజాదీ కోసం పోరాడుతున్నది. ఆర్టికల్‌ 370 ‌మొదలు రాజ్యాంగం నుంచి ఎన్ని ప్రత్యేకమైన హామీలైనా ఆ సూఫీ.......
...ఇంకా చదవండి

రచయితలారా, మీరెటువైపు? వేదాంత వైపా? స్వేద జీవుల వైపా?

వరవరరావు | 03.07.2016 01:08:08am

అరుంధతీ రాయ్‌ ‌మావోయిస్టు పార్టీ ఆహ్వానంపై దండకారణ్యానికి వెళ్లినపుడు ఆమె బస్తర్‌లో ప్రవేశించగానే వేదాంత క్యాన్సర్‌ ఆసుపత్రి కనిపించిందట. దగ్గర్లోనే లోపల......
...ఇంకా చదవండి

వాగ్ధాటి కాశీపతి

వరవరరావు | 16.08.2016 01:29:44pm

1972లో విరసంలో ఆయన ప్రవేశం సాంస్కృతిక రంగంలో విప్లవోద్యమం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రవేశపెట్టినట్లైంది. అప్పటికే కొండప‌ల్లి.... ...
...ఇంకా చదవండి

రాజకీయ ఖైదీలు - చావు బతుకుల్లో కె. మురళీధరన్‌ (అజిత్‌)

వరవరరావు | 11.09.2016 10:16:25am

అజిత్‌గా విప్లవ శిబిరంలో ప్రసిద్ధుడైన కె. మురళీధరన్‌ 61వ ఏట అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు 2015, మే 9న మహారాష్ట్రలోని పూనెకు దగ్గరగా ఉన్న తాలేగాకువ్‌ ధబాడే.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •