ప్రత్యామ్నాయ సాహిత్య వేదిక : కలకత్తా పీపుల్స్‌ లిటరరీ ఫెస్టివల్‌ మార్చ్‌ 25, 2018

| సంభాషణ

ప్రత్యామ్నాయ సాహిత్య వేదిక : కలకత్తా పీపుల్స్‌ లిటరరీ ఫెస్టివల్‌ మార్చ్‌ 25, 2018

- వరవరరావు | 17.04.2018 01:11:40am

కలకత్తా ప్రజాసాహిత్య ఉత్సవాల్లో రెండవ రోజు మార్చ్‌ 25 (ఆదివారం) ఉదయం జరిగిన చర్చ

ʹʹచీకటి రోజుల్లో పాటలుʹʹ ఉంటాయా అని ప్రశ్న లేవనెత్తి వదిలేయడం కాకుండా ప్రజా ప్రత్యామ్నాయం ప్రతిపాదించే సాహిత్య సదస్సు గనుక writing of fascism (ఫాసిజం గురించి రాయడం) మాత్రమే కాకుండా writing off fascism - (ఫాసిజాన్ని పారదోలడం)గా ప్రతిపాదించారు.

రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీలో అమలైన నాజీజం ఫాసిజంల రోజుల్లో ధిక్కార, ప్రతిఘటనా కవిత్వం, నాటకాలు రాసిన, ప్రజారంగ స్థలాన్ని (ప్రిసీనియం స్టేజ్‌) ప్రవేశపెట్టిన బెర్టోల్డ్‌బ్రెహ్ట్‌ - చీకటి రోజుల్లో కవిత్వాలుంటాయా అని తనకు తానే ప్రశ్న వేసుకొని, ఔను చీకటి గురించే ఉంటాయన్నాడు. నేను ఇదివరలో పువ్వుల గురించి, ఆపిల్‌ పండ్ల గురించి, వెన్నెల గురించి కవిత్వం రాసిన వాణ్నేనంటూ హిట్లర్‌ను ఉద్దేశించి నీ ప్రగల్భాలు వింటున్నప్పటి నుంచి, భూగోళాన్ని కబళించడానికి నీ కదన కుతూహలాన్ని చూస్తున్నప్పటి నుంచీ నీ చర్యలనుద్దేశించే రాయక తప్పడం లేదని రాసాడు. చీకటి రోజుల్లో చీకటి రోజుల గురించే కాదు చీకటి రోజులను పారదోలే కవిత్వం కూడ ఉంటుంది. చీకట్లో చిరు దీపం వెలిగించడం, చిరునవ్వులు వెలిగించడమే కాదు. కాగడాల కవాతులు చేయడము ఉంటుంది. ప్రతి నల్లటి మబ్బు అంచున ఒక మెరుపు ఉంటుంది. ప్రతి చీకటి అంచున ఒక వేకువ ఉంటుంది. చీకటి రోజులంతా ఒక వేకువ ఆకాంక్షాసాధనా కృషి ఉంటుంది.

ఫాసిజం కాలంలో ఏకీభవించనోని గొంతు నొక్కే ఆధిపత్య సంస్కృతి- సైలెన్సింగ్‌ కల్చర్‌ ఉన్నట్లే, ధిక్కారాన్ని గుండెల్లో - కుంపట్లో నిప్పు వలె కాపాడుకునే నిశ్శబ్ద విస్ఫోటనం ఉంటుంది. భయభీతాహవ సంస్కృతికి, ప్రాణభీతితో మౌనం తాముగానే పాటించే తమకు తామే మూగబోయే సంకెళ్లు తగిలించుకునే కల్చర్‌ ఆఫ్‌ సైలెన్స్‌ ఉన్నట్లుగానే సంఘీభావ సంస్కృతి ఉంటుంది. దేశభక్తి పేరిటి ద్వేషభుక్తి సంస్కృతిని రెచ్చగొట్టినట్లుగానే సరిహద్దులను అధిగమించి సంకెళ్లు చేధించి, సంఘీభావం తెలిపే సంస్కృతి ఉంటుంది.

ముస్లింలపై వారిని రెండవ తరగతి పౌరులుగా మొదలు దేశద్రోహులు, టెరరిస్టులుగా వ్యవహరించే వివక్ష మొదలు హింసా దౌర్జన్యాలు అమలు చేస్తున్న రాజ్యానికి అమోదం వ్యవస్థలోకి వివక్ష, అవిశ్వాసం, పరాయిభావన, ద్వేషం నుంచి వస్తున్నదని చర్చల్లో పాల్గొన్న స్కైబాబా(తన కథ చదివి) ఘజాలా జమీల్‌ (ఢిల్లీ) ప్రతిపాదించారు.

ఇల్లు కిరాయికి ఇవ్వడానికి తమకు తాముగా హిందువులుగా భావించుకునే అన్ని కులాల నుంచి ఎదురుకునే బ్రాహ్మణీయ వివక్ష, తన సహచరి షాజహానా బురఖా వేసుకోనందుకు, తాను గడ్డం పెంచుకొని నవాజ్‌ చేయనందుకు ముస్లింల నుంచి కూడ వస్తుందని తన అనుభవాల నుంచి, వాటినే రాసిన కథల నుంచి వివరించాడు. ఘజాలా జమీల్‌ ఢిల్లీ బస్తీల్లో, ఘెట్టోల్లో ముస్లిం మహిళల దయనీయ పరిస్థితులపై చేసిన అధ్యయనాలను వివరించింది.

నేను కామ్రేడ్‌ జిఎన్‌ సాయిబాబాకు, ఆయన సహచరులకు పడిన యావజ్జీవ శిక్షకు - ఆదివాసులపై జరుగుతున్న గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌ మొదలు సమాధాన్‌, పరిహార్‌ వరకు - దాడికి ఉన్న సంబంధాన్ని వివరించాను. ముస్లింలపై జరిగే దాడులకు బ్రాహ్మణీయ భావజాలంతో పాటు సామ్రాజ్యవాద రాజకీయార్థిక నేపథ్యం ఉన్నదని చెప్పాను.

ప్రపంచ వ్యాప్తంగా చమురుకు ఇస్లాం మతానుయాయులు అయిన జాతులే సంరక్షకులు. ఆ దేశాల భూగర్భాలే చమురుకు నెలవులు. ఇది ఒక భౌగోళిక, రెండవ యుద్ధకాలం నుంచి చారిత్రకంగా, రాజకీయార్థికంగా ప్రాముఖ్యం సంతరించుకున్న కారణం. అట్లే ఇండియాలో అంటరానివారిగా చూడబడే దళితులు చేసే సఫాయి కర్మచారి పనులు మొదలు కశ్మీరీ శాలువాలు అల్లే సున్నితమైన కళల దాకా నైపుణ్యం ముస్లింల చేతివేళ్లలో ఉన్నది. ఇవి పెట్టుబడికి సవాళ్లు. అట్లే ఆదివాసులు ప్రకృతి సంపదకు సంరక్షకులు. చౌకగా దొరికే శ్రమశక్తి. అడవిలో పెట్టుబడి ప్రవేశించిన నాటి నుంచే వాళ్లపై దోపిడి ప్రయోజనంతో దాడులు జరుగుతున్నవి. అయితే ఆదివాసులు కొలంబస్‌, వాస్కోడిగామా కాలం నుంచి కూడ ప్రతిఘటనా పోరాటాలు చేపట్టని సందర్భమే లేదు.

నక్సల్‌బరీ నుంచి జనతన సర్కార్‌ దాకా ఆదివాసులకు గత 50 సంవత్సరాలుగా ప్రపంచంలోనే అపూర్వంగా ఇండియా పోరాటానికి ఒక ప్రాపంచిక దృక్పథం మార్గదర్శకంగా లభించింది. అది వారిని నడిపించే చుక్కాని అయింది.

ఈ అవగాహనతో కలకత్తా పీపుల్స్‌ కల్చరల్‌ ఫెస్టివల్లో నేను ద్వేష సంస్కృతికి ఉదాహరణగా జునైద్‌ హత్య గురించి రాసిన ʹఘర్‌వాపసీʹ (హిందీ అనువాదం), సంఘీభావ సంస్కృతికి ఉదాహరణగా ʹనాసిక్‌లో పుట్టిన గోదావరిʹ (ఇంగ్లిష్‌ అనువాదం) కవితలు చదివాను.

సైలెన్సింగ్‌ కల్చర్‌కు ఉదాహరణగా జిఎన్‌ సాయిబాబా - ది ట్రూ ప్రిజన్‌ (నిజమైన జైలు), సంఘీభావ సంస్కృతికి ఉదాహరణగా ʹనౌ వియ్‌ హావ్‌ మోర్‌ ఫ్రీడమ్స్‌ʹ ( ఇప్పుడు మనకు చాలా స్వేచ్ఛలు ఉన్నాయి) అనే కవితలు చదివాను.

నిజమైన జైలు

ఎత్తైన గోడలు అండాసెల్‌ ఒంటరితనం కాదు
జైలు తలుపులు మూసే తాళాలచప్పుళ్లు కాపలానిఘాలు కాదు
రోజూ అదే మూసబోసిన తిండి లాకప్‌ క్రూరమైన వేళలు కాదు
ఒంటరిని చేసి గురిచేస్తున్న వేదన మృత్యుభీతి కాదు
శూన్యమైన దినాలు నీరవ నిశీధాలు కాదు

మిత్రమా, న్యాయస్థాన ఉన్నత పీఠాల మీద
ప్రచారమవుతున్న అబద్దాల గురించి

ప్రజల శత్రువు నా మీద విసురుతున్న నిందల గురించి కాదు
నేర శిక్షాస్మృతిలోని సూక్ష్మాంశాల మీమాంస గురించి కాదు

ఆధిపత్య రాజకీయ అధికృత హింస గురించి

మిత్రమా విశాల ప్రజానీకానికి వ్యతిరేకంగా
జరుగుతున్న అన్యాయం గురించి
నోరున్న గొంతుల మౌనం గురించి

ఒక మేరకు మౌనం రుద్దబడింది
మిగతాదంతా స్వయం అపాదితం
కొంత సెన్సాషిప్‌ విధించబడింది
మిగతాదంతా స్వీయాచరణ

అధికారంలో ఉన్న వారి గురించి భయం కాదు

గొంతులేని వారికి గొంతునివ్వాల్సిన
వాళ్ల గుండెల్లోని భయం గురించి
నైతిక విలువల పతనం గురించి
స్వేచ్ఛా సమాజం కోసం మన పోరాటాల
సంయుక్త చరిత్రల విస్మరణల గురించి

ప్రియా మిత్రమా, నిజానికిది మన ప్రపంచాన్ని
దుర్భరమైన జైలుగా మారుస్తుంది

(కల్చర్‌ ఆఫ్‌ సైలెన్స్‌ - నిశ్శబ్దమైన సంస్కృతి గురించి వార్తా కథనాలు పత్రికల్లో చదివి)
24 అక్టోబర్‌ 2017

మనకిపుక్కిడు మరింత స్వేచ్ఛ లభించింది

ఆ రోజు
రోహిత్‌ వేముల
తనకు తాను ఉరి వేసుకొని
ʹనేను నా గుర్తింపుకు కుదించబడకూడదʹని
ప్రకటించిన నాడు
నా గుండెచప్పుళ్లు తప్పిపోయినవి

ఆ రోజు
పెరుమాళ్‌ మురుగన్‌
ʹనాలో రచయిత చనిపోయినాడుʹ
అని ప్రకటించిన నాడు
మగత నిదురలోని ప్రాణాంతక శ్వాస
నన్ను కాటేసింది

ఆ రోజు
హన్స్‌దా సత్‌వేంద్ర శేఖర్‌
ʹఆదివాసి నృత్యం చేయదుʹ
అని ప్రకటించిననాడు
నా కండరాలు నొప్పితో సలిపినవి

ఆ రోజు
హదియా కోర్టుగదిలో తన కాళ్ల మీద నిలబడి
ʹనాకు స్వేచ్ఛ కావాలిʹ
అని అడుక్కోక తప్పనప్పుడు
జైలుగుహలో
నా ఊపిరి ఆగిపోయింది

No. of visitors : 558
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోనీ సోరి నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించండి! ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రచయితలకు విజ్ఞప్తి

వరవరరావు | 17.06.2016 12:32:46pm

తాజాగా సుకుమా జిల్లా గున్పాడ్‌ గ్రామంలో మడ్కం హిడ్మె అనే ఒక ఆదివాసీ మహిళపై స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ జిల్లా రిజర్వ్‌ గార్డ్‌లు చేసిన లైంగిక అత్యాచారం, హ........
...ఇంకా చదవండి

నిజమైన వీరులు నేల నుంచి వస్తారు

వరవరరావు | 16.07.2016 11:10:44am

1980ల నుంచి కూడా విప్లవ ఉద్యమానికి ఆదిలాబాద్‌ ‌జిల్లా బలమైన కేంద్రంగా ఉంది. ఇంద్రవెల్లి మారణకాండ నుంచి అది దండకారణ్య ఉద్యమానికి ఒక ఆయువుపట్టుగా ఉన్నది.......
...ఇంకా చదవండి

చరిత్ర - చర్చ

వరవరరావు | 15.05.2016 01:23:23pm

భగత్‌సింగ్ ఇంక్విలాబ్‌కు ` వందేమాతరమ్‌, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్‌ బాంబ్‌ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ...
...ఇంకా చదవండి

ముగ్గురు దేశద్రోహుల వలన సాధ్యమైన ప్రయాణం

వరవరరావు | 01.06.2016 12:30:00pm

ఆ కూలీ నిస్సందేహంగా దళితుడు, అంటరానివాడు. రోహిత్ వేముల రక్తబంధువు. ముజఫర్‌నగర్ బాకీ హై... అంటూ యాకూబ్ మెమన్‌ను స్మరించుకున్న దేశద్రోహి,...
...ఇంకా చదవండి

దండ‌కార‌ణ్య ఆదివాసీల స్వ‌ప్నాన్ని కాపాడుకుందాం : వ‌ర‌వ‌ర‌రావు

| 21.08.2016 10:46:12am

18 జూలై 2016, అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా వ‌ర‌వ‌ర‌రావు ఉప‌న్యాసం......
...ఇంకా చదవండి

నోటీసుకు జ‌వాబుగా చాటింపు

వ‌ర‌వ‌ర‌రావు | 22.05.2016 04:22:41pm

నిన్న‌టి దాకా ఊరు ఉంది వాడ ఉంది/ వాడ అంటే వెలివాడ‌నే/ అంట‌రాని వాళ్లు ఉండేవాడ‌/ అంట‌రాని త‌నం పాటించే బ్రాహ్మ‌ణ్యం ఉండేది/ ఇప్పుడ‌ది ఇంతింతై ...
...ఇంకా చదవండి

రచయితలేం చేయగలరు?

వ‌ర‌వ‌ర‌రావు | 16.07.2016 09:58:28am

1948లో భారత సైనిక దురాక్రమణకు గురయిన నాటి నుంచి కశ్మీరు ఆజాదీ కోసం పోరాడుతున్నది. ఆర్టికల్‌ 370 ‌మొదలు రాజ్యాంగం నుంచి ఎన్ని ప్రత్యేకమైన హామీలైనా ఆ సూఫీ.......
...ఇంకా చదవండి

రచయితలారా, మీరెటువైపు? వేదాంత వైపా? స్వేద జీవుల వైపా?

వరవరరావు | 03.07.2016 01:08:08am

అరుంధతీ రాయ్‌ ‌మావోయిస్టు పార్టీ ఆహ్వానంపై దండకారణ్యానికి వెళ్లినపుడు ఆమె బస్తర్‌లో ప్రవేశించగానే వేదాంత క్యాన్సర్‌ ఆసుపత్రి కనిపించిందట. దగ్గర్లోనే లోపల......
...ఇంకా చదవండి

వాగ్ధాటి కాశీపతి

వరవరరావు | 16.08.2016 01:29:44pm

1972లో విరసంలో ఆయన ప్రవేశం సాంస్కృతిక రంగంలో విప్లవోద్యమం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రవేశపెట్టినట్లైంది. అప్పటికే కొండప‌ల్లి.... ...
...ఇంకా చదవండి

రాజకీయ ఖైదీలు - చావు బతుకుల్లో కె. మురళీధరన్‌ (అజిత్‌)

వరవరరావు | 11.09.2016 10:16:25am

అజిత్‌గా విప్లవ శిబిరంలో ప్రసిద్ధుడైన కె. మురళీధరన్‌ 61వ ఏట అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు 2015, మే 9న మహారాష్ట్రలోని పూనెకు దగ్గరగా ఉన్న తాలేగాకువ్‌ ధబాడే.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •