21వ శతాబ్దంలో మార్క్స్‌

| కార్య‌క్ర‌మాలు

21వ శతాబ్దంలో మార్క్స్‌

- ఎడిటర్‌ & టీం | 18.04.2018 11:41:43am

మార్క్స్‌ సిద్ధాంతం, రాజకీయాల గురించి మీ అభిప్రాయలు వీడియో రూపంలో పంపించండి

మిత్రులారా, కామ్రేడ్స్‌..

మే 5 నుంచి కారల్‌మార్క్స్‌ ద్వి శతజయంతి కార్యక్రమాలు ఆరంభమవుతాయి. జయంతులకు, వర్ధంతులకు ఏ ప్రత్యేకత లేకపోయినా ప్రపంచ కార్మిక వర్గం, విప్లవ శక్తులు మార్క్స్‌ సిద్ధాంత రాజకీయాలను తిరిగి ఈ సందర్భంగా కూడా మరోసారి అధ్యయనం చేస్తాయి. అత్యంత అమానుషమైన, దుర్మార్గమైన, అనైతికమైన పెట్టుబడిదారీ విధానానికి ఇప్పటికీ, ఎప్పటికీ సోషలిజమే ప్రత్యామ్నాయం. మారుతున్న సామాజిక రాజకీయార్థిక పరిస్థితులను అర్థం చేసుకోడానికి మార్క్సిజమే శాస్త్రీయ సిద్ధాంతం. సకల ఆధిపత్యాలు, హింసా వ్యవస్థలు, దోపిడీ రూపాల నిర్మూలనకు మార్క్సిజమే ఆచరణాత్మక మార్గం చూపుతుంది. 21వ శతాబ్దంలో అనేక వైపుల నుంచి వేగవంతమైన మార్పులు జరుగుతున్నాయి. నూతన సిద్ధాంత వాతావరణం ముందుకు వచ్చింది. ఈ స్థితిలో పెట్టుబడి దుర్మార్గాన్ని, సామాజిక వ్యవస్థల ఆధిపత్యాన్ని అర్థం చేసుకోడానికి యువతరం మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తోంది. వివిధ పోరాటాల్లో పురోగమిస్తోంది.

ఈ సందర్భంలో విరసం.ఓఆర్జీ ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నది. మార్క్స్‌ జీవితం, సిద్ధాంతం, ప్రాసంగికతల గురించి 10-15 నిమిషాల నిడివి గల వీడియోస్‌ను ఆహ్వానిస్తున్నాం. మార్క్సిజానికి సంబంధించిన వేర్వేరు రంగాల్లో కృషి చేస్తున్న మీరు మీ అభిప్రాయాలను వీడియో తీసి virasam1970@gmail.com మెయిల్‌కు పంపించండి. మార్క్సిజంలోని వేర్వేరు భావనల గురించి అయినా, లేదా మార్క్స్‌, ఏంగెల్స్‌ రచనల్లోని నిర్దిష వాచకం మీద అయినా పరిచయం, విశ్లేషణ రూపాల్లో వీడియోస్‌ తీసి పంపించండి. విరసం.ఓఆర్జీ సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తాం. మీ అధ్యయనం, బోధన, ఆచరణ, అన్వయక్రమాల్లో మీరు పొందిన మార్క్సిస్టు అవగాహన ఈ తరానికి చాలా అవసరం. మార్క్స్‌-200 సందర్భంగా విరసం ఎంచుకున్న కార్యక్రమాల్లో ఇదీ ఒకటి. బహుశా ఇప్పుడు అందరికీ స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటి ద్వారా వీడియో రికార్డు చేసి మెయిల్‌ చేయడం తేలికే అనే ఉద్దేశంతో ఇలా అనుకున్నాం. ఈ మాధ్యమానికి ఇప్పుడున్న ప్రాధాన్యత రీత్యా ఈ కార్యక్రమం చేపట్టాం. కాక‌పోతే వీడియో రికార్డు చేసేట‌ప్పుడు వీలైనంత శ్ర‌ద్ధ‌గా రికార్డు చేసి పంపించ‌గ‌ల‌ర‌ని సూచ‌న‌.

ఒక వేళ ఈ పద్ధతి వీలు కాని వారు వ్యాసాలు రాసి మెయిల్‌ చేయండి. మీ స్పందన కోసం ఎదురు చూస్తూ...

ఎడిటర్‌ & టీం
విరసం.ఓఆర్జీ

No. of visitors : 818
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మార్క్స్ వ‌ర్గ‌ పోరాట సిద్ధాంతం అజేయమైంది : కాశీం

కాశీం | 29.05.2018 11:22:54pm

మార్క్స్ ద్విశ‌త జ‌యంతి సంద‌ర్భంగా... మార్క్స్ సిద్ధాంత రాజ‌కీయాల గురించి త‌న‌ అభిప్రాయాల్ని పంచుకున్న‌విర‌సం నాయ‌కుడు కాశీం...
...ఇంకా చదవండి

మార్క్స్ ప్రాసంగిక‌త ఎప్ప‌టికీ ఉంటుంది : అరుణాంక్‌

| 05.05.2018 09:37:20am

మార్క్స్ ద్విశ‌త జ‌యంతి సంద‌ర్భంగా మార్క్స్ గురించి త‌న అభిప్రాయాల‌ను పంచుకున్న‌ డీఎస్‌యూ కార్య‌ద‌ర్శి అరుణాంక్ మార్క్స్ ప్రాసంగిక‌త నేటికీ ఉందంటున్నారు....
...ఇంకా చదవండి

Share your views on Karl Marx, his ideology and Politics

www.virasam.org | 26.04.2018 09:26:06am

Friends who are working on various facets of Marxism and revolutionary ideology and politics, can record the same in a short video format and send them to v...
...ఇంకా చదవండి

marx selected poetry

Editors : James Luchte | 02.05.2018 03:38:37pm

Marx wrote much of this poetry when he was nineteen, around the year 1837, while he was at university. He makes ready use of mythological themes, theologica...
...ఇంకా చదవండి

మార్క్స్‌ శాస్త్రీయ సిద్ధాంత వారసత్వానికి పదునుపెడదాం

విరసం | 02.05.2018 11:30:59am

మార్క్స్‌ తన కాలంలోని పెట్టుబడిదారీ విధానాన్ని విశ్లేషించాడు. శ్రమశక్తి సరుకు కావడంతో పెట్టుబడిదారీ విధానం ఆరంభమైంది. గత వ్యవస్థలకు పెట్టుబడిదారీ విధానా.....
...ఇంకా చదవండి

గెలుచుకోవాల్సిన ప్రపంచం దిశగా కారల్‌ మార్క్స్‌

పాణి | 05.05.2018 11:18:04pm

మన దేశంలో నడుస్తున్న వర్గపోరాటాలపట్ల సంఘీభావం ప్రకటించకుండా మార్క్సిజాన్ని నిరంతరం అధ్యయనం చేసే ఉత్తమ మార్క్సిస్టుల వల్ల ఈ కాలానికి పెద్దగా ప్రయోజనం ఏమీ లే...
...ఇంకా చదవండి

మార్క్సిజం ఆచరణ సిద్ధాంతం..

బాసిత్ | 03.07.2018 02:31:58pm

ఈ దేశంలో దళితులు, శ్రామిక వర్గాలకు అధికారం ఇంకా అందలేదని, అందుకే మార్క్సిజానికి ప్రాసంగికత అనివార్యంగా ఉంటుంద.....
...ఇంకా చదవండి

మునిపటికన్నా విప్లవాత్మకంగా కార్ల్ మార్క్స్

స్టువర్ట్ జేఫ్రిస్ | 05.06.2018 10:37:25am

మార్క్స్ పని అయిపోయినట్టేనా? కానే కాదు. నాకైతే, కార్ల్ మార్క్స్ ఇప్పటికి చదవడానికి అర్హత కలిగినవాడు. అయితే కేవలం అతడి దూరదృష్టి, అంచనా వల్ల కాదు, అతడి విశ్...
...ఇంకా చదవండి

मार्क्स सिद्धांत और राजनैतिकता के बारे में आप के राय वीडियो के रूप में भिजाइए।

एडिटर & टीम | 26.04.2018 09:48:00am

मई 5 से कार्ल मार्क्स के ʹदो सौ साल साल गिरहʹ के कार्यक्रम आरँभ होने वाले हैं। साल गिरह और बर्सियोँ मेँ कोई भी खासियत नहीं रहने पर भी विश्व कार्मिक वर्ग, इन...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఆగస్టు 2019

  ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగ వ్యతిరేకం
  వేటగాడి వల
  పదునెక్కుతున్న కోరలు
  ఎదురుచూపులు
  యురేనియమం
  మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ
  నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో
  దళిత నవలా సాహిత్యంలో ఒక మైలురాయి "నిషిధ"
  చరిత్ర కన్న శిశువు - చరిత్రకు మార్గదర్శి
  ʹఅస‌మ్మ‌తిʹపై ఎక్కుపెట్టిన అస్త్రం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •