ఆసిఫా ఖానుమ్.. వాడికి నీ భూమి కావాలి!

| సాహిత్యం | క‌విత్వం

ఆసిఫా ఖానుమ్.. వాడికి నీ భూమి కావాలి!

- geetanjali | 02.05.2018 10:34:00am

నీవెలా భరించావో కానీ ఆసిఫా .,
లక్ష‌ పాములు నీ లోపలా బయటా విషం చిమ్మినప్పుడు?
వాడి ఇంటి పెరట్లో
నీ ఇంటి గుర్రం మేస్తున్నందుకు కాదు కానీ
నీ అబ్బా,అమ్మీలను
నీ గుర్రాలనీ, గొర్రెలనీ...
తూనీగలాగా గడ్డి పూ లలో దాక్కున్న నిన్నూ
నీ చిన్న ఇంటినీ..
ఆ ఇంటిని మోస్తున్న భూమినీ దోచుకోవడానికే
వాడు నీ దేహాన్ని, నీ ప్రాణాన్ని,నీ నొప్పినీ
గురి చేసుకున్నాడు!
అందుకే కదా
మరణం తరువాత కూడా...
నువ్వు నీ గుర్రాలతో గెంతులేసిన నీ‌ ఇంటి ఆవరణలో కూడా
నిన్ను గౌరవంగా పాత నివ్వ లేదు

నీ భూమి మరు భూమి అయితే
వాడికి రియల్ ఎస్టేట్ మార్కెట్ పోతుంది మరి!
మీ బకరావాలాలు ʹగొర్రెల్ʹలా, ʹమందలు మందలుʹగా‌ ,
పిల్లలను కంటూ పోతే...
కాషాయ సంతానం పలుచనైపోతారట!
అందుకే..
వాడు నీ గర్భసంచీని ఛిధ్రం చేసాడు!
నీ అమ్మీజాన్ కన్నీళ్ళతో చేసిన
నీ చివరి స్నానం సాక్షిగా...
నీ లేత దేహం మీది
వంద గాయాల మచ్చల సాక్షిగా...
వాళ్ళిప్పుడు
తమ మర్మాంగాలతో
మీ బాలికల గర్భసంచుల్ని కోసి పడేసే మత సర్జన్లు!!
వాళ్ళిప్పుడు..
గుళ్ళకొచ్చే స్త్రీలను కూడా గర్భసంచుల నిండా
హిందూ పిల్లలని కనమని శాసిస్తున్నాడు!!

ఆ పచ్చని గడ్డి పూల మైదానంలో..
నువ్వు మనుషుల మధ్య ఎక్కడున్నావని?
నిన్ను ప్రేమించిన, లాలించిన, నీతో ఆడుకున్న
గుర్రాల మధ్యనే కదా ఉన్నావు?
ఆ మానవ మృగాలు ఎట్లా వచ్చాయి నీ దగ్గరకి?
నువ్వు నొప్పితో వెర్రి కేకలు వేస్తున్నప్పుడు
ఏమీ చేయలేక పోయాం మేం!

భారత దేశపు ముద్దు బి టియా...
నిన్ను బచాయించుకోలేక పోయాం!
నీ గుర్రాలే నయం
నిన్నెత్తుకు పోయిన కబురు పరుగు లెత్తి నీ అబ్బాజాన్కి చెప్పాయి
నిన్ను రక్షించుకోనందుకు...ఎక్కెక్కి ఏడ్చి తలదించుకున్నాయి!

ఆసిఫా...నువ్వు పెంచిన
ఒక్క గుర్రమన్నా
నీ‌ అబ్బాజాన్ని
గుడి వైపు తీస్కెళితే బాగుండేది!
గుడి-మస్జిద్ ఒకటే కదా
అబ్బాజాన్ కు?
అందుకే అటువైపు కి వెళ్ళనే లేదు!
మస్జిద్ లను ధ్వంసం చేసినవాడు
తమ గుళ్ళను మరింత ఎత్తుగా కట్టు కుంటున్నది
ఆసిఫాల మీద అత్యాచారాలు చేసేందుకేనా?
గుడులు కడుగుతుంటే రక్తం అందుకేనా ప్రవహిస్తున్నది?

అవును కదా...
వాడి ఆయుధం ఎప్పుడూ త్రిశూలమే కాదు
మర్మాంగం కూడా!
కథువా, ఉన్నవా, చింతగుఫా రహదారుల మీదుగా
అత్యాచారాల రక్తపు నిశానీలు చెరుపుతూ
వాడు గుళ్ళను కడుగుతున్నది భక్తితో కాదు
దేవతల మీద కూడా వాడు కొవ్వెక్కి స్ఖలించిన కాషాయ వీర్యం పోవడం కోసం!
పోక పోయినా ఫరవా లేదురా మానవ మృగమా
నిన్ను నీ మర్మాగంతో సహా
కాషాయపు బట్టలో కప్పెయ్య డానికి త్రిశూలం ఉండనే ఉంది!
కథువా, ఉన్నవా, చింతగుఫా చిట్టి తల్లుల్లారా...
మీ కోసం మా హృదయాలు ఏడుస్తున్నాయి!
ఆసిఫా... నన్నెవ్వరూ పట్టంచుకోవటం లేదు అని
ఒక తల్లి బిడ్డ కోసం పడిన దుఃఖాన్ని..
నీ గొంతు పిక్కటిల్లేలా నువ్వు పాడిన పాట
ఇంకా మా చెవుల్లోంచి హృదయం లోకి జారుతూ ప్రతిధ్వనిస్తూనే ‌ఉంది!
నీ భూమి నుంచి వలసెల్ల నిరాకరిస్తున్నగుర్రాలు...
నీ కోసం.. నువ్వు పాడుకునే కష్మీరీ పాట కోసం
ఆ పర్వత సానుల్లో ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నాయి!





No. of visitors : 153
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


జప్పున రా బిడ్డా!

గీతాంజలి | 05.12.2017 11:34:44pm

బిడ్డా. .డాలర్ల మోజు మన మధ్య సృష్టించిన యొజనాల దూరాల దారాల కొసల్ని పట్టుకొని. . ఒకరి వైపుకి ఒకరం..ఎంత వేగంగా పరి గెత్తినా.. దారం పుటుక్కున తెగిపొయింది.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    ఈ మానవ హననాన్ని ఆపండి
    అరుణతార మే - 2018
    మైనింగ్ మాఫియా కోస‌మే బోరియా - కసనూర్ నరమేధం
    గెలుచుకోవాల్సిన ప్రపంచం దిశగా కారల్‌ మార్క్స్‌
    మార్క్స్ ప్రాసంగిక‌త ఎప్ప‌టికీ ఉంటుంది : అరుణాంక్‌
    Long live the 1st of May
    విరసం క‌థా వ‌ర్క్‌షాప్‌
    marx selected poetry
    మార్క్స్‌ శాస్త్రీయ సిద్ధాంత వారసత్వానికి పదునుపెడదాం
    ఎట్టి మనుషుల మట్టి కథలు
    మొద్దుబారుతున్న సమాజం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •