ఇంద్రావతి..

| సాహిత్యం | క‌విత్వం

ఇంద్రావతి..

- సూర్యచంద్ర | 02.05.2018 10:39:16am

మట్టి వాసనాల్ని కప్పుకున్న
నదుల ఆచ్చాదనల్ని
దేహంమీద నుంచి ఒలిచి
గోడకు తగిలించింది కొన్ని క్షణాలైనా..
వెలుగు సోకని సుప్తావస్థ చరిత్రనే కదా నేను..

నెత్తురుకొలిమిలోని నధులన్నీ
మర్మధ్వనుల కన్నీరై
గుండె తీరంతో ఘర్షించినప్పుడల్లా..
ఇంటి వాకిలిలోని గాయాల్ని
దండగా అల్లకపోతే
నేను ఊపిరి తడిలేని దేహాన్నే కాదు...

గోదావరి ఇంద్రావతి...
నెత్తురు మైనాన్ని పులుముకుని
పచ్చబారి పోయాయి చూడు...
గడ్డకట్టినట్లు నీకు అనిపిస్తుందా.??
అదీ ని దృష్టిలోపం...
ఎర్రటి తీరానికి అవతల
తొలిపొద్దును ఎగదోస్తున్నాయి చూడు...

నెత్తురుదేముంది...
మట్టికడుపులోకి ఒలికి
గర్భస్థ వేకువగా పురిటినొప్పులు పడుతుంది..
ఎన్నటికీ వాడిపోని అడివై
రేపు మళ్లీ జన్మిస్తుంది ఇంద్రావతి.....





No. of visitors : 297
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మిణుగురు న‌వ్వుల‌మై

సూర్యచంద్ర | 19.10.2017 10:09:22pm

నెత్తురంటని తొలి సమతా సంధ్యలోకి.... చీకటి చెదలను చీలుస్తూ మిణుగురు నవ్వులమై మన ప్రయాణం... మన పాదాలను పసిగడుతూ ఎన్ని విషం పుక్కిలించే కండ్లో......
...ఇంకా చదవండి

వేకువముగ్గు

సూర్యచంద్ర | 20.02.2017 12:37:51pm

క్తాన్ని రంగరిస్తూ నీవు తూర్పు వాకిలిలో వేకువముగ్గును పేర్చుతున్నావ్ నీరవ రాత్రిలో పీడితజన కలల్ని కవిత్వంగా అల్లుతున్నాను నేను...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
    అరుణతార సెప్టెంబర్ - 2018
    యాంటి నేషనల్
    ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
    ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
    ʹపట్టణ నక్సలైట్లుʹ అంటే ఇలా వుంటారు
    అక్రమ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
    కుట్ర
    ఇప్పటికైనా అర్ధమయిందా....?
    యుద్ధానంతర యుద్ధగీతం
    పోలీసుల నీడలో రాపూరు
    అర్హత

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •