మొద్దుబారుతున్న సమాజం

| సంభాషణ

మొద్దుబారుతున్న సమాజం

- అశోక్ కుంబము | 02.05.2018 10:50:42am

మన సమాజంలో పతనం అవుతున్న మానవ విలువల గురించి వింటున్నాం, చదువుతున్నాం, చూస్తున్నాం. ఆ క్రమంలోనె మనిషితనానికి మూలమైన స్పందించే తత్వం, దానిని నాగరికంగ వ్యక్తీకరించే లక్షణం కూడ తగ్గిపోతుంటె మనిషి అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడినట్లనిపిస్తుంది. ఎన్నో అమానవీయ ప్రక్రియలు రోజురోజుకు సాదారణీకరించ బడుతున్నాయి. ఎన్నో మానవ విషాదాలు అతి మామూలు విషయాలుగా, స్పందించడం కూదా వృధాగా మారిపోతున్నాయి. మరోవైపు, మనిషికి కొలమానమైన, సాధారణమైన మానవీయ లక్షణాలు పనికిరానివిగానో, కాలం చెల్లిపోయినవిగానో పరిగణించబడుతున్నాయి. ఈ "వ్యాది"లక్షణాలు ఒక ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఎప్పుడు అడ్డంకులే!

నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం దేశంలో ప్రతి ఒక గంటకు నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదే సంస్థ లెక్కల ప్రకారం ప్రతి గంటకు నలుగురు మహిళలపై అత్యాచారం జరుగుతుంది. ఇవి కేవలం రికార్డ్ ల్లోకి ఎక్కిన లెక్కలు మాత్రమే. లెక్కల్లోకి ఎక్కని అభాగ్యులెందరో! కాని ఈ ఆత్మహత్యలు, హత్యలు, అత్యాచారాలు అతి సాదారణ విషయాలుగా మారిపోయాయి. ఇక దళితుల, ఆదివాసుల, మత మైనార్టీల పరిస్థితి ఇంకా ఘోరం. వాళ్ళపై జరిగే హింస నేరమే కానంతగా మారిపోయింది. ఎందుకంటె చాలా సందర్భాలలో రాజ్యం బలవంతుండి వైపె నిలబడుతుంది. దీనికి సంబందించి అనేక ఉదంతాలు సమీప చరిత్రలోనె ఎన్నో ఉన్నాయి. ఈ వర్గాల మీదనే కాదు, వాళ్ళకు అండగా ఉన్న ఎవ్వరిపై అయినా రాజ్యం తన ప్రతాపం చూపిస్తునే వుంది. అయినా సమాజంలో ఎందుకు చలనం లేకుండ పోతుంది. అక్కడో, ఇక్కడో కొన్ని ఎపిసోడులుగా (పాత) గొంతులు వినిపిస్తాయే తప్ప ఒక సమాజంగా స్పందించే భాద్యత ఎందుకు కరువవుతుంది.

దేశం మొత్తంలోనె అత్యంత చైతన్యవంతమైన పౌరసమాజం ఉన్న తెలంగాణ కొత్త రాస్ట్రం గా ఏర్పడ్డాక ఎందుకు తన గొంతును తానే నొక్కేసుకొని మూగగా మారిపోయిందే ప్రశ్నించుకోవాలి. "మాయమయి పోతున్నడమ్మా మనిషన్నవాడు..." అని పాడుకోవడం మాత్రమే కాదు, ఆ ప్రక్రియకు మూలాలు ఎక్కడున్నవో ఆలోచించాలి. మనిషి మాయం కావడమంటె మొద్దుబారిపోవడమని కవి ఆవేదన. సమాజం చదలు పట్టకుండ చలనంలో పెట్టమని అభ్యర్థన. కాని పౌరసమాజం గత పది రోజులుగా రాజ్యం ఆదివాసులపై కొనసాగిస్తున్న హత్యలను కనీసం ఖండించలేని స్థితికి ఎందుకు దిగజారిపోయిందొ ఆలోచించాలి. నలబై మందిని హత్య చేస్తే దానిని నిరసించడానికి, న్యాయ విచారణ జరిపించమని అడగడానికి మావోయిస్టు సానుభూతిపరులు కానవసరం లేదు. కేవలం తోటి మనిషయితే చాలు. అందుకే కదా సిరియా, పాలస్తీన, మియమ్నార్ లలో జరిగే మానవహననాన్ని మనుషులుగా ఖండిస్తున్నాము, కన్నీరు పెట్టుకుంటున్నాము. కాని ఆదివాసుల హత్యలపై నోరెందుకు విప్పలేకపొతున్నాము. వాళ్ళు మావోయిస్టులు లేదా సానుభూతిపరులై వుండొచ్చు, అయితే చంపమని రాజ్యానికి సమ్మతి ఇచ్చేదామా? రాజ్యం వున్నదే పాలకవర్గాల ప్రయోజనాలు కాపాడటం కోసం. హింసను కొనసాగించడమే దాని లక్షణం. కాని ప్రజాస్వామ్య సమాజానికి దానిని ప్రశ్నించే, ఎదిరించే గుణం వుంటుంది కదా. దానిని చంపేయవద్దు అనేదె మనవి. విమర్ష్యలేని రాజ్యభజన భవిష్యత్ తరాలను ఆధునిక బానిసల చేస్తుంది. ఆ మానవ విపత్తు నుండి భావితరాలను కాపాడాల్సిన భాద్యత మనందరిది. అందుకే ఒక ప్రశ్నై నిలబడుదాం. సమాజం మొద్దుబారకుండ కాపాడుకుందాం.





No. of visitors : 1028
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


భూమికి చెవి పెట్టి విందాం, విముక్తి రహస్యం చెబుతుంది

అశోక్ కుంబము | 16.07.2019 08:33:36pm

అమరుల త్యాగాలను తమ గుండెల్లో పదిలంగ దాచుకొని వారి స్వప్నాలను నిజంచేసే విప్లవకారుల కోసం తెలంగాణ గడ్డ మీద ఎదురుచూస్తున్న తల్లులు ఎందరో! విప్లవానికి మరణం......
...ఇంకా చదవండి

ద్రోణాచార్యుడి వేలు తెగాల్సిందే

అశోక్ కుంబము | 20.01.2018 01:08:15am

అంటరానోళ్లంతా మా అగ్రహార విద్యాలయాలలో పిడికిళ్ళ వనమై విస్తరిస్తుంటే మా అగ్రవర్ణ ఆదిపత్య పిలకలెట్ల మొలుస్తయ్? మీ నీడనే మహా పాతకమనుకుంటే నీలి ఆకాశమై ......
...ఇంకా చదవండి

అక్షర చెప్పిన చిన్న కథ

అశోక్ కుంబము | 21.12.2018 01:41:33am

ఆ అమ్మాయి ఆ వాడలోకి పోతుంటె, ఎవరో వెనకనుండి ʹవాళ్ళు అంటరానివాళ్ళు, ముట్టుకోకు" అని గట్టిగా చెప్పినట్లు వినపడుతుంది.ఆ అమ్మయికి ఒక్కసారిగా ఎంతో బాధ అనిపిస్త.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార జులై - 2020
    వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
    గాలింపు, స్థూపాల కూల్చివేత
    కవి కాశీం కవిత్వ విశ్లేషణ
    అసమానత నుండి విప్లవం దాకా..
    ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
    తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
    కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
    వరవరరావును జైలులో చంపవద్దు
    మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
    "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
    అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •