విరసం క‌థా వ‌ర్క్‌షాప్‌

| సంభాషణ

విరసం క‌థా వ‌ర్క్‌షాప్‌

- విర‌సం | 03.05.2018 07:47:26am

మన చుట్టూ ఉన్న సామాజిక వస్తువుల్లో ఏది సాహిత్య వస్తువు అవుతుంది? దాన్ని కథగా మార్చితే ఏది ఫోకస్ పాయింట్ కావాలి? నిజానికి అలాంటి ఫోకస్ పాయింట్లు అందులో ఎన్ని ఉంటాయి? ఇలాంటి విషయాలు సాహిత్య విమర్శకులు చర్చిస్తుంటారు. ఇవే ప్రశ్నలను కథా రచయితలు, విమర్శకులు కలిసి చర్చించుకుంటే ఎలా ఉంటుంది? అదీ రచయితలు కథలు చదువుతోంటే, వాటి మీద మిగతా వాళ్లు పాఠకులుగా, లేదా విమర్శకులుగా ఇన్ని వైపుల నుంచి పరిశీలిస్తోంటే ఎలా ఉంటుంది? ఏప్రిల్ 14, 15 తేదీల్లో విరసం హైదరాబాదులో నిర్వహించిన కథల వర్క్‌షాప్ ఇలా జరిగింది.

ఏడాదికి సగటున రెండైనా జరిగే ఇలాంటి కథా వర్క్‌షాప్ ల‌ లక్ష్యం కొత్త కథలకులను తయారు చేయడం, ఇప్పటికే రాస్తున్న వాళ్లు మరింతగా కథాకాశంలోకి చూపు విస్తరించి సరికొత్త వస్తు శిల్పాలతో, పదునైన చూపుతో కథలు రాయడం. అనేక ఆలోచనలు, అనుభవాల కలబోత నుంచి అంతిమంగా కథా ఉత్పత్తి పెరగడం ఈ సమావేశాల లక్ష్యం. కథ రాయడమే అద్భుతమైన అనుభవం. అలాంటిది.. రచయిత మన ముందు నిలబడి తను రాసిన కథ చదువుతోంటే, దానిని మనం చర్చిస్తోంటే, అప్పుడు రచయిత దాన్ని తానెలా కథ చేసిందీ చెబుతోంటే వినడం కూడా ఒక గొప్ప అనుభవం. అంతే కాదు, ఆ రచనా అనుభవం వెనుక ఉన్న జీవితానుభవం, దాన్ని కథ చేసిన దృక్పథం, నైపుణ్యం.. అన్నీ సమిష్టి అనుభవంగా మారుతాయి. ఈసారి వర్క్షాపు బ్రాహ్మణీయ హిందుత్వ ఇతివృత్తంగా జరిగింది. నిజానికి ఇలా ఒక థీంతో జరిపితే ఎలా ఉంటుంది? అనేది కొత్త ప్రయోగమే. ఎనిమిది నెల్ల కింద కర్నూల్లో రాయలసీమ ఇతివృత్తం మీద తొలిసారి జరిపితే చాలా మంచి ఫలితాలు కనిపించాయి.


వర్క్ షాపు ఆరంభంలో సాహిత్య విమర్శకుడు ఏకే ప్రభాకర్ మంచి కథ ఎలా ఉంటుంది? అనే అంశం మీద మాట్లాడారు. ఆయన ముందు మంచి అనేదాన్ని వివరించారు. మంచి అనేది శిల్పానికి సంబంధించిందే కాదు, వస్తువు, శిల్పం, దృక్పథం మూడింటికి సంబంధించిందని చెప్పారు. దీనికి ఇటీవల వచ్చిన కొన్ని కథలు తీసుకొని చర్చించారు. మారుతున్న పరిస్థితుల్లో ఏ రకమైన ఇతివృత్తాన్ని ఏ దృక్పథంతో, ఎలాంటి నిర్మాణంలో రాసినందు వల్ల అది మంచి కథ అయిందో వివరించారు.

ఆ తర్వాత అల్లం రాజయ్య ఇప్పుడు రాయవలసిన విప్లవ కథ గురించి మాట్లాడారు. అత్యంత ఘర్షణాపూరితమైన వర్తమాన పరిస్థితుల్లో ఏది రూపొందుతున్నదో, ఏది కూలిపోతున్నదో గుర్తించడం విప్లవ కథ లక్ష్యం కావాలి అన్నారు. కూలిపోతున్న, రూపొందుతున్న తీరు ఎలా ఉన్నదో గమనించాలని అన్నారు. రూపొందుతున్నదాన్ని చిత్రిస్తేనే కొత్త కథ అవుతుందని, ఆ కొత్త కేవలం వస్తువుకు సంబంధించిందే కాదని, శిల్పపరమైన కొత్తదనాన్ని ఆ కథలు తీసుకొస్తాయని అన్నారు. ఈ స్పష్టత నుంచి అనేక ప్రయోగాలు చేయవచ్చని అన్నారు.


దీని మీది చర్చ బ్రాహ్మణీయ హిందుత్వ ఇతివృత్తంలోకి విస్తరించింది. హిందుత్వ అనేది ఐడియాలజీగా, సంస్కృతిగా, ఆధిపత్య ఆచరణగా అనేక హింసా రూపాలతో సమాజమంతా అలుముకపోతోంది. వ్యవస్థ సృష్టించే కొత్త అసమానతల్లో కూడా బ్రాహ్మణిజం పాగా వేసి వాటిని మరింత అమానుషంగా, దుర్మార్గంగా తయారు చేస్తున్నది. ఇలాంటి వాటిని కథలు చేయడానికి ఉన్న అవకాశాల గురించి ఆలోచనాత్మక చర్చ జరిగింది. హిందుత్వతో సహా నానాటికీ పెరుగుతున్న అనేక హింసా రూపాలు భయంగొలిపేలా అనుభవంలోకి వస్తున్నాయి. ఈ బీభత్సకరమైన హింసా రూపాలను ఎలా కథ చేయాలి? అనే చర్చ విస్తృత స్థాయిలో, లోతుగా జరిగింది.

ఒక హింసా రూపం, లేదా దానికి సంబంధించిన అనుభవం దానికదే సాహిత్యం కాజాలదు. లేదా అలాంటి అనుభవంలోని ఉ ద్వేగాలు కూడా కథ కాదు. కథలో ఉద్వేగ లక్షణం ఉండవచ్చు.. కానీ అదే సాహిత్యం కాదు. వాటిని యథాతథంగా భాషలోకి అనువదించే వాళ్లూ ఉంటారు. రచయితలుగా అందులో ఎంత సక్సెస్ అయినా అదీ సాహిత్యం కాదు. కథ ద్వారా హింస గురించిన ఎరుక ఎలా కలిగిస్తాం? ఎలాంటి ఎరుక కలిగిస్తాం? అనే దృక్పథ, శిల్పపరమైన గీటురాయి మీదనే అది సాహిత్యమవుతుంది. అప్పుడే అది కళ అవుతుంది. అసలు ఈ మొత్తం ప్రక్రియలో కళ ద్వారా కోరుకుంటున్న ప్రయోజనం ఏమిటి? అనేది కీలకం. ఇదే కథ ద్వారా కలిగే ఎరుకను మౌలికంగా నిర్దేశిస్తుంది.. వస్తువుకు సాహిత్య లక్షణాన్ని అందిస్తుంది.

సరిగ్గా ఇక్కడి నుంచి శిల్పం, లేదా ప్రయోగం చర్చ జరిగింది. కథా రచనలో హద్దులు లేని శిల్ప వైవిధ్యాన్ని సాధించాలి. అయితే ప్రయోగం కోసమే ప్రయోగం చేస్తే అది మరొకరు చెప్పకుండానే ఇతరులకు అర్థమైపోతుంది. అది ఆకర్షణీయంగా ఉండొచ్చుగాని అంత మాత్రాన దాన్ని కథ అని అని ఒప్పుకోలేం. ఒక్కోసారి ఒక చిన్న ప్రయోగం వల్లే వస్తువు మంచి కథగా రూపొందవచ్చు. కానీ కథలోని ఒక అనుభవం పట్ల, లేదా వైరుధ్యం పట్ల రచయిత తీసుకునే వైఖరి లేదా దానికి మూలమైన దృక్పథం వల్లే ఆ వాచకం గొప్ప కళాత్మక నిర్మాణమవుతుందనే చర్చ కూడా జరిగింది.


కథా రచయిత బజరా గల్పిక, బుల్పికల నిర్మాణం గురించి వివరించారు. ఒక పెద్ద ఇతివృత్తాన్ని చిన్న ప్రక్రియలోకి మలచడం వల్ల వచ్చే ప్రభావాన్ని వివరించారు. విర‌సం స‌భ్యులు కె.వి. కూర్మ‌నాథ్‌ ఇటాలో కాల్వినో అనే రచయిత రాసిన రెండు ఇంగ్లీషు కథలు చెప్పి వాటిలో రచయిత ఎంచుకున్న వస్తువులను, రచనా శిల్పాలను విశ్లేషించారు. రెండు మూడు పేజీల ఈ కథల్లో రచయిత ప్రయోగ దృష్టి వల్ల ఎంత విస్తృత సామాజిక నేపథ్యం సమకూరిందీ చెప్పారు. అలాగే ఆ కథల్లోని వైవిధ్యమైన ఫోకస్ పాయింట్లను ఎత్తి చూపారు. ఈ వర్క్‌షాప్ లో ప్రముఖ దళిత రచయిత్రి జూపాక సుభద్ర తన జీవిత, కథా నేపథ్యం వివరించారు. ఆ తర్వాత ఒక కథ చదివారు. ఈ రెండు రోజుల్లో పదమూడు మంది కథకులు తమ కథలు చదివారు. ఇందులో ఉదయభాను, అల్లం రాజయ్య, బజరా తప్ప మిగతా అందరూ రచయిత్రులే. ఈ కథల్లో కొన్నిటి ముగింపులు, ఎత్తుగడల గురించి లోతైన చర్చ జరిగింది. కొన్ని కథల్లో అసలు పాయింట్ వ్యక్తమైందా లేదా అనే పరిశీలనా జరిగింది. కొన్ని కథలకు ఇంకోలా చెప్పడానికి ఉన్న అవకాశాలనూ శ్రోతలు వదిలిపెట్టలేదు. ఈ చర్చ తీరును తరచి చూస్తే.. దృక్పథపరమైన అంశాలు శిల్ప విషయాలుగా, నిర్మాణానికి.. ప్రయోగానికి సంబంధించినవి సారాంశంలో దృక్పథ విశ్లేషణలుగా నిగ్గుదేలాయి.

ఈ కథలన్నీ దాదాపు బ్రాహ్మణీయ హిందుత్వను స్పృశించినవే. అందువల్ల ఏకకాలంలో అనుభవం దగ్గరి నుంచి దానికి ఉన్న సిద్దాంత స్థాయి దాకా విశ్లేషణలు సాగాయి. హిందుత్వ వ్యతిరేక ఇతివృత్తాలను మరింత సునిశితంగా ఎంచుకోడానికి, వాటిని వైవిధ్యభరితమైన కథలుగా మార్చగల శిల్పాన్ని సమకూర్చుకోడానికి ఈ వర్క్‌షాప్ ప్రేరణ ఇచ్చింది.

No. of visitors : 840
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •