గెలుచుకోవాల్సిన ప్రపంచం దిశగా కారల్‌ మార్క్స్‌

| సంభాషణ

గెలుచుకోవాల్సిన ప్రపంచం దిశగా కారల్‌ మార్క్స్‌

- పాణి | 05.05.2018 11:18:04pm


కాళ్లూ చేతులు తప్ప మరేమీ లేని ఒక వర్గం శ్రమశక్తిని అమ్ముకొనే వాళ్లుగా, మరో వర్గం దాన్ని కొనుక్కొనే వాళ్లుగా నిట్టనిలువునా చీలిపోయిన సమాజంలో మార్క్స్‌ పుట్టాడు. పాతకాలపు సాంఘిక, ఆర్థిక బంధనాల నుంచి బైటికి వచ్చి శ్రమశక్తిని అమ్ముకోవడం ఒక ముఖ్యమైన మార్పు. పెట్టుబడిదారీ యుగారంభానికి సూచికగా మార్క్స్‌ దీన్ని గుర్తించాడు. శ్రామికులు అప్పటిదాకా ఎన్నో రకాలుగా చాకిరీలు చేస్తూ వచ్చారు. పెట్టుబడిదారీ విధానం వాళ్లను వేతన కూలీలుగా మార్చేసింది. శ్రమశక్తిని అమ్ముకుంటూ ఉత్పత్తిలో పాల్గొనే దగ్గరే దోపిడీ మొదలైంది. పెట్టుబడిదారీ విధానం ప్రాణం దాగి ఉన్న అదనపు విలువ దోపిడీ అనే అతి ముఖ్యమైన సూత్రాన్ని ఆయన ఆవిష్కరించాడు. ఇప్పుడు అన్ని మానవ సమాజాలను ఈ సూత్రం నడిపిస్తోంది. ప్రతి సమాజంలో ఇంకా చాలా ముఖ్యమైన సమస్యలు ఉండవచ్చు. కానీ అదనపు విలువ దోపిడీని విస్మరించి మిగతా వాటిని పూర్తిగా అర్థం చేసుకోలేం. పరిష్కరించలేం. ఇది మిగతా సమస్యలను తక్కువ చేయడానికి కాదు. వాటిని కూడా సరిగ్గా అవగాహన చేసుకోడానికే. సరైన ప్రాధాన్యత ఇవ్వడానికే.

పెట్టుబడిదారి వ్యవస్థకు ఎన్ని నిర్వచనాలైనా చెప్పుకోవచ్చు. అతి ముఖ్యమైనది మాత్రం.. అది లాభాల మీద బతికే వ్యవస్థ అని చెప్పడమే. లాభాల కోసం ఎంత అమానుషానికైనా నిస్సంకోచంగా ఆ వ్యవస్థ పాల్పడుతుంది. అది దానికి అత్యంత సహజం. తెచ్చిపెట్టుకున్న వ్యవహారం కానేకాదు. అలా తప్ప పెట్టుబడిదారీ విధానం ఇంకోలా పొరబాటున కూడా ఉండలేదు. పెట్టుబడిదారీ విధానం ఏ రూపంలో, ఎలా ఫంక్షనింగ్‌లో ఉన్నా ఈ సూత్రం ఆధారంగానే అది బతికి ఉంటుంది.

అయితే లాభాల కోసం తనకు తాను ఉరి బిగించుకొనే ఈ అమానవీయ వ్యవస్థ తన శతృవును కూడా వెంట తీసుకొని చరిత్ర రంగస్థలం మీదికి వచ్చిందని ఊహించడంలోనే మార్క్స్‌ చారిత్రక దృష్టి ఉన్నది. తన అదనపు విలువను కొల్లగొట్టే ఈ వ్యవస్థను కార్మిక వర్గం ధ్వంసం చేస్తుందని చెప్పాడు. లాభాలపైన బతకడమంటేనే అసమానతలపై బతకడం. అలాంటి ఈ ఈ ఆర్థిక వ్యవస్థను కూలదోసి సమానత అనే ప్రాతిపదికపై అంతిమంగా మానవజాతి చరిత్రను పునర్నిర్మించే శక్తి ఉత్పత్తిదాయకమైన కార్మికవర్గానికే ఉంటుందని మార్క్స్‌ చెప్పాడు.

ఈ విషయంలో మార్క్స్‌ దరిదాపులకు పోగలిగిన ఆలోచనాపరులు కనిపించరు. మార్క్సిస్టు మహోపాధ్యాయులు లెనిన్‌, స్టాలిన్‌, మావో ఈ దారి వెంట వెళ్లి ఈ సిద్ధాంతాన్నే మరింత సంపద్వంతం చేశారు. మార్క్స్‌ అనితర సాధ్యుడైన మేధావిగా మాత్రమే గుర్తించే వాళ్లెవరైనా ఉంటే వాళ్లు మార్క్స్‌ను సవ్యంగా అర్థం చేసుకోనట్టే. వర్గపోరాటాల ద్వారానే కార్మికవర్గం తన ప్రపంచాన్ని గెలుచుకుంటుందని చెప్పాడు. మార్క్సిజమంటే ఏమిటనే ప్రశ్నకు ఒక వాక్యంలో ఎన్నో సమాధానాలు ఉండొచ్చు. కానీ అతి ముఖ్యమైనది మాత్రం.. ప్రపంచాన్ని అర్థం చేసుకొనే పద్ధతి, ప్రపంచాన్ని మార్చే పద్ధతి అనే. మార్క్స్‌ తర్వాత ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా, ఎన్ని సంచలనాలు చెలరేగినా, కొత్త భావనా వ్యవస్థలెన్ని ముందుకు వచ్చినా మార్క్సిజంలోని శాస్త్రీయత చెక్కుచెదరలేదు. మారుతున్న పరిస్థితుల్లోంచి మరింత రుజువు అవుతున్నది. విస్తరిస్తున్నది. ఈ ప్రపంచాన్ని కార్మికవర్గం గెలుచుకోవాల్సి ఉన్నదనే విషయంలో తిరుగులేని సిద్ధాంతంగా మార్క్సిజం దృఢంగా నిలబడి ఉన్నది.

పెట్టుబడిదారీ విధానం పార్లమెంటరీ రాజకీయ విధానాన్ని కూడా వెంటేసుకొని వచ్చింది. వలస వాదం రూపంలో అది మనలాంటి దేశాల్లోకి వచ్చింది. దాన్ని చూసి భ్రమసేవాళ్లు, ముచ్చటపడేవాళ్లు, గందరగోళపడేవాళ్లు ఎందరో ఉన్నారు. భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా బూర్జువా నియంతృత్వం అమలవుతోంది. దీన్ని ఓడించేందుకు వర్గపోరాటాలు తప్ప విప్లవకారులకు వేరే దగ్గరి దారి లేదు. సుదూరం కాకుండా దగ్గరి దారి ఉంటే అనుమానించాల్సిన పని లేదు. అయితే అది వర్గపోరాటాన్ని బైపాస్‌ చేసే దగ్గరి దారి అయితే అంతకంటే ప్రాణాంతకం ఇంకోటి లేదు.

మన దేశంలో నడుస్తున్న వర్గపోరాటాలపట్ల సంఘీభావం ప్రకటించకుండా మార్క్సిజాన్ని నిరంతరం అధ్యయనం చేసే ఉత్తమ మార్క్సిస్టుల వల్ల ఈ కాలానికి పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు. మార్క్సిజాన్ని ఎక్కాలపట్టీలాగా మార్చేసిన వాళ్ల వల్ల కూడా లాభం లేదు. విమర్శనాత్మక వైఖరితో మన దేశంలోని విప్లవోద్యమాలతో కలిసి నడుస్తూ మార్క్సిజాన్ని అధ్యయనం చేయాల్సిందే. మారుతున్న పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మార్క్సిస్టు సిద్ధాంత పరిజ్ఞానం పెంచుకుంటూ మన ముందున్న పోరాటాలను విమర్శనాత్మకంగా అంచనా వేయాల్సిందే. మార్క్సిస్టు పద్ధతి అనే పేరుతో తోచింది, ఇష్టమైంది, అర్థమైంది మాత్రమే ప్రవచించే ఈ రోజుల్లో మార్క్స్‌ 200 ఒక అవసరమైన సందర్భం. ఒరిజిల్‌గా మార్క్స్‌ పద్ధతి ఏమిటో మరోసారి చదవడానికి, బోధించడానికి ఈ సందర్భాన్ని కూడా వాడుకోవచ్చు.





No. of visitors : 391
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మార్క్స్ వ‌ర్గ‌ పోరాట సిద్ధాంతం అజేయమైంది : కాశీం

కాశీం | 29.05.2018 11:22:54pm

మార్క్స్ ద్విశ‌త జ‌యంతి సంద‌ర్భంగా... మార్క్స్ సిద్ధాంత రాజ‌కీయాల గురించి త‌న‌ అభిప్రాయాల్ని పంచుకున్న‌విర‌సం నాయ‌కుడు కాశీం...
...ఇంకా చదవండి

మార్క్స్ ప్రాసంగిక‌త ఎప్ప‌టికీ ఉంటుంది : అరుణాంక్‌

| 05.05.2018 09:37:20am

మార్క్స్ ద్విశ‌త జ‌యంతి సంద‌ర్భంగా మార్క్స్ గురించి త‌న అభిప్రాయాల‌ను పంచుకున్న‌ డీఎస్‌యూ కార్య‌ద‌ర్శి అరుణాంక్ మార్క్స్ ప్రాసంగిక‌త నేటికీ ఉందంటున్నారు....
...ఇంకా చదవండి

Share your views on Karl Marx, his ideology and Politics

www.virasam.org | 26.04.2018 09:26:06am

Friends who are working on various facets of Marxism and revolutionary ideology and politics, can record the same in a short video format and send them to v...
...ఇంకా చదవండి

21వ శతాబ్దంలో మార్క్స్‌

ఎడిటర్‌ & టీం | 18.04.2018 11:41:43am

మార్క్సిజానికి సంబంధించిన వేర్వేరు రంగాల్లో కృషి చేస్తున్న మీరు మీ అభిప్రాయాలను వీడియో తీసి virasam1970@gmail.com మెయిల్‌కు పంపించండి. మార్క్సిజంలోని వేర్వ...
...ఇంకా చదవండి

మార్క్స్‌ శాస్త్రీయ సిద్ధాంత వారసత్వానికి పదునుపెడదాం

విరసం | 02.05.2018 11:30:59am

మార్క్స్‌ తన కాలంలోని పెట్టుబడిదారీ విధానాన్ని విశ్లేషించాడు. శ్రమశక్తి సరుకు కావడంతో పెట్టుబడిదారీ విధానం ఆరంభమైంది. గత వ్యవస్థలకు పెట్టుబడిదారీ విధానా.....
...ఇంకా చదవండి

marx selected poetry

Editors : James Luchte | 02.05.2018 03:38:37pm

Marx wrote much of this poetry when he was nineteen, around the year 1837, while he was at university. He makes ready use of mythological themes, theologica...
...ఇంకా చదవండి

మార్క్సిజం ఆచరణ సిద్ధాంతం..

బాసిత్ | 03.07.2018 02:31:58pm

ఈ దేశంలో దళితులు, శ్రామిక వర్గాలకు అధికారం ఇంకా అందలేదని, అందుకే మార్క్సిజానికి ప్రాసంగికత అనివార్యంగా ఉంటుంద.....
...ఇంకా చదవండి

మునిపటికన్నా విప్లవాత్మకంగా కార్ల్ మార్క్స్

స్టువర్ట్ జేఫ్రిస్ | 05.06.2018 10:37:25am

మార్క్స్ పని అయిపోయినట్టేనా? కానే కాదు. నాకైతే, కార్ల్ మార్క్స్ ఇప్పటికి చదవడానికి అర్హత కలిగినవాడు. అయితే కేవలం అతడి దూరదృష్టి, అంచనా వల్ల కాదు, అతడి విశ్...
...ఇంకా చదవండి

मार्क्स सिद्धांत और राजनैतिकता के बारे में आप के राय वीडियो के रूप में भिजाइए।

एडिटर & टीम | 26.04.2018 09:48:00am

मई 5 से कार्ल मार्क्स के ʹदो सौ साल साल गिरहʹ के कार्यक्रम आरँभ होने वाले हैं। साल गिरह और बर्सियोँ मेँ कोई भी खासियत नहीं रहने पर भी विश्व कार्मिक वर्ग, इन...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
    అరుణతార సెప్టెంబర్ - 2018
    యాంటి నేషనల్
    ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
    ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
    ʹపట్టణ నక్సలైట్లుʹ అంటే ఇలా వుంటారు
    అక్రమ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
    కుట్ర
    ఇప్పటికైనా అర్ధమయిందా....?
    యుద్ధానంతర యుద్ధగీతం
    పోలీసుల నీడలో రాపూరు
    అర్హత

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •