మైనింగ్ మాఫియా కోస‌మే బోరియా - కసనూర్ నరమేధం

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

మైనింగ్ మాఫియా కోస‌మే బోరియా - కసనూర్ నరమేధం

- గ‌డ్చిరోలి వెస్ట్ర‌న్ స‌బ్ జోన‌ల్ క‌మిటీ అధికార ప్ర‌తినిధి శ్రీనివాస్‌ | 11.05.2018 11:28:38pm

జల్-జంగల్-జమీన్ పై ఆదివాసుల సహజ హక్కును కాపాడుకోవడం కోసం ఆయుధమెత్తిన గడ్చిరోలి మట్టి ముద్దు బిడ్డల అమానవీయ హత్యలను తీవ్రంగా ఖండించండి!
బోరియా - కసనూర్ హత్యాకాండను నిరసించండి!

గడిచిన 38 ఏళ్ల గడ్చిరోలి విప్లవోద్యమ చరిత్రలో 22 ఏప్రిల్ 2018 నాటి ఘ‌ట‌న అతి పెద్ద విషాదం. బోరియా - కసనూర్ బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్లో 39 మంది సహచరులు అమరులు అయ్యారు. ఈ ఘ‌ట‌న‌లో పార్టీ స‌భ్యుల‌తో పాటు గడ్చిరోలి సాదార‌ణ ప్ర‌జ‌లూ అమ‌రుల‌య్యారు. ఎక్కడైతే పోరాటం ఉంటుందో అక్కడ త్యాగం ఉంటుంది. 19 శ‌తాబ్దంలో ఆంగ్లేయ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన బాబూరావు శెడమాకే అందించిన త్యాగాల వార‌స‌త్వం, ప‌డియోర్ సంఘం పోరాట వార‌స‌త్వం ఈ గ‌డ్చిరోలి నేల‌కుంది. ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకు వెళ్తూ బోరియా - కసనూర్ లో కామ్రేడ్స్ త‌మ అమూల్య‌మైన ప్రాణాల‌ను త్యాగం చేశారు. అహేరి - పెరిమిలి క్షేత్రంలో ఏర్పాటు చేసిన వేసవి Tactical Counter Offensive Campaign (TCOC)లో భాగంగా స్తానిక స్క్వాడ్లు, కంబాట్ ప్లాటూన్‌లు స‌మావేశ‌పైన సంద‌ర్బంలో ఈ దాడి జ‌రిగింది.

దాడి అనంత‌రం గడ్చిరోలి పోలీసులు 39 మంది మావోయిస్టులను చంపివేసినామని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం గ్రామ‌స్తుల‌తో స‌మావేశ‌మైన సంద‌ర్భంలో ఈ దాడి జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. అందులో 25 మంది కామ్రేడ్స్‌ అమ‌రులు అమ‌రులైనట్లు నిర్దార‌ణ అయ్యింది. వారిలో ముగ్గురు గ్రామీణులు ఉన్నారు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నియామకమైన సి - 60 దళాలు గడ్చిరోలి జిల్లాలో అమాయక ఆదివాసులను బూటకపు ఎన్కౌంటర్ ల‌లో చంపడం ద‌శాబ్ధాలుగా కొన‌సాగుతోంది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను ఇటీవ‌లి ఘ‌ట‌న‌ల‌ను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

5 వ ఫిబ్రవరి 2018 న గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తహసీల్ గద్రేవాడా గ్రామ పంచాయతీ పరిధిలోని కోయన్వర్సే పరిసరాల్లో పక్షుల వేటకు వెళ్లిన రాంకుమార్ కేశె అనే యువ‌కుడిన పోలీసులు కాల్చి చంపారు. 30 మార్చి 2018 న గుమ్మడి కాలువలో పిట్టల్ని పట్టడానికి ఇంటి నుండి వెళ్లిన సోన్సూ మిర్చా ఉసెండీ తిరిగి శవమై ఇంటికి వచ్చాడు. 3 ఏప్రిల్ న గడ్చిరోలి జిల్లా సిరొంచ తహసీల్ సిర్కొండా పరిసరాల్లో విలాస్ కుడ్మేథే, అమ్సీ తలండీ, వందనా కోవాసీ అనే ముగ్గురు యువ‌కులను సజీవంగా పట్టుకుని బుల్లెట్లతో కాల్చేశారు. అందుకే... కసనూర్ - బోరియా హింసాకాండపై పూర్తి స్థాయి నిజ‌నిర్థార‌ణ జ‌ర‌పాల‌ని పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంస్థలకు విజ్ఞప్తి.

భారతదేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో రెండు వర్గాల మధ్య తీవ్రమైన వర్గ పోరాటం కొనసాగుతోంది. ఒక వైపు ప్రస్తుత దోపిడీ వ్యవస్థను పెకిలించివేసి ఒక నూతన ప్రజాస్వామిక రాజ్యాధికారాన్ని స్థాపించే లక్ష్యంతో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో కొనసాగుతున్న విప్లవ పోరాటం. మరోవైపు పిడికెడు మంది కార్పొరేట్ ఘరానా, ధనిక వ‌ర్గాల‌ను కాపాడేందుకు య‌త్నిస్తున్న‌ దోపిడీ రాజ్య యంత్రాంగం ఉంది. రెండు వర్గాల నడుమ అధికారం కోసం జరిగే పోరాటంలో దిన దిన గండం లాంటి జీవితంలో దైనందిన కార్యాచరణకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. గెరిల్లా యుద్ధ నియమాల అమలులో ఎక్కడైనా ఏమరుపాటు ఉంటే , అక్కడ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. బోరియా - కసనూర్ హింసాకాండలో ఇటువంటి ఏమరుపాటే జరిగింది. దీంతో విప్లవ పోరాటానికి భారీ నష్టం వాటిల్లింది. ఈ నష్టంతో తాత్కాలిక ఇబ్బందైతే ఉంటుంది. కానీ ఎక్కడైతే ఆవేదన ఉందో అక్కడ పోరాటం ఉంటుంది. ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అక్కడ ప్రతిఘటన ఉంటుంది. ఎక్కడైతే హింస ఉంటుందో అక్కడ ప్రతిహింస ఉంటుంది. ఆ ప్రజాగ్రహం నుంచి ఉబికి వచ్చే పోరాటం లోంచే నాయకత్వం కూడా ఉబికి వస్తుంది. ఉద్యమాలే మన నాయకత్వాన్ని రూపొందిస్తాయి. మ‌రింత మునుముందుకు నడిపిస్తాయి.

మహారాష్ట్ర బ్రాహ్మణీయ ఫడ్నవీస్ ప్రభుత్వం ద్వారా గడ్చిరోలి అట‌వీ ప్రాంతం నుండి ఆదివాసులను గెంటివేసి లాయడ్ల - జిందాల్ - మిట్టల్ - గోపానీ వంటి మైనింగ్ మాఫియాలను మేపే లక్ష్యంతో ఈ అప్ర‌క‌టిత యుద్దాన్ని కొన‌సాగిస్తోంది. ఒక పకడ్బందీ కుత్సిత యుద్ధతంత్రంలో భాగంగామే బోరియా - క‌స‌నూరు హ‌త్యాకాండ‌. ఇన్ఫార్మర్ అందించిన సమాచారంతో హంతక సీ - 60 కమాండో పోలీసులు ఈ దారుణానికి పాల్ప‌డ్డారు. బ్రాహ్మణీయ, హిందుత్వ మోదీ ఫాసిస్టు ప్రభుత్వపు సామ్రాజ్యవాద అనుకూల దళారి జీతగాళ్లు, పెట్టుబడిదారుల లాభాలకు పూచీపడుతూ.. గడ్చిరోలి నేల గర్భంలో నెలకొన్న అపార ఖనిజ సంపదను దోచి పెట్టడానికి దారిని సుగమం చేయడమే ఈ దాడి లక్ష్యం. ఆదివాసులకు వ్యతిరేకంగా ఈ ఫాసిస్టు దాడి క్రమం 16 వ శతాబ్దం నుండి కొనసాగుతుంది. ప్ర‌కృతి సంప‌ద కోసం మూలవాసుల సామూహిక హత్యాకాండకు పాల్ప‌డిన చ‌రిత్ర అమెరికాలో రూజ్ వెల్ట్ కాలం నుంచి ఉంది. ఇప్పుడు అలాంటి మాన‌వ హ‌న‌నానికే భార‌త పాల‌క‌వ‌ర్గాలు పాల్ప‌డుతున్నాయి. ఆప‌రేష‌న్ గ్రీన్ హంట్ పేర సాగుతున్న ఆ వేట‌లో భాగ‌మే బోరియా - కసనూర్ నరమేధం.

ఈ ఆకుపచ్చ వేట భారతదేశంలో 2009 నుంచి కొనసాగుతోంది. దీని మరో ఐదు సంవత్సరాలు సమాధాన్ పేరిట జరిపే ఈ యుద్ధతంత్రాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు పాల‌కులు ప్ర‌క‌టిస్తున్నారు. ఆదివాసుల సామూహిక హత్యాకాండ ద్వారా సామ్రాజ్యవాద, కార్పొరేట్ శ‌క్తుల‌కు లాభాలు చేకూర్చ‌మే పాల‌కుల లక్ష్యం. ఏ ప్రాంతాల్లోనైతే ప్రకృతి సంపద ఉందో, అక్కడే ఈ నరసంహారం, వినాశనం, విధ్వంసం కొనసాగుతున్నాయి. ఇవ్వాళ భారత దేశ మూలవాసుల అస్తిత్వం, ఆత్మగౌరవం వినాశకర అంచులో ఉంది. ఇట్లాంటి స్థితిలో అడవిపై వారికున్న సహజ హక్కును కాపాడేందుకు జల్ - జంగల్ - జమీన్ - ఆత్మ‌గౌర‌వం కోసం తో గడ్చిరోలి మట్టి బిడ్డలు పోరాడుతున్నారు. ఈ పోరాటాన్ని అణ‌చివేసేందుకు సాగుతున్న‌దే ఆదివాసి వ్యతిరేక యుద్ధం. దోపిడీ పాలక ప్రభుత్వాల ఈ అప్రకటిత యుద్ధాన్ని నడపడానికి వేలాది సి - 60, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాల మోహరింపు ద్వారా గడ్చిరోలి జిల్లా మొత్తాన్ని సైనిక శిబిరంగా మార్చివేశారు.

గ‌డ్చిరోలి విషాద వార్త విని ప్రజాప్రేమికుల మనసు దుఃఖంతో ఎంతగానో ప‌రితపించి ఉంటుంది. మీ దుఃఖాన్ని ఆక్రోశంగా మార్చెయ్యండి. విప్లవం ఎప్పుడూ ఓడిపోదు. బోరియా - కసనూర్ వంటి హత్యాకాండ వలన తాత్కాలిక న‌ష్టం జ‌రిగి ఉండ‌వ‌చ్చు. కానీ అది శాశ్వ‌తం కాదు.

త్యాగాలు లేనిదే విప్లవం విజయవంతం కాదు. విప్లవాన్ని కోరుకునే పీడిత ప్రజలు, ప్రత్యేకించి గడ్చిరోలి వాసులకు మా విజ్ఞప్తి ఏమిటంటే .. ధైర్యం, విశ్వాసాలతో నిలబడాలని. అన్యాయానికి వ్యతిరేకంగా, దోపిడీ - దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగించాలని. విప్లవ పోరాటంలో ఓటమి, గెలుపుల పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఓటమి౼గెలుపు౼మళ్లీ ఓటమి౼మళ్లీ గెలుపు.. ఇట్లా ఆ చక్ర భ్రమణం చివరికి దోపిడీకి గురైన పీడిత ప్రజల గెలుపుగానే నిలుస్తుంది. నిజమే, మనకు జ‌రిగిన న‌ష్టం విప్లవ ఉధృతిలో తాత్కాలిక ఆటంకాన్ని ఏర్పరస్తుంది. విప్లవ స్ఫూర్తి, నిబద్ధతలతో ఇట్లాంటి అవరోధాలను అధిగమించాలి. బూడిద నుండి ఫీనిక్స్ పక్షిలా విప్లవకర శ‌క్తులు లేస్తాయి.

మన అమరవీరుల శోకతప్త కుటుంబాలు, వారి బంధుమిత్రుల పట్ల మావోయిస్టు పార్టీ గాఢమైన సంతాపాన్ని ప్రకటిస్తుంది. విప్లవ ప్రేమికుల సహకారంతో మీరు ఈ దుఃఖంలోంచి తొందరగా బయట పడాలని ఆశిస్తున్నాం. పార్టీ మీ వెంట ఉంది. దేశంలోని పీడిత ప్రజల సానుభూతి మీ వెంటే ఉంది.

ప్రియ‌మైన ప్ర‌జ‌లారా,
బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టులు మూలవాసుల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అంతం చేసే లక్ష్యంతో కొనసాగుతున్న ఆప‌రేష‌న్ గ్రీన్‌హంట్‌కు వ్య‌తిరేకంగా బ‌ల‌మైన ఉద్య‌మాన్ని నిర్మించాలి. రండి, మీరు - మేము కలిసి ఈ ఫాసిస్టు అణిచివేతకు ధీటైన జవాబిద్దాం. సమస్త ప్రకృతి సంపదలకు హక్కు దారులు ఇక్కడి మూలవాసులేనని ప్రకటిద్దాం. వారికి అడవి పై గల సహజ హక్కును కాపాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించైనా కొట్లాడదాం.

మావోయిస్టుల పేరుతో భారతదేశంలోని మూలవాసులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న అప్రకటిత యుద్ధాన్ని ఖండించాలని దేశంలోని, ప్రపంచంలోని సమస్త మానవ హక్కుల సంఘాలు, కార్యకర్తలు, సమస్త ప్రజాస్వామిక వాదులు, సంస్థలకు మా విజ్ఞ‌ప్తి. భారతదేశ మూలవాసుల మానవ హక్కుల హననాన్ని ఆపాల‌ని, ʹమావోయిస్టు భావజాలాన్ని కలిగి ఉండడం అపరాధం కాదనిʹ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించమని డిమాండ్ చేయండి. కసనూర్_బోరియా హత్యాకాండ మీద న్యాయవిచారణ జరిపించాలి.

బొరియా - క‌స‌నూర్ అమ‌రులు


1. శ్రీను @ రౌతు విజ‌యేంధ‌ర్ (ద‌క్షిణ్ గ‌డ్చిరోలి డివిజిన‌ల్ క‌మిటీ కార్య‌ద‌ర్శి)
2. సాయినాథ్ @ డోలేష్ ఆత్రం (ద‌క్షిణ్ గ‌డ్చిరోలి డివిజిన‌ల్ క‌మిటీ స‌భ్యుడు)
3. నందు @ విక్రం @ ఆత్రం వ‌సంత్ (ద‌క్షిణ్ గ‌డ్చిరోలి డివిజిన‌ల్ క‌మిటీ స‌భ్యుడు)
4. ల‌త @ మ‌స‌రి వ‌డ్డె (అహేరి ఏరియా క‌మిటీ కార్య‌ద‌ర్శి)
5. శాంత @ మంగ‌లి ప‌ద్ద(అహేరీ లోక‌ల్ ఆర్గ‌నైజింగ్ స్వ్కాడ్ క‌మాండ‌ర్‌, ఏరియా క‌మిటీ స‌భ్యురాలు)
6. చంద్ర‌క‌ళ @ జ‌న్నీ త‌లండి (అహేరి ఏరియా క‌మిటీ స‌భ్యురాలు)
7. రాజేష్ @ దామా న‌రోటి (యాక్ష‌న్ టీం క‌మాండ‌ర్, పీపీసీఎం)
8. మాధురి @ మ‌ట్టామి బూరి ( పెరిమిల ఏరియా క‌మిటీ స‌భ్యురాలు)
9. జ‌మున @ శాంకో జోగౌ ( 7వ ప్ల‌టూన్ డిప్యూటీ క‌మాండ‌ర్)
10. ల‌లిత @ కోవాసి (7వ ప్ల‌టూన్ పీపీసీఎం)
11. న‌గేష్ @ దుల్స న‌రోటి (14వ ప్ల‌టూన్ పీపీసీఎం)
12. లిమ్మి @ జ‌న్నీమట్టామి (పెరిమిల ఏరియా క‌మిటీ స‌భ్యురాలు)
13. కార్తిక్ @ ఉయాకా కోర్తిక్ (పెరిమిల ఏరియా క‌మిటీ స‌భ్యుడు)
14. సుమ‌న్ . @ జ‌న్నీ కుడియేటి (7వ ప్లాటూన్ పీఎం)
15. శ్రీకాంత్ @ రాను న‌రోటి (పీఎం)
16. స‌న్నూ @ బిచ్చ గావ్డే (7వ ప్లాటూన్ పీఎం)
17. తిరుప‌తి @ ధ‌ర్మ పుంగాటి (పెరిమిల ద‌ళం)
18. అనిత @ మ‌డావి బాలి (పెరిమిల ద‌ళం)
19. రేష్మ (14వ ప్లాటూన్ పీఎం)
20. మున్నీ @ కోర్చామున్ని (7వ ప్లాటూన్ పీఎం)
21. జ‌య‌శీల (అహేరి ద‌ళ స‌భ్యురాలు)
22. క్రాంతి @ పూనెం బుజ్జి (7వ ప్ల‌టూన్ పీఎం)
మ‌రో ముగ్గురు స్థానికులు

శ్రీనివాస్‌,
అధికార ప్ర‌తినిధి,
గ‌డ్చిరోలి వెస్ట్ర‌న్ స‌బ్ జోన‌ల్ క‌మిటీ,
సీపీఐ (మావోయిస్టు)


26 Apr 2018

(www.thewire.in సౌజ‌న్యంతో)

No. of visitors : 1170
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •