బ‌లిమెల నుంచి ఇంద్రావ‌తి దాకా

| సంపాద‌కీయం

బ‌లిమెల నుంచి ఇంద్రావ‌తి దాకా

- క్రాంతి | 19.05.2018 01:43:02am

భార‌త విప్ల‌వోద్య‌మ చ‌రిత్ర‌లో గ‌డ్చిరోలి హ‌త్యాకాండ అతి పెద్ద విషాదం. ఏప్రిల్ 22, 23 తేదీల్లో మ‌హారాష్ట్ర‌లోని గ‌డ్చిరోలి జిల్లా భామ్రాగ‌ఢ్ త‌హ‌సీల్ బోరియా అట‌వీ ప్రాంతంలో జ‌రిగిన బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్‌ల‌లో 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంద్రావ‌తి సాక్షిగా సాగిన ఈ హ‌త్యాకాండ‌... సింహ‌ళ సైన్యం తమిళుల‌పై జ‌రిపిన మాన‌వహ‌న‌నాన్ని గుర్తుచేస్తోంది. జాతి విముక్తి కోసం త‌మిళ ఈలం విముక్తి పులులు చేస్తున్న‌ పోరాటాన్ని అణ‌చివేసేందుకు సాగిన‌ హ‌త్యాకాండ‌లో యాభై వేల మందికిపైగా త‌మిళులు ప్రాణాలు కోల్పోయారు. సామ్రాజ్య‌వాద అమెరికా, బ్రిట‌న్‌, చైనా, ఇండియా, ఇజ్రాయిల్‌ల‌తో క‌లిసి శ్రీలంక సైన్యం జ‌రిపిన దాడుల ఫ‌లితంగా ల‌క్ష‌లాది మంది నిర్వాసితుల‌య్యారు. స‌రిగ్గా అలాంటి మాన‌వ హ‌న‌న‌మే ఇప్ప‌డు దండ‌కాణ్యంలో సాగుతోంది. ఆదివాసీల‌ను అడ‌వికి దూరం చేసేందుకు, ప్ర‌జా విముక్తి పోరాటాన్ని అణ‌చివేసేందుకు భార‌త ప్ర‌భుత్వం చేస్తున్న యుద్ధం ఇది. గ‌డ్చిరోలి ఘ‌ట‌న‌ అందులో భాగ‌మే.

బోరియా - క‌స‌నూరు అటవీ ప్రాంతంలో సీఆర్ పీఎఫ్, సీ-60 కమెండోలు జరిపిన ఈ హత్యాకాండ‌లో చిన్న‌పిల్ల‌లు స‌హా న‌ల‌బైమంది మావోయిస్టులు, ఆదివాసీలు అమ‌రుల‌య్యారు. యాభై ఏళ్లలో విప్ల‌వోద్య‌మం ఇంత భారీ న‌ష్టాన్ని మునుపెన్న‌డూ చ‌విచూడ‌లేదు. రెండేళ్ల క్రితం ఆంధ్ర - ఒరిస్సా స‌రిహ‌ద్దులో జ‌రిగిన‌ రామ‌గూడ ఎన్‌కౌంట‌ర్‌లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ త‌రువాత గ‌డ్చిరోలి సంఘ‌ట‌నే అంత భారీస్థాయిలో జ‌రిగింది.

ఇంద్రావ‌తి తీరంలోని బోరియా - క‌స‌నూరు అట‌వీ ప్రాంతంలో మావోయిస్టులు స‌మావేశ‌మ‌య్యార‌నే ప‌క్కా స‌మాచారంతోనే ఈ ఆప‌రేష‌న్‌ను చేప‌ట్టామ‌ని స్వ‌యంగా పోలీసులే ప్ర‌క‌టించారు. ఈ ఆప‌రేష‌న్‌లో భాగంగా అండర్ బ్యారల్ గ్రెనేడ్ లాంఛర్స్ (యూబీజీఎల్) వంటి అధునాతన ఆయుధాలను విని యోగించామని సైతం ప్ర‌క‌టించారు. కేంద్ర హోం శాఖ‌మంత్రితో పాటు, మినిస్టరీ ఆఫ్ హెం అఫైర్స్ సీనియర్ సెక్యురిటీ ఆఫీసర్ కె. విజయకుమార్ ఈ హ‌త్యాకాండను విప్ల‌వోద్య‌మంపై సాధించిన గొప్ప విజ‌యంగా ప్ర‌క‌టించారు. ఆ వెనువెంట‌నే చ‌త్తీస్‌ఘ‌డ్‌, జార్ఖండ్‌, ఒరిస్సా రాష్ట్రాల్లో జ‌రిగిన మ‌రో నాలుగు ఎన్‌కౌంట‌ర్‌ల‌లో దాదాపు ప‌దిహారుమందికిపైగా అమ‌రుల‌య్యారు. ఈ మొత్తం ʹఎన్‌కౌంట‌ర్లʹ నేప‌థ్యంలో కేంద్ర హోం మంత్రి స‌హా, పోలీసు ఉన్న‌తాధికారుల ప్ర‌క‌ట‌న‌లు మ‌రింత ఆందోళ‌నక‌రంగా ఉన్నాయి. రానున్న‌కాలంలో ఇంకెలాంటి భీభ‌త్సాన్ని చూడాల్సి వ‌స్తోందో అనే ఆందోళ‌న క‌లుగుతుంది.

ఏఓబీ నుంచి గ‌డ్చిరోలి వ‌ర‌కు జ‌రిగిన హ‌త్య‌ల‌ ప‌రంప‌రంను ప‌రిశీలిస్తే ఈ అనుమానం స‌హ‌జ‌మే అనిపిస్తుంది. 31 మందిని బ‌లితీసుకున్న‌రామ‌గూడ ʹఎన్‌కౌంట‌ర్ʹ వెన‌క‌, 40 మందిని బ‌లితీసుకున్నబోరియా - క‌స‌నూరు ʹఎన్‌కౌంట‌ర్ʹ వెన‌క‌ బ‌హుళ‌జాతి కంపెనీల ప్ర‌యోజ‌నాలున్నాయ‌నేది కాద‌న‌లేని వాస్త‌వం. ఆ ప్ర‌యోజ‌నాల‌ను అడ్డుకుంటున్న మావోయిస్టు ఉద్య‌మాన్ని దేశానికి అంత‌ర్గ‌త ముప్పుగా ప్ర‌క‌టించిన భార‌త ప్ర‌భుత్వం దాన్ని అణ‌చివేసేందుకు ఆప‌రేష‌న్ గ్రీన్‌హంట్‌ను ప్రారంభించింది. ఇప్పుడ‌ది స‌మాధాన్ పేరుతో స‌రికొత్త‌గా అమ‌ల‌వుతోంది. దేశంలోని విలువైన స‌హ‌జ వ‌న‌రుల‌ను సామ్రాజ్య‌వాద సంస్థ‌ల‌కు అప్ప‌గించే ల‌క్ష్యంతో భారత పాల‌క వ‌ర్గాలు దేశ ప్ర‌జ‌ల‌పై జ‌రుపుతున్న యుద్ధమే ఆప‌రేష‌న్ గ్రీన్‌హంట్‌.

దండ‌కార‌ణ్యంలోని చ‌త్తీస్‌ఘ‌డ్‌, ఝార్ఖండ్‌, ఒరిస్సా, మ‌హారాష్ట్ర త‌దిత‌ర పాంతాల్లో అపారమైన ఖ‌నిజ సంప‌ద ఉంది. ఈ స‌హ‌జ వ‌న‌రుల‌ను సొంతం చేసుకునేందుకు బ‌హుళ‌జాతి సంస్థ‌లు ద‌శాబ్ధాలుగా ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. సామ్రాజ్య‌వాదుల ఈ దోపిడీకి మావోయిస్టు ఉద్య‌మం ఆటంకంగా మారింది. అడ‌వి నుంచి ఆదివాసీల‌ను గెంటివేసి దేశంలోని స‌హ‌జ వ‌న‌రుల్ని కార్పోరేట్ సంస్థ‌ల‌కు అప్ప‌గించాల‌నే పాల‌క విధానాల‌ను విప్ల‌వోద్య‌మం వ్య‌తిరేకిస్తోంది. విప్ల‌వోద్య‌మాన్ని నిర్మూలిస్తే త‌ప్ప వ‌న‌రుల దోపిడీ సాధ్యం కాద‌నే అవ‌గాహ‌న‌తో భార‌త పాల‌కవ‌ర్గాలు ఇప్పుడు ఈ మార‌ణ‌కాండ‌ను అమ‌లుచేస్తున్నాయి. రామ‌గూడ‌, బోరియా - క‌స‌నూరు ʹఎన్‌కౌంట‌ర్‌ʹలు అందులో భాగ‌మే.

బ‌లిమెల - ఇంద్రావ‌తి తీరాల్లో జ‌రిగిన ఈ రెండు ఉదంతాల్లోనూ మృతిచెందిందీ మావోయిస్టులు మాత్ర‌మే కాదు.. స్థానిక గ్రామాల‌కు చెందిన ఆదివాసులూ ఉన్నారు. రామ‌గూడ ఎన్‌కౌంట‌ర్ సంద‌ర్భంగా 9 మంది ఆదివాసీల‌ను అత్యంత పాశ‌వికంగా హ‌త్య‌చేసిన పోలీసులు, గ‌డ్చిరోలి ʹఎన్‌కౌంట‌ర్ʹ సంద‌ర్భంగా ఒకే గ్రామానికి చెందిన 8మంది ఆదివాసీ పిల్ల‌ల‌ను హ‌త్య‌చేశారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న విధ్వంస‌క‌ర అభివృద్ధిని వ్య‌తిరేకించ‌డ‌మే వాళ్లు చేసిన నేరం. ఈ మూకుమ్మ‌డి హ‌త్యాకాండ‌లో చ‌నిపోయిన వారంద‌రినీ మావోయిస్టులుగా ప్ర‌క‌టించిన పోలీసులు... చివ‌ర‌కు శ‌వాల‌ను కూడా కుటుంబ‌స‌భ్యుల‌కు అప్ప‌గించ‌లేదు. శ‌వాలు కుల్లిపోయి, పురుగులు తిరుగుతున్న ద‌శ‌లో తెచ్చి ఆసుప‌త్రుల్లో ప‌డేశారు. క‌న్న‌వాళ్లు సైతం త‌మ బిడ్డ‌ల్ని పోల్చుకోలేని ద‌య‌నీయ స్థితి ఈ రెండు సంఘ‌న‌ల్లోనూ చూడ‌వ‌చ్చు.


రామ‌గూడ హ‌త్యాకాండ‌


2016 అక్టోబర్ 24వ నుంచి 27 వరకు ఏఓబీలోని బ‌లిమెల రిజ‌ర్వాయ‌రు వ‌ద్ద రామ‌గూడ అట‌వీ ప్రాంతంలో జరిగిన హ‌త్యాకాండ‌లో 31 మంది మృతిచెందారు. వారిలో 22 మంది మావోయిస్టులు కాగా, 9 మంది సాధార‌ణ ఆదివాసీ ప్ర‌జ‌లు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒరిస్సా రాష్ట్రాల్లోని ఖ‌నిజ సంప‌ద‌ను కాజేయ‌జూస్తున్న కార్పోరేట్ సంస్థ‌ల నెత్తుటి దాహానికి నిద‌ర్శ‌నం ఈ హ‌త్యాకాండ‌.

ఒరిస్సా రాష్ట్రంలో 1.6 బిలియ‌న్ ట‌న్నుల‌కు పైగా బాక్సైట్ నిల్వ‌లున్నాయి. ఇటు విశాఖ మన్యంలో 4.15 లక్షల కోట్ల విలువైన బాక్సైట్ నిల్వ‌లున్నాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఈ నిల్వ‌ల‌పై ఆంధ్ర‌, ఒరిస్సా రాష్ట్రాలు దృష్టిసారించాయి. రెండు రాష్ట్రాలూ... బాక్సైట్ త‌వ్వ‌కాల కోసం ప‌లు దేశీయ‌, విదేశీ కార్పోరేట్ సంస్థ‌ల‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వెలిసితీయ‌డం వ‌ల్ల విశాఖ మ‌న్యంలో దాదాపు 200 గ్రామాలు ఖాళీ చేయాల్సి వ‌స్తుంది. 26 వేల మంది ఆదివాసులు నిర్వాసితులవుతారు. ప‌రోక్షంగా దాదాపు మ‌రో 3ల‌క్ష‌ల మందికిపైగా త‌మ జీవించే హ‌క్కును కోల్పోతారు. ఈ విధ్వంస‌క‌ర అభివృద్ధిని స్థానిక ప్ర‌జ‌లు ద‌శాబ్ధాలుగా వ్య‌తిరేకిస్తూనే ఉన్నారు. వేదాంత‌, టాటా, పోస్కో వంటి కంపెనీల‌కు వ్య‌తిరేకంగా వీరోచిత పోరాటం చేస్తున్నారు. ఆదివాసీల ఈ పోరాటానికి మావోయిస్టు ఉద్య‌మం అండ‌గా నిలిచింది. బ‌హుళ‌జాతి సంస్థ‌ల ప్ర‌యోజ‌నాల కోసం ల‌క్ష‌లాది మంది ఆదివాసీల జీవితాల‌ను బ‌లిపెట్ట‌డానికి సిద్ధ‌మైన ప్ర‌భుత్వాలు విప్ల‌వోద్య‌మాన్ని అణ‌చివేత‌ను త‌క్ష‌ణ క‌ర్త‌వ్యంగా స్వీక‌రించాయి. అందులో భాగ‌మే రామ‌గూడ ʹఎన్‌కౌంట‌ర్‌ʹ.

గ‌డ్చిరోలి విషాదం


మ‌హారాష్ట్ర‌, చ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రాల మ‌ధ్య నుంచి ప్ర‌వ‌హించే ఇంద్రావ‌తి న‌దికి ఇరువైపులా అపార‌మైన ఖ‌నిజ సంప‌ద ఉంది. గ‌డ్చిరోలి అట‌వీ ప్రాంతంలో విస్తారంగా గ‌ల సున్న‌పురాయి, ఇనుప ఖ‌నిజాల‌పై క‌న్నేసిన బ‌హుళ‌జాతి సంస్థ‌లు అక్క‌డ త‌వ్వ‌కాలు జ‌రిపేందుకు ద‌శాబ్ధాలుగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. అలా లోయ్డ్స్ మెట‌ల్ అండ్ ఎన‌ర్జీ లిమిటెడ్ 1993లో మైనింగ్ కోసం లీజ్ కి తీసుకుంది. 2006లో తిరిగి లీజ్‌ను రెన్యువ‌ల్ చేసుకుంది. 2011లో ఎట్‌ప‌ల్లి త‌హ‌సీల్ ప‌రిధిలో 348 హెక్టార్ల‌లో ఐర‌న్ ఓర్ త‌వ్వ‌కాలు ప్రారంభించింది. అంత‌కు ముందే ఇదే ప్రాంతంలో 2007లోనే గోపాని ఐర‌న్ కంపెనీ 153 హెక్టార్ల‌లో గ‌నుల త‌వ్వ‌కాల కోసం అనుమ‌తి పొందింది. మ‌రో 22 కంపెనీలు రానున్నాయి కూడా. జిల్లాలోని సూర‌జ్‌ఘ‌డ్‌, ఎట్‌ప‌ల్లి, భామ్రాగ‌డ్ త‌దిత‌ర ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు సుదీర్ఘ‌కాలంగా మైనింగ్ త‌వ్వ‌కాల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. ఆదివాసీలు జ‌రుపుతున్న ఈ పోరాటం 2016 నాటికి తీవ్ర‌స్థాయికి చేరింది. 2016 డిసెంబ‌ర్‌లో ఖ‌నిజాన్నిత‌ర‌లిస్తున్న‌ లోయ్డ్స్ మెట‌ల్ అండ్ ఎన‌ర్జీ లిమిటెడ్‌కు చెందిన 75 వాహ‌నాల‌ను మావోయిస్టులు త‌గ‌ల‌బెట్టారు. దీంతో తాత్కాలికంగా త‌వ్వ‌కాల‌ను నిలిపివేసిన లోయ్డ్స్ కంపెనీ 2017లో తిరిగి త‌వ్వ‌కాల‌ను ప్రారంభించింది. స‌రిగ్గా ఆ స‌మ‌యానికి గ‌డ్చిరోలికి అద‌న‌పు సీఆర్‌పీఎఫ్ బ‌ల‌గాల‌ను పంపాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రాన్ని కోరింది. అలా వేలాది బ‌ల‌గాలను గ‌డ్చిరోలి జిల్లాలో మోహ‌రించి మైనింగ్ త‌వ్వ‌కాలు తిరిగి ప్రారంభించింది రాష్ట్ర ప్ర‌భుత్వం.

నిజానికి ఈ ప్రాంతంలోని ప‌లు గ్రామ స‌భ‌లు మైనింగును వ్య‌తిరేకిస్తూ తీర్మాణం చేశాయి. కానీ గ్రామ స‌భ‌ల తీర్మాణాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ప్ర‌భుత్వాలు కార్పోరేట్ కంపెనీల ప్ర‌యోజ‌నాల‌కే పెద్ద‌పీఠ వేశాయి. దానికి అభివృద్ధి అనే ముసుగును త‌గిలించాయి. ప‌ర్యావ‌ర‌ణానికి హాని త‌ల‌పెట్ట‌డంతో పాటు, ఆదివాసీల‌ను నిర్వాసితుల‌ను చేసే మైనింగ్‌ని వ్య‌తిరేకించిన నేరానికి ఆదివాసీల‌ను అభివృద్ధి నిరోధ‌కులుగా, దేశ ద్రోహులుగా చిత్రీక‌రించింది ప్ర‌భుత్వం. ఆదివాసీల పోరాటానికి మావోయిస్టుల అండ ఉండ‌డంతో మొత్తంగా ఆ ప్రాంతాన్ని త‌మ ఆధీనంలోకి తీసుకునేందుకు ఆదివాసుల‌ను, మావోయిస్టుల‌ను నిర్మూలించేందుకు సిద్ధ‌మైంది.ఈ క్ర‌మంలో భాగంగా జ‌రిగిందే గ‌డ్చిరోలి ʹఎన్‌కౌంట‌ర్‌ʹ. దీన్ని గొప్ప విజ‌యంగా చాటుకున్న‌ పోలీసులు చివ‌రి మావోయిస్టును సైతం ఏరివేస్తామంటూ ప్ర‌క‌టించ‌డం ఆదివాసీ స‌మాజానికి పొంచిఉన్న ముప్పును గుర్తుచేస్తోంది. దండ‌కార‌ణ్యాన్ని ఫ్రీజోన్ గా (ఆదివాసీల‌ను గెంటివేసే) మార్చే ల‌క్ష్యంతో ఇప్ప‌టికే దాడుల‌ను ముమ్మ‌రం చేసింది కేంద్రం. డ్రోన్‌లు, విమానాల‌తో దాడి చేసేందుకు సిద్ధ‌మైంది.

బ‌లిమెల - ఇంద్రావ‌తి తీరాల్లోనే కాదు... దండ‌కార‌ణ్యం (తెలంగాణ - ఆంధ్ర‌ప్ర‌దేశ్ - మ‌హారాష్ట్ర - చ‌త్తీస్‌ఘ‌డ్‌), ఏఓబీ (ఆంధ్ర - ఒరిస్సా స‌రిహ‌ద్దు), జంగ‌ల్ మ‌హ‌ల్ (జార్ఖండ్ - ఒరిస్సా - బెంగాల్‌), సరండా (జార్ఖండ్ - బీహార్ - చ‌త్తీస్‌ఘ‌డ్‌) ప్రాంతాల్లో జ‌రుగుతున్న మాన‌వ హ‌న‌నం వ‌న‌రుల దోపిడీ కోస‌మే. ఆప‌రేష‌న్ గ్రీన్ హంట్‌, స‌మాధాన్ పేరుతో సొంత‌ ప్ర‌జ‌ల‌పై భార‌త పాల‌కులు జ‌రుపుతున్న యుద్ధం ఇది. ఈ యుద్ధాన్ని అడ్డుకోవ‌ల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. కోట్లాది మంది ప్ర‌జ‌ల క‌ల‌ల‌ను కూల్చి పిడికెడు మంది ప్ర‌యోజ‌నాలకు ప‌ట్టం గ‌డుతున్న పాలకుల వైఖ‌రిపై ప్ర‌శ్న‌ల కొడ‌వ‌ళ్లు ఎక్కుపెట్టాలి ఇప్పుడు. మేకిన్ ఇండియా, డిజిట‌ల్ ఇండియా అంటూనే దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని సామ్రాజ్య‌వాదుల‌కు తాక‌ట్టుపెడుతున్న పాల‌క వ‌ర్గాల కుట్ర‌ల‌ను బ‌హిర్గ‌తం చేయాల్సిన భాద్య‌త, ఈ దేశ మూల వాసుల‌ను, వారి కంటి వెలుగును కాపాడుకోవ‌ల్సిన భాద్య‌త బుద్ధిజీవుల‌పై ఉంది. వ‌న‌రుల దోపిడీకోసం సాగుతున్న ఈ మార‌ణ‌కాండ‌ను అడ్డుకోవాల్సిన భాద‌త్య మొత్తం స‌మాజంపై ఉంది.

No. of visitors : 983
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •