ఎన్‌కౌంట‌ర్‌ ముసుగులో మారణ‌హోమం

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

ఎన్‌కౌంట‌ర్‌ ముసుగులో మారణ‌హోమం

- CDRO, IAPL, WSS | 19.05.2018 02:08:05am

గ‌డ్చిరోలి జిల్లాలో ప్ర‌భుత్వం నూత‌న అభివృద్ది పంథా

ఏప్రిల్ 22,2018న మ‌హ‌రాష్ట్ర గ‌డ్చిరోలి జిల్లాలోని బొరియా- క‌స‌నూరు ప‌్రాంతంలో ఎన్‌కౌంట‌ర్‌ జ‌రిగిందని పోలీసులు ప్ర‌క‌టించారు. మ‌రుస‌టి రోజు ఆ ఎన్‌కౌంట‌ర్‌ లో మ‌ర‌ణించిన న‌క్స‌లైట్ల జాబితా అంటూ 16 మంది మృతి చెందిన‌ట్లు ప్ర‌క‌టించారు. 24 ఏప్రిల్ నాడు మ‌రో 15 మంది న‌క్స‌లైట్ల మృత దేహాలు ఇంద్రావ‌తి న‌దిలో దొరికిన‌ట్లు ఇంకో ప్ర‌క‌ట‌న ఇచ్చారు. ఇప్ప‌టికి ఆ సంఖ్య 40కి చేరింది. పోలీస‌లు ప్ర‌క‌టించిన దాని ప్ర‌కారం వీరంతా కేంలం ఆత్మ‌ర‌క్ష‌ణ‌ కోసం జ‌రిగిన ఎదురుకాల్పుల్లో మ‌ర‌ణించారు.

అనుమానాస్ప‌ద రీతిలో ఉన్న ఈ ప్ర‌క‌ట‌న‌లు, సంఘ‌ట‌న‌ల్లో నిజానిజాలు తెలుసుకోవ‌డానికి, క్షేత్ర స్థాయిలో పరిస్థితి అంచ‌నా వెయ్య‌డానికి 12 రాష్ట్రాల‌కు చెందిన 44 మంది స‌భ్యుల బృందం ఒక‌టి ఎన్‌కౌంట‌ర్‌ జ‌రిగింది అని చెప్ప‌బ‌డుతున్న ప్రాంతానికి వెళ్లింది. ఈ బృందంలో జాతీయ స్థాయిలో మాన‌వ‌హ‌క్కులు, మ‌హిళా హ‌క్కుల విష‌యంలో పోరాడే ప‌లు సంస్థ‌ల వారు స‌భ్యులుగా ఉన్నారు.

స్థానిక సీపీఐ ప్ర‌తినిధులు, ప్ర‌జా ప్ర‌తినిధులు, గ్రామ‌స‌భ స‌భ్యుల‌తో పాటు, న్యాయ‌వాదులు, జ‌ర్న‌లిస్టులతో కూడిన బృందం మే 5 నుంచి 7వ‌ర‌కూ గ‌డ్చిరోలి జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించింది.

మా ప‌రిశీల‌న పూర్తి చేశాక నిర్ణ‌యించుకున్న విష‌యాలు ఏంటంటే.. అక్క‌డ జ‌రిగింది సామూహిక హ‌త్య‌లు త‌ప్ప పోలీసులు అంటున్న‌ట్లు ఎదురు కాల్పులు కాదు. మ‌హ‌రాష్ట్ర సీ-60 పోలీసులు, సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలు మావోయిస్టుల‌ను చుట్టుముట్టి అన్ని వైపుల నుంచి అత్యాధునిక ఆయుధాల‌తో, కేవ‌లం వారిని చంపే ఉద్దేశంతో కాల్పులు జ‌రిపార‌నేది నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ప‌రిశీల‌న‌లో వెల్ల‌డైంది.

పోలీసుల వ్య‌వ‌హార శైలి ఈ సంఘ‌ట‌న నిజ‌మైన ఎన్‌కౌంట‌ర్‌ కాద‌నే విష‌యాన్ని బ‌హిర్గ‌తం చేస్తున్న‌ది. ఏప్రిల్22న ఎన్‌కౌంట‌ర్‌ జ‌రిగిన‌ట్లు ప్ర‌క‌టించినా మృత‌దేహాల‌ను ఎవరికీ చూప‌క పోవ‌డం వంటి అశాలు ఎన్కో ఉన్నాయి. జ‌ర్న‌లిస్టుల‌ను కాల్పులు జ‌రిపిన ప్రాంతానికి తీసుకువెళ్ల‌కుండా చేసి కేవ‌లం కొంద‌రు ఎంపిక చేసిన జ‌ర్న‌లిస్టుల‌ను మాత్ర‌మే అనుమ‌తించి, పోలీసులు తాము చెప్పించాల‌నుకున్న‌ది చెప్పించారు.

ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన రెండు రోజుల త‌ర్వాత అదే ప్రాంతంలో ఇంకో 15 మృత దేహాలు అభించాయ‌న్న పోలీసుల ప్ర‌క‌ట‌న లోప‌భూ ఇష్ఠంగా ఉంది. గాయ‌ప‌డ్డ మావోయిస్టులు పారిపోకుండా అక్కడే ఉండి త‌ర్వాత మ‌ర‌ణించార‌ని పోలీసులు చెప్తునట్టు ఉంది. పైగా ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఒక్క పోలీసు మ‌ర‌ణించ‌డం కానీ.. క‌నీసం గాయ‌ప‌డ‌టం కానీ జ‌ర‌గ‌లేదు. దీని గురించి పోలీసుల్నే అడుగుదామ‌ని క‌మిటీ ప్ర‌య‌త్నిస్తే.. ఎన్‌కౌంట‌ర్‌ లో పాల్గొన్న పోలీసులు విదేశీ యాత్ర‌ల్లో ఉన‌ట్లు తెలిసింది.

నిజ‌నిర్థార‌ణ క‌మిటీ బొరియా చేరుకునేస‌రికే అక్క‌డ భారీ స్థాయిలో భ‌ద్ర‌తా ద‌ళాలు మొహ‌రించి ఉన్నాయి. క‌మిటీ ముందు స్థానికులు నోరు విప్ప‌కుండా వారిని భ‌య‌పెట్ట‌డానికే బ‌ల‌గాలు అక్క‌డ ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. ఇంకో వైపు పోలీసులు ఆహేరీ నుంచి క‌స‌నూర్‌ కి జ‌నాన్ని ర‌ప్పించి నిజ‌నిర్థార‌ణ క‌మిటీ రాక‌ను వ్య‌తిరేకిస్తున్న‌ట్లు కృత్రిమ నిర‌స‌న‌ను ఏర్పాటు చేశారు.

క‌మిటీ త‌ర్వాత గ‌ట్టెప‌ల్లి చేరింది. ఇక్క‌డ క‌రెంటు తీసివేయ‌డం వ‌ల్ల మూడు రోజులుగా ఊరంతా చిక‌ట్లో మ‌గ్గుతోంది. కానీ అక్క‌డ కూడా భారీగా బ‌లగాల మోహ‌రింపు మాత్రం ఉంది. ఎన్‌కౌంట‌ర్‌ జ‌రిగిన రోజే భ‌ద్ర‌తా ద‌ళాలు వ‌చ్చాయ‌ని గ్రామ‌స్తులు చెప్పారు. గ్రామ‌స్తులు క‌మిటీ ముందు ఏమీ మాట్లాడ‌కుండా చేయ్యాల‌న్న ల‌క్ష్యంతో పోలీసులు ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేశారు.

ఇదే గ‌ట్టెప‌ల్లి ఊరినుంచి 8 మంది ఏప్రిల్ 22 నుంచి క‌న‌ప‌డ‌కుండా పోయార‌ని క‌ల‌క‌లం రేగింది. పెళ్లికి హాజ‌రు కావ‌డానికి బ‌య‌ల్దేరిన వాళ్లు తిరిగి రాలేదు. ఆ 8మందిలో ఒక‌రైన ర‌సు మాధ‌వి మృత దేహాన్ని గ్రామ‌స్తులు గుర్తించారు. ఆచూకీ లేని మిగ‌తా వారి కుటుంబ‌స‌భ్యులు పోలీసుల‌ను సంప్ర‌దిస్తే.. వారు అంద‌రూ మావోయిస్టు పార్టీ లో కొత్త‌గా చేరార‌ని చెప్పారు. మ‌రి మృత‌దేహాలపై ఉన్న మావోయిస్టు దుస్తుల సంగ‌తేమ‌ని అడిగ ప్ర‌య‌త్నిస్తే.. వారు ఇంత‌కు ముందే మావోయిస్టు పార్టీలో చేరార‌ని మాట మార్చారు. మృత‌దేహాల ద‌గ్గ‌ర ల‌భించిన ఆధార్ కార్డుల్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని కుటుంబ స‌భ్యుల‌కు తిరిగి ఇవ్వ‌కుండా మృతుల గుర్తింపును క‌ష్ట‌త‌రం చేశారు.

గ‌డ్చిరోలి జిల్లా రాజ‌రాం కాండ్లాలో పోలీసులు చెప్పేది ఇంకోలా ఉంది. 23, ఏప్రిల్ నాడు రాత్రి ఏం జ‌రిగింది అనే విష‌యంపై వారు ఇంకో రకంగా చెప్పారు. 24,ఏప్రిల్ రాజారం-కాండ్ల ద‌గ్గ‌ర ఎన్‌కౌంట‌ర్‌ జ‌రిగింద‌ని చెప్పారు. కానీ 25ఏప్రిల్ న నందు మృత దేహాన్ని అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గిస్తూ అక్క‌డి ఎస్పీ ఇచ్చిన లెట‌ర్ లో కొపెచవంచ కేటారం ఎన్కౌంట‌ర్ లో మృతి చెందిన‌ట్లు పేర్కొన్నారు. ఆ ఎన్‌కౌంట‌ర్‌ మృతుల్లో న‌లుగురు మ‌హిళ‌లు కూడా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు.


నిజ‌నిర్థార‌ణ క‌మిటీ ఆఎన్‌కౌంట‌ర్‌ ప్రాంతాన్ని ప‌రిశీలించడంతో పాటు, నందు కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసింది. ఏప్రిల్ 23న నందుని మ‌రి కొంద‌రితో క‌లిపి పోలీసులు అదుపులోకి తీసుకున్నార‌ని కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందింది. వారిని వెతుకుతూ పోలీసుల్ని ఆశ్ర‌యించినా ఉప‌యోగం లేక‌పోయింది. ఆత‌ర్వాత రోజు 23 తేదీ సాయంత్రం నైనార్ ఎన్‌కౌంట‌ర్‌ లో నందుతో పాటు మిగ‌తా వారు కూడా మ‌ర‌ణించార‌ని వార్త వ‌చ్చింది.

నిజ‌నిర్థార‌ణ క‌మిటీ ఆ ప్రాంతానికి(నైనార్) వెళ్లి ప‌రిశీలించి చూడ‌గా నందు ఇంకా మిగ‌తా వారిని చిత్ర‌హింస‌లు పెట్టి చంపిన‌ట్లు స్ప‌ష్టంగా తెలిసింది. పోస్ట్ మార్టం రిపోర్టును కూడా కుటుంబానికి ఇవ్వ‌క‌పోవ‌డం క‌మిటీని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. 25 ఏప్రిల్ నాటికి మృత‌దేహాన్ని కుటుంబ‌స‌భ్యుల‌కు అప్ప‌గించారు. అది అప్ప‌టికే కుళ్లిపోయిన స్థ‌తిలో ఉంది. శ‌రీరంపై బుల్లెట్ గాయం ఏదీ క‌న్పించ‌క‌పోగా.. కుడి భుజంపై గొడ్డ‌లితో నరికిన గాయాలున్నాయి. అక్క‌డి ప్ర‌జ‌లు కూడా ఎన్‌కౌంట‌ర్‌ త‌ర‌హా తుపాకీ కాల్పుల శ‌బ్దం ఏదీ విన‌లేద‌ని చెప్పారు. గ్రామ‌స్తులు, కుటుంబ‌స‌భ్యులు చెప్పిన దాని ప్ర‌కారం నందుని అత‌నితో పాటు మిగ‌తావాళ్ల‌ని అదుపులోనికి తీసుకుని.. కిరాత‌కంగా హింసించి చంపేశార‌ని అర్థ‌మైతోంది.

అస‌లు విచార‌ణ కోసం అదుపులోకి తీసుకున్న వారిని కోర్టులో ఎందుకు హాజ‌రు ప‌ర్చ‌లేదు? అన్ని ప‌రిస్థితులు, ఆధారాలూ క‌స్టడీలో హింసించి చంపేశారు అని చెపుతున్నా పోలీసుల‌పై చ‌ర్య‌లెందుకు తీసుకోరు?

రాజ్యం చేస్తున్న ఈ హ‌త్య‌ల్ని వేరు వేరు సంఘ‌ట‌న‌లుగా చూడాల్సిన పనిలేదు. ఎందుకంటే పోలీసులు సాగిస్తున్న ద‌మ‌ణ కాండ‌లో ఇవిభాగాలు.

ఈ సంవ‌త్స‌రం మొద‌టి నుంచి పోలీసు క్యాంపులు పెంచడం, కొత్త బ‌ల‌గాల్ని మోహ‌రించ‌డం, ప్ర‌జ‌ల్ని భ‌యబ్రాంతుల్ని చేయ‌డానికే.
ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన ఆడ‌విలో ప‌క్షుల వేట‌క‌ని బ‌య‌ల్దేరిన ప్రేమ్ లాల్, రాజ్ కుమార్ అనే ఇద్ద‌రు యువ‌కుల్ని భ‌ద్ర‌తా ద‌ళాలు అదుపులోకి తీసుకుని వారిని తాము మావోయిస్టుల‌మ‌నే అని ఒప్పుకోవాల‌ని బ‌ల‌వంత పెట్టారు. వారిలో ప్రేమ్ లాల్ త‌ప్పించుకు వ‌చ్చి జ‌రిగిన సంఘ‌ట‌న గ్రామ‌స్తుల‌కు చెప్తే, మ‌రుస‌టి రోజు ఆ ప్రాంతానికి వెళ్లి చూశారు. అక్క‌డ రాజ్ కుమార్ ను చిత్ర‌హింస‌లు పెట్టిన ఆన‌వాళ్లు క‌న్పించాయి. రాజ్ కుమార్ మ‌ర‌ణించే ఉంటాడ‌ని భావించారు. చివ‌రకు వారు గ‌డ్చిరోలి పోలీస్టేష‌న్ కు వెళ్లేస‌రికి వారికి రాజ్ కుమార్ మృత‌దేహం క‌న్పించింది.

కొయ‌న్ వ‌ర్ల గ్రామ‌స్తులు చెప్పిన దాని ప్ర‌యారం పోలీసులు ఈ హ‌త్య విష‌యంలో కేసు న‌మోదుకు సిద్దంగా లేదురు. మృతుని కుటుంబ స‌భ్యులు హెదారి పోలీసు క్యాపులో కంప్లైంట్ ఇవ్వ‌డానికి వెళ్తే వారికి మావోయిస్టుల‌తో సంబంధాలు ఉన్నాయ‌న్న లెట‌ర్ పై వేలి ముద్ర‌లు వేయించుకున్నారు.

సున్జ‌ఘ‌ర్ ప్రాంతంలో లాయిడ్ కంపెనీ 2016లో మైనింగ్ మొద‌లు పెట్టింది. జ‌నం తిర‌గ‌బ‌డి ఆ లీజు ర‌ద్దుకు పోరాడారు. దాని ప‌ర్య‌వ‌సానంగా పోలీసుల హింస పెరిగిపోయింది. ఎవ‌రైనా మైనింగ్ కి వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేస్తే వారిని బంధించి, హింసించిన ఉదాహ‌ర‌ణ‌లు అనేకం ఉన్నాయి.

మార్చి 29, 2018న మిర్చా ఉసెండి అనేయువ‌కుడు అడ‌విలో జంతువుల కోసం ఉచ్చువేశాడు. మ‌రుస‌టి రోజు అక్క‌డికి వెళ్లే స‌రికి సీఆర్పీఎఫ్ సిబ్బంది అత‌నిపై దాడి చేసి చంపేశారు. అత‌ని ఆచూకి కోసం పోలీసు స్టేష‌న్ కి వెళ్లిన త‌ల్లిదండ్రుల‌కు నిరాశే ఎదురైంది. చివ‌ర‌కు ఏప్రిల్ 3వ తేదీన అత‌ను ఎన్‌కౌంట‌ర్‌ లో మ‌ర‌ణించాడ‌ని పోలీసులు ప్ర‌క‌టించారు. గ్రామ‌స్తులు, కుటుంబ స‌భ్యులు ఎస్పీ కార్యాల‌యం ముందు నిర‌స‌న తెలిపారు.

ఈ ప్రాంతంలో పోలీసుల హింస పెర‌గ‌డానికి గ‌ల కార‌ణాల్లో ముఖ్యంగా ధ‌మ్ కుండ్వనీ, సూర్జ‌ఘ‌ర్ మైనింగ్ ప్రాజెక్టులని చెప్పుకోవ‌చ్చు. మొద‌ట్లో ఇవి భారీ స్థాయిలో ప్ర‌జా ప్ర‌తిఘ‌ట‌న ఎదుర్కొన్న ప్రాజెక్టులు. మ‌ళ్లీ ఇప్పుడు పోలీసు హింస సాయంతో ప్ర‌జా పోరాటాన్ని అణ‌చి మైనింగ్ కంపెనీల‌కు లబ్ది చేకూర్చే కుట్ర జ‌రుగుతోంది.

పోలీసుల‌, భ‌ద్ర‌తా బ‌ల‌గాల హింస‌కు, లైంగిక వేధింపుల‌కు భ‌య‌ప‌డి మ‌హిళ‌లు అడ‌విలోకి వెళ్ల‌డ‌మే మానేశారు. మ‌రో వైపు పురుషులు నిర్భంధానికి భ‌య‌ప‌డి బ‌య‌టికి రావ‌డం లేదు. తూనికాకు సేక‌రించే కాంట్రాక్ట‌ర్లు సైతం ప‌రిస్థితుల‌కు భ‌య‌ప‌డి ఈ ప్రాంతానికి రావ‌డమే మానేసిన‌ట్లు తెలుస్తోంది.

పోలీసుల ఇష్టారీతి నిర్భంధం, హ‌త్యాకాండ‌, న్యాయ‌వ్య‌వ‌స్థ నిష్క్రియా ప‌ర్వం ఇవ‌న్నీ ఇక్క‌డి ప్ర‌జ‌ల్లో భ‌యాన్ని, కోపాన్నీ కూడా క‌ల్గిస్తున్నాయి. మ‌హ‌రాష్ట్ర, ఛ‌త్తీస్ ఘ‌డ్, ఝార్ఖండ్ రాష్ట్రాల‌కు చెందిన ఆదివాసుల‌కు ధ‌మ్ కుండ్వాషీ ప‌విత్ర స్థ‌లం. ఇప్పుడు అది కూడా మైనింగ్ కు బ‌ల‌య్యేలా ఉంది. మైనింగ్ అక్క‌డి ప్ర‌జ‌ల సామాజిక, ఆర్థిక‌, సాంస్కృతిక జీవితాన్ని తీవ్రంగా ప్ర‌భావితం చేస్తోంది.

నిజ‌నిర్థార‌ణ క‌మిటీ వివిధ గ్రామాల్లో తిరిగుతూ మూడు రోజులు ఆ ప్రాంతంలోనే ఉంది, వంద‌ల మందిని క‌లిసి ప‌రిస్థితిని అంచ‌నా వేయ‌డానికి ప్ర‌య‌త్నించింది. ప్ర‌భుత్వం ఏదైతే అభివృద్ధి అని చెప్తుందో ఆ అభివృద్ది ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల్ని గౌర‌వించేందుకు సిద్దంగా లేద‌ని అర్థం అవుతోంది. త‌మ అడ‌విని, భూముల్ని కాపాడుకోవాల‌ని చూసినందుకు వారు తీవ్ర‌మైన హింస‌ను ఎదుర్కొంటున్నారు.

ఎన్‌కౌంట‌ర్‌ పేరుతో ప్ర‌భుత్వం చేస్తున్న ఈ హ‌త్య‌ల్ని ఖండిస్తూ.. నిజ‌నిర్ధార‌ణ బృందం చేస్తున్న డిమాండ్లు

- బొరియా - క‌స‌నూరు, రాజ‌రాం - కాండ్లా, రేఖార్ లాంటి బూట‌క‌పు ఎన్కౌంట‌ర్ల‌పై న్యాయ‌విచార‌ణ చేప‌ట్టాలి.
- పోలీసు హింస‌ను వ్య‌తిరేకించినందుకు, పౌర‌హ‌క్కుల నేత‌ల‌పై పెట్టిన కేసులు ఉప‌సంహ‌రించుకోవాలి
- బూట‌కపు ఎన్కౌంట‌ర్లు, విచ‌క్ష‌ణా ర‌హిత బ‌ల‌ప్ర‌యోగం లాంటి ఘ‌ట‌న‌ల్లో కేసులు న‌మోదు చేయాలి
- ఆ ప్రాంతంలో ఉన్న పోలీసుల్ని, పారామిల‌ట‌రీ బ‌ల‌గాల్ని వెన‌క్కి పిల‌వాలి
- మైనింగ్ చెయ్య‌డానికి గ్రామ‌స‌భ‌ల అనుమ‌తి త‌ప్పని స‌రి చేయాలి.
- మైనింగ్ కోసం గ్రామ స‌భ అనుమ‌తిని అవ‌స‌రం లేకుండా చేసిన పీఈఎస్ఏ(పీసా) చ‌ట్టాన్ని ఉప‌సంహ‌రించుకోవాలి.
- న్యాయ‌మైన ధ‌ర‌కు తూనికాకు, వెదురు సేక‌రించి ప్ర‌భుత్వ‌మే కొనాలి, అందుకోసం అడ‌వులను కాపాడాలి

(సీడీఆర్ఓ, ఐఏపీఎల్, డ‌బ్ల్యూఎస్ఎస్)
మే 7, 2018
అనువాదం : స్వేఛ్చ

No. of visitors : 1174
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

International Seminar on Nationality Question

AIPRF | 20.11.2018 11:30:05pm

AIPRF - International Seminar on Nationality Question | Delhi | 16 - 19 Feb 1996| William Hinton | Saibaba | Varavararao | Ngugi |Noam Chomsky...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •