ఎ(క)లక్షన్...

| సాహిత్యం | క‌విత్వం

ఎ(క)లక్షన్...

- సురేంద్ర దేవ్ చెల్లి | 19.05.2018 08:29:31am

వర్గపోరులు ఆహారాన్ని
సెంసార్ చేసి నిషేధించినప్పుడే
అర్థం చేసుకోవాల్సింది
దేశంలో కొత్త బుచ్చర్స్ పడ్డారని.

అమ్మ ఏడ్చే పసిపిల్లాడిని
తన చాపిన కాళ్లపై
ఆడిస్తూ నవ్వించినట్లు
వీడెవడో అదే ఫీల్ ని‌ ల్యాబ్ లో సృష్టించి
మతం మత్తును నేకగా మనపై చల్లి
ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్ లైన్ మీద
మన బ్రెయిన్స్ రీప్లేస్ చేస్తున్నాడు.

కుంకుమపువ్వు నింపుకున్న టీ పొడి
-అదేదో బెవరేజ్ యాడ్ అనుకునేరు!

హింట్...
ప్రజల రక్తాన్ని చిక్కని డికాషిన్ లా మరిగించి
జీవనదుల్లో కలిపి
పారిస్తానని వాగ్దానం చేసినట్లు లేదు?

ʹసిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్ పార్టీʹఅంటూ
మీ‌ వాళ్లకు నరనరాల్లో ఉన్మాదం నింపడానికి
మాపై టెస్టింగ్ డోస్ వేస్తున్నావా?

అందరూ కలిసి
నాయకుల బూట్లను
పాలిష్ లేని కాలం నుండి మెరిపిస్తుంది చాలు
అద్దంలో నోరు తెరచి చూసుకుంటే
ఆ రహస్యం తెలిసిపోతుందని
సమస్యపై‌ ప్రజలు మాట్లాడటం మానేశారు.

ఎవడో‌ వచ్చి నీ భుజంపై చెయ్యేసి
నాలుగు మొసలి కన్నీటి బొట్లను విసిరితే
దగ్గరకు రానిచ్చి
నీ స్వచ్ఛమైన బాధను కలుషితం చేసుకోకు.

దే ఆర్ సోల్డ్ అవుట్...
పాలన కోసం పక్కనపెట్టు
పాలసీ మేకింగ్ ఈజ్ క్రిపిల్డ్.

ఇకపై నోటుకు ఎన్ని ఓట్లు పడ్డాయో
రేష్యో చెప్పాలి
క్రికెట్ బెట్టింగ్ జోరున్న దేశంలో
ఇంతకన్నా ఎట్లా చెప్పను?

No. of visitors : 571
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆలోచించడం నేరం..

సు.దే.చె | 02.01.2017 11:22:05pm

ఈ దేశంలో నడిచేటప్పుడు జాగ్రత్త నీవు నడిచిన త్రోవను తరుముకుంటూ వస్తారు నీ మేధస్సును తూనిక వేస్తారు...
...ఇంకా చదవండి

ఎలియాస్

సురేంద్ర | 04.02.2017 02:44:42am

ఒకానొక రోజు రేడియోలో ʹఉపగ్రహాలు నల్లమల అడవిలో ఖనిజాల సంపత్తిని తెలియపరిచాయి. వాటిని వెలికితీయడం కొరకు ప్రభుత్వం అధ్యాయన కమిటీని నియమించడం జరిగింది ʹ అంటూ .....
...ఇంకా చదవండి

నాలో నేనే తొంగిచూస్తే

సు.దే.చె | 05.04.2017 11:58:04pm

అప్పుడప్పుడు నాలో నేనే తొంగిచూస్తే గుండె లోగిలిలో మనస్సు పూతోట యోగక్షేమమును అడిగి తెలుసుకుంటుంటాను...
...ఇంకా చదవండి

ఆది-అంతం

సు.దే.చె | 18.01.2017 11:01:43pm

తుమ్మెద పుప్పొడి సేకరణకు సెలవు ప్రకటించింది. అడివంటే పచ్చని సోయగమే కాదు అందులోనే నిరంతరాయంగా దోపిడీ వ్యవస్థకు ఫ్రిక్షన్ పుట్టుకొస్తుంది...
...ఇంకా చదవండి

రక్తం గోడపై...

సు.దే.చె | 18.03.2017 12:32:21pm

ఊసల వెనుక,గాఢమైన చీకటి గదిలో థర్డ్ డిగ్రీ లయబద్ధమైన చిత్రహింసలకు రక్తం గోడపై అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ గుర్తులు. సమసమాజ నిర్మాణం కొరకు సమస్తమూ వీడి అడవి బాట ప...
...ఇంకా చదవండి

సూధ్రుడెవడు?

సు.దే.చె | 04.05.2017 11:05:13am

వాడు వాడే సూధ్రుడిని అతిసూధ్రునిగా విభజించిన వాడే కదా.....
...ఇంకా చదవండి

చెరగనివి నీడలు మాత్రమే...

సు.దే.చె | 05.12.2017 11:49:32pm

నీడలు నల్ల రంగునే పూసుకుని మన మధ్య తిరుగాడడం ఎప్పటి మాటో! నీడలు వెలుగున్నప్పుడే పుడతాయని ʹఅంధకారంలో షాడో డైస్ʹ అని చెప్పినవాడు ఎటుపోయాడో? బహుశా కాకమీదున.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....
  జి.యన్. సాయిబాబా, వరవరరావుల విడుదలను కోరుతూ ప్ర‌పంచ‌ మేధావుల విజ్ఞప్తి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •