రెక్కల గూడు

| సాహిత్యం | క‌విత్వం

రెక్కల గూడు

- అరసవిల్లికృష్ణ | 19.05.2018 08:44:01am

ఖాళీ ఆకాశం నుండి వాలిన పావురం
తన భాషను మరిచింది
మబ్బుల చాటున పిట్టలా వొదిగిన పావురం
నీడల్ని చూచి భయపడుతున్నది
ఎవరు పలకరించినా
మృదువుగా చేయి వేసినా
ఏది గుర్తుకు రాని
చలన రహిత రెక్కల జీవితం
దిగులు నిండిన సాయంకాల చీకటి లో
వెలుగుకై ఆరాట పడిన గొంతుక
రహదారిపై విరిసిన గరికపూల
నిర్జనశరీరం కోసం
ఎదురు చూచిందో
అందర్నీ వదిలి
రెక్కల్ని తోడు తీస్కొని
అనేక పావురాల మూగ సభాంషల్ని వదిలి
చెట్టు నీడకై తపించి వుంటుంది
ఎగిరినంత మేర
ధాన్యపు గింజలను వెతికింది
ఎర్రని సూర్యోదయం లో
ఒకనాటి పావురం ఎదురవుతుందని
సమస్తాన్ని గాలించింది-
వెతుకులాట లో ఆకల్ని మరిచింది
ఆకాశం అదృశ్యమయినాక
నేలపై రెక్కలను ఆనించింది
నీడల్ని వెతికింది
భయం నుండి తేరుకొని
గర్భాశయం నుండి జారిన
శిశువులను వెతికింది
ఆకాశం సాక్షి గా
గుంపు లో తప్పి పోయిన పావురం
జాడల్ని వెతుకు తుంది
చిత్రకారుని ఆకాశం మాయమయినాక
నిశ్శబ్ధ నిశీధి లో
కీచుగొంతుక కలవరం లో
పావురం కన్నీటి ధారలో
కనబడు తున్నాడా మానవీ- మానవులు
కిరణాల వేడి తగ్గాక
మనుషులు నడిచి వస్తున్నారా పావురం దగ్గరికి
నడి రోడ్డు పై నలిగిన బంతి పూల మొక్కలా-
పావురం వెతుకులాట పూర్తి కాలేదని
ఆకాశం నిండా పరుచుకున్న వెన్నెల లో
తెగిన పాదాల చప్పుడు లో

ఏమయినావు పావురాయి
నీడల్ని- జాడల్ని మరిచిన మనుషులు కి
తూర్పు దిక్కున ఎర్రని కాగడా వుందని
నీ కళ్ళతో చెప్పలేక పోయావా-
పొలికేక వినబడుతుందని
పావురాలు సముద్రమయినాయని
పెనుకేక లా ఎగురుతున్నవని-
నివురు గప్పిన నిప్పు నుండి
ఎర్రమందారం పాట పాడుతుంది
గాయకుడు శరీరాన్ని వదిలి
గానం లా నిలబడ్డాడు
చలి మంచులో
వేణువు బధ్ధలయినాక
పినలగర్ర నుండి
రాగం వుబికి వస్తున్నప్పుడు
పావురం నెత్తిపై మొలిచిన ఆయుధాన్ని
గాయకుడు సానబెడుతున్నాడు
ఇంతసేపు
పావురం గురించి
మాట్లాడాను అనుకున్నారు కదా
ఆదివాసీ గొంతులో స్రవిస్తున్న
ఆయుధ గానం గురించి చెప్ప బోయి
ఏభై ఏళ్ళ వసంతం వెలుగుల మధ్య
పావురం గురించి మాట్లాడాను

No. of visitors : 898
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఒకరు వెనుక ఒకరు

అరసవిల్లి కృష్ణ | 18.02.2020 03:12:45pm

నాదగ్గర నాదేశ మూలవాసుల దగ్గర ఏ ధృవీకరణ పత్రం లేదు...
...ఇంకా చదవండి

రంగుల రాట్నం హఠాత్తుగా ఆగితే..

అరసవిల్లి కృష్ణ | 01.05.2020 12:27:46am

మార్చి 20న భారత ప్రధాని నరేంద్ర మోది మార్చి 22 ఆదివారం జనతా కర్ప్యూ అని ప్రకటించాడు. రేపటి తమ ఉపాధి ఏమిటి అనే ఆలోచించుకునే ప్రజలు సోమవారం తమ పనులకు ఆటంకం.....
...ఇంకా చదవండి

మనకు తెలియని మేరువు

అరసవిల్లి కృష్ణ | 02.06.2020 10:36:37pm

మేరువు నవల మనకు తెలియని స్త్రీల చరిత్రకు సంబంధించినది. అనేక ముద్రల మధ్య విలువలను స్త్రీలు మాత్రమే కాపాడాలి....
...ఇంకా చదవండి

అసమానత నుండి విప్లవం దాకా..

అరసవిల్లి కృష్ణ | 16.07.2020 11:41:15pm

కవిగా కాశీంను అంచనా వేయడానికి వాచకాన్ని చదవడం, కవిని దూరంగా వుండి గమనించడం మాత్రమే సరిపోదు. కవిని దగ్గరగా చూడాలి. కవి హృదయంలోకి దారి చేసుకొని వెళ్ళగలగాలి....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద్ కు నివాళి
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •