ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

| సంపాద‌కీయం

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

- వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

సరిగ్గా ఏడాది క్రితం ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఆంధ్రజ్యోతి దినపత్రికకు ఒక వ్యాసం రాశారు. హిందుత్వవాదులు ఆ వ్యాసం రాసినందుకు ఆయన మీద, దానిని అచ్చువేసినందుకు సంపాదకుడి మీద, ప్రచురణకర్త మీద కేసు పెట్టారు. బ్రాహ్మణధర్మం పట్ల ఆయన వ్యక్తపరుస్తున్న భావాల మీద చర్చ చేయాలని వాళ్ళు అనుకోలేదు. ఆయనను దూశిస్తూ, బెదిరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పరమ అప్రజాస్వామిక రాతలు రాస్తున్నారు. ఇటీవల విజయవాడలో సి.ఐ.టి.యు ఏర్పాటు చేసిన సభలో ఆయన చేసిన చేసిన ప్రసంగం వివాదాస్పదం చేశాక బ్రాహ్మణ సంఘాలు ఆయన మీద ఏకంగా దాడి వంటి ఆందోళనకు దిగాయి. ఆయనకు బెదిరింపు ఫోన్లు కూడా వస్తున్నాయి. ధబోల్కర్, పన్సారే, కలబుర్గి వంటి ఆలోచనాపరుల హత్యలు, దేశవ్యాప్తంగా ప్రగతిశీల భావాలపై జరుగుతున్న దాడుల నుండి దీనిని వేరుగా చూడలేము.

మత సెంటిమెంట్ల పేరు మీద గత కొంత కాలంగా భావాలను, ఆలోచనల్ని నేరమయం చేసే కుట్ర జరుగుతున్నది. నీ రాతలు, నీ మాటలు, నీ ఆలోచనలు మా సెంటిమెంట్లను గాయపరుస్తున్నాయి అని చెప్పి నీ మీద భౌతిక దాడి చేయగల వాతావరణాన్ని సృష్టించడమే కాదు, హిందూ అతివాదశక్తులు దానికి సమ్మతిని కూడగడుతున్నారు. హిందుత్వవాదులు ఏమైనా మాట్లాడొచ్చు. కర్రలు, కత్తులు, తుపాకులు ప్రదర్శించి వాళ్ళకు గిట్టని సమూహాలను ఏకంగా నిర్మూలిస్తామని కూడా అనవచ్చు. అదేమీ కేసు నమోదు చేయగలిగే నేరం కాదు. కానీ భిన్నాభిప్రాయం ప్రకటించి వాళ్ళ ʹసున్నితమైనʹ మనోభావాల్ని ఎవరైనా గాయపరిస్తే అది నేరమవుతుంది. అధికారికంగా కాకపోతే అనధికారికంగా వారిని శిక్షించొచ్చు. హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో ఆలోచనల మీద, భిన్న సంస్కృతుల మీద, విశ్వాసాల మీద అనధికార పోలీసింగ్, ప్రైవేటు గ్యాంగుల దౌర్జన్యాలు కేంద్రంలో బి.జె.పి అధికారంలోకి వచ్చాక విపరీతంగా పెరిగిపోయాయి. మూక సంస్కృతిని రెచ్చగొట్టి సంఘపరివార్ దాని అంగబలాన్ని పెంచుకునే పనిలో ఉంది. దీని మీద రచయితలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, శాస్త్రవేత్తలు పలు రూపాల్లో నిరసన వ్యక్తం చేసినా కనీసం వినగలిగే స్థితిలో కూడా ప్రభుత్వం లేదు. కాబట్టి ఈ జరుగుతున్న సంఘటనల్లో ప్రభుత్వ కుట్రపూరిత భాగస్వామ్యం ఉందని చెప్పక తప్పదు. ఆటాగే రాష్ట్ర ప్రభుత్వాల నిశ్శబ్ద ఆమోదం కూడా ఉందని చెప్పాలి.

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా, సంఘపరివార్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రగతిశీల ప్రజాస్వామికవాడులందరూ ఒక్కటి కావాలి. భావాల సంఘర్షణ ద్వారానే సమాజం వికసిస్తుంది. అది లేని నాడు వ్యక్తి, సమాజం ఆలోచనను కోల్పోయి గిడసబారిపోతుంది. స్వతంత్ర భావాలు తిరుగాడని చోట ప్రజలు క్రియారహితం అయిపోతారు. రాజ్యం దయాదాక్షిన్యాల మీద ఆధారపడి అణగారిపోతారు. సరిగ్గా రాజ్యం అదే కోరుకుంటుంది.

ప్రొ.కంచె ఐలయ్య గాని, మరెవరైనా గాని, వారి భావాలను అంగీకరించలేకపోతే రాత ద్వారా, మాట ద్వారా ఖండించవచ్చు. చర్చ చేయవచ్చు. ఇవేవీ కాకుండా తిట్లకు, బెదిరింపులకు, దౌర్జన్యాలకు దిగేవారి ఉద్దేశం సమాజంలో భిన్నాభిప్రాయాలను అణచివేసి నియంతృత్వాన్ని స్థాపించాలనుకోవడం. అది ఎన్నటికీ సాధ్యం కాదు. ఘనమైన భారత చరిత్ర అని సంఘపరివార్ ఏమైనా చెప్పొచ్చు గాక, ఈ నేల మీద చార్వాకులు, బుద్ధుడు మొదలు ఫూలే, పెరియార్, అంబేడ్కర్ దాకా ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక ఆలోచనాధార, ధికార సంస్కృతి కొనసాగుతున్నది. ఆ వారసత్వాన్ని మేము కొనసాగిస్తాము. కనుక మేము ప్రొ.కంచె ఐలయ్య పక్షాన, గాయపడుతూ నెత్తురోడుతున్న విశ్వాసాల పక్షాన, మావంటి రచయితలకు ప్రాణప్రదమైన భావ ప్రకటనా స్వేచ్చ పక్షాన నిలబడతాము.

వరలక్ష్మి, కార్యదర్శి, విప్లవ రచయితల సంఘం


No. of visitors : 1590
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి

ఉద్దేశం మంచిదే అంటున్నారు, ఏమిటా ఉద్దేశం?

పి.వరలక్ష్మి | 18.11.2016 10:43:33am

జనం డబ్బు మొత్తం బ్యాంకుల్లో పోగేసి ఏం చేయబోతున్నారు? పరిమితి విధించడం ద్వారా కొద్ది రోజులపాటు డబ్బు తీసుకోను కూడా వీలుకాని దిగ్బంధనం విధించి మరీ ఏం చేయబోతు...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్ శతజయంతి సదస్సు
  విరసం నాయకుడు జగన్‌పై అక్రమంగా పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలి
  అరుణతార అక్టోబర్ 2019
  మనమూ తేల్చుకోవాల్సిందే
  ఏవోబీ నెత్తురు చిందుతోంది
  అసహజ మరణాలు సమాజానికి హెచ్చరికలు అంటున్న కథ ʹ డోలిʹ
  ఎవరామె?
  స్వైర విహారం
  హిందూత్వసాంస్కృతిక దాడికి వ్యతిరేకంగా సాంస్కృతిక ప్రతిఘటనా దినాన్ని జరుపుకుందాం
  నీకు నేనంటే కోపమెందుకు ?
  రేయి బంగారు మధుపాత్రలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •