మాబిడ్డల్ని మానుంచి గుంజుకున్నరు

| సంభాషణ

మాబిడ్డల్ని మానుంచి గుంజుకున్నరు

- సుకన్య శాంత | 19.05.2018 09:39:48am


పోలీసులు విడుదల చేసిన ఎన్‌కౌంట‌ర్‌ లిస్టులో 16 ఏళ్ల బాలిక రాసు కూడా ఉందని చెబుతున్నారు. గట్టెపల్లి (మహరాష్ట్ర) పక్క ఊర్లో తమ బంధువుల ఇంట్లో ఏప్రిల్ 21నాడు పెండ్లి. ఆ పెండ్లికి సంబరంగా బయల్దేరిన పిల్లలు ఐదురోజులైనా ఇంటికి రాకపోయేసరికి పరేషాన్ అయ్యారు. అనుకోకుండా జరిగిన ఘటనతో మాత్రమే వాల్లకు పూర్తి వివరాలు తెలిశాయి.

అయ్యో, ఈమె మా రాసు యేనా..? కానీ ఆమె చెంపలు బాగా ఉబ్బిపోయాయే.. అయినా.. ఆ నుదురు.. విశాలమైన నుదురు, చిన్న కళ్లు, అంటూ తన మాడియా భాషలో వాపోతాడు బసు అంతారాం. అనుకోకుండా అతను సోమనాగోటి(లాయర్) మొబైల్ ఫోన్ లోకి తొంగి చూసినప్పుడు ఆ అమ్మాయి శవాన్ని జూసి అన్న మాటలివి.

ఏప్రిల్ 27నాడు అంతారాం ఎన్‌కౌంట‌ర్ మృతులలో రాసును జూసి, షాక్ తో అందరికీ వార్తను షేర్ చేస్తాడు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 16 మంది నక్సల్స్ చనిపోయినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అందులో రాసు ఫోటో కూడా ఉంది.

రాసు అక్కలు నాంజీ(20) జానో (18) ఈ వార్తను ఎంత మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. మరో వైపు ఎన్‌కౌంట‌ర్ మృతుల‌ వివరాలు కనీసం కూడా పోలీసులు చెప్పక పోవడాన్ని గ్రామస్తులు నిరసిస్తున్నారు.

అంతా భయపడ్డట్టే జరిగిపోయింది


ఇంద్రావతినది ఒడ్డున ఏప్రిల్ 22 నాడు జరిగిన ఎన్కౌంటర్ మ్రుతుల్లో రాసు నంబర్ ఐదుగా రాశారు. ఆమెను గుర్తు తెలియని నక్సలైట్ గా ముద్ర వేశారు. ముఖంబాగా ఉబ్బిపోయింది. ముఖం మీద లోతైన గాట్లు ఉన్నాయి. ఎడమ కన్ను బాగా ఉబ్బిపోయింది. శరీరాన్ని ఛిద్రం జేసినట్టున్నారు. కానీ పిల్లను చిన్నప్పటి నుంచి చూసిఉండటం వల్ల ఆ విశాల మైన నుదురు, చిన్న కళ్లను ఇట్టే గుర్తుపట్టగలిగారు.

గ్రామస్తులునాగోటి మొబైల్ లో తమ పిల్లల కోసం ఆత్రుతగా వెదికారు. వాళ్లలో తమ పిల్లాడు సావి(10) అతని నంబర్10 ఉన్నాడేమో అని చర్చించుకున్నారు. కానీ, వాళ్ళేమీ చెప్పలేక పోతున్నారు. విపరీతంగా కొట్టినట్టు ఉన్నారు. ముఖం బాగా వాచిపోయింది. కొన్నిలక్షణాలు నా కొడుకు మాసే ను పోలి ఉన్నాయ్. కానీ ఏమీ చెప్పలేం అంటాడు ఆదివాసీ అంతోరాం.

విషాదమేమంటే, ఇప్పటి దాకా తమ పిల్లల గురించి ఖచ్చితమైన సమాచారమేదీ తెలియరాలేదు. తాము గడ్చిరోలీలో తప్పిపోయిన పిల్లల గురించి ఫిర్యాదు చేస్తే. సీ 60 కమాండోలు (వీళ్ళే ఎన్కౌంటర్ లో పాల్గొన్నది) తమ ఊరికి వచ్చి వెళ్లారేగానే ఇంకే విషయం తెల్సి రాలేదు.

ఎన్‌కౌంట‌ర్‌


గట్టేపల్లి గ్రామం, నాగపూర్ కు 310 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.గడ్చిరోలీలోని అందరు ఆదివాసీల్లాగే, ఆగ్రామంలో గల 35 కుటుంబాలు తూనికాకు సేకరణ, అడవి ఉత్పత్తుల మీద ఆధారపడి బతుకుతారు. ఆ ఉరిని చేరాలంటే గతుకుల మట్టిరోడ్డే ఆధారం. అప్పుడప్పుడు చుక్కతెగిపడ్డట్టు, వొచ్చిపోయే ప్రభుత్వ ప్రైవేటు వాహనాల్లో ఆదివాసీలు 66కిలోమీటర్ల దూరాన గల ఎట్‌పల్లి పట్టణానికి పోయి వస్తుంటారు. రాత్రి పూట రెండుగంటలకు పైగా మట్టి రోడ్డు మీద (వెన్ను విరిగే) బైకు ప్రయాణం ఛాలెంజ్ తో కూడుకున్నదే. బస్ సౌకర్యం సరిగా లేనందువల్ల గ్రామస్తులు అతి తక్కువగా పట్నం పోయి వస్తుంటారు. కొద్ది మందికి మాత్రమే బైక్ లు ఉంటాయి. వాటిని అందరూ ఉదారంగా వాడుకుంటుంటారు.

ఏప్రిల్ 21 నాడు, రాసుతో బాటు మరో ఏడుగురు(అందరూ 21ఏళ్ల లోపు వాళ్లే) 15కిలో మీటర్ల దూరాన కాసమార్ గ్రామానికి పెండ్లికని బయల్దేరారు. అక్కడి గ్రామాలలో ఆదివాసీల ఇంట పెండ్లి అంటే గొప్ప సందడిగా ఉంటుంది. పెండ్లికి మూడు రోజుల ముందే ఆహ్వానం లేనివాళ్లు సైతం అక్కడికి చేరుకుంటారంటాడు గోటి(ఈయన కూడా మాడియా జాతివాడే) పెండ్లి వారు కూడా ఆహుతుల్ని ఆనాహుతల్ని సొంత చుట్టాల్లాగే చూసుకుంటారు. ఆదివాసీలు కష్టసుఖాలు సమిష్టిగా పంచుకుంటారు.

అసలు రాసు వాళ్లు తమ ఊరికే రాలేదంటున్నారు కాసమారు (పెండ్లి జరిగే ఊరు) గ్రామస్తులు. వాళ్లు బయలుదేరాక మార్గమధ్యలో అన్నలన్నా తమక్యాంపునకు పిల్చి ఉండాలే.. లేదా పోలీసులన్నా పట్టుకెళ్లి కాల్చి చంపేసి ఉండాలె.. అంటాడు నాగోటి.. ఆయన గడ్చిరోలీ జిల్లా పరిషత్ మెంబరు.

సరిగ్గా ఆసమయంలో సీ60 కమాండోలు(మహారాష్ట్ర నక్సల్స్ వ్యతిరేక కమాండోలు) విజయవంతంగా ఆంబుష్ చేసి నలబై మంది నక్సల్స్ ని మట్టుబెట్టగలిగామని వార్త వొచ్చేసింది. నక్సల్స్ సమావేశం గురించి తమకు రెండు రోజుల ముందే పక్కా సమాచారం ఉందని పోలీసులు చెబుతున్నారు.

ఏప్రిల్ 22 నాడు కాసనూర్ చుట్టూ గల అడవీ ప్రాంతాన నక్సల్స్ విడిది చేసిన (కొద్దిగంటల కోసం) ప్రాంతాన్ని చుట్టుముట్టి కాల్పులు జరుపగా, అక్కడికక్కడే 36 మంది చనిపోయారని పోలీసులు చెబుతున్నారు. మరుసటి రోజు ఆరుమంది శవాల్ని కనుగొన్నారట ఈ రెండు ఎన్కౌంటర్లు, ఈ మధ్య కాలంలో మేం సాధించిన అతి పెద్ద విజయాలు అంటాడు వి విజయ్ కుమార్ (సెక్యూరిటీ అడ్వైజర్) దీన్ని ది హిందూ పేపర్ కూడా రిపోర్టు చేసింది.


సుదీర్ఘ నిరీనిరీక్షణ


అసలు ఎన్కౌంటర్ల గురించి తమకేమీ తెలీదంటారు గ్రామస్తులు. ఏప్రిల్ 22 నాడు తమ పిల్లలు తిరిగి రాకపోయేసరికి ఆదుర్దాలో 140 కిలో మీటర్లు ప్రాయాణించి గడ్చిరోలీలో ఫిర్యాదు చేశారు. అప్పటికీ ఏవివరాలు తెలీయరాలేదు.

వాళ్లు ది వైర్ విలేకరి (సుకన్య శాంత) తో మాట్లాడుతూ చాలా ప్రశ్నలు లేవనెత్తారు. మేమ ఏప్రిల్ 24 నాడు పోలీసుల్ని కలిస్తే.. మాకు ఈ వివరాలు ఎందుకు చెప్పలేదు? అంటూ ప్రశ్నించాడో ఆదివాసీ.

మమ్మల్ని డీఎన్ఏ పరీక్ష కోసం గడ్చిరోలీకి పిలిపించారు. పోలీసులు కనీసం మాకు ఫోటోలు లిస్టు వివరాలైనా చెప్పి ఉంటే, ఇప్పటికే మా పిల్లల అంత్యక్రియలన్నా జరుపుకునే వాళ్లం. ఇది చాలా క్రూరమైన విషయం అంటూ మరో ఆదివాసీ ప్రశ్నిస్తాడు. ఇన్ని హత్యలు జరిగిన తర్వాత కూడా తమ పిల్లల గురించి మాటమాత్రం గానైనా చెప్పక పోవడం ఆదివాసీల్ని షాక్ కు గురిచేసింది.

ఏప్రిల్ 24 నాడు, గ్రామస్తులు వెళ్లి తమ పిల్లలు కనబడకుండా పోయారని గడ్చిరోలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏమీ తెలియనట్టుగా నటించి, అన్ని వివరాలు రాసుకొని, మరుసటి రోజు రమ్మని ఒక క్రూరమైన ఆట ఆడారు. అప్పటికే మీడియాలో వార్త వచ్చేసింది.

ఎంత దుర్మార్గం? మాకు లిస్టు చూయించే బదులు, మమ్మల్ని మార్యురీకి తీసుకెళ్లి శవాల్ని గుర్తించమన్నారు. ఏం గుర్తించగలం? ఏమున్నది గుర్తించడానికి? శవాలన్నీ దళసరి పాలిధీన్ కవర్లలో చుట్టబడి ఉన్నాయి. ముఖం మాత్రమే కనబడుతోంది. అంటాడు బిజ్జు చుండు మావి(29). మార్చురీ గదిలో ద్రుశ్యం దారుణంగా ఉంది. ముఖాలు పూర్తిగా కుళ్లిపోయి, గుర్తు పట్టరాకుండా ఉన్నాయ్ అంటూ వాపోయాడాయన. ఇప్పుడు తమ డీఎన్ఏ పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.

బిజ్జు కొడుకు మంగేష్ (16) కూడా పెండ్లికి పోయిన బ్రుందంలో ఉన్నాడు. అతను ఎట్టపల్లిలోని భగవంత్ రావు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో 11వ తరగతి చదువుతున్నాడు. సెలవుల కోసం, కొద్ది రోజుల క్రితమే గట్టేపల్లికి వొచ్చి ఉన్నాడు. మా బాబు 10వ తరగతి పాసైన వెంటనే.. పెద్ద చదువుల కోసం ఎట్టపల్లికి పంపాం.. అంటాడు బిజ్జూ మా వోడు చక్కగా చదువుతున్నాడు. అని వెంటనే సవరించుకొని మావోడు చక్కగా చదువుతుండె అని అంటాడు.

ది వైర్ విలేకరి గట్టెపల్లిని సందర్శించిన మరుసటి రోజు జిల్లా ఎస్పీ (అభినవ్ దేశ్ ముఖ్) మాట్టాడుతూ.. గట్టెపల్లి గ్రామస్తులు ఒక శవాన్ని గుర్తించారని అన్నాడు. తక్కిన శవాల్ని డీఎన్ఏ పరీక్షల వివరాలు వచ్చాక అప్పగిస్తామని సెలవిచ్చాడు.

మీడియా ప్రహసనం


మరో వైపు స్థానిక పేపర్లు, జాతీయ పేపర్లు ఈ సంఘటనను రకరకాలుగా వ్యాఖ్యానించాయి. వాళ్లు సేకరించిన సమాచారం అంతా ఏకపక్షమే. వాళ్లు పోలీసులు చెప్పిందే రాశారు గానీ.. కనీసం గ్రామస్తుల్ని అడగాలనే సోయిలేకుండా పోయింది. హెలీకాఫ్టర్ లలో పోలీసుల వెంబడి పోయి వచ్చి.. చూసి.. ఫోటోలు తీసి హంగామా స్రుష్టించి తిరిగి పోలీసుల్తోనే వెళ్లిపోయారు. క్షేత్ర పర్యటన ముగిసిందన్నమాట.
అయితే మొదటగా ఈ ఎనిమిది మంది పిల్లల్ని కరుడు గట్టిన నక్సల్స్ గానే పేర్కొన్నారు. గ్రామస్తులు గడ్చి రోలీలో ఫిర్యాదు చేశాక కాస్త వివరాలు సేకరించి.. వీళ్లంతా కొత్తగా రిక్రూట్ అయిన వాళ్లు అని తమ కమాండర్ ను కలవడానికి వచ్చారని రాశారు

సాయినాథ్ అలియాస్ ధోలేష్ మాది ఆత్రం (32) పెరిమ‌లి ద‌ళ‌క‌మాండ‌ర్ అని పోలీసులు చెబుతున్నారు. అత‌ను గ‌ట్టేప‌ల్లి గ్రామ‌స్థుడు కావ‌డంతో క‌థ‌ల‌ల్ల‌డానికి పోలీసుల‌కు, ప‌త్రిక‌ల‌కు క‌లిసొచ్చింది. మీడియా మాత్రం నిస్సిగుగా, పోలీసులు చెప్పిందే రాసిపెట్టి త‌మ భ‌క్తిని చాటుకుంది.

ఎవ‌రైనా ద‌ళాల్లో క‌లుస్తారంటే, త‌మ‌కు ముందుగా విష‌యం తెల్సిపోతుంద‌ని గ్రామ‌స్థులు చెప్పారు. 10 - 15 సంవ‌త్స‌రాల క్రింద‌ట సాయినాథ్ పార్టీలోచేరుతున్నార‌ని, తిరిగి గ్రామానికి రాడ‌ని మాకు అర్థ‌మైంది. ఒక వేళ మా పిల్ల‌లే గ‌నుక పార్టీలో చేరాల‌నుకుంటే, ఇలా గుంపుగా పోయే సాహ‌సం మాత్రం ఎప్పుడూ చేయ‌ర‌ని ఓ పెద్దాయ‌న చెప్పుకొచ్చారు. కాగా 2004లో ద‌ళంలో చేరిన సాయినాథ్ మీద ప‌లు కేసులున్నాయ‌ని, అత‌నిపై 16 ల‌క్షల రివార్డు ఉంద‌ని పోలీసులు చెబుతున్నారు.

త‌మ పిల్ల‌ల చేతుల్లో చిన్న చిన్న బ్యాగులున్నాయ‌నీ, అందులో అలంకార సామ‌గ్రి త‌ప్ప మ‌రేమీ లేద‌ని గ్రామ‌స్థులు చెప్పారు. వీళ్ల‌కు పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవ‌ని, ఎప్పుడూ ద‌ళాన్ని క‌ల‌వ‌లేద‌ని తెలిపారు.

గుర్తింపు కార్డులు


సాధార‌ణంగా ఆదివాసీలు త‌మ గుర్తింపు కోసం ఆధార్ కార్డు, ఓట‌రు కార్డు వంటివి చాలా భ‌ద్రంగా దాచుకుంటారు. పెండ్లికి వెళ్లిన పిల్ల‌లు మైన‌ర్లు కాబ‌ట్టి, వాళ్ల‌కు ఆధారం ఆధార్ కార్డులే. మంగేష్ కాలేజీలో చ‌దువుతున్నందున అత‌డికి కాలేజీ ఐడీ కార్డు ఉంది. అయితే, పోలీసులు వ‌చ్చి త‌మ ద‌గ్గ‌రున్న ఆధార్ కార్డుల‌ను (ప‌రిశీల‌న కోస‌మ‌ని) ఎత్తుకెళ్ల‌డంతో, ఆదివాసీల‌లో అనుమానం మొద‌లైంది. పోలీసులు చెప్పిన‌దాన్ని కాద‌న‌డానికి ఇప్పుడు మా ద‌గ్గ‌ర ఏ ఆధార‌మూ లేదు అని గ్రామ‌స్థులు అంటున్నారు.

కాగా, సాయినాథ్ ఎప్పుడూ స్థానిక పిల్ల‌ల‌తో ట‌చ్‌లో ఉండేవాడ‌ని, జిల్లా ఎస్‌పీ అంటున్నారు. అత‌ను ఊరికి వ‌చ్చి వెళ్తుంటాడ‌ని , ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన చోటుకి సాయినాథే పిల్ల‌ల్ని తీసుకెళ్లి ఉంటాడ‌ని ఎస్‌పీ అంటున్నాడు.

స‌భ్య స‌మాజం నిర్ఘాంత పోయేలా చేసిన ఈ హ‌త్య‌ల మీద ఒక స్వ‌తంత్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని, నాగోటి తో పాటు గ్రామ‌స్థులు కోరుతున్నారు. వాళ్లు ఉద్య‌మంలో పాల్గొన్నారో, లేదో గాని, మా పిల్ల‌ల్ని ఇట్లా చంప‌డం క్ష‌మించ‌రానికిది. వాళ్లు మా నుంచి ఒక మొత్తం త‌రాన్నే గుంజేసుకున్నారు. ఏక స‌భ్య విచార‌ణ ద్వారా మాత్ర‌మే మా కుటుంబాల‌కు న్యాయం చేకూరుతుంది అంటున్నారు గ్రామ‌స్థులు

అడ‌వి గ‌ర్భాన‌, విసిరేసిన‌ట్టుగా ఉండే గ‌ట్టేప‌ల్లిలో ఆదివాసీలు త‌మ పిల్ల‌ల‌ను పోగొట్టుకొని, పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. అధికారుల నిర్ల‌క్ష్యం స‌రేస‌రి. కాని, పోలీసుల‌తో పాటు మీడియా కూడా త‌మ పిల్ల‌ల్ని న‌క్స‌ల్స్ గా ముద్ర వేయ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు.

అనువాదం : ఉద‌య‌మిత్ర‌
ది వైర్ సౌజ‌న్యంతో...

No. of visitors : 684
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


భావోద్వేగాలు

ఉద‌య‌మిత్ర‌ | 04.03.2017 09:42:24am

శాంతి అంటూ ఒకటుంటదా ఉంటది కాకపోతే వాళ్ళకు యుద్ధం తర్వాత శాంతి...
...ఇంకా చదవండి

ముఖద్వారం

ఉదయమిత్ర | 04.02.2017 12:56:50am

అడివిప్పుడి పెనుగాయం రాయని రాయకూడని గాయం లోలోపలసుళ్ళుతిరిగి పేగులకోస్తున్నగాయం దాపులేనిపచ్చిగాయం...
...ఇంకా చదవండి

కవలలు

ఉద‌య‌మిత్ర‌ | 20.12.2016 11:35:38pm

పాలస్లీనా కాశ్మీర్ ! కాశ్మీర్ పాలస్తీనా ! ఒకతల్లికి పుట్టిన కవలల్ని స్వాతంత్ర్య మాత చరిత్ర ఊయలలొ ఊపుతున్నది...
...ఇంకా చదవండి

నా సోదరి; నా ఆత్మబంధువు

కవితా లంకేష్ | 18.10.2017 06:43:06pm

గౌరి మూగబోవడమా!! హాహా!! పెద్దజోకు!! ఆమె పొద్దుతిరుగుడు పూవులా పగిలి ఎటు తిరిగితె అటు విత్తనాలజల్లి స్థలకాలాల దాటి ఖండాంతరాల చేరింది......
...ఇంకా చదవండి

అల్లరి విద్యార్థులు

ఉద‌య‌మిత్ర‌ | 16.08.2018 01:17:15am

కార్ల్ మార్క్స్ .. ఎప్పుడూ అసహనంగా కదుల్తుంటాడు విరామమెరుగని కాలంమీద ధనికులపై విప్లవ సంతకం చేయమంటాడు మదర్ థెరెసా నాకొ అర్థంగానిప్రశ్న టైము దొర్కితెచాలు ప్ర...
...ఇంకా చదవండి

ఆ...ఏడురోజులు

ఉదయమిత్ర | 21.12.2018 02:10:52am

బూటుపాదంకింద నలిగిన అక్షరం ఆర్తనాదమై చెంపమీద ఫెడేల్మని కొట్టినట్టుంటది......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •