అమ్మ ఒక పని మనిషా?

| సాహిత్యం | క‌విత్వం

అమ్మ ఒక పని మనిషా?

- గీతాంజలి | 19.05.2018 03:54:37pm


నువ్వూ చెల్లీ నాన్న
మీరు ముగ్గురే నాకు!
అయినా కొండంత భార మయ్యారేమి నాకు?
నా పీజీ పట్టాను ట్రంకు పెట్టెకు నైవేద్యం ఇచ్చి
బేబీ కేర్ సెంటర్లకు నీ పసితనాన్ని నుసి చెయ్యలేక
నన్ను నేను బలి ఇచ్చుకున్నందు కేనా ?
ఆరేళ్ల చిన్న తల్లివి.. నువ్వూ నా మీదే అరుస్తావూ !
నాన్న లా హుకుంలు జారీ చేస్తావు!
అవునులే ... నీకెప్పుడూ నేను
వంటింట్లో మండే పోయ్యిలా
సింకులో అంట్ల గిన్నె లా
మాసిపోయిన నాన్న లుంగీలా
నువ్వొదిలిన యూనిఫాం లా కని పిస్తాను!

నేనేమో... వెయ్యి చేతులతో
చెల్లి ముడ్డి కడుగుతూ
నువ్వు విడిచిన షూస్ తీస్తూ
ఇంటి కసుపూడుస్తూ
చేత్తో చీపురు తోనో.. ఆంట్ల పీచుతోనో.. పప్పు గరిటతోనో..
పట్టించుకోని నాన్న మీద సహాయం చేయమని అరుస్తూ
గయ్యాళి గా
మేధస్సుకు చేతులు చేసే పనులకు పొంతన కుదరక
డి ప్రెస్స్ అవుతూ కనిపిస్తే...
నాన్నే మో.. పని మనిషి పని చేస్తున్న నిశ్చింతతో...
ఈజీ చైర్ లో వేడి టీ తాగుతూ
ఒక మూడు భాషల్లోని పత్రికలు చదువుతూ
అవయ్యాక
వాట్సాప్ ఫేస్ బుక్ లో ప్రపంచాన్ని పలకరిస్తూ..
వర కట్న హత్యలనీ..
ఫ్యాక్టరీ లో - ఆఫీస్ లో శ్రమ దోపిడీ నీ ఖండిస్తూ..
నీ లెక్కల్లో కంప్యూటర్లో సందేహాలు తీరుస్తూ..
మన ఉా రిలో తాత పాలేరుతో వెట్టి చేయిస్తున్నట్లు..
తాను చేయాల్సిన పని కూడా నాతోనే
మెడలు వంచి చేయిస్తూ ఉన్నాగాని...
హుందాగా అద్భుతంగా
కోపమే లేని శాంత మూర్తిగా హీరో లా కనిపిస్తాడు.!

అవును మరి!
నీ ఎల్కేజీ పుస్తకాల్లో..
Father is head of the family...
Father earns money for the family..
Mother cooks the food for the family..
Mother keeps the house clean ..
Mother looks after the
Children !
అని చదువుతావు!
నీ చిన్ని అంతః చేతన మనస్సులో అమ్మ ఇంటి పని మనిషి
నాన్న... పెద్ద మనిషి అన్న ముద్ర
శాశ్వతంగా పడిపోతుంది!

చివరికి...
ఏడు నెలల చెల్లి కూడా.. అమ్మను వెతుక్కుంటూ
పాక్కుంటూ .. పాక్కుంటూ వంటింట్లో కే వస్తుంది!
నా చిట్టి తల్లీ..!
నేనూ .. నా ఆరేళ్ల వయసులో
నీ అమ్మమ్మ మీద మా నాన్నతో కలిసి నీలా పెత్తనం చేసిన దాన్నేరా!
మా నాన్నని హీరో లా చూసిన దాన్నే!
ఆఖరికి.. ఇప్పుడు మీ అమ్మమ్మ ప్రతిబింబం లాగా మారిన దాన్నే!

ఒరే నా ఆరేళ్ల చిట్టి తల్లీ!
నీకు రేపొచ్చే ఇరవై ఆరెళ్లకి..
నీవు కూడా అమ్మ అనే పని యంత్రంలా మారక ముందే..
నా స్థితి ఇంకా అధ్వాన్నం కాక ముందే..
నేనో నువ్వో..
ఇద్దరి లో ఎవరిమో..
మరి ఇద్దర మో..
నాన్నని ప్రశ్నించాలి!
నాన్న.. నాన్ననీ ప్రశ్నించాలి!
నాన్నా - తాతయ్యా కూర్చునే
ఆరాము కుర్చీలో ఇప్పటికైనా
అమ్మనీ - అమ్మమ్మనీ కూర్చో పెట్టాలి
అమ్మ ఒక పని మనిషి కాదు అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచి మరీ చెప్పాలి!
ఎర్ర జెండా ఊపి తీరాలి!!

No. of visitors : 530
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నేనొక అర‌ణ్య స్వ‌ప్నం

గీతాంజ‌లి | 16.08.2016 09:11:44am

నిదుర‌లోని స్వ‌ప్నాల్లో మెల‌కువ‌లోని సంభాష‌ణ‌ల్లో నాచూపుల‌కందే దృశ్యాల‌లో నా శ్వాస‌కు చేరే ప‌రిమ‌ళాల్లో ఒక్క నువ్వే అందుతావు ఎందుకు ?...
...ఇంకా చదవండి

క‌విత్వం రాయడానికి ఓ రోజు కావాలా?

గీతాంజలి | 22.03.2018 12:45:25am

ఎవరో కడలి అట ఎంత బాగా రాస్తుందో ప్రేమ గురించి ముఖ పుస్తకంలో ...!! ఇప్పుడిప్పుడే, దేహంలో- మనసులో వసంతాలు విచ్చుకుంటున్న అమ్మాయి! ఇక ఒక్క క్షణం కూడా నటించను...
...ఇంకా చదవండి

ఎవరు అశుద్ధులు

గీతాంజ‌లి | 04.10.2016 11:12:24pm

అమ్మ గ‌ర్భంలోని ప‌రిమళ స‌ర‌స్సులో మునిగి న‌న్ను నేను శుద్ధి చేసుకునే పుట్టాను పుట్టిన‌ప్ప‌ట్నించీ నిన్ను శుద్ధి చేస్తూనే వ‌చ్చాను...
...ఇంకా చదవండి

పడవలైపోదాం

గీతాంజ‌లి | 04.03.2017 09:28:58am

నది ధుఃఖాన్ని ఈడ్చుకెళ్తున్న పడవలను లేదా నదిని మోస్తున్న పడవలను ఎన్నడు తీరం చేరని తనాన్ని నదిని వీడలేని తనాన్ని నది మధ్యలొ నిలిచిపోయి నదుల సామూహిక...
...ఇంకా చదవండి

గోడ ఒక ఆయుధం

గీతాంజ‌లి | 04.04.2018 06:21:40pm

గోడ నువ్వు కత్తిరిస్తున్న నా రెక్కల చప్పుడు వినే శ్రోత!! నువ్వు నొక్కేస్తున్న నా నగారా పిలుపుని వెలివాడల నుంచీ అరణ్యాల దాకా ప్రతిధ్వనించే గుంపు ...
...ఇంకా చదవండి

నీడ ఒక అంతర్ మానవి !

గీతాంజలి | 03.08.2018 11:31:48am

పోనీ...నువ్వు ఎప్పుడైనా మృత వీరుడి స్తూపపు నీడ పడ్డ భూమి.. ఎఱ్ఱెరని విత్తనమై మొలకెత్తడం చూసావా?? రా... నీడలు చెప్పిన రహస్యాలను .. మనం చేయాల్సిన యుద్ధాలను.....
...ఇంకా చదవండి

వదిలి వెళ్లకు...!

గీతాంజలి | 21.12.2018 07:53:43pm

నన్ను నీళ్లు లేని సముద్రం లోకి.. సముద్రం లేని భూమి మీదకి. వదిలి వెళ్ళకు .. వదిలి వెళ్ళకు.. ఎలా ఉండాలి నీవు లేక... ఎలా చేరాలి నీ దాకా? నిన్ను చేరాలంటే.. ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
  అరుణతార జూన్ 2019
  మహాభారతం - చారిత్రక వాస్తవాలు
  జల వనరుల సాధనకు స్ఫూర్తి
  వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
  నల్లని పద్యం
  పేకమేడలు
  Democratized Poetry
  ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
  ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
  Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
  ఆచ‌ర‌ణే గీటురాయి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •