భారత దేశ చరిత్రలో పోలీసు బలగాలు ఒక పథకం ప్రకారం ఇంత మందిని చంపడం ఇదే ప్రథమం కావచ్చు. నిజానికి ఇప్పటికీ ఈ మారణకాండలో ఎంత మంది చనిపోయిందీ స్పష్టంగా తెలియడం లేదు. ప్రభుత్వం ఇలా తన ప్రజలపై మూకుమ్మడిగా దాడికి పాల్పడి హత్య చేయడం ప్రజాస్వామికవాదులను కలచి వేస్తోంది.
మధ్యభారత దేశంలోని ఆదివాసీ ప్రాంతాల్లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. గడ్చిరోలి మారణకాండ అందులో భాగమే. ఆదివాసుల నిర్మూలన, లేదా మావోయిస్టు ఉద్యమ నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఇది ఎన్కౌంటర్ కాదని, ఏకపక్ష దాడి అని దేశంలోని పౌర ప్రజాస్వామిక హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే మావోయిస్టుల నిర్మూలనకు ఛత్తీస్‌ఘడ్‌లో వైమానిక దాడులు (డ్రోన్లు, హెలికాఫ్టర్ కార్పెట్ బాంబింగ్‌లు) చేయబోతున్నామని ఈ మధ్య కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ ప్రకటించారు. మావోయిస్టు
ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ఇప్పటి దాకా చేపట్టిన అన్ని అభియాన్లను కేంద్ర ప్రభుత్వం ʹఆపరేషన్ సమాధాన్ - 2022ʹ కిందికి తీసుకువచ్చింది. దీని లక్ష్యం 2022 నాటికల్లా మావోయిస్టు ఉద్యమాన్ని అంతమొందించడం. తెలంగాణ ప్రభుత్వం కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో రక్షణ కారిడార్ పేరుతో ఆదివాసులపై డ్రోన్, హెలికాఫ్టర్ దాడులు చేస్తున్నది.
ఈ పరిస్థితి దేశమంతా మరింత తీవ్రమయ్యేలా కనిపించడం ఆందోళనాకరం. ఇంత మందిని చంపేశాక సమాజం నుంచి ఎలాంటి విమర్శ వస్తుందో అనే జంకు కూడా లేకుండా గడ్చిరోలి ఎస్పీ అవినాష్ దేశ్‌ముఖ్ ఒక టీవీ ఇంటర్యూలో మాట్లాడుతూ ʹచివరి మావోయిస్టును కూడా ఏరివేస్తాʹమని అన్నారు. ʹఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ యుద్ధాన్ని ఆపంʹ అని దాపరికం లేకుండా తేల్చేశారు.
ఇది ఈ దేశ ప్రజాస్వామ్య భవితవ్యానికి సంబంధించిన సమస్య. ప్రభుత్వం ఇంతగా సైనికీకరణ చెంది తన ప్రజలపైనే దాడులు చేయడం మానవ హక్కులకు, విలువలకు ప్రమాదకరం. గడ్చిరోలి ఎన్కౌంటర్ తర్వాత కూడా దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఆదివాసులను, విప్లవకారులను బూటకపు ఎన్కౌంటర్ల పేరిట చంపేస్తున్నారు. ఈ హత్యాకాండ తక్షణం నిలిపివేయాలని అందరూ నినదించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భారతదేశంలో ఆదివాసులపై జరుగుతున్న యుద్ధాన్ని నిలిపివేసేందుకు, ప్రజల జీవించే హక్కును కాపాడేందుకు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, ప్రజాస్వామిక సంస్థలు, ప్రజా సంఘాలు, ప్రగతిశీల శక్తులు, పౌరసమాజం జోక్యంచేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
sign the petition
Type in English and Press Space to Convert in Telugu |
దండకారణ్యంలో... నక్సల్బరీ 50 వసంతాల వేడుకలునక్సల్బరీ వారసులైన దండకారణ్య మావోయిస్టు విప్లవ కారులు జనతన సర్కార్ నేపథ్యంలో తమకు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్రజలకూ, ప్రపంచ..... |
విరసం సాహిత్య పాఠశాలరాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య... |
నోట్ల రద్దు ప్రగతి వ్యతిరేకమైనది : ప్రసాద్విరసం సాహిత్య పాఠశాల (11, 12 ఫిబ్రవరి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల రద్దుపై ఐఎఫ్టీయూ ప్రసాద్ ప్రసంగం... |
సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాంమానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్ విప్లవం. ఈ నవంబర్ 7 నుంచి రష్యన్ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ... |
సాయిబాబా అనారోగ్యం - బెయిల్ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూకేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్ పిటీషన్ వేయడంలో చాల రిస్క్ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల... |
నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమంనక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా....... |
ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండిఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ... |
లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్పాతనగరం పేద ముస్లింలకు బడేబాయి, సహచరులకు ఖాన్‌సాబ్.పౌరహక్కుల నేతగా, విప్లవ రచయితగా, అధ్యాపకుడిగా, పాత్రికేయుడిగా తెలుగు సమాజంలో తనదైన...... |
కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాంభౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స
... |
బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిపడదాం
చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్ విప్లవం..... |
Open letter to Krishna BandyopadhyayAs a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol.. |