ఓ రోజు నేను లండన్ హైగేట్ స్మశానవాటికలో ఉన్న కార్ల్ మార్క్స్ సమాధి ముందు నిలబడి అతడు పుట్టి రెండు శతాబ్దాలు అవుతున్నా, ఈ రోజు మనకోసం చెప్పేందుకు ఏదైనా ఉందా అని ఆశ్చర్యంతో చూస్తున్నా.. ʹప్రపంచ కార్మికులారా ఏకంకండిʹ అని సమాధిపైన రాసుంది. కానీ వారు ఏకం కాలేదు – పీడితుల సంఘీభావం, దేన్నైతే మార్క్స్ పెట్టుబడిదారి విధానాన్ని కూల్చేందుకు అవసరం అనుకున్నాడో, అది ఏ మూలనో ఉన్నది.
ʹబూర్జువాలు ఉత్పత్తి చేసేది, వారి గోతులు తీసేవారినేʹ అని మార్క్స్, ఎంగెల్స్ లు 170 ఏండ్ల కింద ʹకమ్యునిస్టు మానిఫెస్టోʹలో రాసిన మాటలు. ఈనాటి పెట్టుబడిదారి విధానం హద్దులు లేనిది. ఈ చారిత్రక వైచిత్ర సమయంలో దేన్నైతే తాత్వికుడు ఎంగెల్స్ ʹమోసపూరితమైన కారణంʹ అన్నాడో, ఆ పెట్టుబడిదారి విధానం తను మనుగడ సాగించడం కోసం, తన గోతులు తవ్వేవారిని (కార్మికవర్గాన్ని అని రచయిత ఉద్దేశం) సైతం తనలో కలిపేసుకుంది. ప్రపంచంలో అతిపెద్ద సోషలిస్టు సమాజం అయిన చైనా (పైకి కనిపిస్తున్నప్పటికీ) పెట్టుబడికి కావాల్సిన ముడిసరుకులను తక్కువ ఖర్చుతో ఎగుమతి చేస్తున్నది, అది ప్రపంచ దేశాల కార్మికులకు పనిలేకుండా చేస్తున్నది.
అయితే మార్క్స్ పని అయిపోయినట్టేనా? కానే కాదు. నాకైతే, కార్ల్ మార్క్స్ ఇప్పటికిఅనుసరణీయుడే. అయితే కేవలం అతడి దూరదృష్టి, అంచనా వల్ల కాదు, అతడి విశ్లేషణ ఇప్పటికి ప్రతిధ్వనిస్తున్నందు వల్ల. ఉదాహరణకి మార్క్స్, ఎంగెల్స్ లు ప్రపంచీకరణ ఎట్లా పని చేస్తుందో దూరదృష్టితో చూశారు. ʹకొత్త పరిశ్రమలు ఆక్రమిస్తున్నాయి.ʹʹఈ పరిశ్రమలు దేశీయమైన ముడి పదార్థాలతో సరుకులను ఉత్పత్తి చేయడం యిక మానివేసి, ఎక్కడో మారుమూలల్లో ఉన్న ప్రదేశాల నుండి ముడి పదార్థలను తెప్పించుకొని వస్తువులను ఉత్పత్తి చేయడంవల్ల వీటి ప్రవేశం నాగరిక జాతులన్నిటికి జీవన్మరణ సమస్యగా ఏర్పడింది.ʹఅందుకనే చైనా కార్మికులు మనం అస్తిత్వంలో ఉంటాయని ఊహించని వాటిని ఉత్పతి చేశారు, ఒంటరిగా వదిలేస్తే బహుశ మనం పొందే అపేక్ష, అదే మనల్ని రాజకీయంగా నిశ్చలుల్ని, సరిహద్దురేఖల సంఘ వ్యతిరేకుల్ని, నిద్రలో నడిచే నార్సిస్ట్ లను చేస్తుంది. అవును అదే నిజం. నేను మాట్లాడుతున్నది ఐ ఫోన్ ల గురించే.
నేను బతుకున్న ప్రపంచం గురించి ఏమి ఆలోచించకుండా మార్క్స్, ఎంగెల్స్ లు కమ్యునిస్ట్ ప్రణాళికలో విశ్లేషించిన మొదటి పేజీలు చదువుతున్నప్పుడు చాల కష్టంగా అనిపించింది. ʹఉత్పత్తి విధానాలలో నిరంతరం విప్లవం తేవడం, సమస్త సామాజిక స్థితులను ఎడతెగకుండా కలతపెట్టడం, నిత్యమైన అనిశ్చితత్వం, ఆందోళనలు కలిగిఉండడమే బూర్జువా శకాన్ని అంతకముందుండిన అన్నీ శకాలనుండీ ప్రత్యేకంగా ఉంచుతున్నాయి. ʹమనం సరిగ్గా మార్క్స్ ఎంగెల్స్ లు ఊహించిన అటువంటి ప్రపంచంలో నివాసిస్తున్నాం.నాకైతే ఈ మాటలు కేవలం ఉబర్, డెలివరూ (deliveroo) లాంటి మిగతా సంస్థలు విలువలు, ప్రమాణాలు పక్కనబెట్టి త్వరితగతిన డబ్బు సంపాధించడమే కాదు, పన్నుకట్టని షేర్ హోల్డర్స్ ను తృప్తీ ప్రరచేందుకు ఈ గ్రహం నిరంతరాయంగా ఎట్లా ద్వసం కాబడుతున్నది అని కూడా అనిపిస్తుంది.
సావ్ పౌలో అనే ఒక నగరాన్ని మార్క్సిస్ట్ ప్రొఫెసర్ డేవిడ్ హార్వే పరిశీలిస్తూ.. ఒక మనిషిని మరొక మనిషి నుండి వేరు చేస్తూ, ట్రాఫిక్ జామ్ లు, వీధుల్ని కాలుష్యం చేస్తున్న కార్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలపై ఆధారపడి ఆ నగర ఆర్థిక వ్యవస్థ ఉన్నది. బలంగా ఉన్న స్వేచ్ఛాయుత మార్కెట్ పెట్టుబడి ప్రజల నిజమైన అవసరాలకు వ్యతిరేకంగా ఉన్నది అన్నాడు.
మార్క్స్ ఫేస్ బుక్ ఆవిర్భావాన్ని ఊహించలేదు. కానీ మార్క్ జూకెర్బర్గ్ వ్యాపార విధాన మౌలిక సూత్రాలను కిందటి నెల కాంగ్రెస్ సమావేశంలో అమెరికన్ సెనేటర్లు గ్రహించిన దానికన్న ఎక్కువగానే గ్రహించాడు. ʹబూర్జువాలుʹ అని మార్క్స్ ఎంగెల్స్ లు చాలా అందంగా రాశారు.ʹబూర్జువా వర్గం మనిషికి మనిషికి మధ్య, కేవలం నగ్నంగా అగుపించే స్వార్థంనూ నీచమైన ʹనగదు చెల్లింపుʹనీ తప్ప ఏ విధమైన సంబంధాన్ని మిగల్చలేదు. ఈ బూర్జువా వర్గం స్వర్గ సంబధమైన మత పారవశ్యాని, ఔదార్య సాహోసోపేతమైన ఉత్సాహాన్ని, సంస్కృతి రహితమైన భావోద్రేక బలహీనతనూ డబ్బులెక్కకట్టడమనే మంచునీటిలో ముంచివేసింది.ʹ
ఒక్క ఫేస్ బుక్ యే కాదు. అమెజాన్, గూగుల్ కూడా మనుషులను దోపిడికి గురికాబడగలిగే ఆస్తులుగా తయారు చేశాయి. అది కూడా ఒక రకమైన తెలివే.
కార్ల్స్ మార్క్స్ ʹదాస్ కాపిటల్ʹలో 1867లోʹవస్తుపూజʹ మీద రాసిన మాటలు నేటికీ బాధతో అయినా వర్తించబడెవే అని భావిస్తున్నా. ఒక్క పదం ద్వారా సాధారణ కార్మికులు యేమీ ఉత్పత్తి చేస్తారో రాశాడు –ఐ పాడ్స్, కార్లూ, కొత్త పుస్తకాలు కూడా మార్క్స్ ద్విశత జయంతి సంధర్భంగా స్మరించుకుంటున్నాయి – అది పెట్టుబడిదారీ విధానంలో ఒక వింత. ఒక వస్తువుకు అతీంద్రియ శక్తులు ఆపాదించి దాన్ని నమ్మే వాళ్ళు పూజించినట్లుగానే, పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించి వస్తువుకు కొన్ని మతాలవలే మాంత్రిక శక్తులు ఆపాదించబడ్డాయి.
ఎప్పుడైతే ఐ ఫోన్ అనే వస్తువు మరొక వస్తువు మార్పిడికి (సహజంగా డబ్బు) మార్చబడిందో, ఆ మార్పిడి ఐ ఫోన్ తయారుచేస్తున్న కార్మికుడి/రాలి ఖాతాలోకి వెళ్ళదు. తక్కువ జీతాలకు పనిచేస్తున్న మనకు తెలియని ఎందరో కార్మికులు ఆ దుర్మార్గ పరిస్తితుల నుండి బయట పడేందుకు బలవన్మరణం గురించి ఆలోచిస్తున్నారు అనేది సత్యదూరమేమి కాదు. ʹకొనుగోలు చేయదగిన వస్తువు ఒక మార్మికమైన విషయం.ఎందుకంటే కార్మికుడి శ్రమ యొక్క సామాజిక పాత్రలో కార్మికుడి శ్రమవల్ల జరిగే ఉత్పత్తిని బాహ్యమైన విషయంగా ముద్రవేయడం వలన వారికిఅలా కనిపిస్తుంది.ʹ అని మార్క్స్ రాశాడు.
ʹహద్దులు లేకుండా పెరిగే వస్తు వ్యామోహ ప్రపంచంలో ఒక కొత్త మానవ సమూహాం పుట్టుకొస్తుందిʹ అంటాడు GyorgyLukacs. ఆ మనుషులు కొనడం, అమ్మడం అనే వారి సారం దాకా దిగజారిపోతారు. గత నెలలో జెడి స్పొర్ట్స్ తనకు 24% లాభాలు వచ్చాయని ప్రకటించినప్పుడు అది బ్రిటిష్ హై స్ట్రీట్ కి మంచి వార్త అయినా పెరుగుతున్న చెప్పుల వ్యామోహం వలన దిగజారుతున్న వ్యవస్థ అనిపించింది. ఎందుకో అది లూకాస్ వర్ణించినట్లే అనిపించింది. అట్లాంటి ప్రపంచం చాలా సులభంగా కూలిపోతుంది.
మార్క్స్ అన్నట్లు ʹఇప్పటిదాకా ప్రపంచాన్ని పలువురు పలు రకాలుగా వాఖ్యానించారు. చేయాల్సిందల్లా దాన్ని మార్చడమేʹ. అయితే ప్రపంచాన్ని మార్చడం ఇప్పటికీ సవాల్ గానే ఉంది. మనకు ఇప్పుడు ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మార్క్స్ కావాలి. అది రాబోయే పెద్ద పోరాటాలకు ముందుమాట లాంటింది. ఇప్పుడున్న స్థితి నుండి బయట పడటానికి,ఆయన రాతలు తక్కువ సహాయం చెయ్యవు.
(www.theguardian.com సౌజన్యంతో)
Type in English and Press Space to Convert in Telugu |
మార్క్స్ వర్గ పోరాట సిద్ధాంతం అజేయమైంది : కాశీంమార్క్స్ ద్విశత జయంతి సందర్భంగా... మార్క్స్ సిద్ధాంత రాజకీయాల గురించి తన అభిప్రాయాల్ని పంచుకున్నవిరసం నాయకుడు కాశీం... |
marx selected poetryMarx wrote much of this poetry when he was nineteen, around the year 1837, while
he was at university. He makes ready use of mythological themes, theologica... |
మార్క్స్ ప్రాసంగికత ఎప్పటికీ ఉంటుంది : అరుణాంక్మార్క్స్ ద్విశత జయంతి సందర్భంగా మార్క్స్ గురించి తన అభిప్రాయాలను పంచుకున్న డీఎస్‌యూ కార్యదర్శి అరుణాంక్ మార్క్స్ ప్రాసంగికత నేటికీ ఉందంటున్నారు.... |
Share your views on Karl Marx, his ideology and PoliticsFriends who are working on various facets of Marxism and revolutionary ideology and politics, can record the same in a short video format and send them to v... |
21వ శతాబ్దంలో మార్క్స్మార్క్సిజానికి సంబంధించిన వేర్వేరు రంగాల్లో కృషి చేస్తున్న మీరు మీ అభిప్రాయాలను వీడియో తీసి virasam1970@gmail.com మెయిల్‌కు పంపించండి. మార్క్సిజంలోని వేర్వ... |
మార్క్స్ శాస్త్రీయ సిద్ధాంత వారసత్వానికి పదునుపెడదాంమార్క్స్ తన కాలంలోని పెట్టుబడిదారీ విధానాన్ని విశ్లేషించాడు. శ్రమశక్తి సరుకు కావడంతో పెట్టుబడిదారీ విధానం ఆరంభమైంది. గత వ్యవస్థలకు పెట్టుబడిదారీ విధానా..... |
मार्क्स सिद्धांत और राजनैतिकता के बारे में आप के राय वीडियो के रूप में भिजाइए।मई 5 से कार्ल मार्क्स के ʹदो सौ साल साल गिरहʹ के कार्यक्रम आरँभ होने वाले हैं। साल गिरह और बर्सियोँ मेँ कोई भी खासियत नहीं रहने पर भी विश्व कार्मिक वर्ग, इन... |
గెలుచుకోవాల్సిన ప్రపంచం దిశగా కారల్ మార్క్స్మన దేశంలో నడుస్తున్న వర్గపోరాటాలపట్ల సంఘీభావం ప్రకటించకుండా మార్క్సిజాన్ని నిరంతరం అధ్యయనం చేసే ఉత్తమ మార్క్సిస్టుల వల్ల ఈ కాలానికి పెద్దగా ప్రయోజనం ఏమీ లే... |
మార్క్సిజం ఆచరణ సిద్ధాంతం..ఈ దేశంలో దళితులు, శ్రామిక వర్గాలకు అధికారం ఇంకా అందలేదని, అందుకే మార్క్సిజానికి ప్రాసంగికత అనివార్యంగా ఉంటుంద..... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |