ఔను... వాళ్లు చామన ఛాయే!

| సాహిత్యం | క‌విత్వం

ఔను... వాళ్లు చామన ఛాయే!

- ఎస్‌. చంద్ర‌య్య‌ | 05.06.2018 10:46:16am


నేనిప్పుడుమిమ్మల్ని
కంఠాలు తెంపేసిన ఏ కలువ రేకులతోనో
తూడులకు ఉరేసిన ఏ తామరలతోనో కొలువలేను
రాలిపోయిన పుప్పొడి మెట్లపై మీ పాదం తొక్కించలేను
సింహమధ్యలతోనో, అరటి బోదెలతోనో
హంసలతోనో, చక్రవాకాలతోనోనీకొక వికృత రూపాన్నిచ్చి
రాజాస్థానాల్లో ఆడే బొమ్మను చేయలేను
అసలు సౌందర్య దృష్టేలేని కవిగాళ్ళందరూ
నీ అందాలను వారి తుచ్ఛ భావనాలోకంలో ఎన్ని మానభంగాలకు గురిచేసారు
పోల్చటానికి ఏమీ మిగలనట్టుగా
ప్రతి కవిగాడూమార్చి మార్చి వాడేసిన చంద్రబింబంతో
నిన్నిక ఎంతమాత్రమూ తూకంవేయలేను
ఇంకేదో కొత్త డిక్షన్ కోసం దేవులాట మొదలెట్టాను
ఎవడో నిర్ణయించిన సౌందర్య కొలతల్లోచిక్కుకొని
ఊపిరాడక చస్తున్న ఓ నా పిచ్చిలచ్చుమఁమ్మల్లారా!
మీరంతా నల్లతుమ్మపూవు పసుపు వర్ణాలే
తెల్లటి ఉమ్మెత్త పువ్వు మొఖాలే మీవి
గుమ్మంపై వేలాడుతున్న జొన్నకంకి మీద
సర్కస్ ఫీట్స్ వేస్తున్న కీసుపిట్టకంఠాలే మీవి
ఆకాశ పాదాలకు పసుపు పూసే ప్రయత్నంలో నిమగ్నమైన
నా నల్లాల పూవుల్లారా
గాలితేమతో జీవగంజి నింపుకుంటున్న
ఓ కందిపువ్వు రూపాల్లారా
ఒడ్డుమీద నవ్వుతూ పలకరించే
ఓ నా గునుగు పూల కళ్ళ అందాల్లారా
తొమ్మిది నెళ్ళ పసిగుడ్డును మోస్తూ
ఏడేడు సముద్రాలు ఈదిన సాహసమే మీది
ఎవరేమన్నా
మీరు మా పుల్జెరి పళ్ళ తీపి, వగరులే
కలువలపై కవాతు చేస్తున్న కానుగు పువ్వులెహె!





No. of visitors : 358
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వర్షం

ఎస్‌. చంద్ర‌య్య‌ | 03.09.2016 12:45:41am

వర్షం రైతు పగుళ్ళ పాదాలకు చెక్కిలిగిలి పెట్టి మురిసిపోయింది వర్షం పోతూ పోతూ.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    ఖైదు కవి స్వేచ్చ కోసం పోరాడదాం
    అరుణతార నవంబర్ - 2018
    International Seminar on Nationality Question
    రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
    ప్రభుత్వమే అసలైన కుట్రదారు
    సూర్యాక్షరం
    శ్వాసిస్తున్న స్వ‌ప్నం
    చిరున‌వ్వే ఓ ప్ర‌క‌ట‌న‌
    వెలిసిన రంగులు
    అతనేం చేసిండు?
    సరిహద్దున సముద్రమైనా లేన‌ప్పుడు
    ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •