భారత ఉపగ్రహ కన్నుల్తో ప్రజలపై యుద్ధం

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

భారత ఉపగ్రహ కన్నుల్తో ప్రజలపై యుద్ధం

- లలిత్‌ శుక్లా (అనువాదం: బాసిత్‌) | 01.06.2016 09:41:36am

బ్రిటీష్‌ వలస పాలన నుండి బయటపడిన 68 ఏళ్ల ʹస్వతంత్రʹ భారత ప్రభుత్వం తాగు యోగ్యమైన నీరు, కనీస వైద్య సౌకర్యాలు, ప్రాథమిక విద్య తదితరాలను మెజారిటీ ప్రజలకు అందించకపోయినా అణగారిన ప్రజల మీదికి ఆధునిక సాయుధ బలగాలను పెద్ద ఎత్తున మోహరించి కూడా తగుదునమ్మా అని గొప్పలు పోతోంది. ఏ ప్రజలైతే పర్యావరణాన్ని రక్షిస్తున్నారో, అక్రమ మైనింగ్‌ని ప్రతిఘిస్తున్నారో, స్వీయగౌరవ పతాకాన్ని ఎగురవేస్తున్నారో, అన్యాయానికి వ్యతిరేకంగా మ్లాడుతున్నారో అణచివేత లేని సమాజాన్ని కలకంటున్నారో ఆ ప్రజల్ని జాతి వ్యతిరేకులుగా, నక్సలైట్లుగా, మావోయిస్టులుగా ముద్ర వేస్తున్నారు. అందువల్ల వారిని బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపవచ్చు. వారిపై అత్యాచారం జరుపొచ్చు. వారిని చిత్రహింసల పాలు చేయొచ్చు.

మధ్య భారత లోతట్టు అడవుల్లో ఎక్కడికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రవేశించడానికి సైతం ఇష్టపడదో, ఎక్కడికి గరిష్ట ఆర్థిక అభివృద్ధి గణాంకాలు కూడా ఎటువంటి మార్పును తీసుకురావో అక్కడి ప్రజల సంస్కృతి భారత ప్రజల సంస్కృతిలో భాగం కాదు. ఈ ప్రజల బ్రిటీష్‌ వలస పాలన ప్రతిఘటనా పోరాట గాథలు భారత చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకోలేవు. వారి స్వేచ్ఛా పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ప్రజల ప్రతిఘటనా పోరాన్ని ఎదుర్కోవడానికి సామ్రాజ్యవాద పెట్టుబడి శక్తులతో మిలాఖతైన భారత ఫాసిస్టు ప్రభుత్వం అన్ని రకాల నికృష్ట ఎత్తుగడలకు పాల్పడుతోంది. బూటకపు ఎన్‌కౌంటర్ల నుండి, బూటకపు న్యాయవిచారణ నాటకాల దాకా. ఇదంతా ప్రజాస్వామ్యం పేరు మీద, అభివృద్ధి పేరు మీద, జాతీయతావాదం పేరు మీదనే సాగుతోంది. ప్రభుత్వ బలగాలు నక్సలైట్లను ఎదుర్కొనే పేరు మీద అమాయక ప్రజల్ని వేటాడుతున్నారు. అక్కడ ప్రజలకు మానవ హక్కులు లేవు. సాయుధులైన ప్రజాస్వామ్య పరిరక్షకులు ఇక్కడికి అత్యాచారాలు చేయడానికి చిత్రహింసలు పెట్టడానికి, నయా స్వేచ్ఛాయుత వనరుల దోపిడిని ప్రతిఘిస్తున్న అమాయకులను అంతమొందించడానికి వస్తుంటారు. భారత ప్రభుత్వం రాజకీయ పరిష్కారాన్ని చూపడానికి బదులుగా, వారిపై తుపాకీ తూటాల బలంతోనే సమాధానం చెప్పగలనని విశ్వసిస్తోంది. అది జమ్మూ-కశ్మీర్‌ అయినా, ఈశాన్య భారతమైనా, మధ్య భారతమైనా.

భారత ప్రభుత్వం ఆదివాసీ హననానికి తయారవుతుండగా భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఐఎస్‌ఆర్‌ఓ) ఉన్నత స్థాయి నాణ్యత కలిగిన ఉపగ్రహ ఛాయా చిత్రాలను సంక్షోభిత ప్రాంతాల నుండి తీసి భద్రతా దళాలకు పంపడం ద్వారా తిరుగుబాటుదారుల కార్యక్రమాలను పసిగట్టాలని అనుకొంటున్నది. అడవిలో తిరుగుబాటుదారులు వెతుక్కుంటూ వచ్చే నీటి గుంటలపై ఇస్రో ఒక కన్నువేయాలన్నది వ్యూహం.

అదే సంస్థలోని ఒక పరిశోధక విద్యార్థిగా, శాస్త్ర సాంకేతిక ప్రగతిని అమాయక ప్రజల్ని చంపేందుకు ఉపయోగించే తీరుకు నేను సిగ్గుపడుతున్నాను. సఫాయి కార్మికులు మురుగును ఒట్టి చేతుల్తో శుభ్రం చేస్తూ వేలాదిగా చనిపోతుండే దేశంలో, మహిళల్ని వెంటాడి చంపే వికృత వేటను కొనసాగుతున్న దేశంలో, వేలాది రైతులు ఆత్మహత్యలకు నెట్టబడుతున్న దేశంలో, నల్లడబ్బు విచ్చల విడిగా రాజ్యం చేస్తున్న దేశంలో శాస్త్రవిజ్ఞానం ఈ సమస్యలకు పరిష్కారం కనిపెట్టే, మెరుగైన సమాజాన్ని నిర్మించే కృషి జరిగాలి గాని అందుకు భిన్నంగా అమాయకులను చంపడానికి నీటి గుంటలను కాపుగాసేందుకు వినియోగిస్తున్నారు. ఎవరికైతే నీవు తాగునీరు, తగినంత ఆహారం, కనీస వైద్య సౌకర్యం కల్పించలేవో, వారి వనరులపై కన్ను వేసే అధికారం ఎవరిచ్చారు?

మేము విద్యార్థులుగా మన సమాజానికి ఏదైనా చేయాలని, ఈ సంస్థలో పరిశోధన కోసం చేరాం. మేము ఎక్కడైతే ప్రతి ఒక్కరికే ఆహారం, వసతి, ఆరోగ్యం విద్య లభిస్తాయో అటువంటి ఒక మెరుగైన సమాజాన్ని తయారు చేసే పనిలో మా కలను చూస్తున్నాం. ఈ సమాజాన్ని మెరుగుపరిచే పరిశోధన, శాస్త్ర విజ్ఞాన సామర్థ్యం గురించి ఆలోచిస్తూ మేం గ్రామాల నుంచి వచ్చాం. కాని వాస్తవం మరోలా ఉంది. ఇది ఘోరం. ఇక్కడ అణ్వస్త్రాల ప్రచారం కోసం పని చేయాల్సి ఉంటుంది. ఛత్తీస్‌గఢ్‌లో అమాయక ప్రజల్ని చంపడం కోసం అడవుల్లో సహజ నీటి నిలువలపై నిఘా వేయడానికి సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.

సామూహిక విధ్వంసానికి ఉపయోగపడే ఆయుధాల్ని తయారుచేయని, అణుశక్తి గురించి ప్రచారం చేయని సంస్థలో పనిచేస్తే బావుండునని ఆలోచించేవాడిని. అంగారక గ్రహం మీదికి అంతరిక్షయానం గురించి నేను గర్వపడ్డాను. కాని ఆ ʹవిజయంʹ ఏ తీరుగా ప్రదర్శంచబడిందో, ఆ తీరుకు నిరాశపడ్డాను. దాని గురించి నేనో చిన్న వ్యాసం రాసాను. ʹభారత అంగారక అంతరిక్షయానం - వీర విజేతలుʹ అని. నేను పొరపడ్డాను.

శాస్త్ర విజ్ఞానం ప్రజలకు సేవ చేయడానికే అనే శాస్త్రీయ భావనను మనమంతా కలిసి నిలబెట్టాలి. మనం సాధించిన ప్రగతి మానవ హననానికి ఉపయోగపడడాన్ని ప్రతిఘించాలి. అమాయక ప్రజల రక్తంలో మీ చేతుల్ని కడగనీయకండి. మానవత్వం కోసం నిలబడదాం! ఆపరేషన్‌ గ్రీన్‌హంట్ ను ప్రతిఘిద్దాం!

(raiot.in సౌజన్యంతో)


No. of visitors : 903
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఇండియ‌న్ ఆర్మీ గో బ్యాక్‌

ఆదివాసీ బ‌చావో స‌మితి, దండ‌కార‌ణ్య‌ | 21.05.2016 01:09:44pm

ఆప‌రేష‌న్ గ్రీన్ హంట్ పేరుతో భార‌త ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌జ‌ల‌పై యుద్ధాన్ని వ్య‌తిరేకిస్తూ.. రూపొందించిన డాక్యుమెంటరీ ʹభార‌త్ సేన వాప‌స్ జావోʹ...
...ఇంకా చదవండి

ప్రకృతి సంపదను కాపాడుతున్న అదివాసులకు అండగా నిలబడుదాం

| 15.05.2016 11:37:50am

ఆదివాసీల‌ను మ‌ట్టుపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేప‌ట్టిన 3వ ద‌శ గ్రీన్‌హంట్‌ని వెంట‌నే నిలిపివేయాల‌ని డిమాండ్ చేస్తూ టీడీఎఫ్‌ బ‌హిరంగ‌స‌భ‌...
...ఇంకా చదవండి

ఛత్తీస్ ఘడ్ ఆదివాసీ గ్రామాలపై దాడులు చేసి, హత్యలు, అత్యాచారాలు జరిపిన భద్రతా దళాలపై చర్యలు తీసుకోవాలి

విమెన్ అగైనెస్ట్ సెక్సువల్ వైలెన్స్ అండ్ స్టేట్ రిప్రెషన్ | 24.05.2016 09:55:15am

మంగ్లి పొట్టం, తన సోదరి, తన స్నేహితురాలతో కలిసి పశువులను మేపుతుండగా ఆమెపైన దాడి జరిగింది. ఆమె బట్టల్ని చింపివేసి చంపుతామని బెదిరించారు. వాళ్లు ఆమె స్నేహితుర...
...ఇంకా చదవండి

ప్ర‌భుత్వ విధానాల‌ను విమ‌ర్శించ‌డం నేర‌మా?

ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌జాసంఘాలు | 05.06.2016 11:00:27am

మే 24న వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలో ఆప‌రేష‌న్ గ్రీన్ హంట్ 3వ ద‌శ‌కు వ్య‌తిరేకంగా తెలంగాణ ప్ర‌జాస్వామిక వేదిక నిర్వ‌హించ త‌ల‌పెట్టిన బ‌హిరంగ‌స‌భ‌కు అనుమ‌తి నిచ్చిన పో...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •