ఈ దేశం మాకు యుద్ధాన్ని బాకీపడింది

| సాహిత్యం | స‌మీక్ష‌లు

ఈ దేశం మాకు యుద్ధాన్ని బాకీపడింది

- నరేష్కుమార్ సూఫీ | 05.06.2018 10:49:13am

"జైలు సాహిత్యం" ఈమాటా మనకు కొత్తది కాదు బందీఖానా గోడల మధ్యనుంచి పుట్టుకొచ్చిన అక్షరాలూ కొత్త కాదు. కానీ వసంత మేఘగర్జన వినిపించిన నాటినుంచీ ఈ దేశపు జైళ్లు కొత్త తరహా సాహిత్యాన్ని కనటం మొదలు పెట్టాయి.

నిజానికి జైలు స్వేచ్చా కాంక్షని మరింతగా రెచ్చగొడుతుంది, బందీఖానా రెక్కలు విచ్చుకోవాల్సిన అవసరాన్ని పదే పదే గుర్తు చేస్తుంది. నిజానికి జైలు స్వతంత్ర జీవన దృక్పధాన్ని మరింత విశాలం చేసి చూపిస్తుందేమో...!

అందుకే చెరసాల గోడల మీద స్వేచ్చా బావుటాల కలలూ, కలవరింతలూ మరింత ఆశావహంగా, మరింత బలంగా మొలకెత్తటం మొదలుపెట్టాయి. అర్థం తెలియని అడవి భాషలు కూడా లిపిని మొలిపించుకొని మరీ అడవి గొంతుకని వినిపించడం మొదలు పెట్టాయి.

నజీర్....! ఈదేశం లోని లక్షలాది విద్యార్థులకు మల్లెనే యూనివర్సిటీ లో చదవటానికి వచ్చాడు, చరిత్రని మలుపు తిప్పిన అనేకానేక విద్యార్థి వీరుల బాటలోనే రాయటమూ మొదలు పెట్టాడు. అయితే విశ్వవిద్యాలయం లో ఉండాల్సిన విద్యార్థి జైలు గోడలమధ్య గొంతు చించుకున్నాడు, యుద్ధం తనకు బాకీపడ్డ ఆయుధాన్ని అందుకోవటానికి తపన పడుతూనే ఉన్నాడు.

సత్యాన్వేషణ కోసం వెళ్లిన ఏడుగురి బృందాన్ని సుక్మా జైలులో బందించింది. భారత ప్రభుత్వం. రోజులో 22 గంటలు జైలు గోడలని చూస్తూ కూచుని ఇట్లా కవిత్వంగా మారిపోయి బయటకి వచ్చాడు.

"నీవు నడిచిన దారంతా సింధూరమై
ఆకుపచ్చ అడవిని కౌగిలించుకుంటుంది/
నీ భుజం వాలినపుడు
నా దేహం వణికి పోయింది
అయినా...
నీలోని నేను నీ దారినెలా వీడగలను?
ప్రశ్ననే సమాధానంగా చెప్పుకొని, ప్రశ్ననే తన పంథాగా నేర్చుకొని చెప్పేసాడు. మూడు దశాబ్దాలని కూడా చూడని విద్యార్థి. ఎన్ని నిద్రా రహిత రాత్రులని కౌగిలించుకొని సెదతీరితే ఇంత ఖచ్చితత్వాన్ని చేరుకోగలడు..!

నిరంతర కార్యాచరణలో, అనుక్షణం ఒక ఉద్విగ్న వాతావరణంలో ఉండే మనుషులు "రాజకీయ ఖైదీలు"గా ఉన్నప్పుడే కాస్త కవిత్వం రాసే వీలు చిక్కుతుందేమో.. అందుకే దాదాపుగా జైల్లో ఉన్నప్పుడే కవిత్వం ఎక్కువగా రాసిన వాళ్ళున్నారు. అలా నజీర్ తన కవిత్వాన్ని మిత్రుణ్ణి చేసుకొని బారెక్ లోపలే ఒక స్వేచ్చా జీవితాన్ని ఊహించి ఉంటాడు.

"ఎక్కడున్నావని అడక్కు నన్ను
సత్యాన్వేషన కోసం పయణమయ్యాను
కారాగారమొక సత్యమై ప్రత్యక్షమైంది
ఇప్పుడు... నేనూ, నిజమూ పదిలమే"
చుట్టూ ఒక బీభత్సం, నిరంతరం ఒక అభద్రతా భావం ఎట్లా తనని తాను సంబాలించుకోవాలో అర్థం కానితనం. సహచరుల మాటలే ఓదార్పు.. అయినా లోలోపలి కల ఇట్లా తోలుస్తూనే ఉన్నట్టుంది.

అందుకే...
"తుపాకీ ఆనవాలు పసిగట్టలేను
ఆలివ్ గ్రీన్ ఆల్విదా నాకింకా గుర్తే" ఎవరా ఆలివ్ గ్రీన్ ఆల్విదా.? కామ్రేడ్ వివేక్.. "ఇతన్ని మేమే ఎన్కౌంటర్ చేశాం" అన్న మాట పోలీస్ ఠాణాలో వినిపించినప్పుడు. ఆ అమాయకపు మొహం గుర్తొచ్చి ఎంత రగిలిపోయి ఉంటాడో. కామ్రేడ్ శృతి, కామ్రేడ్ సాగర్ లాంటి మరెన్ని ఛిద్రిత దేహాలు కళ్ళముందు మెదిలి ఉంటాయి.

మైదాన ప్రాంత రాజకీయ ఖైదీల గురించి అంతో ఇంతో సమాచారం మనకుంటుందిగానీ. కెమెరా కన్ను పడని, ఏ పాత్రికేయుని ఆలోచనా వెళ్లని చోటునుంచి వచ్చే ఆదివాసీ నిర్బందాల గురించీ మనం పెద్దగా ఆలోచించలేం. ఆదివాసీ యోధుల కథలని చందమామ కథలుగా వినే మనకు ఇక "చెలిమ" గురించి ఎలా తెలిసేది? చెలిమ ఒక ఆదివాసీ యుద్ధఖైదీ "చెలిమా నాతో చెలిమి చేస్తావా/ ఖాకీ సెంట్రీ అరుపులు తప్ప/నాదైన జీవితమేదీ లేదిక్కడ" అంటూ సాగిన "తురాయి పిట్ట" కవిత ఆదివాసీ ఖైదీల గురించి కూడా ఆలోచించమని పాఠకునికి చెప్పటానికే సాగిందేమో. నజీర్... యుద్ధం నాకు ఆయుధాన్ని బాకీ పడింది అన్నాడు. యుద్ధంలో భాగమయ్యాడు.

నీ కలల కొమ్మలు దులిపితే
నేనేరిన గాయాల గుర్తులు
నీ చర్మాన్ని ఒలిచిందేవరు?
కాళ్ళకింద మట్టిని తొలిచిందేవరు?
మర్చిపోను నీ మాటలు
యుద్ధం నాకు ఆయుధాన్ని బాకీ పడింది" అంటూ ముగించాడు గానీ.. నిజానికి ఈ దేశం ప్రజలకు ఒక యుద్దాన్నే బాకీ పడింది. ప్రతీ రగిలే గుండెనీ ఆయుదంగా మలిచే ప్రయత్నంలోనే వేల బలిదానాలు. యుద్ధం జరగాల్సి ఉంది వసంతమేఘగర్జన కుండాపోతై కురావాల్సి ఉంది. విముక్తిని, స్వేచ్చనీ మొలకెత్తించాల్సి ఉంది. అవును ఈ దేశం మనకోక యుద్దాన్ని, ఆ యుద్దం ఒక ఆయుధాన్ని ఆ ఆయుధం స్వేచ్చనీ బాకీపడ్డాయి... లెక్కలు తేలుతాయ్ బాకీ నయా పైసాతో సహా వసూలు చేసుకునే రోజోస్తుంది. అప్పటిదాకా నజీర్ లాంటి మనుషులు బాకీలెక్కలు కడుతూనే ఉంటారు. చెలిమ లాంటి యోధులు కదులుతూనే ఉంటారు.





No. of visitors : 631
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణ‌తార - మే 2019
    ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
    ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
    వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
    159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
    ఒక వికృతి
    ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
    స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
    స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
    విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
    వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
    మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •