ఆధిప‌త్యంపై అలుపెర‌గ‌ని పోరాటం

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

ఆధిప‌త్యంపై అలుపెర‌గ‌ని పోరాటం

- క్రాంతి | 05.06.2018 05:11:50pm

ఇంద్రావ‌తి... ఎన్నెన్ని గాయాల‌ను గ‌ర్భంలో దాచుకుందో? ఎన్నెన్ని పోరాటాల‌కు ఊపిరిలూదిందో? ఎన్నెన్ని త్యాగాల‌కు సాక్ష్యంగా నిలిచిందో? నెత్తురోడుతున్న నేల‌పై పోరాట చ‌రిత్ర‌ను న‌మోదు చేస్తున్న న‌దీ ఇంద్రావ‌తి. ఆ న‌ది ఒడ్డున నిల‌బ‌డ్డ ఆదివాసీ... ఇప్పుడు ఆయుధాన్ని సంధిస్తున్నాడు. జ‌ల్ - జంగ‌ల్ - జ‌మీన్ కోసం యుద్ధాన్ని స‌వాల్ చేస్తున్నాడు. ప్ర‌తియుద్ధంలో రాటుదేలుతున్నాడు. అత‌డు... బాబూరావు శెడ‌మాకె వార‌సుడు. ప్రజా యుద్ధ సైనికుడు. రేప‌టి నూత‌న మాన‌వుడు.

త‌న కాళ్ల కింద నేల‌ను కాపాడుకునేందుకు అత‌డు.... శ‌తాబ్ధాలుగా పోరాడుతూనే ఉన్నాడు. ప్ర‌కృతి మీద ఆధార‌ప‌డి జీవించే అత‌డిని అడ‌వికి దూరం చేసే కుట్ర వంద‌ల ఏళ్ల‌ క్రిత‌మే ఆరంభ‌మైంది. బ్రిటీష్ వ‌ల‌స పాల‌కులు మొద‌లు.. ఇవాల్టి ద‌ళారీ పాల‌కవ‌ర్గాల వ‌ర‌కు అత‌డిని వెంటాడుతూనే ఉన్నారు. అయినా.. అత‌డు పోరాటంలో నిల‌బ‌డే ఉన్నాడు. త‌న హ‌క్కును కాపాడుకునేందుకు నెత్తురు ధార‌పోస్తూనే ఉన్నాడు. నిన్న బాబూరావు శెడ‌మాకెగా... ఇవాళ మావోయిస్టుగా... అత‌డు సృష్టించిన చ‌రిత్ర‌కు ఇంద్రావ‌తి స‌జీవ సాక్ష్యం.

వ్యాపారం పేరిట భార‌త‌దేశానికి వ‌చ్చిన ఆంగ్లేయులు దేశాన్ని త‌మ గుప్పిట్లోకి తీసుకోవాల‌నుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ప‌ద‌హారో శ‌తాబ్ధంలో పోరుబంద‌ర్‌, సూర‌త్‌ల మీదుగా వివిధ‌ రాష్ట్రాల్లో త‌న వాణిజ్యాన్ని విస్త‌రించుకుంది. నాటి నుంచి తూర్పు బెంగాల్‌, మ‌ద్రాస్‌, కొచ్చిన్ త‌దిత‌ర ప్రాంతాలు ఇంగ్లాండ్ నౌక‌ల‌కు పోర్టులుగా మారాయి. మ‌ద్రాస్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది. త‌రువాత కోల్‌క‌ట‌ను. ప్లాసీ యుద్ధం త‌రువాత‌ బ్రిటీష్ ప్ర‌భుత్వం నేరుగా ఇంగ్లాండ్ నుంచి ఆప‌రేట్ చేయ‌నారంభించింది. భార‌త దేశంలోఫారిన్ మినిస్ట్రీ ని ఏర్పాటు చేసింది. క్ర‌మంగా దేశంలో స‌గానికిపైగా సంస్థానాల‌పై ఆదిప‌త్యం సాధించింది.

యూర‌ప్ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఖ‌నిజ‌సంప‌ద కావాలి. ఆ సంప‌ద వాళ్ల‌కు ఇండియాలో క‌నిపించింది. ఇంగ్లాండ్‌లో కొత్త కంపెనీల కోసం ఇండియా నుంచి ఖ‌నిజ సంప‌ద‌ను త‌ర‌లించుకుపోవాల‌నుకుంది బ్రిటీష్ ప్ర‌భుత్వం. అలా ఆంగ్లేయుల దృష్టి దేశంలోని మూల‌వాసుల‌పై ప‌డింది. అప్ప‌టికి మ‌ధ్య‌భార‌తంలో గోండ్వానా పాంత్రం సంప‌న్న రాజ్యంగా ఉండేది. అనేక రాజ్యాల దృష్టి దానిపైనే ఉండేది. ఉత్త‌రాన మొఘ‌ల్ సామ్రాజ్యం, ద‌క్షిణాన విజ‌య‌న‌గ‌రం, బ‌హ్మ‌ణి, బెంగాల్ సుల్తాన్‌లు.. గోండ్వానాను సొంతం చేసుకోవాల‌ని భావించారు. అలా పూనేకు చెందిన బ‌హ్మ‌ణి, మ‌రాఠాలు క‌లిసి బ్రిటీష‌ర్స్‌ స‌హాయంతో గోండ్వానాలోని ప‌లు కోట‌ల‌లపై దాడి చేశారు. 1751 నాటికి గోండ్వానా ప్రాంతం పూర్తిగా మ‌రాఠాల స్వాధీనం అయ్యింది. గోడ్వాంన భాషా - సంస్కృతులు పూర్తిగా ధ్వంసమ‌య్యాయి. స‌తారా, ర‌త్న‌గిరి జిల్లాల్లో సంస్కృత భాష‌ను అమ‌లులోకి తెచ్చారు. 1854నాటికి చంద్ర‌పూర్ ప్రాంతం బ్రిటీష్ ఆదీనంలోకి వెళ్లింది. దీంతో బ్రిటీష్ పాల‌న‌కు వ్య‌తిరేకంగా గోండ్వానా రాజులు, శంక‌ర్‌షా, ర‌ఘునాథ్‌షా, దేవ్‌నారాయ‌ణ్ సింగ్ తిరుగుబావుటానెగ‌రేశారు. మోలంప‌ల్లి జ‌మీంద‌ర్ పులేశ్వ‌ర్ బాపు కుమారుడు బాబూరావు పులేశ్వ‌ర్ శెడ‌మాకె గ్రామ గ్రామంలో యువ‌కుల‌ను కూడ‌గ‌ట్టాడు.

బాబూరావ్ పులేశ్వ‌ర్ శెడ‌మాకె 12 మార్చి 1833న జ‌న్మించాడు. చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని రాయ్‌పూర్ ప్రాంతంలో ఇంగ్లీష్ విద్యను అభ్య‌సించాడు. హిందీ, ఇంగ్లీష్‌, తెలుగు, గోండ్వానా భాష‌ల‌పై ప‌ట్టుసాధించిన శెడ‌మాకే విద్యాభ్యాసం పూర్త‌యిన త‌రువాత తిరిగి మోల‌ప‌ల్లికి వ‌చ్చాడు. దాదాపు అదే స‌మ‌యంలో చంద్ర‌పూర్ ప్రాంతం ఆంగ్లేయుల ఆధీనంలోకి వెళ్లింది.

ఆంగ్లేయుల పాల‌న‌కు వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తిన మొద‌టి వ్య‌క్తి శెడ‌మాకె. ఆంగ్లేయుల ఆధిప‌త్యానికి, వ‌న‌రుల దోపిడీకి వ్య‌తిరేకంగా గెరిల్లా యుద్ధాన్ని న‌డిపాడు. 1857లో దేశ‌మంతా బ్రిటీష్ పాల‌న‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న కాలంలో శెడ‌మాకె 500 మంది ఆదివాసీ యువ‌కుల‌తో సైన్యాన్ని త‌యారు చేశాడు. త‌న సైన్యంతో రాజ్‌ఘ‌డ్ ప్రాంతాన్ని బ్రిటీష్ ఆధీనం నుంచి విముక్తి చేశాడు. ఈ విష‌యం చంద్ర‌పుర్‌కి చేర‌డంతో అప్ప‌టి బ్రిటీష్ క‌లెక్ట‌ర్ మి. క్రిక్ట‌న్ శెడ‌మాకెపై దాడికి బ్రిటీష్ సైన్యాన్ని పంపాడు. కానీ... సైన్యం చేరుకోవ‌డానికి ముందే.. నంద‌గావ్ గోస్రీ వ‌ద్ద బ్రిటీష్ సైన్యాన్ని మ‌ట్టి క‌రిపించాడు శెడ‌మాకె. దీంతో క్రిక్ట‌న్ తిరిగి అద‌న‌పు బ‌ల‌గాల‌ను మ‌ళ్లీ యుద్ధానికి పంపాడు. ఈ సారి సంగ‌నాపుర్‌, బామ‌న్‌పేట‌లో జ‌రిగిన యుద్ధాల్లో బ్రిటీష్ సైన్యం తిరిగి ఓడిపోయింది.

రెండు ప‌రాజ‌యాల త‌రువాత‌... శెడ‌మాకె లో విశ్వాసం రెట్టింప‌య్యింది. 29 ఏప్రిల్ 1858న చించ‌గూడలోని టెలిఫోన్ స్టేష‌న్‌ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో టెలిగ్రాఫ్ ఆప‌రేట‌ర్లు మి. హాల్‌, మి. గార్ట్‌లౌండ్ మ‌ర‌ణించారు. దీంతో క్రిక్ట‌న్ శెడ‌మాకెను బంధించేందుకు కుట్ర‌ప‌న్నాడు. ఒక‌వైపు నుంచి నాగ్‌పుర్ కెప్టెన్ షేక్స్‌పియ‌ర్స్‌ని పుర‌మాయించాడు. మ‌రోవైపు అహేరి జ‌మిందారిణి రాణి ల‌క్ష్మీ బాయిపై శెడ‌మాకెను ప‌ట్టుకోవాల‌ని ఒత్తిడి పెంచాడు. అన్ని వైపుల నుంచి గాలింపు చ‌ర్య‌లు తీవ్ర‌త‌రం కావ‌డంతో... శెడ‌మాకె త‌ప్పించుకోలేపోయాడు. చివ‌ర‌కు 18 సెప్టెంబ‌ర్ 1858న శెడ‌మాకెను అరెస్టు చేశారు. చండా సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. 21 అక్టోబ‌ర్ 1858న బాబూరావ్ శెడ‌మాకెను బ‌హిరంగంగా ఉరితీశారు. అలా సామ్రాజ్య‌వాద దోపిడీకి వ్య‌తిరేకంగా పోరాడి ప్రాణ‌మొదిలాడు బాబూరావు శెడ‌మాకె.

వ‌ల‌సాధిప‌త్యానికి, వ‌న‌రుల దోపిడీకి వ్య‌తిరేకంగా శ‌తాబ్ధాలుగా ఆదివాసులు పోరాడుతూనే ఉన్నారు. త‌మ కాళ్ల నేల‌ను కాపాడుకునేందుకు దోపిడీ పాల‌కవ‌ర్గాలకెదురు నిలిచి త‌మ‌దైన ప్ర‌త్యామ్నాయ పాల‌న‌నూ నిల‌బెట్టుకుంటున్నారు. ప్ర‌థ‌మ స్వాతంత్ర్య పోరాటానికి వందేళ్ల ముందే ఝార్ఖండ్ (నాటి బీహార్‌)లో సాయుధ పోరాటాన్ని సంధించిన తిల్క‌మాంజీ సంప్ర‌దాయ ఆయుధాల‌తో బ్రిటీష్ సైన్యానికి ఎదురునిలిచాడు. ఆంధ్ర‌, తెలంగాణ మొద‌లు ఒరిస్సా, మ‌హారాష్ట్ర‌, ఝార్ఖండ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్ ఇలా... అన్ని ఆదివాసీ ప్రాంతాల్లోనూ ఇలాంటి వీర యోధులు ఎంద‌రో క‌నిపిస్తారు. ఒక గూండాధ‌ర్‌, ఒక బిర్సాముండా, ఒక కొమురంభీం, ఒక అల్లూరి ఇలా ఎంద‌రో పోరాటయోధులు అందించిన వార‌స‌త్వాన్ని ఇవాళ దండ‌కార‌ణ్య ఆదివాసీలు కొన‌సాగిస్తున్నారు.

అట‌వీ సంప‌ద‌ను దోచుకుంటున్న బ‌హుళజాతి కంపెనీల‌ను నిలువ‌రిస్తూ... వాటికి అండ‌గా నిలిచిన రాజ్యాన్ని స‌వాల్ చేస్తున్నారు. అందుకే... ఆదివాసీ స‌మాజంపై రాజ్యం క‌క్ష‌గ‌ట్టింది. అడ‌వి మీద హ‌క్కు మాదే అని నిన‌దిస్తుంద‌న్నందుకు ఆదివాసీలను అంతం చేసేందుకు సిద్ధ‌మైంది. ఆప‌రేష‌న్ గ్రీన్‌హంట్ పేరిట ఆదివాసీ ప్రాంతాల‌ను సాయుధ బ‌ల‌గాల‌తో నింపి, యుద్ధ బీభ‌త్సాన్ని సృష్టిస్తోంది. అందులో భాగంగా జ‌రిగిందే గ‌డ్చిరోలి హ‌త్యాకాండ‌. గ‌డ్చిరోలి జిల్లాలోని ఐర‌న్ ఓర్‌ను సొంతం చేసుకునేందుకు ద‌శాబ్ధాలుగా బ‌హుళ‌జాతి కంపెనీలు య‌త్నిస్తున్నాయి. ఇక్క‌డ ఇనుప ఖ‌నిజం త‌వ్వ‌కాల కోసం 1993లో ప్ర‌భుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న‌లియాండ్స్‌ మొట‌ల్ కంపెనీ 2016లో త‌వ్వ‌కాల‌ను ప్రారంభించింది. సుదీర్ఘ‌కాలంగా స్థానిక ఆదివాసీలు ఈ త‌వ్వ‌కాల‌ను వ్య‌తిరేకిస్తున్నారు. ఆదివాసీల పోరాటానికి విప్ల‌వోద్య‌మం అండ‌గా నిల‌వ‌డంతో ప్ర‌భుత్వానికి కంటిమీద కునుకులేకుండా పోయింది. ఆదివాసీల‌ను అడ‌వి నుంచి గెంటివేస్తే త‌ప్ప ఖ‌నిజ‌ల త‌వ్వ‌కానికి మార్గం సుల‌భంకాద‌ని భావించిన ప్ర‌భుత్వం వేల సంఖ్య‌లో సైన్యాన్ని మోహ‌రించి గ్రామాల‌పై దాడికి దిగుతోంది. అందులో భాగంగానే మార్చి 22, 23 తేదీల్లో సామూహిక హ‌త్యాకాండ‌కు పాల్ప‌డి 40 మంది మావోయిస్టులు, ఆదివాసుల‌ను బ‌లితీసుకుంది.

కానీ ఈ పోరాటం ఇవాల్టిది కాదు.. త‌మ‌ను తాము కాపాడుకోవ‌డంతో పాటు, ఈ దేశ భ‌విష్య‌త్తును కాపాడేందుకు ఆదివాసీలు చేస్తున్న పోరాటం ఇది. సామ్రాజ్య‌వాద దోపిడీకి వ్య‌తిరేకంగా విప్ల‌వ పార్టీ నాయ‌క‌త్వాన సాగుతున్న పోరాటం ఇది. బాబూరావు శెడ‌మాకె అందించిన వార‌స‌త్వం వాళ్ల‌ది. న‌ల‌బై మందిని హ‌త్య చేసి ఒక పోరాటాన్ని అణ‌చివేయ‌డం సాధ్యంకాదు.

(ఆదివాసీ రిస‌ర్జెన్స్ సౌజ‌న్యంతో.. )

No. of visitors : 762
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •