ఈ తీర్పు సారాంశమేమిటి?

| సంభాషణ

ఈ తీర్పు సారాంశమేమిటి?

- పాణి | 06.06.2018 10:58:45am

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం గురించి అగ్రకుల సమాజం ఏమనుకుంటున్నదో అదే అత్యున్నత న్యాయస్థానం కూడా అనుకుంది. ఇదే ఆశ్చర్యం. మన దేశంలోని విషాదం కూడా. ఇది యాదృశ్చికమైతే అంతగా పట్టించుకోనవసరం లేదు. న్యాయ విచక్షణలో అత్యున్నత ప్రజాస్వామిక విలువలను గీటురాయిగా భావించే న్యాయస్థానం ఇలా అనుకోడానికి సామాజిక మూలాలు ఉన్నాయి. వాటితో సంబంధం లేకుండా న్యాయపరమైన సాంకేతిక చర్చ ఎంత చేసినా అసలు విషయం బోధపడదు. సాంకేతిక విషయాలకు ప్రాధాన్యత ఉండేదే. కానీ ఇలాంటి విషయాల్లో అంతా అదే కాదు. ఇంకా చాలా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం విషయంలో సుప్రీంకోర్టు వ్యవహారాన్ని ఇలాగే చూడాలి. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వమే అసలు ముద్దాయి. ప్రభుత్వాలు, అందునా బీజేపీ ప్రభుత్వం దళితులు, ఆదివాసుల విషయంలో ఎలా వ్యవహరిస్తుందో కొత్తగా చెప్పుకొనేది ఏమీ లేదు. అంతగా అది అందరికీ తెలిసిపోయింది. కాబట్టి న్యాయస్థానం వ్యవహారమే చర్చనీయాంశం చేయాలి.

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వ్యవస్థా పీడితులైన దళితులు, ఆదివాసుల రక్షణ కోసం వచ్చింది. కాబట్టి ఆ స్పూర్తికి తగినట్టు అమలువుతున్నదా? లేదా అని న్యాయస్థానం పహారా కాయాలి. ఎందుకంటే చట్టం ఎక్కడ, ఎట్లా తయారైనా అమలు కావాల్సింది ఈ అసమ వ్యవస్థలోనే. అక్కడ ఉండే ఆధిపత్య శక్తులకు ఈ చట్టమే కంటగింపుగా ఉంటుంది. అయితే వాళ్లకు దీన్ని పనిగట్టుకొని దెబ్బతీయాల్సిన పని లేదు. అసమ సామాజిక సంబంధాల ప్రాబల్యం వల్ల చట్టం చట్టంగానే ఉంటుంది. అణచివేత, పీడన అలాగే ఉంటాయి. నిత్యం దాడులు జరుగుతూ ఉంటాయి. మన దేశంలో ప్రజలకు రక్షణ ఇచ్చినట్లు కనిపించే అన్ని చట్టాల దుస్థితి ఇదే. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుంది.

కాబట్టి కోర్టు ఈ చట్టం ఎలా అమలవుతోంది? నిజంగానే దాని వల్ల ఉద్దేశించిన వాళ్లకు ఏదైనా రక్షణ ఉందా? సామాజిక దౌష్ట్యాన్ని అడ్డుకోవడంలో దీని పాత్ర ఏమైనా ఉందా? ఇలాంటి చట్టం అమలవుతున్నందు వల్ల సామాజికంగా వ్యవస్థీకృతమైన హింస ఏమైనా తగ్గుతున్నదా? అనే పరిశీలన చేయాలి. సరిగ్గా అప్పుడే సామాజిక వ్యవస్థల్లోని హింస, అసమానత, అమానవీయ విలువల విషయంలో న్యాయ వ్యవస్థ అపమ్రత్తంగా ఉన్నట్లు లెక్క. లేదా న్యాయవ్యవస్థ ఇతర వ్యవస్థల్లోని అన్యాయాన్ని, హింసను తగ్గించే విషయంలో తనదైన పాత్ర పోషించినట్లవుతుంది. సమాజ ప్రజాస్వామికీకరణలో న్యాయ వ్యవస్థ తన కర్తవ్యం నిర్వహించడమంటే ఇదే. పైగా అనేక పోరాటాల ఫలితంగా ఒక చట్టం వస్తుంది. చట్ట రూపం సంతరించుకున్న తరతరాలుగా పీడితుల ఆకాంక్షగా దాన్ని చూడాలి.

ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఊరక పాలకవర్గం భిక్షగా ఇవ్వలేదు. ఆధునిక కాలంలో జరిగిన అనేక సాంఘిక విముక్తి పోరాటాలు, దళితుల ఆత్మగౌరవ పోరాటాలు, దళితులపై .. ఆదివాసులపై జరిగిన అత్యాచారాలకు వ్యతిరేకంగా సాగిన ప్రతిఘటనా పోరాటాలన్నిటి ఫలితం ఈ చట్టం. ఇందులోని న్యాయ భావనపట్ల సుప్రీంకోర్టుకు ఎరుక ఉండాలి. సమాజంలోని ఏ విలువ వల్ల, ఎలాంటి ఆచరణ వల్ల ఒక అన్యాయం దీర్ఘకాలంగా కొనసాగుతున్నది? అనే స్పృహ లేకుంటే సమాజానికి అది అందించే న్యాయం మీదే కాదు, అసలు న్యాయవ్యవస్థకు ఏపాటి న్యాయ దృష్టి ఉంది? అనే అతి ముఖ్యమైన సందేహం కలుగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వాల ఉద్దేశాల కంటే తాను హేతబద్ధంగా, సామాజిక దృష్టితో వ్యవహరిస్తాననే నమ్మకాన్ని కోర్టు నిలబెట్టుకోవాలి. కానీ చాలా విషయాల్లో సామాజికతను న్యాయస్థానం పట్టించుకోదని దిన పత్రికల పాఠకులకు సహితం అర్థమవుతూ ఉంటుంది. ఇక ప్రభుత్వాల ఉద్దేశాలు, ప్రయోజనాల విషయంలో దాని నుంచి విమర్శనాత్మకతను ఎలా ఆశించగలం?

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం విషయంలో కూడా సుప్రీం కోర్టు అలా తన ఉదార్తను విస్మరించింది. ఒకటికి రెండు సార్లు తాను చెప్పిన అభిప్రాయాల ద్వారా తనకు అలాంటి స్పృహ ఏమీ లేదని చాటుకుంది. ఉదార్తత మాట అటుంచి రోజువారీ వ్యవహారంలో ఈ చట్టం ఎలా అమలవుతోంది? అని కూడా ఆలోచించలేదు. సరిగ్గా చెప్పాలంటే.. ఈ చట్టం వచ్చినప్పటి నుంచి దీని గురించి ఊళ్లలో బలిసిన అగ్రకుల పెత్తందార్లు ఏం అనుకుంటున్నారో అదే సుప్రీం కోర్టు అనుకున్నది. అంటే కులం కేంద్రంగా ఉండే మన ఊరి వ్యవస్థ ఎలా అనుకుంటుందో అలాగే రాజ్యాంగంలోని విలువలను వ్యాఖ్యానిస్తూ దాని కాపాడాల్సిన అత్యున్నత న్యాయ వ్యవస్థ కూడా అలాగే అనుకుంది. ఇలా అనుకోవడం ఒక సమస్య అయితే, దానికి మన దేశంలో ఒక భౌతిక పునాది ఇప్పటికీ బలంగా మిగిలి ఉండటం అంతకంటే తీవ్ర సమస్య.

కారణం ఏమంటే, మన దేశంలోకి అన్ని ʹప్రజాస్వామిక వ్యవస్థలుʹ ఎక్కడి నుంచి ఎలా వచ్చి, ఎలా పని చేస్తున్నాయో న్యాయ వ్యవస్థ కూడా అలాగే వచ్చింది. అలాగే పని చేస్తున్నది. మిగతా వ్యవస్థలకంటే అది అతీతంగా ఎలా ఉండగలదు? అందుకే దానికి దళితులు, ఆదివాసులకు జరుగుతున్న అన్యాయం, ఈ చట్టం పరిధిలో వాళ్లకు జరగాల్సిన న్యాయం అనే విషయాల్లో ఏ వాస్తవ దృష్టీ ప్రదర్శించ లేదు. దళితుల న్యాయాన్యాయాల విషయంలో ఒక అగ్రకులస్థుడు ఎలా అర్థం చేసుకోగలడో సుప్రీంకోర్టు కూడా అదే అర్థం చేసుకుంది. లేదా అదే అర్థమైంది.

ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిధిలోకి వచ్చే ఘటనల్లో అత్యల్పంగానే కేసులు నమోదవుతున్నాయి. వాటిలో కూడా మరీ అల్పంగా నిందితులకు శిక్షలు పడుతున్నాయి. ఇదీ ఈ చట్టం అసలు అమలు తీరు. దళితుల, ఆదివాసుల రక్షణ కోసం తెచ్చిన ఈ చట్టాన్ని ఎవరైనా సరే పైన చెప్పిన రెండు వాస్తవాల మీద ఆధారపడి సమీక్షించాలి. న్యాయస్థానానికి ఇదే కనీస ప్రాతిపదిక కావాలి. అంటరానితనం, ఆదివాసీ.. ఆదివాసేతర వివక్ష అనుభవిస్తున్న దళితులు, గిరిజనుల మీద జరిగిన దాడుల్లో ఎందుకు శిక్షలు పడటం లేదు అని అలోచించాల్సిన న్యాయస్థానం దాన్ని తిరగేసి చూసింది. ఆ రకంగా అది నికార్సయిన అగ్రకుల వాదన వినిపించింది. ఈ కేసుల్లో నిందితులకు శిక్షలు పడటం లేదు కాబట్టి ఈ కేసులన్నీ తప్పుడు కేసులే, చట్టం దుర్వినియోగపరుస్తున్నట్లే.. అనే నిర్ధారణకు వచ్చింది.

కాబట్టి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఇలా దుర్వినియోగం కావడాన్ని అడ్డుకోవాలనుకుంది. నిజానికి దుర్వినియోగం అవుతోందా? అమలు కావడం లేదా?. అసలు అమలు కాకపోవడం, దుర్వినియోగం కావడం అనే అంశాలను వేర్వేరు స్వభావాలు ఉండే చట్టాలను పరిగణలోకి తీసుకొని న్యాయకోవిదులు లోతైన పరిశీలన చేస్తే చాలా విషయాలు బైటికి వస్తాయి. ఆయా చట్టాలు తయారు కావడం వెనుక పని చేసిన ప్రక్రియను, ప్రభుత్వ ఉద్దేశాలను పరిగణలోకి తీసుకొని పరిశీలించాల్సిన విషయం ఇది. ఉపా చట్టం ఉందనుకోండి.. అది రావడం వెనుక ప్రజా పోరాటాలు, వాటి అణచివేత అనే సంక్లిష్టమైన ప్రక్రియలో ప్రభుత్వానికి అధికారం ఉంది కాబట్టి ఫాసిస్టు స్వభావం ఉన్న ఆ చట్టం తీసుకొచ్చుకుంది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగమవుతోంది కాబట్టి దాన్ని తిరగదోడి నిర్జీవం చేస్తున్నారు కదా.. ఉపా చట్టమో, లేదా మణిపూర్‌లోని సైనిక బలగాల చట్టమో దుర్వినియోగమవుతున్నాయి కాబట్టి వాటినీ ఇలా సవరణల పేరుతోనో, మరే పేరుతోనో తీసేయండి.. అని అడగడంలో తర్కం ఉన్న మాట నిజమే. కానీ ఆ చట్టాలు ʹదుర్వినియోగంʹ కాకుండా అమలు చేయడమంటే కూడా ప్రజలను అణచివేయడమే.

కాబట్టి ప్రజలకు కాస్త పనికి వస్తాయనుకునే చట్టాల విషయంలోనే మనం అమలు కావడం లేదని, ఫలానా సామాజిక అంశాలు దీనికి కారణమని మనం విశ్లేషిస్తూ ఉంటాం. ప్రభుత్వం, దాని ʹన్యాయʹదృష్టిని పుణికిపుచ్చుకున్న కోర్టు ఇంకో వైపు నుంచి దుర్వినియోగమనే వాదన తీసుకొని వస్తాయి. ఇలా చట్టం దుర్వినియోగమవుతోందని సుప్రీంకోర్టు గతంలో ఏదైనా వేరే సందర్భంలో స్పందించిందో లేదో తెలియదు. ఇప్పుడు మాత్రం ఏ పల్లెలోకి వెళ్లి పేద అగ్రకులస్థుడినా అడిగానా ఎస్సీ, ఎస్టీ చట్టం విషయంలో ఎలా స్పందిస్తారో, సరిగ్గా అలాగే న్యాయస్థానం మాట్లాడింది. దానికి ఆధునిక న్యాయ దృష్టి లేకపోవడం కంటే ఈ దృష్టి ఉండటం అభ్యంతరం. ఇప్పుడు ప్రగతిశీల శక్తులు దీన్ని ప్రచారం చేయాలి. ఎందుకు కోర్టు కంఠస్వరం అలా ఉంది? దీనికి మన దేశంలోని ఏ సామాజిక మూలాలు కారణం? కోర్టు వ్యాఖ్యానం వల్ల ఎస్సీ ఎస్టీ చట్టం విషయంలో లోపల్లోపల గొణుక్కుంటూ చాటుమాటున మాట్లాడుకుంటున్న అగ్రకులాల వాళ్లకు బలమైన ఊతం దొరికింది. ఇంత కాలం ఈ చట్టం అలా ఉన్నందు వల్ల తామంతా బిక్కుబిక్కుమంటూ బతికామని, తమ హక్కులు కాలరాయబడ్డాయని ఇక బైటికే గట్టిగా అనగలరు. ఒక అన్యాయమైన వాదనను బరితెగించి చేయగలరు. దీని వల్ల అప్రజాస్వామికమైన అగ్రకుల భావజాలం మరింత బలం పుంజుకుంటుంది. ఇది అతి ముఖ్యమైన సమస్య. ఇంకో పక్క నుంచి దళితుల ఆత్మగౌరవ ప్రతిఘటనా పోరాటాల స్ఫూర్తి దీని వల్ల ప్రశ్నార్థకం అవుతుంది. ఇది మరో ముఖ్యమైన సమస్య.

ఏ సామాజిక కారణాల వల్ల ఈ చట్టం వచ్చిందో.. ఆ సామాజిక కారణాల వల్లే అది కనీసంగా కూడా అమలు కావడం లేదు. ఇప్పుడు అలాంటి సామాజిక రాజకీయ కారణాల వల్లే ప్రభుత్వం దాన్ని న్యాయస్థానానికి తీసికెళ్లింది. అందుకే సుప్రీంకోర్టు అలా స్పందించింది. ఈ తీర్పు కూడా సమాజంలో అగ్రకులతత్వం పెరగడమనే సామాజిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నది. ఇది ప్రగతిదాయకమైన మార్పులకు తీవ్రమైన అవరోధం.

సుప్రీం కోర్టు సవరణలతో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పూర్తిగా నిర్జీవమైంది. ఇప్పుడు దాన్ని అమలు చేయమని అడిగినా ఏ ఫలితమూ లేని దశకు వెళ్లిపోయింది. దళితులు, ఆదివాసులు తమకు దళితేతరుల నుంచి, ఆదివాసేతరుల నుంచి ఈ చట్టం పరిధిలో అన్యాయం, అవమానం జరిగిందని ఫిర్యాదు చేసినంత మాత్రాన నిందితులను అరెస్టు చేయాల్సిన పని లేదని సుప్రీంకోర్డు చెప్పింది. అంతే కాదు, ఎఫ్‌ఐఆర్‌ తయారైనంత మాత్రాన అరెస్టు చేయడానికి లేదు. ఈ చట్టం కింద ప్రభుత్వ అధికారులను అరెస్టు చేయాలంటే ప్రాథమిక నేరారోపణలకు తగిన ఆధారాలున్నాయని ఒక సీనియర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ పరిశోధించి నిగ్గుతేల్చి విశ్వసించాలి. ఇవన్నీ కుదిరి ఒకవేళ అరెస్టు చేస్తే కూడా వాళ్లు మిగతా చాలా కేసుల్లోలాగే బెయిలు తీసుకొని వెంటనే బైటికి వెళ్లిపోవచ్చు.

చట్టాల ద్వారానే సమాజం మారకపోవచ్చు. పీడితులకు, ఖండితులకు పూర్తి న్యాయం జరగకపోవచ్చు. కానీ వాళ్ల రక్షణకు ఒక చట్టం ఉండాల్సిందే. కానీ పైన చెప్పిన సవరణలతో కోర్టు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి అంత్యక్రియలు చేసింది.

No. of visitors : 344
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •