న్యాయంకోసం పోరే వాళ్లకు సంకెళ్లు

| సంభాషణ

న్యాయంకోసం పోరే వాళ్లకు సంకెళ్లు

- అరుణాంక్ లత | 07.06.2018 09:07:57am

భీమా కోరేగామ్ అల్లర్ల వెనుక ఉన్న అర్బన్ మావోయిస్టుల అరెస్ట్ʹ ఈ వార్త చదవగానే విద్రోహి కవి విప్లవ్ రావుఫ్ సాతిదార్ తో విప్లవ రచయితల సంఘం మహాసభలకు పోతున్న సమయంలో జరిగిన సంభాషణ యాదికచ్చింది. 8 మంది తెలంగాణ కు చెందిన వలస కూలీలను పట్టుకొని, వారిని మావోయిస్టులుగా చూపుతూ... ʹభీమా కోరేగం అల్లర్లలో మావోయిస్టులు ఉన్నారు. వారు వీరేʹ అని ఇండియన్ ఎక్స్ప్రెస్ లో అక్కడి పోలీసు అధికారులు విడుదల చేసిన వార్త యాదికచ్చింది. ఇప్పటికి ఆ ఎనమండుగురు తెలంగాణ వలస కూలీలు జైల్లో మగ్గుతూనే ఉన్నారు.

చారిత్రక భీమా కోరేగామ్ వీరోచిత పోరు వారసత్వాన్ని కొనసాగించాలని, నయా పీష్వాల పాలనకు అంతం పలకాలని సభ పెట్టుకున్న వాళ్లలో కొందరు అరెస్టు అయ్యారు. ప్రకాష్ అంబేద్కర్ మొదలు జిజ్ఞేశ్ మేవాని, సంజయ్ కాక్, ఆనంద్ ప‌ట్వ‌ర్ధ‌న్‌, ఉమర్ ఖలీద్ దాకా ఆ మీటింగ్ లో పాల్గొన్న వారందరిపైనా కేసులు పెట్టారు. ʹరెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారుʹ అని అభియోగం. అక్కడ మొదలైన కేసుల పరంపర ఆ ఎనమండుగురు వలస కూలీలకు వేసిన మావోయిస్టు ముద్రతో నుంచి సుధీర్ దావ్లే, సురేంద్ర గాడ్లింగ్‌, రోనా విల్స‌న్‌, షోమా సేన్‌, మ‌హేష్ రావ‌త్ దాక వచ్చింది. వీరితో పాటు కబీర్ కళా మంచ్ సభ్యుల ఇళ్లపై గ‌తంలో పోలీసుల దాడులు జరిగాయి. పూణే చిత్పవన్ బ్రాహ్మణులు, నయా పీష్వాలు, దళితుల ర్యాలీ మీద దాడికి కారకులు శంభజి బీడే, మిళింద్ ఎక్బోటే లను కాపాడేందుకు నాగపూర్ కేంద్రంగా జరిగిన కుట్ర ఇది. పుణె చిత్పవన్ బ్రాహ్మలు, rss కలిసి చేసిన కుట్ర ఇది. బుధ‌వారం ఏకంకాలంలో పూనే, ముంబై, ఢిల్లీ న‌గ‌రాల్లో ఈ ఐదుగురి ఇళ్ల‌పై దాడులు జ‌రిపి వారిని అరెస్టు చేయడం వెన‌క గ‌ల కుట్ర‌ను అర్థం చేసుకోవ‌చ్చు. వీరంతా వివిధ రంగాల్లో పీడిత కులాల, వర్గాల ప్రజల తరఫున మాట్లాడుతున్న వారు.

సురేంద్ర గాడ్లింగ్ గడ్చిరోలి పరిసర ప్రాంతాల ఆడివాసులకు కేర్ ఆఫ్ అడ్రస్. అతడి ఇంట్లో ఎప్పుడు ఒక గది కేసులకోసం గడ్చిరోలికి వచ్చే ఆదివాసీలకు రిసర్వ్ చేసే ఉంటుంది. ʹమావోయిస్టుల అర్బన్ కనెక్ట్ʹగా చిత్రించబడి జైల్లో ఉన్న సాయిబాబాకే గాక మిగతా ఐదుగురికి గాడ్లింగే లీగల్ కౌన్సిల్. ʹఅంతర్జాతీయ ప్రజా న్యాయవాదుల సంఘంʹకు ఇండియన్ చాప్టర్ అయిన ʹభారత ప్రజా న్యాయవాదుల సంఘంʹకు అఖిల భారత ప్రధాన కార్యదర్శి.

సుధీర్ ధావ్లే ʹరమాబాయి అంబేద్కర్ నగర్ కాల్పుల ఘటనʹ తర్వాత పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఆ ఘటనకు నిరసనగా ʹఉరిపోసుకున్నʹ గొప్ప గాయకుడు ʹవిలాస్ ఘోగ్రేʹ సహచరుడు. ʹవిద్రోహిʹ (తిరుగుబాటు) పత్రిక స్థాపకుడు. సంపాదకుడు. తరువాత కాలంలో సుధీర్ ఏర్పరచిన ʹరిపబ్లికన్ పాంథర్స్ʹ (కుల నిర్మూలనా కోసం పోరాటం దాని ట్యాగ్ లైన్)కి అధికార పత్రిక అయింది. మావోయిస్టులకు సహకరిస్తున్నాడనే ఆరోపణలపై మూడున్నర ఏండ్లు జైల్లో ఉండి విడుదల అయిన వ్యక్తి. ఇప్పటికి అదే ʹఆవాన్ʹ గొంతుతో పాడుతుంటే, అట్లా నిలబడి మైమరచి వింటూనే, దేహమే ఓ పిడికిలిగా మారుతాం.

ప్రో. షోమా సేన్. నాగపూర్ యూనివర్సిటీలో ఆంగ్ల విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నది. అంతే గాక విమెన్స్ స్టడీస్ డిపార్ట్మెంట్ కి ఇంచార్జ్ గా ఉన్నది. మహిళ సంఘాలలో క్రీయాశీలక సభ్యురాలిగా, హక్కుల కార్యకర్తగా గత మూడు దశాబ్దాలుగా పని చేస్తున్నది. ఒకనాటి తన సహచరురాలు ʹఅనురాధ షాన్ బాగ్ʹ @అనురాధ గాంధీ మెమోరియల్ కమిటీలో సభ్యురాలిగా ప్రతి సంవత్సరం ʹఅనుʹ స్మృతిలో స్మారక ఉపన్యాసాలు నిర్వహిస్తున్నది.

రోనా విల్సన్, కేరళకు చెందిన వాడైన JNU పూర్వ విద్యార్థి. ప్రత్యేక ప్రజాస్వామిక తెలంగాణ మొదలు అన్ని ప్రజాస్వామిక ఉద్యమాలకు సంఘీభావంగా నిలబడ్డవాడు. రాజకీయ ఖైదీల విడుదల కమిటీ (CRPP)కి ప్రజా సంబంధాల కార్యదర్శి. దేశంలో ఉన్న రాజకీయ ఖైదీల విడుదల పోరాటంలో క్రీయాశీలకంగా పనిచేస్తున్నవాడు. కౄర నిర్బంధ చట్టాలైనా UAPA, AFSPA లాంటి అనేక చట్టాలకు వ్యతిరేఖంగా జరుగుతున్న ప్రజా ఉద్యమంలో కలిసి నడుస్తున్న వాడు. వాటికి వ్యతిరేఖంగా అనేక సభలు, సమావేశాలు నిర్వహించి కృషి చేస్తున్న వాడు.

అందరికన్నా చిన్నవాడు మహేష్ రావత్. చిన్నవాడైనా ఏమి తక్కువ వాడు కాదు. డిగ్రీ స్థాయి నుండే ప్రజలను నిర్వాసితులను చేస్తున్న మైనింగ్ కి వ్యతిరేకంగా డిగ్రీ స్థాయి నుండే విస్తాపన వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నవాడు. ముంబై టిస్ లో పీజీ చేసి యూజీసీ జే ఆర్ ఎఫ్ సాధించినవాడు. విస్థాపితుల పక్షాన నిలబడి రాజ్యంతో కలబడుతున్నవాడు. బీడీ శర్మ అధ్యక్షుడిగా ఉండిన ʹభారత్ జన ఆందోళన్ʹ నాయకత్వ స్థానంలో పనిచేశాడు. గడ్చిరోలిలో రాజ్యం కూడా వెళ్లని గ్రామాలతో సత్సంబంధాలు కలిగివుండి, గ్రామసభలు నిర్వహణలో పాల్గొంటూ, ఆదివాసీ హక్కుల కోసం నిరంతరం వాళ్లతో ఉంటూ ఉద్యమిస్తున్న వాడు. అట్లా ఉండడం రాజ్యానికి కంటగింపు అయింది. మావోయిస్టు సానుభూతిపరుడు అని అరెస్టు చేశారు. అయినా ఆదివాసుల వారి హక్కులకై నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న గడ్చిరోలిలో జరిగిన ఇంద్రావతి మారణకాండ నిజ నిర్ధారణకి వెళ్లిన సభ్యులకు అండగా ఉన్నాడు. వారు నిజాలు వెలికి తీయడంలో పాత్ర పోషించాడు.

ఈ ఐదుగురు ప్రజల పక్షాన ఉండడం నచ్చని రాజ్యం ʹప్రశ్నించే ప్రతివాడు నక్సలైటేʹ అని న్యాయంకోసం పోరాడుతున్న వారిని జైలు గోడల మధ్య బందీలు చేస్తున్నది. ఆదివాసులపై జరుగుతున్న ఆపరేషన్ గ్రీన్ హంట్ ని వ్యతిరేకిస్తూ దానికి వ్యతిరేక కాంపెయిన్ చేస్తున్న సాయిబాబాను, రాజ్యం చేసిన యే ఆరోపణలు నిరూపించలేకపోయినా ʹనిత్యం అమ్ముడుపోయే న్యాయంʹ జైల్లో నిర్బంధించింది. NSA హెడ్ క్వార్టర్ నుండి వచ్చిన రాతనే, జడ్జి తీర్పు అయి కూర్చుంది. సాయిని జైల్లో చంపేసి కుట్ర చేస్తుంది. వీళ్ళందరి మీద మావోయిస్టు ముద్ర ఉంది. సైద్ధాంతికంగా మావోయిస్టు భావజాలాన్ని సమర్ధించే వ్యక్తులు. అయినా ʹభావజాలం ఉన్నదని కేసులు పెట్టరాదుʹ అని వివిధ రాష్ట్రాలు మొదలు సుప్రీంకోర్టు దాకా ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. అయినా రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని ʹచట్టమేʹ ʹచట్టవ్యతిరేకంగాʹ నిర్బంధిస్తున్నది. ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ అనే ʹక్షత్రియʹ ముఖ్యమంత్రి మనుస్మృతిని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, దళితులపై జరుగుతున్న దాడులను, ప్రతిదాడులే సమాధానం అని ʹభీం ఆర్మీʹని స్థాపించిన ʹచంద్రశేఖర్ ఆజాద్ రావణ్ʹ రామరాజ్యపు జైల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. మాములు బెయిలబుల్ కేసులతో మొదలయిన వేధింపులు చివరికి అతనిపై ʹజాతీయ భద్రతా చట్టంʹమోపే దాకా పోయింది. అజానుభాహుడైన చమార్ యువకుడు జైల్లో జరిగిన శారీరక, మానసిక హింసతో చిక్కి శల్యమయ్యాడు. అతడినీ జైల్లోనే చంపేసి కుట్ర జరుగుతున్నది. ఒకవైపు పిల్లలు చనిపోతుంటే తన స్వంత డబ్బులతో ఆక్సిజన్ కొనుక్కచ్చి పిల్లల ప్రాణాలను కాపాడిన గోరఖ్పూర్ డాక్టర్ కాఫీల్ ఖాన్ ని జైల్లోనే అంతమొందించే కుట్ర పన్నిన విషయాన్ని అతడు లేఖలో రాశాడు. ఈ ఇద్దరికి యే మావోయిస్టు భావజాలంతో సంభందం లేదు. అయినా దళితుడు, ముస్లిం అయినందుకే ఈ బ్రాహ్మణీయ ఫాసిస్టు రాజ్యానికి శత్రువులు అయ్యారు.

హిందు ఫాసిజం ఇటు దళితులకు అటు కమ్యూనిస్టు శిబిరానికి ఉమ్మడి శత్రువు. రాజ్యంలో ఉన్న హిందూ ఫాసిజం ఇద్దరిపై రక్తపువేటను కొనసాగిస్తున్నది. మిత్ర వైరుధ్యాన్ని తమ ప్రయోజనాలకోసం శత్రు వైరుధ్యంగా మారుస్తున్న అవకాశవాదులను తరిమికొట్టి విశాల శక్తులన్ని ఐక్యం కావాల్సిన సమయం ఇది. యుద్ధం జరుగుతున్న చోట మధ్యే మార్గాలు ఉండవు. ఉంటే అది పీడితులను అణచివేసే కుట్రే. ఇది కుట్రలను చేదిస్తూ కలిసి నిలవాల్సిన సమయం. కలిసి గెలవాల్సిన సమయం. లాల్ నీల్ ఐక్యత ఎన్నికల్లో ఓట్లకు కాదు. నెత్తుటప్పు తీర్చేటందుకు కావాలి. పార్టీలు మారాయి. పాలకులు మారారు. బుద్ధుడు బాబాసాహెబ్ నుండి ʹహాథి నహీ గణేష్ హై, బ్రహ్మ విష్ణు మహేష్ హైʹ అన్నవాళ్ళు ఇప్పుడు మళ్లీ ʹహాథి హాత్ దోస్తానాʹలో జుగల్ బందీ వినిపించేంతంగా మారారు. ప్రజలు మాత్రం పోరాడుతూనే ఉన్నారు. అలుపెరగని పోరాటం. గెలిచేదాక చెయ్యాల్సిన పోరాటం. చేస్తూనే ఉన్నారు. కనీసం ప్రజలు మమ్మల్ని గమనిస్తున్నారని సోయి యే మాత్రం ఉన్నా మారాలి. లేకపోతే ప్రజలే సమాధానం చెప్తారు. ఆపరేషన్ సమాధాన్ కే చెప్తున్న వాళ్ళు మీకు చెప్పరా!.

06/06/2018

No. of visitors : 875
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


బీజేపీ నమూనా.. అశ్రిత పెట్టుబడిదారి విధానంతో కలగలిసిన సాఫ్ట్ హిందుత్వ : రానా అయుబ్

ఇంటర్వ్యూ : అరుణాంక్ | 16.07.2016 01:13:23pm

బి.జె.పి నమూనా అశ్రిత పెట్టుబడిదారి విధానంతో కలగలిసిన సాఫ్ట్ హిందుత్వ . బి.జె.పి పైకి హిందుత్వగా కనపడుతున్న కాంగ్రెస్ కన్నా పెట్టుబడి అనుకూల వైఖరీ ఉన్న......
...ఇంకా చదవండి

ఉదాస్ మౌస‌మ్ కే ఖిలాఫ్

అరుణాంక్, డిఎస్‌యూ | 23.03.2017 09:19:39am

భ‌గ‌త్‌సింగ్, పాష్‌ల ప్రాసంగిక‌త ఇవాల్టికీ ఉంది. పాష్ మాట‌ల్లోనే చెప్పాలంటే ʹహ‌మ్ లడేంగే సాథీ ఉదాస్ మౌస‌మ్ కే కిలాఫ్ʹ అంటూ క‌ద‌లాల్సిందే. ...
...ఇంకా చదవండి

అడవిని కాస్తున్న వెన్నెల

అరుణాంక్ | 04.09.2017 09:51:34am

పాట దూరమైంది. పాట పాడే గొంతు దూరమైంది. వినపడనంత. కనపడనంతదూర వెళ్ళారు వాళ్ళు. మదిలో, మస్తిష్కంలోవెన్నెల చెప్పిన మాటలే. వెన్నెలని ఎంత అద్భుతంగా చెప్పింది. వెన...
...ఇంకా చదవండి

అలసెంద్రవంక

అరుణాంక్‌ | 05.05.2017 01:06:18pm

నా ʹఅలʹలో ఎంత మార్పు. ʹమాటీగరిʹ ఇచ్చి చదవమన్నప్పుడు తెలుగు చదవడం కష్టంగా ఉంది అన్న అల ʹఅంటరాని వసంతంʹ గురించి మాట్లాడుతు ʹరేయ్ నాకు అటువంటి జీవితం లేదుʹ అన...
...ఇంకా చదవండి

యుద్ధానంతర యుద్ధగీతం

అరుణాంక్ | 06.09.2018 11:50:31pm

ప్రశ్నించిన ప్రతివాడు నక్సలైటే ఓ నా తెలంగాణ నేల నీకు గుర్తుందా! నీ మీదుగా దండకారణ్యానికి ఉద్యమమే కాదు ఇప్పుడు నిర్బంధమూ విస్తరించింది కాకపోతే రూరల్ పేద .....
...ఇంకా చదవండి

నెలవంక సందేశం

అరుణాంక్ | 16.06.2018 12:36:48am

ప్రశ్నించిన చోటల్లా బందీ కాబడుతున్న వాళ్ల సాక్షిగా దేశ ముఖచిత్రాన్ని మార్చే ఒక్క వాక్యం రాద్దాం ఒక్క కవాతు చేద్దాం ... ...
...ఇంకా చదవండి

అల అడిగిన కథ

అరుణాంక్ | 18.08.2017 10:00:25am

ఎండిన చేపలు కాదు అవి. ఎండిన డొక్కలకు ఆహారమైన చేపలు. బతుకనీకి భరోసానిచ్చిన చేపలు....
...ఇంకా చదవండి

కడలి

అరుణాంక్‌ | 05.03.2018 08:26:10am

రెండు సరిహద్దులను కలిపే వంతెనై కడలి సరిహద్దును పహారా కాసే నిగాహ్ నేత్రమైన సెంట్రీ కడలి జనమై కడలి జనసందోహమై కడలి...
...ఇంకా చదవండి

ఆలోచన ఒక మహారణ్యం

అరుణాంక్‌ | 17.04.2018 12:31:36am

మరణించేది వ్యక్తులే శాఖోపశాఖలుగా విస్తరిస్తున్న మహారణ్యం వారి ఆశయం వారి ఆలోచనలు...
...ఇంకా చదవండి

Dream to Dream

అరుణాంక్‌ | 22.07.2018 01:05:48am

కలిసి కట్టుకున్న కలల సౌధం మిసైల్ పడ్డట్టు నిట్టనిలువునా కుప్పకూలిపోయింది కలిసి కన్న కల వేటగాడ్ని చూసిన పావురాల గుంపులా చెదిరిపోయింది...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •