వీవీపై అక్రమ కేసు విరమించుకోవాలి

| సంభాషణ

వీవీపై అక్రమ కేసు విరమించుకోవాలి

- | 15.06.2018 11:54:17pm

వరవరరావు తెలుగు సాహిత్యంలో సుప్ర సిద్ధ రచయిత. అరవై ఏళ్ల నుంచి కవిగా, రచయి తగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా సాహిత్య కృషి చేస్తున్నారు. సముద్రం, చలినెగళ్లు, ఆ రోజులు లాంటి కవితా సంపుటాలను ప్రచురిం చారు. ʹతెలంగాణ విమోచనోద్యమ నవలలʹపై విలువైన పరిశోధనను చేశారు. ఈ పరిశోధన వివిధ విశ్వవిద్యాలయాలలో రెఫరెన్స్‌గా ఉంది. ʹభూమి తో మాట్లాడు...ʹ లాంటి కల్పనా సాహి త్యంపై విమర్శ గ్రంథాలను రాశారు. వరంగల్‌ లోని సి.కె.ఎం. కళాశాలలో సుదీర్ఘ కాలం తెలుగు అధ్యాపకులుగా, కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. కవిగా, రచయితగా, వక్తగా, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాహిత్య విశ్లే షకుడిగా ఆయనకు దేశవ్యాపిత గుర్తింపు ఉంది. తెలుగు సమాజంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం కోసం ఆయన నక్సలైట్లకు, ప్రభు త్వానికి మధ్య జరిగిన చర్చలలో ప్రతినిధిగా పాల్గొని తన బాధ్యతను నిర్వహించారు.

వరవరరావు 1970లో ఏర్పడిన విప్లవ రచ యితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. ప్రజాకవి శ్రీశ్రీ, కాళోజీలతో కలిసి పనిచేశారు. ఆయన నమ్మిన విలువల కోసం, సిద్ధాంత రాజకీయాల కోసం అరవై ఏళ్లుగా రాజీ లేకుండా పనిచేస్తు న్నారు. ఇట్లాంటి వ్యక్తులు మన సమాజంలో ఉండటం సామాజిక చలనానికి అదనపు కూర్పు. భిన్న భావాలు కలిగి ఉండటమనే ప్రజాస్వామిక సూత్రానికి ఆయన లాంటి వాళ్లు ఒక ఉదాహరణ. భారత సమాజం మొదటి నుంచి అన్ని ఆలో చనలకు నిలయంగా ఉంది. వరవరరావు విప్లవా చరణ సాహిత్యంలోనే కానీ ఇతరేతర రూపాలలో కాదని మేము నమ్ముతున్నాం. విప్లవ పార్టీల చర్యలతో ఆయనకు సంబంధం ఉండే అవకాశం లేదు. రచయిత స్వేచ్ఛగా తన భావాలను వ్యక్తం చేసే అవకాశం ఉన్నప్పుడే సృజనాత్మక సాహిత్యం వికసిస్తుంది. భావాలను ఆధారంగా చెబుతున్న లేఖలో వరవరరావు ప్రస్తావనను ఆధారం చేసు కుని రచయితను వేధించడం సరైంది కాదు కనుక మహారాష్ట్ర పోలీసులు అక్రమ కేసులో ఆయనను ఇరికించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని మేము విజ్ఞప్తిచేస్తున్నాము. వరవరరావుపై అక్రమ కేసును మోపే ప్రయత్నాన్ని విరమించుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

(నిఖిలేశ్వర్, నందిని సిధారెడ్డి, పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.రామచంద్రమూర్తి, కె.శ్రీని వాస్, గద్దర్, అంపశయ్య నవీన్, పాశం యాద గిరి, ఓల్గా, విమలక్క, దేవిప్రియ, యాకూబ్, కాత్యా యని విద్మహే, గోరటి వెంకన్న, సురెపల్లి సుజాత, విల్సన్‌ సుధాకర్, కొండేపూడి నిర్మల, జయధీర్‌ తిరుమలరావు. నగ్నముని, కె.శివారెడ్డి, ఖాదర్‌ మొహినుద్దిన్‌ తదితర 35 మంది రచయితలు, కవులు, కళాకారులు)

No. of visitors : 506
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం
  సుక్మా బూటకపు ఎదురుకాల్పులు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •