కార్పోరేట్ కంపెనీల ఏజెంట్‌గా మోదీ స‌ర్కారు

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

కార్పోరేట్ కంపెనీల ఏజెంట్‌గా మోదీ స‌ర్కారు

- చ‌ర‌ణ్‌ | 16.06.2018 12:42:29am

మోడీ ప్రభుత్వం నాలుగేళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు జరుపుకుంటోంది. అందుకు తగ్గట్టు ఇటు ప్రభుత్వం, వారి అనుకూల కార్పొరేట్ మీడియా ఈ నాలుగేళ్ల పాలనపై విస్తృత ప్రచారం చేస్తోంది. ఒకవైపు ప్రజలు అధిక ధరలు, నిరుద్యోగం, మహిళలపై అత్యాచారాలు, ఆకలి భాదలతో ఇబ్బందులు పడుతుంటే, ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటూ అధికార దర్పంతో నోటికొచ్చింది మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారు. ఆవు మాంసం తిన‌కూడ‌దంటూ గో ర‌క్ష‌క ద‌ళం పేరుతో ముస్లీంలు, దళితులపై దాడులు, హత్యాలకు పాల్పడుతున్నారు. కథువా, ఉన్నావ్ రేపు కేసుల్లో నిందుతులుగా ఉన్న బీజేపీ నేతలను రక్షించే పనిలో నిమగ్నమై ఉన్న ఆర్ఎస్ఎస్, బీజేపీని చూస్తుంటే వారి మనువాద, మహిళ వ్య‌తిరేక వ్య‌తిరేక వైఖ‌రి స్పష్టమౌతూనే ఉంది. బేటి బచావో బేటీ పడావో అనే నినాదం వేనుక ఉన్న అసలు అర్ధం ఎటువంటిదో తెలిసిపోతూనే ఉంది. మ‌రోవైపు డిజిటల్ ఇండియా అనే పనికిరాని నినాదంతో దేశ విదేశ కార్పోరేట్ కంపీనీలకు భూములు నిధులు దారాదత్తం చేస్తున్నారు.

మోదీ ప్రతి ఏడాది 10లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. అయినా ఇంకా మనదేశంలో 18కోట్ల మంది నిరుద్యోగులు అలాగే ఉన్నారు. నాలుగేళ్లలో కేవలం లక్షన్నర ఉద్యోగాలే కల్పించగలిగారు. పెద్ద‌ నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్వవస్థపై పెను ప్రభావం పడింది. దాంతో చిన్న వ్యాపారులు చాలా వరకు రోడ్డున‌ప‌డే పరిస్థితి వచ్చింది. చిన్న వ్యాపారులు ఒక్కరే కాదు దానికి అనునసంధానంగా ఉన్న 5కోట్ల మందికి తిండి కూడా దొరకక మరింత పేదరికంలోకి నెట్టబడ్డారు. ఎంతో మంది రైతులు పంట రుణాలు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మోడీ ప్రభుత్వం ప్రైవేటు స్కూల్స్ ను ప్రోత్సహించండానికి నాలుగు లక్షల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయించింది. దేశంలో ప్రతి గంటకు ఒక విద్యార్థి అధిక ఫీజలు కట్టలేక ఆత్మహత్యాలు చేసుకుంటన్నారు. దేశంలో కొత్తగ ఆరోగ్య విధానం అనే పేరుతో ఉన్న ఆ కొద్ది ప్రభుత్వ హస్పిటల్స్ ను మూసివేసి పూర్తిగా ప్రైవేటు పరం చేయాలని ఆలోచనలో ఉన్నారు. నీతి అయోగ్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలు జిల్లాలోని ప్రభుత్వ హస్పిటల్స్ కు సంబంధించిన భవనాలు, భూములు లెక్క తేల్చి ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పగించే ముసాదాను తయారు చేశారు. నిజానికీ ఇప్పుడు బీజాపూర్ జిల్లాలో ఒక కూ గ్రామంలో ఉన్న ప్రాథమిక చికిత్సాలయానికి ఆయుష్మాన్ భారత్ బోర్డు తగిలించి ప్రధానమంత్రి ప్రజల మనోభావాలు గాయపరిచారు. ఒక్క సారి కళ్లు తెరిచి దీర్ఘంగా చూస్తే ప్రజా ఆరోగ్య సేవలు ఎంత దారుణ పరిస్థితో ఉన్నాయో అర్ధమైతుంది. దేశంలో 10వేల మందికి ఒక్క డాక్టరు పనిచేస్తున్నారు. అదే చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో 20వేల మందికి ఒక డాక్టరు పనిచేస్తున్నారు. ఇక ప్రభుత్వ హస్పిటల్స్ లో 5వేల మందకి ఒక బెడ్ అందుబాటులో ఉన్న పరిస్థితి. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతి వ్యక్తి మీద 75డాలర్లు ఖర్చు చేస్తుంది. అదే అమెరికాలో ప్రతి ఏడాది 9403డాలర్లు, చైనాలో 420డాలర్లు ఖర్చు చేస్తుంది. మన దేశం శ్రీలకం, భూటాన్ దేశాలకంటే కూడా వైద్యం కోసం ఖర్చు చేస్తుంది. వేయి మందికి ఒక డాక్టరు పనిచేస్తున్నడంటే అది ప్రపంచంలో ఒక మంచి వ్వవస్థ కింద ఉన్నట్టు లెక్క. కానీ అలా వెయ్యి మందకి ఒక డాక్టరును అందుబాటులో ఉంచాలంటే మన దగ్గర ఇంకా మూడు లక్షల మంది డాక్టర్లు అవసరం ఉంటారు. కానీ మనకు అంత మంది డాక్టర్లు లేని దేశంగా ఉంది. ప్రభుత్వం ప్రైవేటు కార్పోరేట్ హస్పిటల్స్ లో ఖాతాలో డబ్బులు వేయడానికి 5లక్షల రూపాయ‌లతో ఆయూష్మాన్ భారత్ పథకం పెట్టి కార్పొరేట్ కంపెనీల ఖాతాలోకి ఈ మొత్తాన్ని వేసే ప్రయత్నం చేస్తుంది. ఈ నిజాన్ని దాచి పెట్టి కార్పొరేట్ మీడియా ద్వారా ప్రజల కళ్లలలో దుమ్ము కొడ్తుంది.

నిత్యావసర వస్తువులు, పెట్రోలు, డిజిల్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత మే నెల 14 నుంచి 22 వరకు 8రోజుల్లో పెట్రోలు మీద ఒక్కసారిగా 1రూపాయి 95 పైసలు డిజిల్ పై 1రూపాయి90పైసలు ధరలు పెంచారు. దీంతో నిత్యావసర వస్తువలు ధరలు మరింతగా పెరిగాయి. దేశంలో ప్రజలకు తాగు నీళ్లు కూడా దొర‌క‌ని పరిస్థితి దాపురించింది. రాజధాని నగరానికి దగ్గర గల రాయ్ పూర్ లో కలుషిత నీటిని తాగి అనేక మంది ప్రజలు రోగాల పాలై ప్రాణాలు కొల్పోతున్నారు. ప్రధాని మోడీ-రమణ్ సింగ్ లోక్ సూరజ్ యాత్ర పేరుతో హెలికాప్టర్ లో తిరుగుతూ ప్రజాధనాన్ని నీళ్లలాగ ఖర్చు పెడుతున్నారు. కార్పొరేట్ వ్వవస్థకు అనుకూలమైన పనులు చేస్తూ నిసిగ్గుగా ప్రచారాలు చేసుకుంటున్నారు. ప్రైవేటు కంపెనీలు టాటా, ఎస్సార్ గ్రూప్, జిందాల్, వేదాంత, అదాని కంపెనీల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి.

గడిచిన ఐదు దశాబ్దాలుగా భూమి, అడివి, నీళ్లను నిర్దాక్షిణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొచుకుంటున్నాయి. ప్రైవేటికరణ పేరుతో అనేక మైనింగ్ భూములను కార్పోరేటు ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేశి పెడుతున్నాయి. డిల్లీ ప్రభుత్వం ఎన్ఎమ్ డీసీ పేరుతో బైల‌డిల్లాలో ఉన్న మైనింగ్ భూములను ఎస్సార్ అలాగే జపాన్ కంపీలను ఇచ్చింది. ఇప్పుడు టాటా, జిందాల్ కంపెనీలకు బైల్లడిల్లా గుట్టల్లో మైనింగ్ తవ్వుకోవడానికి లీజ్ కు ఇవ్వబోతుంది. అక్క‌డ మైనింగ్‌ తక్వకాలు జరుగుతున్నందు వల్ల అందులోంచి రసాయనాలు బయటకు వచ్చి నదులు, కాలువలు కలుషితమైన ఎరుపు రంగులోకి మారి మోరీలుగా మారిపోయాయి. వాటి దుష్పభావం మూలంగా ప్రజలు అనారోగ్యాలపాలై మరణిస్తున్నారు. ఇన్ని విధాలుగా ఆదివాసి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా మోడీ-రమణ్ సింగ్ లకు వారి బ్రతుల గురించి ఇసుమంతైనా కనికరం లేదు. కేవలం టాటా, జిందాల్ కంపెనీలు ఇచ్చే లాభాలే ఎంతొస్తున్నయ‌ని మాత్రమే ఆలోచిస్తుంటారు. మైనింగ్ తవ్వకాలతో చుట్టూ పక్కల కలుషితమవ్వడంతో ఆదివాసీ ప్రజలు అనేక సార్లు ఆందోళనకు దిగారు. కానీ ఎన్ని సార్లు ఆందోళనకు దిగినా అభివృద్ధి పేరుతో ఆదివాసీ ప్రజల జీవితాలతో ఆడుకుంటునే ఉన్నారు. ప్రభుత్వాలు ఒక పెద్ద మైనింగ్ మాఫీయా లా పనిచేస్తున్నాయి.

తాజాగా చ‌త్తీస్‌ఘ‌డ్ ఎన్ఎమ్ డీసీలో స్థానిక అభ్యర్ధలకు ఉద్యోగాలు కల్పించకుండా పోటితత్వం, కాంట్రాక్టుల పేరుతో బయటి వారికి ఉద్యోగాలు ఇచ్చారు. స్థానిక ఆదివాసీ యువకులు స్థానిక ఉద్యోగాల కోసం ఆందోళనలకు దిగితే పోలీసులు, మిలటీరిలో అధిక సంఖ్యలో చేర్చుకుంటున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మే 21న అంభికాపూర్ లోని కేపి గ్రామంలో ఉన్న సీఆర్పిఎఫ్ 241వ బెటాలియన్‌ను బస్తర్ వారియర్స్ పేరుతో ఏర్పాటు చేసే సందర్భంగా దేశంలో మావోయిజం అంతమైతుందని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి రమణ్ సింగ్ చ‌త్తీస్‌ఘ‌డ్‌ను మావోయిస్టు ముక్తి రాష్ట్రంగా మార్చుతామ‌ని మాట్లాడారు.

మేము, రైతుల, కార్మికుల, విద్యార్ధుల, మహిళలతో ఒక విషయం అప్పీల్ చేస్తున్నాం. మోడీ –రమణ్ సింగ్ సడాక్ సంచార్ పథకం కింద ఎంత మందకి పని దొరికింది? బస్తర్ సంభాగ్ లో ఒక లక్ష ఎకరాల ఆదివాసీ భూములను లాక్కొని కార్పొరేట్ కంపెనీల అభివృద్ధి మెడల్ కోసం సడ‌క్ సంచార్ పథకం తీసుకు వచ్చారు. మావోయిజం అంత‌మైతే బస్తర్ బెటాలియాన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఒక నెల రొండు నెలల్లోనే నాలుగు బెటాలియాన్ల‌ అర్థసైనిక ద‌ళాలు బస్తర్ ప్రాంతానికి ఎందుకు వస్తున్నారు. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం ప్రతి ఏటా అర్తసైనికుల పై 2500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ కింది స్థాయి ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. చాలా చోట్ల ఉపాధ్యాయులను ఇప్పటివరకు పర్మినెంట్ ఎందుకు చేయలేక పోయింది? అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 75వేల ఉపాధ్యాయ పోస్టులు, 1500 డాక్టర్ పోస్టులు 12వేల నర్సుల పోస్టులు ఎందుకు భర్తీ చేయలేక పోయింది? కేవలం పోలీసుల భర్తీకి అధిక ప్రాధాన్యం ఎందుకిస్తున్నట్టు? దేశం లో ప్రతీ 10వేల మందికి ఒక డాక్టర్ ఉంటే... దేశంలో 640మందికి ఒక పోలీస్ ఉంటున్నాడు. ఇక బస్తర్ లో 35మందికి వెనక ఒక పోలీస్ ఉంటున్నాడు. విద్య, వైద్యం, త్రాగునీరు, ఉద్యోగ కల్పన అనేవి బీజేపీ ప్రాథమిక ఎ జండా కాదు. దేశ - విదేశ కార్పొరేట్ సంస్థల కోసం మాత్రమే జల్, జమీన్, జంగల్ అంటూ ప్రకృతిని దొచిపెట్టాడనికి బస్త‌ర్‌ లో ఒక లక్షా 60వేల మంది సైనికులను కాపలాగా ఉంచారు. మావోయిస్టుల‌ను 2022వరకు అంతం చేయాలనే ప్రతీ రోజు గస్తీలు వెతుకులాటల పేరుతో పూజారికాంకర్, తుమ్మిర్ గూడ, బోరియల‌ లో ఆదివాసీ ప్రజలను హింసిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల కనీస అవసరాల గురించి పట్టించుకోదు. దళిత, ఆదివాసీ, మైనార్టీ, మహిళ, బీద ప్రజల వ్య‌తిరేక ప్ర‌భుత్వం ఇది. కేవలం కార్పొరేట్ సంస్థలకు ఒక ఏజెంట్ లాగ పనిచేన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సామ్రాజ్య‌వాద అనుకూల విధానాల‌కు వ్య‌తిరేకంగా బ‌ల‌మైన ప్ర‌జా ఉద్య‌మాలు నిర్మించాల్సిన అవ‌స‌రం ఉంది.

No. of visitors : 399
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ʹసమాధాన్‌ʹ ప్రజల దగ్గర ఉంది - అయిదు వసంతాల ప్రతిఘటనారావం

యూసఫ్‌బీ | 21.05.2017 07:26:22pm

మావోయిస్టు మూలాలు విచ్ఛిన్నం చేయడం ద్వారా ఉద్యమాన్ని దెబ్బతీయాలనేది అసలు అర్థం. కానీ పాలకులకు ఒక విషయం తెలియడం లేదు. మావోయిస్టుల మూలాలు ఈ దేశ దోపిడీ ఉత్ప......
...ఇంకా చదవండి

అవి స్వప్నాలు కావు వాస్తవాలు

పి.శంకర్‌ | 03.07.2018 02:10:57pm

రచయిత తన స్నేహితులతో కలిసి సారాయి చుక్కలు సేవిస్తూ పున్నమి రాత్రులలో మాడియా నృత్యాలను తిలకించే రచన ఆమె కలం నుండి రావడం జనతన సర్కార్లున్న చోటే సాధ్యం.....
...ఇంకా చదవండి

Make True Their Dreams

sankar | 03.07.2018 02:16:09pm

Only then her dream can come true. Let us fight united for a natural life of the tribals and make true their dreams for the same......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •