రాజ్య హింసలో కేంద్ర, రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలతో తెలుగు ప్రభుత్వాలు కూడా సరిసమానమే

| సాహిత్యం | వ్యాసాలు

రాజ్య హింసలో కేంద్ర, రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలతో తెలుగు ప్రభుత్వాలు కూడా సరిసమానమే

- వరవరరావు | 16.06.2018 05:21:04pm

షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌, షెడ్యూల్డ్‌ ట్రైబ్‌లపై జరిగే అత్యాచారాల నిరోధక చట్టాన్ని సుప్రీంకోర్టు తీర్పు మార్చి 20వ తేదీన నీరు గార్చడం వల్ల దళితులమీద, ఆదివాసులమీద వెంటనే ప్రారంభమై హింసా దౌర్జన్యాలు తీవ్రతరమవుతున్న తీరు కేవలం బిజెపి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోటనే కాదు, దేశమంతటా కనిపిస్తున్నది.

ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంతో తీవ్రంగా తలపడుతున్నట్లు కనిపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం వారం రోజులు తిరగకముందే మార్చి నెలాఖరున విరసం సభ్యుడు పృథ్విరాజ్‌, చంద్రన్‌ మిశ్రాలను కిడ్నాప్‌ చేసి కేంద్ర విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ పొదిలి అప్పారావు హత్యాప్రయత్నం కేసులో ఇరికించినవిషయం ఇప్పుడందరికి తెలుసు. అయితే ఇది కేవలం భారత శిక్షా స్మృతిలోని కుట్ర, హత్యాప్రయత్నం అనే సెక్షన్‌లే కాకుండా మరో రెండు అప్రజాస్వామిక చట్టాల కింద కూడా మోపడమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పై సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం వల్ల జరిగింది. అవి ఒకటి యుఎపిఎ, రెండోది ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌. మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ హైకోర్టులో వీరిద్దరి బెయిల్‌ గురించి వేసిన పిటిషన్‌ సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత సోమవారం 18వ తేదీన తీర్పు వెలువడనున్నది.

ఇది ఇలా ఉండగా ఈ కేసు విచారణలో సేకరించవలసిన సమాచారం విషయంలో మీ సహకారం కావాలని భారత శిక్షా స్మృతి 160 సెక్షన్‌ కింద కృష్ణా జిల్లా విరసం కన్వీనర్‌, కార్యవర్గ సభ్యుడు అరసవెల్లి కృష్ణ, సభ్యులు పెద్ది కృష్ణ, మేడక యుగంధర్‌లకు ప్రగతిశీల కార్మిక సంఘం రెండు రాష్ట్రాల కన్వీనర్‌ కొండారెడ్డికి తూర్పుగోదావరి జిల్లా చింతూరు పోలీసుస్టేషన్‌ నుంచి సమన్లు పంపారు. అటువంటి సమాచారం తమదగ్గర ఏమీ లేదన్నా, సహకరించలేదని పోలీసులు భావించినా, వాళ్లని ఈ కేసులో నిందితులుగా చూపే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇది ఒక పొంచి ఉన్న ప్రమాదం. ముఖ్యంగా విరసంపై ఇతర ప్రజా సంఘాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎఒబి మారణకాండ కాలం నుంచి కూడా కక్షపూర్వకంగా వ్యవహరిస్తున్న తీరుకు ఇది మరొక దాఖలా.

కేంద్రంలో మాత్రమే కాకుండా 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి పైన వాస్తవంగా అంతకన్నా తీవ్రంగా కాంగ్రెస్‌పై వ్యతిరేకత ప్రదర్శిస్తున్న కెసిఆర్‌ ఇటీవల మూడో ఫ్రంట్‌ ప్రతిపాదన చేశాడు. అత్యుత్సాహంగా మమతా బెనర్జీ (బెంగాల్‌), స్టాలిన్‌ (తమిళనాడు)లను వెళ్లి కలిసాడు. అఖిలేశ్‌ యాదవ్‌(యుపి)ను హైదరాబాద్‌కు ఆహ్వానించాడు. కాని ఈ ముగ్గురు కూడా బిజెపిని ఓడించడానికి కాంగ్రెస్‌ పొత్తును కాదంటే కుదరదనే అభిప్రాయం వెలుబుచ్చడంతో కర్ణాటక వెళ్లి కుమారస్వామిని కలిసాడు. మొదట ఉత్సాహం చూపినా, తన గెలుపుకు చంద్రబాబు, చంద్రశేఖర్‌ రావుల సహకారమే కారణమని చెప్పినా, ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌తో కలిసి ఏర్పాటు చేసాడు. తెలంగాణలో కెసిఆర్‌తో స్నేహంగా ఉన్న చంద్రబాబు కర్ణాటకలో బిజెపిని ఓడించడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్‌కు సహకరించాడు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన వేదికపై సోనియా గాంధీతో ఎంతో స్నేహపూర్వకంగా కనిపించాడు. ఈ పదవీ స్వీకార ఉత్సవానికి ప్రత్యేక ఆహ్వానం పొందిన కెసిఆర్‌ ముందు రోజే వెళ్లికలిసి తప్పించుకున్నాడు.కనుక ఈక్రమమంతా ఈ మూడో ఫ్రంటు బిజెపి కోసమే తెరిచిందని రాజకీయ పార్టీలకే కాదు, మీడియాకే కాదు, ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమయింది. ఛండీయాగాలు, వాస్తు, జీయర్‌ స్వామి కనుసన్నల్లో నడుస్తున్న పాలన వంటి అంశాల వలన కెసిఆర్‌కు హిందూ బ్రాహ్మణీయ భావజాలం ఎంత బలంగా ఉందో దాచినా దాగని సత్యం.

ఇటువంటి కుల, వర్గ స్వభావం పాలనలో మాత్రమే కాదు, అణచివేతలో కూడా స్పష్టంగా బయటపడుతుంది. అధికారంలోకి రాగానే ఎన్‌డిఎలో ఉన్న చంద్రబాబు కన్నా తానే మోడీని ప్రసన్నం చేసుకోవాలని వికారుద్దీన్‌ అతని నలుగురు సహచర ముస్లిం యువకులను ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపాడు. ఎక్కడో అడవిలో కాదు, హనుమకొండ ఆలేరు రోడ్డు మీద వరంగల్‌ జైలు నుంచి హైదరాబాద్‌ కోర్టుకు ఒక బస్సులో సాయుధ బందోబస్తుతో తీసుకువస్తూ బస్సు సీట్లలో పెద్ద పెద్ద గొలుసులతో వాళ్ల కాళ్లు చేతులు బంధించారు. మూత్ర విసర్జనకు కిందికి దిగుతామనే నెపంతో తప్పించుకోజూశారని కాల్చి చంపారు. అక్కడ తిరుగుతున్న పశువుల కాపరులతో సహా మీడియా వరకు ఈ దృశ్యాలన్నీ మొబైల్‌ఫోన్‌లలో బంధించారు. 50 ఏళ్ల నక్సలైట్‌ల ఎన్‌కౌంటర్‌ల చరిత్రలో కూడా ఇంత దుర్మార్గమైన సంఘటన లేదు. లంకపెల్లిలో వివేక్‌తోపాటు అమరులైనా ఇద్దరు మహిళలు ఆదివాసీలు. తెలంగాణ గడ్డమీదనే అమరురాలైన శృతి సామాజికంగా అట్టడుగు బడుగు వర్గం నుంచి వచ్చిన విద్యావంతురాలు. సాగర్‌ నిరుపేద. అతని ఎన్‌కౌంటర్‌తో గుండెపగిలి కొద్ది నెలల్లోనే తల్లి చనిపోయింది. బొట్టెంతోగు ఎన్‌కౌంటర్‌లో అమరులు యూసుఫ్‌ బీ మెదక్‌జిల్లా నుంచి ముస్లింసామాజిక వర్గం నుంచి, సృజన దళిత సామాజిక వర్గంనుంచి సోని ఆదివాసి సామాజికవర్గం నుంచి వచ్చి విప్లవ చైతన్యంతో మావోయిస్టు పార్టీలో చేరినవాళ్లు. ఇట్లా చెబుతూ పోతే ఆదివాసీ దళితులు లేని ఎన్‌కౌంటర్‌గాని, తెలంగాణ గ్రేహౌండ్స్ పాల్గొన‌ని ఎన్‌కౌంటర్‌గాని లేవు. హరితహారాల కోసం పోడుభూముల ఆక్రమణ, మేడిగడ్డ నుంచి కాళేశ్వరం వరకు ఆదివాసిల ముంపు వంటి ఎన్నో ఉదాహరణలు ఆయన ఆదివాసి వ్యతిరేకతకు నిదర్శనాలు.

అట్లేె పాతపెల్లి (మహబూబ్‌ నగర్‌),మంథని (కరీంనగర్‌), నేరెళ్ల (సిరిసిల్ల), అభంగపట్నం(నిజామాబాద్‌)సంఘటనలు ఎంఆర్‌పిఎస్‌పై తీవ్రనిర్బంధం, ఎంఆర్‌పిఎస్‌ మహిళా నాయకురాలు భారతిని పోలీసు కాల్పుల్లోచంపడం నుంచి కృష్ణ మాదిగ ఆరోపణ ప్రకారం. ఆయనపై హత్యాప్రయత్నం కుట్ర వంటి ఎన్నో ఉదాహరణలు ఆయన దళిత వ్యతిరేకతకు నిదర్శనాలు.

ఇంక సిరిసిల్లజిల్లాలోని ఇల్లంతకుంట మండలం కందికొట్కూరు కిష్టారావు పల్లెలో ఎల్లయ్య, ఎల్లవ్వ దంపతులు, వారి కుమారులు అనిల్‌ తమ 38 గుంటల భూమిలో హత్యకు గురి అయిన నెత్తుడి తడి ఆరలేదు. బందగీ వలె అది కోర్టులో పోరాడి దున్నుకుంటున్న భూమి. చుండూరులో వలె చివరకు వాళ్ల మృతదేహాలను తమ భూమిలోనే ఖననం చేయడానికి కూడా అవకాశం లేకపోయింది. ఎందుకంటే ఆ ముగ్గురిని చంపిన ముదిరాజ్‌ దేవయ్య కుటుంబీకులు ఈ తీర్పుపై హైకోర్టుకు పోవడమే కాకుండా తామే గొడ్డళ్లతో ఈ దళితుల్ని నరికి తీర్పు చెప్పేసారు.అయినా పోలీసు దృష్టిలో ఈ భూమి ఇంకా వివాదాస్పదమైంది. అప్పటి దాకా దళితుల నెత్తురు చెమటయి తడిసిన భూమి. జూన్‌ 11న నెత్తురే నెత్తురుగా చిందిన భూమి. శరీరాలకే అంటరానిశరీరాలుగాని గొడ్డళ్లకు కాదు.

కెసిఆర్‌ తెరాస ప్రభుత్వపు ఆదివాసి, దళిత, ముస్లింమైనారిటి వ్యతిరేకతను ఈ నాలుగేళ్లలో విహంగ వీక్షణంగా చూడటానికి మాత్రమే ఈ వివరణ. ఈ నేపథ్యంలో చూడాలి యుఎపిఎ, పబ్లిక్‌ సెక్యురిటీ యాక్ట్‌, 120 (బి), అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న నేరం వంటి ఆరోపణలపై డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు బద్రి, రాష్ట్ర కమిటీ సభ్యులు రంజిత్‌, సుధీర్‌ల కిడ్నాప్‌, అక్రమ లాకప్‌, చూపిన అరెస్టు ఉస్మానియా యునివర్సిటిలో పిహెచ్‌డి చేస్తున్న బద్రిఅతి పేద వృత్తి కులం నుంచి వచ్చినవాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడని కాలం నుంచి కూడా ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసి నిర్బంధాలను ఎదుర్కొన్నాడు. ఆయన ఇద్దరు పిల్లలను బడిలో చేర్చడానికి హనుమకొండలో ఇంటికి వెళ్లిన సందర్భంగా ఆయనతో పాటు మిగితా ఇద్దరిని కిడ్నాప్‌ చేసి ఎత్తుకపోయి భూపాల్‌పల్లి జిల్లా వెంకటాపూర్‌ పోలీసు స్టేషన్‌లో కౌన్సిలింగ్‌ ప్రయత్నాలు చేసి ప్రజాసంఘాల నిరసనలు, రిప్రజెంటేషన్‌లు, హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ల ప్రయత్నాల తర్వాత కాని కోర్టులో హాజరుపరచలేదు. ఇప్పుడు వాళ్లు ఖమ్మం కోర్టులో పైన చెప్పిన కఠినమైన నేరారోపణలతో మగ్గుతూ ఉన్నారు. వాళ్ల చదువులే కాదు, వాళ్ల పిల్లల చదువులూ ప్రశ్నార్థకాలైపోయాయి.

కొనసాగుతున్న నిర్బంధాల గొలుసువలె బద్రి ఇచ్చిన కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌ అనే నెపంతో 11వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మూసారం బాగ్‌ చౌరస్తా దగ్గర జర్నలిస్టు, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్‌ దుర్గాప్రసాద్‌ను పోలీసులు కిడ్నాప్‌ చేసి ఎత్తుకవెళ్లి ప్రజా సంఘాల రౌండ్‌ టేబుల్‌, రోడ్డురోకో, హోం మంత్రికి రిప్రజెంటేషన్‌ల తర్వాత ఇదే వెంకటాపూర్‌ పోలీసు స్టేషన్‌ కేసులో పై ముగ్గురితోపాటు ఖమ్మం కోర్టులో జూన్‌ 12న హాజరుపర్చారు. ఛత్తీస్‌గఢ్‌కు నిజానిర్దారణకు వెళ్లిన ఏడుగురు టిడిఎఫ్‌ బృందం అరెస్టయి ఆరు నెలలు జైల్లో ఉండి విడుదలయి ఏడాది కూడా కాలేదు. మళ్లీ ఇప్పుడు ఈ అరెస్టు. ఇప్పటికే ఎంతో కొంత నలుగురికి తెలిసిన ఈ విషయాలు మళ్లీ చెప్పడానికి కాదు.

ఇంతకన్నా దుర్మార్గంగా చంద్రబాబు, చంద్రశేఖర్‌రావుల పాలకవర్గాల కుట్రపూరిత స్నేహాన్ని చెప్పడానికి తాజా ఉదాహరణ బండి దుర్గా ప్రసాద్‌ ఇంకా పోలీసు కస్టడీలో ఉండగానే జూన్‌ 11 సాయంత్రం ఆయన కోసం చింతూరు పోలీసు స్టేషన్‌నుంచి పోలీసు సమన్లు తీసుకుని హెడ్‌కానిస్టేబుల్‌ రావడం. దుర్గా ప్రసాద్‌తోపాటు గతంలో తెలంగాణ విద్యార్థి వేదికలో పనిచేసి ఇపుడు వరంగల్‌ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న అనిల్‌కు కూడా సమన్లు ఇచ్చారు. హైద‌రాబాద్ కేంద్రీయ‌ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ పొదిలి అప్పారావు హత్యాప్రయత్నం కేసులో తమ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే చెప్పాలని ఈ సమన్లు. ఏమి తెలియదంటే ఏమవుతుందో పైన చూశాం.

ఇప్పుడు బిజెపిపై వ్యతిరేకతతో ఉన్నా సెంట్రల్‌ యునివర్సిటికి తేవడం మాత్రమే కాదు, రోహిత్‌ వేముల (ఆత్మ)హత్యకాలం నుంచి దళిత ప్రజాస్వామిక శక్తుల నుంచి తీవ్రవ్యతిరేకతను ఎదుర్కొంటున్న పొదిలి అప్పారావును వెంకయ్యనాయుడుతో పాటు కాపాడుతున్నది చంద్రబాబు నాయుడే. ఇది అందరికీ తెలుసు. తెలుసుకోవలసిన విషయమేమిటంటే ఒక నెల రోజుల్లో పొదిలి అప్పారావును వెనక్కి పంపిస్తానని శాసనసభలో వాగ్ధానప్రకటన చేసిన కెసిఆర్‌ కూడా పొదిలి అప్పారావు హత్యాప్రయత్నం కేసులో తెలంగాణలోని వరంగల్‌ నుంచి ఇద్దరు యువకులకు సమన్లు పంపాడు.

ఇప్పుడు దళిత బడుగువర్గాలపై బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాదు, లేని రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అగ్రవర్ణాలు, రాజ్యం చేస్తున్న దాడిని విడిగా చూడలేము. భీమా కోరేగావ్‌ సంఘటన తర్వాత కేంద్ర, మహరాష్ట్ర బిజెపి ప్రభుత్వాల నిర్బంధానికి జనవరిలోనే గురి అయింది తెలంగాణకు చెందిన ముంబయిలో రిలయన్స్‌ యాజమాన్యంలోని అండర్‌గ్రౌండ్‌ కేబుల్‌ వర్కర్స్‌గా పనిచేస్తున్న ఏడుగురు యువకులు అరెస్టయి చిత్ర హింసలకు గురి అయి యుఎపిఎ కింద గత ఆరునెలలుగా పూణె జైలులో మగ్గుతున్నారు. బంబైలో ఉపాధ్యాయుడుగా చేసిన మచ్చ ప్రభాకర్‌ ఇదే కేసులో యాంటి టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ తీవ్ర వేధింపులకు గురై సున్నిత మనస్కుడైనందువలన అదే రాత్రి ఉరిపెట్టుకుని చనిపోయాడు. తర్వాత పరిణామాలుగా సుప్రీంకోర్టు తీర్పు, పృథ్వి, చందన్‌ల అరెస్టు, ఏప్రిల్‌ 2న సుప్రీంకోర్టు తీర్పుపై దేశవ్యాప్త దళితుల ప్రదర్శన మీద పోలీసు కాల్పులు,11 మంది అమరత్వం- రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత నిరసనను కూడగట్టగలిగాయో కాని కేంద్ర, మహరాష్ట్ర బిజెపి ప్రభుత్వాల దమనకాండతో సరిసమానంగానే దళిత, బడుగువర్గాల, ప్రజాస్వామిక శక్తులపై అంతనిర్బంధాన్ని మాత్రం చవిచూస్తున్నాయి.

No. of visitors : 772
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!
  అయోధ్యకి మళ్ళీ రెక్కలొచ్చినయ్
  రాయలసీమ బతుకు పోరాటం
  మట్టివాసనెపుడూ జీవనోత్సవమే.
  పాలమూరి దుఃఖం
  బతుకు వెతుకులాట లో పాఠకుడికి యెదురయ్యే నిఖార్సైన మానవుడు
  తొలితరం విప్లవ కథకుడు
  స్వేచ్చా స్వప్నం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •