మా ఊళ్లో మా రాజ్యం అంటూ ఆదివాసీలు స్వయం పాలనను ప్రకటించుకుంటున్నారు. ఝార్ఖండ్‌లోని దాదాపు వంద ఆదివాసీ గ్రామాలు ఇప్పుడీ ఉద్యమంలో భాగమయ్యాయి. ʹఈ గ్రామం మాది. దీనిపై సర్వహక్కులూ మావి. ప్రభుత్వం ఇక్కడ అడుగుపెట్టడానికి వీల్లేదు. మా నిర్ణయాలను మేమే తీసుకుంటాం. జల్, జంగిల్, జమీన్ పై మాదే హక్కు. ఎవరూ వాటిని దోచుకోడాన్ని అనుమతించంʹʹ అని ఆ రాతిపలకలపై చెక్కించి గ్రామ ప్రవేశ మార్గం వద్ద నెలకొల్పుతున్నారు. ముండా ఆదివాసీ తెగలో చనిపోయిన వారి స్మృతిలో సమాధి వద్ద రాతి పలకల్ని ఏర్పాటు చేస్తారు. దీన్ని పథల్గడి అంటారు. ఇప్పుడు... గ్రామ సభ అధికారాలు, రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ లో పొందుపరచిన నియమాలను రాతిపలకలపై చెక్కి ʹపథల్గడిʹ సంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. రాతి పలకలపై ʹగ్రామసభ అనుమతి లేనిదే బయటివాళ్లెవరూ గ్రా మంలోకి రాకూడదుʹ అని రాసిపెట్టారు.
పెసా చట్టం ప్రకారం 5వ షెడ్యూల్డ్ ప్రాంతాలలో గ్రామ సభలే నిర్ణయాత్మక పాత్రపోషిస్తాయి. గ్రామ సభ నిర్ణయం ప్రకారమే స్థానిక పరిపాలన సాగాలి. కానీ ఈ చట్టాన్ని అమలు చేయడంలో పాలకులు విఫలమయ్యారు. విఫలమయ్యారు అనడం కంటే.. ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడంలో పాలకులు సఫలమయ్యారు అనడమే సముచితం. మాజీ ఐఏఎస్ అధికారి బి. డి. శర్మ లాంటి వాళ్లు ఆదివాసీ హక్కుల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు విశేష కృషి చేశారు. రాతి పలకలపై 5వ షెడ్యూల్లోని నియమాలను చెక్కించి గ్రామాల్లో నాటించారు. ఇప్పుడదే స్ఫూర్తితో పథల్గడి ఉద్యమం నడుస్తోంది.
నిజానికి చట్టప్రకారం... ఇక్కడి వనరులపై ఆదివాసీలకే హక్కున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఆదివాసేతరుల గుప్పిట్లో ఉంటున్నాయి. బీహర్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచీ ఆదివాసీలకు ఎలాంటి హక్కులూ దక్కడం లేదు. చట్టాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాలేవీ ఆదివాసీలను పట్టించుకోలేదు. పైగా కొత్త కొత్త చట్టాల పేరుతో అటవీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ వచ్చింది. అంతేకాదు... బయటివాళ్లు వచ్చి అటవీ ప్రాంతంలో భూమిని సొంతం చేసుకునేలా రిజిస్టర్ 2 చట్టాన్ని తీసుకువచ్చింది. దీంతో ఆదివాసీ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. అదే ఇప్పుడు పథల్గడి ఉద్యమ రూపం దాల్చింది.
ఝార్ఖండ్‌లోని ఖుంతి జిల్లాలో దాదాపు 80 గ్రా మాల్లో పథల్గడి ఉద్యమం బలంగా సాగుతోంది. స్కూళ్లు, మార్కెట్లు, చిన్న చిన్న ఆఫీసులు, బ్యాంకులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు తమదైన విద్యా విధానాన్ని సైతం రూపొందించుకున్నారు. రాజ్యానికి, ప్రజలకు మధ్య చట్టబద్ద లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. ముండా తెగ ప్రజలు నడుపుతున్న ప్రజా ఉద్యమం ఇది. ఇప్పుడీ ఉద్యమాన్ని అణచివేసేందుకు స్థానిక బీజేపీ సర్కారు కుయుక్తులు పన్నుతోంది. పథల్గడి ఉద్యమం వెనక మావోయిస్టులున్నారంటూ ప్రచారాన్ని లంఘించిన ప్రభుత్వం పలువురు పథల్గడి ఉద్యమకారులను జైళ్లలో బంధించింది.
పథల్గడి ఉద్యమకారులు ఝార్ఖండ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా ఇంటిపై దా డి చేసి ముగ్గురు సెక్యూరిటీ గార్డులను అపహరించి తీసుకెళ్ళడంతో ఉద్యమం మిలిటెంట్ దశకు చేరుకుంది. వారిని పది రోజుల పాటు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. తమ సమస్యలపై గవర్నర్ స్పందించే వరకు వారిని వదిలివేయమంటూ ఉద్యమకారులు పట్టుబట్టారు. దీంతో ఆదివాసీ గ్రామాలపై వేలాది పోలీసు లను, పారా మిలటరీ బలగాలను మోహరించిన ప్రభుత్వం పథల్గడి ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో పోలీసుల జరిపిన దాడిలో ఒక ఆదివాసీ మరణించాడు. అయినా... ప్రజలు వెనకడుగు వేయలేదు. స్వయం నిర్ణయాధికారాన్ని నిలబెట్టుకునేందుకు సాంప్రదాయ ఆయుధాలతో రాజ్యానికి ఎదురునిలిచారు.
జూన్ 19న ఖుంతి ప్రాంతంలో అమ్మాయిల అక్రమ వ్యాపారంపై నాటకం వేసేందుకు వెళ్లిన ఐదుగురు గిరిజన మహిళలను కొందరు అప హరించి సామూహిక అత్యాచారం జరిపారు. ఈ నేరాన్ని పథల్గడి ఉద్యమకారులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. తిరు అనే పథల్గడి నాయకుడిపై అపహరణ, అత్యాచార కేసును నమోదు చేసిన పోలీసులు అతడి కోసం ఆదివాసీ గ్రామాలను జల్లడపడుతున్నారు. పథల్గడి పోరాటాన్నిఅణచివేసేందుకు బీజేపీ సర్కారు ఇలాంటి దుష్ర్ఫచారానికి తెరతీసింది. ఈ కట్టుకథలకు ప్రజలే సమాధానం చెబుతారు. అణచివేతను ధిక్కరించి తమదైన స్వయంపాలనను నిలబెట్టుకుంటారు. పథల్గడి తొవ్వలో పోరాటాన్ని గెలిపిస్తున్నవాళ్లు... బిర్సాముండా, తిల్కమాంజల వారసులు.
Type in English and Press Space to Convert in Telugu |
అక్కడ డేనియల్ ఉన్నాడుఅక్కడ బాల్యం భయంలో... యవ్వనం నిర్బంధంలో గడిచిపోతుంది. ఇంటి నుంచి బయటకెళ్లిన పిల్లలు తిరిగి వస్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక... |
బోధనా హక్కు కోసం మరో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్.సాయిబాబా1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట... |
దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజంసామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........ |
మరో ఆదివాసీ యువకుడు...17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువకుడిగా తప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జవాన్లు చనిపోవడానికి కారణమైన అంబులెన్స్ ........ |
పొట్టకూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారుతాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్టయ్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన మనోహర్ శవమై తిరిగి వచ్చాడు. "ఎన్కౌంటర్" కథ రిపీట్ అయ్యింది.... |
వెలివాడే తొలిపొద్దై పుస్తకావిష్కరణరోహిత్ వేముల స్మృతిలో విప్లవ రచయితల సంఘం వెలువరించిన వెలివాడే తొలిపొద్దై పుస్తకాన్ని రోహిత్ తల్లి వేముల రాధిక ఆవిష్కరించారు. మార్చి ... |
సంతకు వెళ్లిన వాళ్లు.. శవాలై వచ్చారుఏకంగా ఇరవై రోజుల నుంచి మృత దేహాలను ఖననం చేయకుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా ఈ విషయంలో స్పందించకపోవ... |
అధికారం నీడలో.... అంతులేని హింస మోదీ ప్రభుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ సహజ వనరులను వేదాంత, ఎస్సార్, టాటా, జిందాల్ వంటి బహుళజాతి సంస్థలకు కట్టబెడుతోంది. అందుకు...... |
ఆ చెట్టుకు నోరుంటే ..ఆటపాటల్లో మురిసిపోయే పసివాడు ఉట్టన్నట్టుండి నక్సలైటయ్యాడు. కసిగా గుచ్చుకున్న బయోనెట్ మొన వాడి మొర ఆలకించలేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల... |
ఆరని మంటలు...2011 మార్చిలో చత్తీస్‌ఘడ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జరిగిన మారణహోమం పోలీసుల పనే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెషల్ పోలీస్... |
Open letter to Krishna BandyopadhyayAs a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol.. |