కొత్త చ‌రిత్ర

| సాహిత్యం | క‌విత్వం

కొత్త చ‌రిత్ర

- వెంక‌ట్ కొండేటి | 03.07.2018 02:04:27pm


నేను వద్దనకుని
విసిరిపడేసిన ఓ నిషిధ్ద ఆజ్ఞాత విప్లవ చిత్రమొకటి
మళ్ళీ నా కంట‌ పడింది
నా చూపులకు చిక్కుకుంది.
యుద్ద వాతావరణం నుండి
బ్రతికి బయటపడినట్టు గాయాల దేహాలతో
ఆ చిత్రం చిధ్రమై ఉంది
ఎర్రబడ్డ అడవితల్లి ఒడి నిండా
పచ్చి నెత్తురు ఇంకా ప్రవహిస్తునట్టుగానే ఉంది

నేనేం చేయగలను..
నాలుగు వేడి వాడి విప్లవ పదాలను
సూటిగా ఎక్కుపెట్టగలను.
నాలుగు విప్లవ నినాదాలను రాసి,
తడి ఆరిపోతున్న గొంతులకు
చేవ చచ్చిపోతున్న పిడికిళ్ళకు అందివ్వగలను..
సోమరితనంలో ఉన్న
ఈ స్వార్దపు లోకాన్ని చైతన్య పరచగలను
అంతమాత్రాన ఇంతదూరం రావాలా
నా వల్ల‌కాదు
ఈ నరహంతక రామరాజ్యంలో
నా కలానికి ఎన్ని తూటాలో
ఇంకా నెత్తురోడుతూనే ఉన్నాయి.
తప్పొప్పుల మధ్య ఉరికంబం అంచున
సన్నని తాడుకు నా అక్షరాలు వేలాడుతూనే ఉన్నాయి..
చప్పుడు చేయని సాక్ష్యాలతో
నా అక్షరాలను దోషిగా చేసి విధించిన శిక్షలెన్నో...

అయినా నాతోటి అక్షర బూర్జువ
కలాలకు ఇంకా అంత్యక్రియలు పూర్తవనేలేదు ‌
నేను ఇప్పుడు రాలేను.. రాలేను..

పచ్చి నిజం చెప్పనా...
అన్యాయం, దౌర్జన్యం, దోపిడి, అవినీతి పురుడుపోసుకున్న చోటే
విప్లవ తిరుగుబాటు కూడా పుడుతుంది..
దెబ్బతిన్న చోటే
విప్లవం పంజా విసురుతుంది..

గాయాల దేహాలే కొత్త చ‌రిత్ర సృష్టిస్తాయి
ఇప్పుడు మనం అనవలిసింది విప్లవం శరణం గచ్చామి.

ఈ సారి ఎదురపడే విప్లవం
వినీలకాశంలో ఎరుపు వర్ణంలో రెపరెపలాడాలి





No. of visitors : 410
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


చీకటి కడుపును చీల్చుకొని

వెంకట్ కొండేటి | 16.08.2018 01:07:47am

ఈ రోజు వీళ్ళు అమరులైవుండొచ్చు రేపే డప్పులై, రగిలే నిప్పుకనికలై తొలిపొద్దు అరుణారుణ రవి కిరణాలై చీకటి కడుపును చీల్చుకొని మళ్ళి ఉదయిస్తరు మళ్ళి ఉద్యమిస్తరు, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార జూలై - 2019

    చారిత్రక పత్రం
    రచయితలకు సవాల్ !
    మూడు తరాల, యాభై వసంతాల విరసం
    వర్తమాన సంక్షోభాల తాత్విక చిత్రణ - అద్దెప‌ల్లి ప్ర‌భు ʹశ్రీ సూర్యనారాయణʹ
    రూపొందుతున్న కాలానికి తగిన కథన శిల్పం
    తిరిగి వ‌స్తావ‌ని
    నన్నెక్కనివ్వండి బోను
    కవిత్వాన్ని సాయుధం చేసిన చ‌నుబాల ధార‌
    సామాజిక సంఘర్షణల సారం - ప్రస్థానం
    సాహిత్యంలో విప్లవోద్యమానికి యాభై ఏళ్లు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •