అవి స్వప్నాలు కావు వాస్తవాలు

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

అవి స్వప్నాలు కావు వాస్తవాలు

- పి.శంకర్‌ | 03.07.2018 02:10:57pm

WAR CONTINUES, WITH MORE DEATHS, RAPES AND ARRESTS ON ʹSAMADHANʹ LINES FOR REAL SAMADHAN.

స్కాలర్‌ వాణి ఝా ఝా తన బస్తర్‌ అధ్యయనం నుండి, అక్కడ ఎదురైన అనేక చేదు ఖాకీ అనుభవాల నుండి రచయితతో అన్న మాటలు ముందు గుర్తు చేసుకుందాం.ʹBastar has become a liberated zone in more senses than one - liberated from the protection of the Constitutionʹ ఔను ఝా ఝా సరిగానే చెప్పింది. నాలుగు దశాబ్దాలుగా బస్తర్‌ భూభాగంలో కొనసాగుతున్న విప్లవోద్యమ నేపధ్యంలో భారత భద్రతా బలగాలకు అక్కడ రాజ్యాంగాన్ని అమలు చేయాలన్న బాధ్యత, వృత్తి ధర్మం, దానికి లోబడి పని చేయాలన్న శిక్షణ, నైతికత ఎంతమాత్రం లేకుండా పోయాయి. కాకపోతే భారత ప్రజలను ప్రధానంగా ఈ దేశానికి ఓ లిఖిత రాజ్యాంగం ఉందన్న ఎరుక గల వారిని మూర్ఖులను చేయడానికి తాము చేసే ప్రతి పని దానికి లోబడే జరుగుతుందనే భ్రమలను కాపాడాల్సిన అవసరం మాత్రం ఉంది. ఆ పని వారి పాలకులు ప్రజా ప్రతినిధులుగా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వకాల్తాదారులుగా రాజ్యాంగం సాక్షిగా బాధ్యతలు చేపట్టిన నేపధ్యంలో చేయక తప్పడం లేదు. వారు ఆ మాత్రం చేయలేకపోతే వారి పతనం మరింత చేరువవుతుంది. నందినీ సుందర్‌ అత్యంత శ్రమ ప్రయాసలకు, అంతకన్నా బస్తర్‌ పర్యటనలో అడుగడుగునా రిస్క్‌ను, ఆందోళనను ఎదుర్కొంటూ చేపట్టిన భగీరధ ప్రయత్నంలో బస్తర్‌లో అమలు కాని భారత రాజ్యాంగం తీరు తెన్నులను సోదాహరణంగా వెలికి తీసి రాజ్యాంగ ప్రియుల ముందుంచగలిగింది. ఆమెను నిజంగా అభినందించాలి. భారత రాజ్యాంగం పై ఇంకా విశ్వాసం మిగిలినవాళ్లు, ʹది బర్నింగ్‌ ఫారెస్ట్‌-ఇండియాస్‌ వార్‌ ఇన్‌ బస్తర్‌ʹ తప్పక చదవాలి. ఈ దేశంలో విప్లవ ప్రజానీకం ప్రత్యేకించి సాధారణంగా వెనుకబడిన ప్రాంతాలు, ప్రజలుగా పేర్కొనబడే ఆదివాసులు లేదా నూతన పదబంధాలలో ʹపూరెస్ట్‌ ఆఫ్‌ ది పూర్‌ʹగా, ʹసివిల్‌ సొసైటీʹచే పిలవబడుతున్న మూలవాసులు అసమాన త్యాగాలతో, చెప్పనలవి గాని హింసా దౌర్జన్యాల మధ్య, హత్యలు, అత్యాచారాలు, గృహదహనాలు, ఆస్తుల నష్టం, పంటల విధ్వంసాల మధ్య దేశం కోసం, భావి తరాల కోసం తమ వర్తమానాన్ని నిస్వార్థంగా బలి చేస్తున్న ప్రజల పోరాట జీవితాలను తెలుసుకోవడానికి ఈ పుస్తకాన్ని తప్పక అధ్యయనం చేయాలి. రచయిత తన పుస్తకంలోని ఎపిలోగ్‌లో కోరుకున్న నూతన వ్యవస్థ నిర్మాణానికి బస్తర్‌లో దారులు పరుస్తున్న నక్సల్బరీ విప్లవ పంథా, అక్కడ రూపొందుతోన్న నూతన రాజ్యాంగ సంస్థలు జనతన సర్కార్‌లు ఎదుర్కొంటున్న ప్రసవ వేదనలు తెలుసుకోవడానికి, నిర్దాక్షిణ్యమైన వర్గ పోరాటాన్ని అర్థం చేసుకోవడానికి బర్నింగ్‌ ఫారెస్ట్‌ చదవాలి. రచయిత భావజాలం ఏమైనప్పటికీ, సాండ్‌విచ్‌ ధియరీయే కావచ్చు, కానీ ఆమె నిజాయితీగా ప్రజల సమస్యను ముందుకు తెచ్చింది. ఆ సమస్యలకు మూలాలను తన రచనకు ఎంచుకున్న పేరు ʹఇండియాస్‌ వార్‌ ఇన్‌ బస్తర్‌ʹలోనే ఉంది. అయితే రచయితను తన భావజాలమే గైడ్‌ చేస్తుందనేది తెల్సిందే. పుస్తకంలో అవసరం లేకపోయివ ʹఎవ్‌రీతింగ్‌ ఈస్‌ సబ్జెక్ట్‌ టు ది లా ఆఫ్‌ కాజేషన్‌ʹ అన్న చందంగా ఒక వైపు ఖాకీల దాష్టీకం ఎండగడుతూనే మరో వైపు మావోయిస్టుల హింసాత్మక చర్యలను పేర్కొనడం పాఠకులు సులువుగానే గుర్తిస్తారు. కాకపోతే సాండ్‌విచ్‌ థియరీని నమ్మేవాళ్లు సంతృప్తిపడుతారు. ఇందులో అదే ప్రధానాంశం కాకపోవడంతో దానిలోకి వెళ్లడం లేదు.

నందినీ సుందర్‌కు బస్తర్‌తో దాదాపు గత మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. బస్తర్‌ ప్రజల జీవితాలు, వారి పోరాటాల గురించి పలు రచనలు చేసి పాఠకులకు అందించింది. ఆమె బస్తర్‌ ప్రజలను అమితంగా ప్రేమిస్తుందనడానికి ఆమె రచనలే సాక్ష్యం. అలాంటి ప్రజల పై భారత రాజ్యం తలపెట్టిన యుద్ధాన్ని ఆమె ఎలా భరిస్తుంది? ఏ ప్రజాస్వామికవాది భరించలేరు. ఆదివాసీ హితైషి ఎదిరించకుండా ఉండలేరు. అందుకే ఆమె భారత రాజ్యాన్ని, రాజ్యాంగం ముందు నిలిపింది. రాజ్యం చర్యలను రాజ్యాంగం పై నమ్మకంతో ఎదుర్కొంది. కానీ తుదకు జడ్జిసాబ్‌ ఆమె విశ్వాసాలను భ్రమలుగా తేల్చడంలో కృతకృత్యుడయ్యాడు. వర్గ సమాజంలో న్యాయం వర్గాతీతం కాదని జడ్జిసాబ్‌లు, పోలీస్‌ సాబ్‌లు ఎలా నిరూపిస్తూ వచ్చారో తన రచన చదివిన వారికి బోధపడుతుంది. రచయితకు బోధపడకుండా ఉండదు కానీ ఎవరి నమ్మకాలు వారివి అని ఆమె ముగింపు వాక్యాలే తెలుపుతున్నాయి. ʹఐ స్టిల్‌ అకేషనల్లీ ప్రే ఎట్‌ ది గ్రేవ్‌ ఆఫ్‌ ది జడ్జ్‌ సాబ్‌, బట్‌ విత్‌ మచ్‌ హాలోయర్‌ హోప్‌ దాన్‌ బిఫోర్‌ʹ. రచయిత ఇలా చేయడం చాలా అవసరం. బర్నింగ్‌ ఫారెస్ట్‌ లాంటి మరిన్ని రచనలు వెలువరించడం ద్వారా చాలా మందికి ఈ రాజ్యాంగం పై భ్రమలు ఇంకా ఇంకా తొలగిపోవడానికి ఉపయోగపడతాయి.

రచయిత సల్వాజుడుం, గ్రీన్‌హంట్‌ల మూలంగా బస్తర్‌ ప్రజలు ఎంతటి పాశవికమైన పరిస్థితులను అనుభవిస్తున్నారో కళ్లకు కట్టినట్టుగా వివరించింది. మహిళల పై జరుగుతున్న అత్యాచారాలు ఏ నాగరిక సమాజం ఆమోదించని అనాగరిక స్థాయిలో ఎలా ఉన్నాయో భావి తరాల మాటలలోనే చూపడం ద్వారా ప్రజాస్వామిక ప్రభుత్వాల, రక్షక భటుల ముసుగులు తొలగించి వారి నిజస్వభావాలను వెల్లడి చేసింది. చాలా విషయాలలో విప్లవోద్యమం జరిపిన కృషిని ఉద్దేశ్యపూర్వకంగానే పేరొనకపోవడం రచనలో అగుపడుతుంది. ఉదాహరణకు క్యాంపుల నుండి ప్రజలు వెనక్కి రావడంలో పార్టీ పాత్ర ఎక్కడా ఉండదు. ప్రజల ఆస్తులను కాపాడడంలో, ప్రజలను గ్రామాలలో స్థిరపర్చడంలో వారికి పూర్తిగా సహాయ సహకారాలు అందించడంలో పార్టీ కృషి తెలిసినప్పటికీ తను పదే పదే పేర్కొనే మనీష్‌ కుంజాం కానీ, గాంధేయవాది హిమాంశు కుమార్‌ కానీ మిగతా చాలా మంది ప్రజాహిత శక్తులు పార్టీని కోరిన తక్షణమే ఎక్కడికక్కడే పార్టీ కమిటీలు వారి అభిప్రాయాన్ని స్వాగతించి ప్రజలు గ్రామాలకు తిరిగి రావడంతో తన వంతు అది చేసిందన్న విషయంలో ఎలాంటి దాపరికం లేదు. ఈ సమాచారం రచయితకు లేదనుకోలేం. మరో ఉదాహరణ చెప్పుకోవాలంటే అలెక్స్‌ పాల్‌ను ʹకిడ్నాప్‌ʹ చేసిన సందర్భంగా పార్టీ మొదటి మధ్యవర్తిగా మనీష్‌ కుంజాంనే ప్రతిపాదించింది. కానీ ఆయన నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాడు. ప్రభుత్వం కలెక్టర్‌ గారి ఆరోగ్యం కోసం మందులు పంపిస్తే ఆగమేఘాల మీదా ఆరా తీస్తూ మోసుకొచ్చి ఇచ్చి వెళ్లాడు. ఆ కుంజాం అలా ఎందుకు చేసినా పార్టీ వైపు నుండి స్థానిక నాయకుడిగా ఆయనకు ప్రతిపాదించిన విషయం రచయిత పేర్కొనకపోవడం యాదృచ్ఛికం ఏమి గాదు. ఇలాంటి ఉదాహరణలు, రెండు పక్షాల మధ్య ప్రజలు నలుగుతున్నారంటూ పూసల్లో దారంలా వ్యక్తీకరించడం చివరి వరకు సాగుతోంది. అయితే ఆ పుస్తకం ద్వారా పాలకుల ప్రయోజనాల కోసం వారు ఎంతకైనా బరి తెగిస్తారనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పడం ఆమె ప్రజా పక్షపాతాన్ని తెలుపుతుంది. ఇలాంటి రచనలు ఆమె కలం నుండి మరిన్ని వెలువడాలని ఆశిస్తున్నాం.

ప్రజల వెంట ఉంటూ ప్రజల మధ్య నడుస్తూ ప్రజల వ్యధలు తెలుసుకుని అక్షరబద్ధం చేసిన రచనలో రచయిత దృగ్విషయాలనే పట్టుకోగలిగిందనేది స్పష్టం. తాడిమెట్ల సహా నాలుగు గ్రామాల పై పోలీసులు బడి ఊచకోత కోసిన రోజు వాస్తవంగా ఏం జరిగిందో, ఆ రోజు మాటుదాడి వెనుక దాగిన సత్యాలను రచయిత ప్రజల నుండి రాబట్ట లేకపోయిందనీ, లేదా రచయితకు ప్రజలు వెల్లడించలేదనే పుస్తకంలో రాసిందాన్ని బట్టి తేలుతుంది. ప్రజలకు రచయిత పై విశ్వాసం లేక చెప్పలేదు అని కాదు కాని వారికి ఈ వ్యవస్థ పై విశ్వాసం లేక ఆమెకు వెల్లడించలేదు. ఇలా చాలా చోట్ల పార్టీ, విప్లవోద్యమ పాత్ర పుస్తకంలో అభావం గావడం రచనలో బస్తర్‌ ఉద్యమంతో గాఢ పరిచయం ఉన్న వాళ్లకు తప్ప అర్థం కాదు. అలా సంబంధం లేని వారు దృగ్గోచర విషయాల నేపధ్యంలోనే ఆలోచించి అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి పుస్తకం అనివార్యం చేస్తుంది.

చివరన మా ఆందోళనను మీ ముందుంచాలనుకుంటున్నాను. దేశంలో హిందుత్వ శక్తులు అత్యంత ప్రమాదకర స్థాయిలో వ్యవహరిస్తున్నాయి. ఈ మధ్య దేశవ్యాప్తంగా విప్లవాభిమానులు, విప్లవకారులు జరుపుకున్న నక్సల్బరీ స్వర్ణ వేడుకల గురించి మీకు తెల్సిందే. ఆ సందర్భంగా గడచిన 50 ఏళ్ల నక్సల్బరీ ఉద్యమాన్ని విశ్రాంత పోలీసు ఉన్నతాధికారులు సైనిక విశేషజ్ఞులు సహా చాలా మంది చాలా రకాలుగా విశ్లేషించారు. హిందుత్వ శక్తులూ సమీక్షించాయి పోలీసు ఉన్నతాధికారులు, హిందుత్వ శక్తులు అరుంధతీ, నందినీ సుందర్‌ల గ్యాంగులంటూ తెల్ల చొక్కా నక్సలైట్లు, అర్బన్‌ నక్సలైట్లు ఇలా రకరకాల పేర్లు పెట్టి టార్గెట్‌ చేస్తూ రాసిన వార్తలు మీ దృష్టిలో ఉన్నవే. మీరు హాజరైన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మీరు మావోయిస్టులతో కొలంబియా తరహాలో చర్చల ప్రతిపాదన పెడితే కె.విజయకుమార్‌ ఇచ్చిన జవాబు మీరు విన్నారు. ఇప్పటికే దేశంలో పలువురు మేధావులను హిందుత్వ శక్తులు పొట్టన పెట్టుకున్నాయి.

అయితే విప్లవం నుండి వెళ్లిపోయిన వారు అందించిన వివరాలను ఆమెకు 2012లో కలిసిన ఉయికే లాంటి నాయకుల ద్వారా గానీ, మధ్యవర్తుల ద్వారా గానీ కౌంటర్‌ చెక్‌ చేసుకుని ఉంటే స్వల్ప దోషాలకు కూడా అవకాశం ఉండేది కాదు.

రచయిత తన స్నేహితులతో కలిసి సారాయి చుక్కలు సేవిస్తూ పున్నమి రాత్రులలో మాడియా నృత్యాలను తిలకించే రచన ఆమె కలం నుండి రావడం జనతన సర్కార్లున్న చోటే సాధ్యం. ఆమె కోయిలల పాటలు వింటూ ఆహ్లాదంగా అడవిలో నడిచే అవకాశం రేపటి ప్రజా పాలనలోనే సాధ్యం. పిల్లలకు పాఠాలు ఆదివాసీ మాతృభాషలలో చెప్పడం, పరాయి భాషలను నేర్చుకునే స్వేచ్ఛా అవకాశాన్ని కల్పించడం, విద్యార్ధులకు అన్ని సదుపాయాలు ఉండేలా చూడడం, ప్రజా సంప్రదాయాలను ఎత్తిపట్టే గీతాలను కళాధూక, కళాకర్సడ్‌ల ద్వారా భద్రపరచడం, అడవులను రక్షించడం, ప్రజల సంస్కృతిని గౌరవించే సంప్రదాయాన్ని పాటించడం కచ్చితంగా రచయిత రేపటి రచనలో ఉండాలంటే ఆమె నేటి విప్లవోద్యమంతో మరింత సన్నిహితం కావడం ద్వారానే సాధ్యం. హిడ్మే, హిడ్మా, మాసా, దేవేలు కలం పట్టి సాంస్కృతిక యోధులు కావడాన్ని ఆమె లిపిబద్ధం చేయాలంటే నేటి వారి ఎదుగుదలకు మరింత చేరువ కావాలి. ఆమె బస్తర్‌ వాసి కావాలి. శతాబ్దంన్నర క్రితం బ్రిటిషర్‌ ఎల్విన్‌ ఒక ఆదివాసీ కాగలిగినపుడు నందినీ సుందర్‌ సంపూర్ణంగా బస్తర్‌ సిటిజన్‌ కావడం సాధ్యమే కదా! ఆమె స్వప్నించే కల ఆ రోజు సార్థకం అవుతుంది. అప్పటివరకు పోరాటం వినా మరో దారి లేదు. ఆ మంచి రోజుల కోసం, అవి స్వప్నాలు కావు వాస్తవాలు అని నిరూపించడం కోసం, కమాన్‌, లెట్‌ అస్‌ ఫైట్‌ యునైటెడ్‌లీ.

పి.శంకర్‌

దండకారణ్య రచయిత


No. of visitors : 867
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ʹసమాధాన్‌ʹ ప్రజల దగ్గర ఉంది - అయిదు వసంతాల ప్రతిఘటనారావం

యూసఫ్‌బీ | 21.05.2017 07:26:22pm

మావోయిస్టు మూలాలు విచ్ఛిన్నం చేయడం ద్వారా ఉద్యమాన్ని దెబ్బతీయాలనేది అసలు అర్థం. కానీ పాలకులకు ఒక విషయం తెలియడం లేదు. మావోయిస్టుల మూలాలు ఈ దేశ దోపిడీ ఉత్ప......
...ఇంకా చదవండి

Make True Their Dreams

sankar | 03.07.2018 02:16:09pm

Only then her dream can come true. Let us fight united for a natural life of the tribals and make true their dreams for the same......
...ఇంకా చదవండి

కార్పోరేట్ కంపెనీల ఏజెంట్‌గా మోదీ స‌ర్కారు

చ‌ర‌ణ్‌ | 16.06.2018 12:42:29am

మావోయిజం అంత‌మైతే బస్తర్ బెటాలియాన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఒక నెల రొండు నెలల్లోనే నాలుగు బెటాలియాన్ల‌ అర్థసైనిక ద‌ళాలు బస్తర్ ప్రాంతానికి .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •