మార్క్సిజం ఆచరణ సిద్ధాంతం..

| సంభాషణ

మార్క్సిజం ఆచరణ సిద్ధాంతం..

- బాసిత్ | 03.07.2018 02:31:58pm

మార్క్స్ 200వ జయంతి సందర్భంగా మే 5ʹ 2018 శనివారం సాయంత్రం, హైదరాబాద్, సుందరయ్య భవన్, షోయబ్ హాల్లో సిటీ కన్వీనర్ గీతాంజలి అధ్యక్షతన మార్క్సిజం పై సదస్సు జరిగింది.

ఈ సదస్సులో ʹమార్క్సిస్టు సాహిత్య సిద్దాంతంʹ పై విరసం కార్యవర్గ సభ్యుడు బాసిత్ మాట్లాడారు. సమాజ నిర్మాణంలోని దోపిడి మూలాల్ని, దుర్మార్గాన్ని బట్టబయలు చేయడమే మార్క్సిస్ట్ సాహిత్య సిద్ధాంత లక్షమని ఆయన అన్నారు. వర్గసమాజంలో శ్రామిక వర్గ పక్షపాతం వహించేదే సిసలైన సాహిత్యమని, రచయిత వర్గం కూడా కీలకమైందనీ, సాహిత్యాన్ని, రచయితను ఏ గతితార్కిక నియమాల వెలుగులో పరిశీలించాలో సూచించే పలు ప్రశ్నల్ని ఆయన ఉటంకించాడు. రాజకీయ తాత్వికత, కళాత్మకత అనేవి మార్క్సిస్ట్ సాహిత్య సిద్ధాంతానికి చుక్కాని వంటివని చైనాలో ప్రశస్త యెనాన్ ప్రసంగంలో మావో అన్నారని ఆయన అన్నారు.మార్క్సిస్ట్ సాహిత్య సిద్ధాంతానికి మించిన న్యాయదృష్టి ఇంకే సాహిత్య సిద్ధాంతానికి ఉండే అవకాశం లేదని, అందుకే మార్క్సిస్ట్ సాహిత్య సిద్ధాంతం తిరుగులేనిదని ఆయన అన్నారు.

సభలో పూజారి కాంకేర్ అమరుల స్మృతిలో వారి జీవిత చరిత్రలను అమరుల బంధు మిత్రుల సంఘం ʹఒక వేకువ కోసంʹ పేరిట ప్రచురించిన పుస్తకాన్ని పూజారి కాంకేర్ అమరుడు ప్రభాకర్ అన్న, వదినెలు ఆవిష్కరించారు. ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తూ, ʹవర్గపోరాటం- మార్కిజంʹ అనే అంశంపై కామ్రేడ్ వరవరరావు మాట్లాడారు. మార్క్సిజం వర్గపోరాట ఆచరణ శాస్త్రమని, అటువంటి ఆచరణలోనే కామ్రేడ్ దాడబోయిన ప్రభాకర్ అమరుడయ్యాడని, అమరులౌతున్న వారిలో ఎక్కువగా మహిళలు ఉంటున్నారని, ʹఆధునిక చరిత్రను మహిళలు రచిస్తారనిʹ మార్క్స్ అంటే దానికి సజీవ సాక్ష్యం దండకారణ్య పోరాట చరిత్ర అని వి.వి. అన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి దాకా పదిహేను వేల మంది దాకా అమరులయ్యారని, రాజ్యం ఆదివాసులను మావోయిస్టులుగా ముద్రవేసి ఆపరేషన్ గ్రీన్హంట్ పేర నరమేధానికి పాల్పడుతోందని ఆయన అన్నారు.మార్క్స్ పెట్టుబడి రాస్తున్న విప్లవాల యుగంలో తామున్నామనే చైతన్య పూర్వక అవగాహనతో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ తదితర పోరాటాల్లో పాల్గొనడం ద్వారా విప్లవ కార్యాచరణలో స్వయంగా భాగస్వామ్యం వహించాడని వి.వి. అన్నారు.

ʹమార్క్సిజం - ప్రాసంగికతʹ అనే అంశంపై కామ్రేడ్ కాశీం మాట్లాడుతూ మార్క్స్ సైద్ధాంతిక, రాజకీయార్థిక రచనల కంటే ముందు మార్క్స్ జీవితం, ఆయన ఆత్మీయ స్మృతులు వంటివి చదవడం ద్వారా ఆయన సౌజన్యం ఎంత ఉన్నతమైనదో అర్థం అవుతుందని ఆయన అన్నారు. మార్క్సిజాన్ని ఇవ్వాళ మనకంటే పెట్టుబడిదారులు, ఐరోపా దేశాలే ఎక్కువగా చదువుతున్నారని, ఇదే మార్క్సిజం ప్రాసంగికతకు నిదర్శనమని ఆయన అన్నారు.1857 నాటి భారతదేశం గురించిన రచనలలో ఇక్కడ విప్లవాన్ని ʹకులంʹ అనేది ఆటంక పరుస్తుందని స్పష్టంగా రాసాడని, ఈ దేశంలో దళితులు, శ్రామిక వర్గాలకు అధికారం ఇంకా అందలేదని, అందుకే మార్క్సిజానికి ప్రాసంగికత అనివార్యంగా ఉంటుందని ఆయన అన్నారు.

కాగా సమావేశంలో ఉదయమిత్ర అనువాదం చేసిన మార్క్స్ కవిత ʹహృదయ వీణʹ ను సమావేశానికి అధ్యక్షత వహించిన కామ్రేడ్ గీతాంజలి సభలో చదివారు.

సభలో రచయితలు, ప్రజాసంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No. of visitors : 462
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మార్క్స్ వ‌ర్గ‌ పోరాట సిద్ధాంతం అజేయమైంది : కాశీం

కాశీం | 29.05.2018 11:22:54pm

మార్క్స్ ద్విశ‌త జ‌యంతి సంద‌ర్భంగా... మార్క్స్ సిద్ధాంత రాజ‌కీయాల గురించి త‌న‌ అభిప్రాయాల్ని పంచుకున్న‌విర‌సం నాయ‌కుడు కాశీం...
...ఇంకా చదవండి

మార్క్స్ ప్రాసంగిక‌త ఎప్ప‌టికీ ఉంటుంది : అరుణాంక్‌

| 05.05.2018 09:37:20am

మార్క్స్ ద్విశ‌త జ‌యంతి సంద‌ర్భంగా మార్క్స్ గురించి త‌న అభిప్రాయాల‌ను పంచుకున్న‌ డీఎస్‌యూ కార్య‌ద‌ర్శి అరుణాంక్ మార్క్స్ ప్రాసంగిక‌త నేటికీ ఉందంటున్నారు....
...ఇంకా చదవండి

Share your views on Karl Marx, his ideology and Politics

www.virasam.org | 26.04.2018 09:26:06am

Friends who are working on various facets of Marxism and revolutionary ideology and politics, can record the same in a short video format and send them to v...
...ఇంకా చదవండి

21వ శతాబ్దంలో మార్క్స్‌

ఎడిటర్‌ & టీం | 18.04.2018 11:41:43am

మార్క్సిజానికి సంబంధించిన వేర్వేరు రంగాల్లో కృషి చేస్తున్న మీరు మీ అభిప్రాయాలను వీడియో తీసి virasam1970@gmail.com మెయిల్‌కు పంపించండి. మార్క్సిజంలోని వేర్వ...
...ఇంకా చదవండి

మార్క్స్‌ శాస్త్రీయ సిద్ధాంత వారసత్వానికి పదునుపెడదాం

విరసం | 02.05.2018 11:30:59am

మార్క్స్‌ తన కాలంలోని పెట్టుబడిదారీ విధానాన్ని విశ్లేషించాడు. శ్రమశక్తి సరుకు కావడంతో పెట్టుబడిదారీ విధానం ఆరంభమైంది. గత వ్యవస్థలకు పెట్టుబడిదారీ విధానా.....
...ఇంకా చదవండి

marx selected poetry

Editors : James Luchte | 02.05.2018 03:38:37pm

Marx wrote much of this poetry when he was nineteen, around the year 1837, while he was at university. He makes ready use of mythological themes, theologica...
...ఇంకా చదవండి

గెలుచుకోవాల్సిన ప్రపంచం దిశగా కారల్‌ మార్క్స్‌

పాణి | 05.05.2018 11:18:04pm

మన దేశంలో నడుస్తున్న వర్గపోరాటాలపట్ల సంఘీభావం ప్రకటించకుండా మార్క్సిజాన్ని నిరంతరం అధ్యయనం చేసే ఉత్తమ మార్క్సిస్టుల వల్ల ఈ కాలానికి పెద్దగా ప్రయోజనం ఏమీ లే...
...ఇంకా చదవండి

మునిపటికన్నా విప్లవాత్మకంగా కార్ల్ మార్క్స్

స్టువర్ట్ జేఫ్రిస్ | 05.06.2018 10:37:25am

మార్క్స్ పని అయిపోయినట్టేనా? కానే కాదు. నాకైతే, కార్ల్ మార్క్స్ ఇప్పటికి చదవడానికి అర్హత కలిగినవాడు. అయితే కేవలం అతడి దూరదృష్టి, అంచనా వల్ల కాదు, అతడి విశ్...
...ఇంకా చదవండి

मार्क्स सिद्धांत और राजनैतिकता के बारे में आप के राय वीडियो के रूप में भिजाइए।

एडिटर & टीम | 26.04.2018 09:48:00am

मई 5 से कार्ल मार्क्स के ʹदो सौ साल साल गिरहʹ के कार्यक्रम आरँभ होने वाले हैं। साल गिरह और बर्सियोँ मेँ कोई भी खासियत नहीं रहने पर भी विश्व कार्मिक वर्ग, इन...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •