కులం - భూమి : కందికట్కూరు విషాదం

| సంపాద‌కీయం

కులం - భూమి : కందికట్కూరు విషాదం

- పాణి | 21.07.2018 10:16:36am

భూమితో ముడిపడిన సమస్యలు కులంతో బైటికి వస్తుంటాయి. కుల పరమైన దాడులు, హత్యలు, అవమానపరచడం వెనుక భూమి ఉంటోంది. ఇది యాదృశ్చికం కాదు. అట్లని కుల సమస్యను, లేదా దళితుల సమస్యను భూమి సమస్యే అని కుదించడానికి కూడా లేదు. ఆత్మగౌరవం కోసం దళితులు ఆరాటపడినప్పుడల్లా దాడులు జరగడం కూడా గమనించవచ్చు. దళితులు అంటరానివాళ్లు కావడం వల్ల ఈ వ్యవస్థలో వాళ్ల చుట్టూ ఉన్న అనేక సమస్యల్లో భూమి ప్రధానంగా ఉంటున్నది. ఇలాంటి వాటిని అనేక స్థాయిల్లో సిద్ధాంతీకరించవచ్చు. ఆ అవసరం కూడా ఉంది. అయితే వాస్తవాలను అర్థం చేసుకోడానికి నిత్యం దళితులపై జరుగుతున్న దాడులను గమనించినా సరిపోతుంది.

తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరులో జూన్‌ 12వ తేదీన జరిగిన తండ్రీ కొడుకులు ఎల్లయ్య, శేఖర్‌ హత్య ఈ విషయాన్నే చాటుతోంది. మాదిగ కులస్తుడయిన ఎల్లయ్య కుటుంబంపై పక్క ఊరు కిష్టారావుపల్లెకు చెందిన ముదిరాసి కులస్థుడైన మావిళ్ల దేవయ్య కుటుంబ సభ్యులు చేసి వీరిని హత్య చేశారు. ఇది ఆవేశంలో మాటా మాటా పెరిగి తీవ్రస్థాయికి వెళ్లిన ఘర్షణ కాదు. ఒక పథకం ప్రకారమే దాడి చేశారు. మాదిగలపై బీసీలు దాడి చేసి హత్య చేయడం, అదీ కేవలం 39 కుంటల భూమి కోసం జరగడం మన సమాజంలోని కుల వివక్షను తెలియజేస్తోంది. అంటరానితనంతో భూమికి ఉన్న సంబంధాన్ని కూడా సూచిస్తోంది.

ఎల్లయ్య దశాబ్దాల కింద దాయాదుల నుంచి కొనుక్కున్న భూమి మీద గత కొద్ది కాలంగా బీసీ కుటుంబం కన్నేసింది. చుట్టూ ఇతరుల భూములు ఉన్నాయి. మధ్యలో మాదిగల భూమి ఉంది. భూముల అమ్మకాలు, కొనుగోళ్ల వ్యవహారంలో చాలా యాదృశ్చికంగానే ఇది జరిగి ఉండవచ్చు. కానీ ఇతర కులస్థుల భూముల మధ్య దళితుల భూమి ఉండటం కూడా ఇక్కడ సమస్య అయింది. అదే అంటరాని కులస్థుల భూమి కాకుండా ఇతరుల పొలం ఉండి ఉంటే అదీ ఒక సమస్య అయ్యేదా? బహుశా కాకపోవచ్చు.

ఈ వివాదం కోర్టులో కూడా నడుస్తోంది. ఏడాదిన్నర కింద పొలంలోనే దేవయ్య కుటుంబసభ్యులు ఎల్లయ్య వాళ్ల మీద దాడి చేశారు. అప్పుడు బాధితులు కేసు పెట్టారు. అధికారులు పట్టించుకోలేదు. అప్పట్లో దాయాదుల మధ్య భూమి కొనుగోలుకు సంబంధించిన కాయితాలను పరిగణలోకి తీసుకొని అధికారులు ఈ సమస్యను పరిష్కరించి ఉండవచ్చు. అది చాలా చిన్న పని. మామూలుగా ఇలాంటి భూ సమస్యలు గ్రామాల్లో తరచూ వచ్చేవే.

కానీ అధికారులు నిర్లక్ష్యం చేశారు. యంత్రాంగానికి నిర్లక్ష్యం సహజమే. దాని వల్లే ఎన్నో సమస్యలు తీవ్రమవుతుంటాయి. రక్తపాతం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమస్యలో పక్క మాదిగలు, ఆ పక్క బీసీలు ఉండటం, అవతలి వాళ్లు ప్రభావితం చేయగలవాళ్లు కావడం వల్ల రివెన్యూ, పోలీసు యంత్రాంగాలు ఎల్లయ్య సమస్యను పరిష్కరించలేదు. సరికదా బీసీ దేవయ్య పక్షం తీసుకున్నాయి. నిజానికి ఆ రోజే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఉండాలి. ఈ పని చేయకపోగా బాధితులు పెట్టిన కేసును నీరుగార్చారు. వీళ్లను మోసం చేసి సంతకం చేయించుకొని కేసు లేకుండా చేశారు. అంటే కుల సమస్యకు అధికార యంత్రాంగం తీసుకున్న వైఖరి తోడైంది. ఫలితంగా సమస్య ఇద్దరి హత్య దాకా వచ్చింది. దీని వెనుక ఏం పని చేసి ఉంటుంది?

చాల ప్రాంతాల్లో అనేక పరిణామాల వల్ల భూముల ధరలు పెరిగిపోయాయి. కందికట్కూరు పక్కనే మానేరు రిజర్వాయర్‌ పూర్తవుతోంది. నీటి వసతి పెరిగింది. సహజంగానే పాత భూముల ధరలు పెరిగాయి. దీంతో దేవయ్య కుటుంబసభ్యులు ఎలాగైనా ఈ భూమి లాక్కోవాలని చూశారు. అధికార యంత్రాంగం మద్దతు కూడా ఉన్నది. రెండు కులాల మధ్య పేచీ వస్తే సహజంగానే ప్రభుత్వ యంత్రాంగం అందులోని పై కులానికి మద్దతుగా వెళుతుందని చెప్పడానికి రోజువారీ జీవితంలోంచి ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వవచ్చు. ఇక్కడ అదే జరిగింది.

మాదిగ, ముదిరాసి కులాల మధ్య నిచ్చెనమెట్ల వ్యవస్థ వల్ల సామాజికంగానే అంతరం ఉంది. కుల వ్యవస్థ నిర్మాణం, దాని పనితీరు పట్ల చైతన్యవంతమైన అవగాహన లేకపోతే ఈ అంతరం తప్పక అనేక రూపాల్లో ఆధిపత్యంగా వ్యక్తమవుతుంది. కులవ్యవస్థ మూలాలను, వాటికి ఉండే సంస్కృతీ భావజాలాలను అర్థం చేసుకున్నవారే అది విసిరే బ్రాహ్మణీయ ఆధిపత్యానికి దూరంగా ఉండగలరు. లేకపోతే తమ కంటే కింది కులంపట్ల ప్రతి పై కులస్థులు ఆధిపత్య ధోరణినే ప్రదర్శిస్తారు.

కందికట్కూరు ఘటనను కేవలం 39 కుంటల భూమి వివాదంగానే చూడ్డానికి లేదు. అదీ ఉన్నది. అది కీలకం కూడా. అంత వరకే చూస్తే పాక్షికమవుతుంది. మన సామాజిక సంక్లిష్టత అంతా ఇలాంటి ఘటనల్లో వ్యక్తమవుతుంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. దేనికి వ్యతిరేకంగా పోరాట శక్తులను కలిపి నిలబెట్టాలి అనే అతి పెద్ద సవాల్‌ను అత్యంత విషాదకరంగా కందికట్కూరు ప్రగతిశీల శక్తులకు విసురుతోంది.





No. of visitors : 450
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    ఈవ్ టీజింగ్ సాకు తీసుకొని మొత్తం దళితవాడను సాంఘిక బహిష్కరణకు గురిచేయడం అమానుషం
    సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రొమిలా థాపర్‌ తదితర పిటిషన్‌దారుల పత్రికా ప్రకటన
    Self mortality
    దు:ఖం చేత దు:ఖం కొరకు దు:ఖం వలన
    నుల్క‌తోంగ్ నిజాలు
    అప్పుడు
    ఎలా కలవాలి ?
    నిన్న- నేడు - రేపు
    జాషువా సాహిత్యంలో , కులం - మతం సామాజిక దృష్టి
    ముందు బాక్సైట్‌ సంగతి చూడండి
    మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...
    దేశద్రోహ నేరం!

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •