బ్రాహ్మ‌ణీయ హిందూ ఫాసిజాన్ని ప్ర‌తిఘ‌టిద్దాం

| సాహిత్యం | వ్యాసాలు

బ్రాహ్మ‌ణీయ హిందూ ఫాసిజాన్ని ప్ర‌తిఘ‌టిద్దాం

- | 21.07.2018 11:21:25am


జూన్ 6న ఢిల్లీ, ముంబై, నాగపూర్‌ల‌లో ఐదుగురు హక్కుల కార్యకర్తలను అరెస్టు చేసి భీమాకోరేగాంవ్ కుట్ర కేసు పేరుతో యుఎపిఎ కింద పోలీసు కస్టడీలో, జైల్లో పెట్టి, అంతకన్నా ఎక్కువగా కార్పోరేటు ఛానల్స్ లో సంచలనాత్మకమైన నిందారోపణలు చేస్తున్నప్పటి నుంచీ దేశవ్యాప్తంగా వీరి పట్ల ప్రజా సంఘాల నుంచి, ప్రజాస్వామ్య వాదుల నుంచి, ప్రజల నుంచి సంఘీభావం వెల్లువత్తుతున్నది. న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ (అఖిల భారత ప్రజాన్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి) ప్రొఫెసర్ షోమాసేన్ (నాగపూర్ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్, జెండర్ అధ్యయనాల శాఖాధిపతి, మహిళా హక్కుల కార్యకర్త, (డబ్ల్యు ఎస్ఎస్) మ హేశ్ రావత్ (విస్థాపన్ విరోద్ జ‌న వికాస్ ఆందోళ‌న్‌ అఖిల భారత కార్యవర్గ సభ్యుడు) సుధీర్ ధాప్లే (రిపబ్లికన్ ప్యాంథర్స్ నాయకుడు, ʹవిద్రోహిʹ పత్రికా సంపాదకుడు) రోనావిల్సన్ (రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ప్ర‌జా సంబంధాల‌ కార్యదర్శి)ల నిర్బంధాన్ని, వారిపై తప్పుడు ఆరోపణలపై ప్రజలు వీళ్లు పని చేస్తున్న కార్యక్షేత్రాల దృష్ట్యా దళితులు, ఆదివాసులు, ముస్లిం మైనారిటీలు, సాంస్కృతిక కార్యకర్తలు, మహిళలు, రాజకీయ ఖైదీలు - మొత్తంగా శ్రమజీవులు, పీడుతులైన విశాల ప్రజారాశులను నిర్బంధంగా చూస్తున్నారు.

ఇటువంటి ప్రజారాశులు - ముఖ్యంగా నయీపీష్వాయీ వివక్షకు, దాడికి గురవుతున్న దళితులు, ఆదివాసులు, ముస్లింలు, బడుగు వర్గాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఎల్గార్ పరిషత్ 2017 డిసెంబర్ 31న దళిత అమరుల ద్విశత స్మృతి సంవత్సరం సందర్భంగా పూనే శనివార వాడలో లక్ష మందికి పైగా సంఘటితమైనపుడు జనవరి 1న ఆర్ఎస్ఎస్ శక్తులు శంభాజీ భిడే, మిలింద్ ఎక్బోటే ప్రేరేపణతో చేసిన దౌర్జన్యంలో దళితులే మరణించారు. దళితులే గాయపడినారు. ఈ ఇద్దరిపై నేరారోపణ జరిగి, సుప్రీంకోర్టు దాకా ముందస్తు బెయిల్ నిరాకరింపబడినా వారు బ‌లాదూర్‌గా తిరుగుతున్నారు. ఎందుకంటే ఈ ముఠా నాయకుడు శంభాజీ భిడేను దేశ ప్రధాని నరేంద్రమోడీ ʹగురూజీʹగా సమ్మానిస్తాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆయనకు ʹపద్మశ్రీ ఇప్పించాలని చూసాడు. మక్కా మసీదు బాంబు పేలుడులో ముస్లిం పేదలే మరణించి, ఆ సందర్భంగా గుమికూడిన జనంపై పోలీసు కాల్పుల్లో ముస్లిం పేదలే మరణించి, మొదట అనుమానితులుగా ముస్లిం యువకులే అరెస్టయినట్లుగా బీమాకోరేగావ్ హింసకు, దౌర్జన్యానికి కారకులంటూ రిలయన్స్ కంపెనీ అండర్ గ్రౌండ్ కేబుల్ వర్కర్స్ యూనియన్ కార్యకర్తలు, ముంబైలో దశాబ్దాలుగా ఉంటున్న తెలంగాణ దళిత, బడుగు వర్గాల యువకులను ఎనిమిది మందిని యాంటీ టెర్రరిస్టు స్కాడ్ జనవరి 14వ తేదీననే యుఎపిఎ కింద అరెస్టు చేసింది. మహారాష్ట్ర గుజరాత్ మధ్యన ప్రభుత్వం తల పెట్టిన గోల్డెన్ కారిడార్లు వ్యతిరేకించడానికి ప్రవేశించిన మావోయిస్టులకు మద్దతు ఇస్తూ ఈ భీమాకోరేగాఁవ్ ప్రదర్శనలో హింసను ప్రేరేపించారని ఆరోపించారు. ఎటిఎస్ ఈ సందర్భంగా నిర్బంధంలోకి తీసుకొని గురి చేసిన చిత్రహింసలు భరించలేక సుప్రసిద్ధ రచయిత మచ్చ ప్రభాకర్ జనవరి నెలలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

ఏప్రిల్ నెలలో ఢిల్లీలో రోనా విల్సన్ ఇంటిపై, నాగపూర్లో సురేంద్ర గాట్లింగ్ ఇంటిపై మహారాష్ట్ర, కేంద్ర నిఘా వర్గాలు దాడిచేసి వాళ్ళ ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్, పుస్తకాలు అన్నీ ఎత్తుకుపోయారు. 2018 జూన్ 6న ఏకంగా ఢిల్లీ, ముంబై, నాగపూర్లలో ఈ ఇద్దరితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి భీమా కోరేగాఁవ్ సంఘటనతో ముడి పెడుతూ పూనేలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పద్నాలుగా రోజులు పోలీసు కస్టడీకి తీసుకొని ఎరవాడ జైలుకు పంపించారు. పోలీసు కస్టడీలోనే గుండెపోటు వచ్చి సురేంద్ర గాట్లింగ్ కు ప్రభుత్వ ఆసుపత్రిలో యాంజియోగ్రాఫ్ కూడ చేయించాల్సి వచ్చింది. జూన్ నెలలోనే పదవీ విరమణ చేయవలసి ఉన్న ప్రొఫెసర్ షోమా సేన్ ఆర్డోరైటిస్తో, అనారోగ్యంతో పధ్నాలుగు రోజులు పోలీసు కస్టడీలో గడపాల్సి వచ్చింది. అరెస్టు నాటి నుంచి రిపబ్లిక్ ఛానెల్, టైమ్స్ నౌ వంటి కార్పొరేట్ ఛానల్ వీళ్లపై, ఎల్గార్ పరిషత్లో, ఐపిఎల్, సిఆర్పిపి వంటి సంస్థల్లో ఉన్న వారిపై పెద్ద ఎత్తున మీడియా ట్రయల్ నిర్వహిస్తున్నది. ప్రకాశ్ అంబేడ్కర్, ఆనంద్ తెల్తుంబ్లే, గౌతమ్ నావ్లఖా, సుధా భరద్వాజ్ మొదలు ప్రముఖ హక్కుల కార్యకర్తలపై, ప్రజాస్వామ్యవాదులు, మేధావుల పై మావోయిస్టు పార్టీ సంబంధాలు, కశ్మీర్ వేర్పాటువాదుల సంబంధాలు ఆరోపిస్తూ విష ప్రచారం చేస్తున్నవి. గతంలో వినాయక్ సేన్తో మొదలై ప్రొ.జి.ఎన్.సాయిబాబా అతని సహచరుల నిర్బంధం, యావజ్జీవ శిక్షతో అర్బన్ మావోయిస్టులనే ఆరోపణ రాజ్య నిర్బంధ వ్యూహమైంది.

మార్చ్ 20న ఎస్.సిఎస్టి అత్యాచార నిరోధక చట్టాన్ని నీరు గార్చిన తర్వాత భీమాకోరేగాఁవ్ కుట్రకేసు వలయం దేశవ్యాప్తమైంది. ఏప్రిల్ 2 భారత్ బంద్ సందర్భంగా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో పదమూడు మంది పోలీసు కాల్పుల్లో అమరులయ్యారు. వందలాది మంది అరెస్టయ్యారు. అప్పటికే ఏడాది పైగా ఉత్తర ప్రదేశ్లో దళితభీమ్ సేన నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ రావణ్, అతని సహచరులు ఏడాదిపైగా జైళ్లలో మగ్గుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో విరసం సభ్యుడు, న్యాయశాస్త్ర విద్యార్థి అంకాల పృథ్వీరాజ్, కేంద్ర విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి చందన్ మిశ్రాలను రోహిత్ వేముల స్మృతిబద్ద హత్యకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న కక్షతో ఈ నేపథ్యంలోనే మర్చ్ నెలాఖరులో విజయవాడలో అరెస్టు చేసి కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ పొదిలి అప్పారావును హత్య చేయడానికి మావోయిస్టు పార్టీతో కలిసి కుట్ర చేసారని యుఎపిఎ, పేలుడు పదార్థాలు కలిగి ఉన్నారనే సెక్షన్, ఆంధ్రప్రదేశ్ ప్రజాభద్రతా చట్టం, నేరపూరిత కుట్ర (120బి)వంటి సెక్షన్లు పెట్టి హైకోర్టులో కూడా బెయిల్ రాకుండా అడ్డుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామిక విద్యార్థి సంఘాల పై తెలంగాణ ప్రజాస్వామిక ఫోరం ఏర్పడినప్పటి నుంచీ కొనసాగుతున్న నిర్బంధం, రాజ్యహింసలో భాగంగా జూన్ 5న వరంగల్ లో డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (డిఎస్యు) రాష్ట్ర అధ్యక్షుడు భద్రి ఇంట్లో అతనితో పాటు మరో ఇద్దరు డిఎస్యు విద్యార్థులు రంజిత్, సుధీర్లను అరెస్ట్ చేసారు. ఆ ఇద్దరినీ మావోయిస్టు పార్టీలో చేర్చడానికి తీసుకుపోతున్నాడని చిత్రహింసలు పెట్టి ముగ్గురిని కూడ యుఎపిఎ తదితర పైన పేర్కొన్న సెక్షన్ల కింద ఖమ్మం జైల్లో పెట్టారు. భద్రీ ఇచ్చిన ఒప్పుకోలు వాజ్ఞ్మూలం అని కల్పించి పత్రికా రచయిత, టిడిఎఫ్ కన్వీనర్ బండి దుర్గాప్రసాద్ ను నెల రోజుల క్రితం అరెస్టు చేసి అదే కేసులో అదే జైల్లో పెట్టి, వాళ్ల అభ్యర్థనపై కాకుండా నేరస్తులను శిక్షించినట్లుగా వరంగల్ జైలుకు బదిలీ చేసి ఒంటరి సెల్స్లో బంధించారు. విచారణలో ఉన్న ఖైదీల విషయంలో ఇది పూర్తిగా చట్ట వ్యతిరేక చర్య. తెలంగాణ విద్యార్థి సంఘం(టివిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కోట శ్రీనివాస్ పై కూడా కాగజ్నగర్ పోలీసు స్టేషన్లో ఇటివంటి నేరారోపణల కత్తియే వేళ్లాడుతున్నది. వీళ్లంతా దళిత, బడుగు వర్గాలకు చెందిన వాళ్లు.

పోడుభూములకు పట్టాలివ్వాలనీ, వనరుల విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సిపిఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) నాయకులను, దళనేతలను యుఎపివ, పబ్లిక్ సెక్యురిటి యాక్ట్ల కింద అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇండ్లలో నుంచి ఎత్తుకుని పోయి ఆయుధాలు కలిగి ఉన్నారని కేసులు పెడుతున్నారు.

ఆదివాసులపై మావోయిస్టులని దాడులు, లైంగిక అత్యాచారాలు, ఎన్ కౌంటర్ హత్యలు, గృహదహనాలు, విస్థాపనల పరాకాష్ఠ ఏప్రిల్ 22 నుంచి 24 దాకా మహారాష్ట్ర గడ్చిరోలిలో సాగిన మారణకాండ అందులో అమరులైన నలభైమంది, నలభై మంది మిస్సింగ్ మైనర్లు, స్త్రీలు - అందరూ ఆదివాసులే. ఈ మారణకాండతో ఆగకుండా ఫారెస్ట్ గెస్ట్హౌజ్లో సి-60 కమాండోలు, సిఆర్పిఎఫ్ బలగాలు మృత్యు హేల నృత్యాలు చేసాయి.
ఈ మారణకాండ లాయిడ్స్, జిందాల్, ఎస్సార్ వంటి కార్పోరేట్ కంపెనీల స్వార్థ ప్రయోజనం కోసమేనని నిజనిర్ధారణ చేసినందుకే, సిడిఆర్ఓ బృందానికి సహకరించిన సుధీర్గాట్లింగ్, మహేశ్ రౌత్లపై కక్ష పెట్టుకున్నది రాజ్యం.

బుర్జాన్వనీ ఎన్ కౌంటర్ హత్య కాలం నుంచి కశ్మీర్లో భారత సైన్యం అమలు చేస్తున్న రాజ్యహింస గురించి నిజనిర్ధారణకు వెళ్లిన ఐపిఎల్ బృందానికి నాయకత్వం వహించినందుకు కూడా రాజ్యానికి సురేంద్ర గాట్లింగ్ పై కక్షగా ఉంది. ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలలో ముస్లింల విషయంలో ʹఎన్ కౌంటర్ʹ హత్యలనేవి సర్వసాధారణమై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు కూడా ఇవ్వాల్సి వచ్చింది. మైనారిటీలకు న్యాయ సహాయం చేసినందుకు రిహాయ్ మంచ్ నాయకుడు రాజీవ్ యాదవను చంపుతామని బెదిరించారు. లౌకిక, ప్రజాస్వామిక వాదులకు హిందుత్వవాదుల నుంచి ఈ బెదిరింపులు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో భౌతిక హత్యలకు దారితీసిన ఉదంతాలు మనకు తెలుసు.

నరేంద్ర దబోల్కర్, గోవింద పన్సారే (మహారాష్ట్ర) కల్బుర్గి, గౌరీలంకేశ్ల హంతకుల ఆలస్యమైన అరెస్టు సందర్భంగా బయటపడిన హిట్ లిస్ట్లలో గిరీశ్ కర్నాడ్, ప్రకాశ్ రాజ్, భగవాన్ వంటి పదహారు మంది ప్రఖ్యాత కళాకారులు, రచయితలు, మేధావులు, హేతువాదులుండడం ఒక వైపు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కేంద్రీయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఛాన్సలర్లు కావడం మరొకవైపు చూస్తున్నాం. ఉన్నత విద్య కాశాయీకరణ, కార్పోరేటీకరణ యూజీసీని రద్దు చేయడంతో పరాకాష్టకు చేరింది.

గడ్చిరోలీ మారణకాండ అడవిలో జరిగితే తుత్తుకుడి మారణకాండ సముద్ర తీరాన జరిగింది. వేదాంత కాపర్ కంపెనీ క్యాన్సరుత్పత్తి, కాలుష్యానికి వ్యతిరేకంగా తమిళనాడు సముద్ర తీరాన చిరకాలంగా సాగుతున్న ప్రతిఘటనపై ప్రభుత్వం జరిపిన పోలీసు కాల్పులు సభ్య ప్రపంచాన్ని విశ్రాంతి పరచినవి. పదమూడు మంది ప్రదర్శనకారులు మరణించారు. కార్యకర్తలు, వాళ్లకు న్యాయసహాయం చేసిన వంచినాథన్, న్యాయవాదులు యుఎపిఎ కింద జైళ్ల పాలయ్యారు. అడవిలో ఆదివాసులు, సముద్ర తీరాన పల్లెకారులు, మత్స్యకారులు ఈ విధ్వంస, హింసలకు బలవుతున్నారు.

ఝార్ఖండ్లో ఏభై ప్రజాసంఘాలతో ఏర్పడిన మజూర్ సంఘటన్ సమితిని నిషేధించి, మధుబన్ (ప్రసిద్ద జైన క్షేత్రం పార్శ్వనాథ్) ధన్ బాద్, గిర్డి, రాంచీలతో కార్మిక సంఘాల కార్యాలయాలు సీల్ చేసి పద్దెనిమిది మంది కార్యకర్తలను అరెస్టు చేసారు. అందులో ఎంఎస్ఎస్ అధ్యక్షుడు బచ్చాసింగ్ మాత్రమే కాదు విస్థాపన్ విరోధీ మంచ్ ప్రధాన కార్యదర్శి దామోర్ తూరి కూడ ఉన్నాడు.

బెంగాల్లో భూమి కోసం పోరాడుతున్న భంగార్ రైతులను మొదలు ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్ పూర్ వరకు ప్రజలపై పలు రకాల రాజ్యహింస కొనసాగుతున్నది. అడవులు, సముద్ర తీరాలు, గ్రామాలు మొదలు క్యాంపస్ల వరకు పోలీసు బులెట్లు, బాష్ప వాయు ప్రయోగాలు, అక్రమ అరెస్టులు నిత్యకృత్యమయ్యాయి. ఈ అన్ని సందర్భాల్లోనూ యుఎపిఎ, ఎన్ఎస్ఎ, పిఎస్ వంటి అప్రజాస్వామిక చట్టాలను ప్రయోగిస్తున్నారు. కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలోనైతే సైనిక బలగాలకిచ్చిన ప్రత్యేక అధికారాల చట్టాన్ని ప్రయోగిస్తున్నారు.

ఇటువంటి అత్యంత దారుణమైన భీబత్సవాతావరణంలో నిర్బంధాన్ని, రాజ్యహింసను ప్రతిఘ‌టించడానికి విశాల ప్రజారాశులు, వివిధ రంగాలకు చెందిన ప్రజాస్వామ్యవాదులు సంఘటితమై అవిశ్రాంత ఉద్యమం నిర్వహించడమొక్కటే మార్గం. ఈ బాధ్యతను, కర్తవ్యాన్ని స్వీకరించి దేశంలోని ప్రముఖ ప్రజాస్వామ్యవాదులు, విశ్రాంత న్యాయమూర్తులు, మేధావులు, కళాకారులు రాజ్యహింసకు, అప్రజాస్వామిక చట్టాల ప్రయోగానికి, హక్కుల కార్యకర్తల అరెస్టులకు నిరసనగా ఆగస్ట్ 3 శు క్రవారం రోజు ʹచలో పార్లమెంట్ʹ (చలో ఢిల్లీ) పిలుపు ఇస్తున్నారు.

1. భీమా కోరేగావ్ శౌర్య దిన ప్రేరణ అభియాన్ రోజు(జనవరి 1, 2018), హింసా దౌర్జన్యాలను రెచ్చగొట్టిన మనోహర్ ʹశంభాజీʹ భీడే, మిలింద్ ఎక్బోటేలను వెంటనే అరెస్టు చేసి విచారించి శిక్షించాలి.
2. సురేంద్ర గాడ్లింగ్, షోమా సేన్, మహేశ్ రౌత్, సుధీర్ ధావ్లే, రోనా విల్సన్లను వెంటనే విడుదల చేయాలి.
3. 2018 జనవరిలోనే భీమా కోరేగావ్ కేసులో యుఎపిఎ కింద జైల్లో పెట్టిన రిలయన్స్ కేబుల్ వర్కర్స్ యూనియన్ కార్యకర్తలైన‌ ఎనిమిది మంది తెలుగు యువకులను (ముంబైలో స్థిరపడిన తెలంగాణకు చెందిన వాళ్లు) వెంటనే విడుదల చేయాలి.
4. అంకాల పృథ్వీరాజ్ (న్యాయ శాస్త్ర విద్యార్థి, విజయవాడ), చందన్ మిశ్రా (పరిశోధక విద్యార్థి, కేంద్రీయ విశ్వవిద్యాలయం)లను వెంటనే విడుదల చేయాలి.
5. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ బండి దుర్గా ప్రసాద్ (జర్నలిస్ట్)ను, డెమొక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బద్రి, అతని సహచరులు రంజిత్, సుధీర్లపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ డెమొక్రటిక్ ఫోరం కన్వీనర్ కోట శ్రీనివాస్ పై కాగజ్ నగర్ పోలీసులు పెట్టిన అక్రమ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి. పౌర హక్కుల సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి రమేష్ చంద్రను వెంటనే విడుదల చేయాలి.
6. సిపిఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) నాయకులను పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని బేషరతుగా విడుదల చేయాలి.
7. భీమ్ ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ ( రావణ్)తోపాటు ఏడాదికి పైగా యూఎపిఏ, ఎన్ ఎస్ ఏ కింద ఇతర కేసుల్లో ఉత్తరప్రదేశ్ జైల్లో పెట్టిన అతని సహచరులు భీం ఆర్మీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి.
8. సుప్రీంకోర్టు ఎస్.సి, ఎస్.టి అత్యాచారాల నిరోధక చట్టాన్ని నీరుగారుస్తూ ఇచ్చిన తీర్పును నిరసిస్తూ 2018 ఏప్రిల్ 2న నిర్వహించిన ʹభారత్ బంద్ʹలో పోలీసు కాల్పుల్లో అమరులైన దళితుల హత్యకు కారకులైన పోలీసు అధికారులపై హత్యా నేరాన్ని నమోదు చేసి, విచారణ చేసి శిక్షించాలి. ఆ సందర్భంగా అరెస్టయిన వాళ్లందరిని వెంటనే విడుదల చేయాలి.
9. తూతుకుడిలో వేదాంత కాపర్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రదర్శన చేసిన ప్రజలపై కాల్పులు జరిపి పదముగ్గురిని చంపిన పోలీసు అధికారులపై హత్యానేరం మోపి విచారించి శిక్షించాలి. ఆ సందర్భంలో అడ్వకేట్ ఎస్ వంచినాథన్ ను అతనితోపాటు అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి.
10. భంగార్ భూపోరాటం (బెంగాల్)లో యుఎపిఎ కింద అరెస్టు చేసిన ఉద్యమ కార్యకర్తలు అలిక్ చక్రవర్తి, కుశాల్ దేబ్ నాథ్, శర్మిష్ట చౌదరి, రతుల్ బెనర్జీ, ప్రదీప్ సింగ్ ఠాకూర్ మొదలగు ఎందరో గ్రామస్తులను వెంటనే విడుదల చేయాలి.
11. మజ్దూర్ సంఘటన సమితి (ఎంఎస్ఎస్) అధ్యక్షుడు బచ్చా సింగ్తోపాటు యుఎపిఎ కింద అరెస్టయిన కార్యకర్తలను,విస్తాపన్ విరోధి మంచ్ ప్రధాన కార్యదర్శి దామోదర్ తురిని వెంటనే విడుదల చేయాలి. ఎంఎస్ఎస్ (ఝార్ఖండ్)పై నిషేధాన్ని ఎత్తివేయాలి.
12. కర్ణాటకలో, ఇతర చోట్ల ప్రజామేధావుల హత్యకు కుట్ర చేసిన హిందుత్వవాదులను వెంటనే విచారించి శిక్షించాలి..
13. ఏప్రిల్ 22-24 గడిచిరోలి ఆదివాసి ప్రజలపై మారణకాండ, మిస్సింగ్ సంఘటనలపై సుప్రీం కోర్టు (సిట్టింగ్ లేదావిశ్రాంత) న్యాయమూర్తితో న్యాయవిచారణ జరిపించాలి, ఈ హత్యాకాండకు బాధ్యులైన పోలీసు అధికారులపై హత్యా నేరం నమోదు చేసి వారిని సస్పెండ్ చేసి విచారణ నిర్వహించాలి.

అప్రజాస్వామిక చట్టాలు, హక్కుల కార్యకర్తలపై నిర్బంధ వ్య‌తిరేక‌ ప్రచార ఉద్యమం

No. of visitors : 589
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •