మిగతా కథ

| సాహిత్యం | క‌థ‌లు

మిగతా కథ

- మానస ఎండ్లూరి | 21.07.2018 11:42:21am

రమేష్ హుషారుగా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు.

అతని ఆనందం చూసి తండ్రి నరసింహారావుకి ఏదో జరగరాని పని ఏదైనా జరిగిందా అని కంగారు మొదలైంది.

ʹఏరా కథల పోటీల్లో నీ కథ ఎంపికైందా?ʹ

కొడుకు మొహంలో ఆనందం కనిపిస్తున్నా పైకి కనిపించని పని వత్తిడిని గమనించి మంచి నీళ్ళు అందిస్తూ అడిగాడు నరసింహారావు.
ఆ ప్రశ్న కి రమేష్ హుషారంతా నీరుగారిపోయింది.

ʹలేదు నాన్న. ఈ సారి కూడా రాలేదు. మళ్ళీ సాధారణ ప్రచురణకే తీసుకున్నారుʹ దిగులుగా చెప్పాడు రమేష్.

ʹఅదేవిట్రా! ఎంతైనా అదే పత్రికలో ఎప్పటి నుంచో సహ సంపాదకుడిగా చేస్తున్నావ్. ఇన్ని కథలు రాశావ్. అయినా ఏ కథకూ బహుమతి రాకపోడమేంటి? సరే బయట పత్రికలు నీ కథలు చూసి నీ పోస్ట్ వచ్చిందంటేనే భయపడుతున్నారనుకోʹ నవ్వు ఆపుకుంటూ అన్నాడు తండ్రి.

ʹఊరుకో నాన్నా నీకు మరీ నేనంటే లెక్కలేకుండా పోయిందిʹ అనుకుంటూ స్నానానికి వెళ్ళాడు రమేష్.

తల్లి లేని కుటుంబం. తండ్రీ కొడుకులు ఇద్దరే ఉంటారు. నరసింహారావు రిటైర్ అయ్యాక ఇంటి పెత్తనమంతా అతనిదే. అద్భుతంగా వంట చేస్తాడు. రమేష్ కు సమయానికి అన్నీ అందిస్తాడు. స్త్రీ లేనితనం ఏ మాత్రం కనబడని ఇల్లు అది.

రమేష్ స్నానం ముగించుకుని నిన్న రాస్తూ వదిలేసిన కథ పూర్తి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు. తండ్రి అప్పటికే టమాట రసానికి తాలింపుకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. కథ రాయడం కష్టమంటే కాదు వంట చేయడం కష్టం అని ఎప్పుడూ వాదించుకుంటూ ఉంటారు ఇద్దరూ. పైకి చెప్పడు గానీ కొడుకు కథకు బహుమతి వస్తే అందరికంటే ఆనందించేది నరసింహారావే. బహుమతి పొందిన రచయితగా కొడుకు పేరు చూసుకోవాలని తానూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు.

రచన పని ముగించుకుని భోజనానికి కూర్చున్నాడు రమేష్. వంటే కాదు వడ్డన కూడా తండ్రి పనే.

ʹఇంతకీ వచ్చేటప్పుడు చాలా చలాకీగా వచ్చావ్. ఏంటి సంగతి?ʹ అడిగాడు నరసింహారావు అన్నం వడ్డిస్తూ.

ʹరాగానే నీళ్ళు చల్లావ్ గాʹ

ʹమరేంటి రా, మంచి కథలు రాయరా అంటే రాసిన కథనే ఇటు మార్చి అటు మార్చి మళ్ళీ రాస్తావ్. కొన్ని అయితే మరీ అన్యాయం. పాత్రల పేర్లు శీర్షికల పేర్లు మార్చి రాసావ్. మీ పత్రిక కాబట్టే ఆ మాత్రం సాధారణ ప్రచురణకు ఒప్పుకుంటున్నాడు మీ ఎడిటర్ʹ

ʹఅయినా నా కథలకీ పాఠకులూ అభిమానులు ఉన్నారు. నువ్వేం వెటకారం చెయ్యనక్కరలేదుʹ

ʹసరే మంచిదే. నెలకు రెండు మూడు సార్లు భారీ పారితోషికంతో కథల పోటీలు పెడుతూనే ఉంటారు. ఒక్కదాంట్లోనూ నీ పేరు వచ్చి చావదు. కనీసం ఆఖరి బహుమతైనా రాదుʹ

ʹఅబ్బా నాన్నా నీకు చెప్పినా అర్ధం కాదు. బహుమతులు వచ్చేది సగం మా పత్రికలో పని చేసేవారికే. అదీ మా ఎడిటర్ తో సత్సంబంధాలు ఉన్నవాళ్లకేʹ

ʹలేదంటే మీ ఆస్థాన రచయితలకు. నాకెందుకు తెలీదు. కథల పోటి చూసిన ప్రతిసారీ ఫలితాల జాబితా కూడా కనబడుతూనే ఉంటుంది. మీ కార్టూనిస్ట్, కాలమిస్త్స్, ఆ నలుగురైదుగు రచయితలు. వాళ్ళేగా ఎప్పుడూ వచ్చేది. ఒక్క కొత్త పేరు కనబడితే ఒట్టు.ʹ
ʹమా ఎడిటర్ కు నేనంటే పడి చావదు. అందుకే నాకెప్పుడూ బహుమతులు రాకుండా చేస్తున్నాడు. రోజూ నా మొహం చూడాలి కాబట్టి నా కథలన్నీ సాధారణ ప్రచురణకి మాత్రమే తీసుకుంటాడుʹ

ʹఇదంతా సరేలే. ఇంతకు నువ్ ఆనందంగా రావడానికి కారణం ఏంటో చెప్పనేలేదేʹ

ʹమా ఎడిటర్ ఇవ్వాళ కొంచెం సుముఖంగా మాట్లాడాడు నాన్నా. ఏదో పని ఉండుంటుందిʹ

ʹహ అంతే. పనుంటేనే మనం కనిపిస్తాం రా. ఇంకొంచెం అన్నం పెట్టుకోʹ

ʹచాలుʹ తో రోజు గడుస్తుంది ఇద్దరికీ.

కొడుకు పని చేసే వార పత్రికను ఆత్రంగా చూడడం. రమేష్ పేరు లేకపోడంతో విసుగొచ్చేది నరసింహారావుకు. కానీ ఈ మధ్య ఏదో కొత్త కథ చాలా రోజులనుంచి నలుగుతూ రాయడం గమనించాడు. ʹఅసలు వీడు ఎటువంటి కథ రాస్తున్నాడాʹ అని కొడుకు గదిలోకి వెళ్ళాడు రమేష్ ఆఫీసుకు వెళ్ళిన వెంటనే.

బల్ల మీద ఎన్నో కాగితాలు చెల్లా చెదురుగా పడున్నాయి. ఎప్పుడూ సర్డుకోడు. తాను సర్డుదామంటే తన గదిలోకే రానివ్వడు. ఆ పుస్తకాలూ ఈ పుస్తకాలూ తీసి మొత్తానికి సగం రాసి ఉన్న కథను పట్టాడు నరసింహారావు. శీర్షిక లేదు కథకు. మూడు పేజీల వరకు రాసుంది. రమేష్ కు తను ఈ సగం కథ చదివినట్టు తెలిస్తే నచ్చదు. బాగా తిడతాడు. కానీ కళ్ళ ముందు కాగితాలు రెపరెపలాడుతుంటే ఉండబట్టలేక చదివేశాడు. సరిగ్గా అణకువగా ఉండే హరిత వాచ్ మాన్ భార్య సుశీలను హత్య చెయ్యడంతో ఆపేశాడు. అనవసరంగా సగం కథ చదివాననుకున్నాడు నరసింహారావు. ఇప్పుడు మిగతా కథ ఎలా తెలిసేది? కొడుకు మళ్ళీ ఇంటికొచ్చి ఆలోచించి ఆ కథను పూర్తి చెయ్యాలి. అప్పటిదాకా నోరు మెదపకుండా ఎదురు చూడాల్సిందే.

సాయంత్రం అలసిపోయి వచ్చిన కొడుక్కి ఎదురెళ్ళి మరీ తాగడానికి చల్లని పండ్ల రసమిచ్చాడు. ఎప్పుడూ లేనిది ఇదేంటి కొత్తగా అని అర్ధమే కాలేదు రమేష్ కు. అనుమానంగా గ్లాస్ అందుకుని గడ గడా తాగేసి తండ్రికిచ్చేసాడు. వెంటే ఉండి సపర్యలు చేస్తున్న తండ్రిని చూస్తుంటే ఏమీ అర్ధం కావడం లేదు రమేష్ కి. ప్రతి రోజులా కథల మీద అంత సమయం వృధా చెయ్యొద్దని వాదించడం లేదు. పైగా తలుపు కూడా దగ్గరకు వేసి ఏకాంతాన్ని కల్పించాడు. ఆ రాత్రి తనకిష్టమైన గోంగూర పచ్చడి చేసిపెట్టాడు. ఉన్నట్టుండి ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నాడో అర్ధం కాలేదు రమేష్ కి.

మరుసటి రోజు రమేష్ ఆఫీస్ కు వెళ్ళిపోగానే తన గదిలో మిగిలిన కథ కోసం కాగితాలన్నీ తిరగేసి వెతికాడు తండ్రి నరసింహారావు. కానీ దొరకలేదు. అనుమానమొచ్చి ఎక్కడైనా దాచాడా లేక పూర్తి చేసి పట్టుకెళ్ళిపోయాడా అని చాలా ఆలోచించి నిరాశచెందాడు. కనీసం కథ పేరైనా తెలుసుకోలేనందుకు విచారంగా రోజు గడిపాడు. ఆ సాయంత్రం మళ్ళీ షరా మాములే. ఇంటికొచ్చిన కొడుకును త్వరగా స్నానం చెయ్యమని గసరడం, కథలు మంచిగా రాయమని చీవాట్లు పెట్టడం. పళ్ళరసం లేదు పలకరింపు లేదు. తండ్రిని చూసి ఇప్పుడు కాస్త ధైర్యంగా ఉన్నాడు రమేష్.

ఈ కథ కచ్చితంగా పోయిన వారం పెట్టన పోటీలకు పంపే ఉంటాడు. అంటే ఫలితాలు రెండు వారాల్లో ఇచ్చేస్తాడు. ఈ సారి ఎలా అయినా కొడుక్కి ఏదోక బహుమతి వస్తుందని ఎదురు చూస్తున్నాడు నరసింహారావు.

ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. పత్రిక ఇంటికి వచ్చిన వెంటనే గబా గబా వెతికాడు. తన కొడుకు పేరు ఎక్కడా లేదు. నిస్సత్తువగా కూలబడ్డాడు కుర్చీలో. మొదటి బహుమతి ఒక కొత్త రచయిత విక్రాంత్ కు రెండు మూడవ బహుమతులు ఎప్పుడూ వచ్చేవాళ్ళకే వచ్చాయి.

అంతలోనే ఆఫీస్ నుంచి వచ్చాడు రమేష్.

ʹఏరా ఈ మధ్య ఆలస్యమవుతుందిʹ లోపలికెలుతూ అన్నాడు తండ్రి.

ʹమా ఎడిటర్ అమెరికా వెళ్ళాడు నాన్న. నేనే ఆయన పనులన్నీ చెయ్యాలి. కొంచెం బయటకెళ్ళే పనుందʹనుకుంటూ వెళ్ళాడు రమేష్.
ఈ సారి కూడా తన కథ ఎంపిక కాలేదని అలా మిత్రుల దగ్గరకు వెళ్ళాడేమో అనిపించింది తండ్రికి. కొడుకు వీధి దాటాడని చూసుకుని అతని గదిలోకి వెళ్ళాడు మిగిలిన కథ దొరుకుతుందేమోనని. రమేష్ ఆఫీస్ బాగ్ చూశాడు. కథకు సంబంధి౦చిన కాగితాలేవీ దొరకలేదు కానీ మొదటి బహుమతిగా నగదు పొందిన ʹవిక్రాంత్ʹ కు వెళ్ళాల్సిన బ్యాంకు చెక్ కనబడింది.

నిశబ్దంగా బయటకు వచ్చాడు. పత్రికలో మిగతా కథ చదవడానికి.

No. of visitors : 507
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఆగస్టు 2019

  ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగ వ్యతిరేకం
  వేటగాడి వల
  పదునెక్కుతున్న కోరలు
  ఎదురుచూపులు
  యురేనియమం
  మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ
  నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో
  దళిత నవలా సాహిత్యంలో ఒక మైలురాయి "నిషిధ"
  చరిత్ర కన్న శిశువు - చరిత్రకు మార్గదర్శి
  ʹఅస‌మ్మ‌తిʹపై ఎక్కుపెట్టిన అస్త్రం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •