నాస్తికోద్యమ నాయకుడు కడుచూరి అయ్యన్నకు నివాళి

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

నాస్తికోద్యమ నాయకుడు కడుచూరి అయ్యన్నకు నివాళి

- విరసం | 03.08.2018 10:27:07am

శాస్త్రీయ చింతనతోనే అంధ విశ్వాసాలను, బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలాన్ని ఓడించగలం

నాస్తిక సమాజం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు కడచూరి అయ్యన్న(70) 25వ తేదీ బుధవారం మధ్యాన్నం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన స్మృతికి విరసం నివాళి అర్పిస్తోంది. సుమారు నలభై ఏళ్ల ప్రజా జీవితంలో నాస్తిక భావజాలాన్ని ప్రచారం చేయడంలో అయ్యన్న అవిశ్రాంతంగా కృషి చేశారు. భూస్వామ్యం, బ్రాహ్మణ్యం, కులవ్యవస్థ సంకెళ్లలో బందీ అయిన మన సమాజంలో మూఢనమ్మకాలు, ఆచారాలు, విశ్వాసాలు, సనాతన ధర్మం, వెనుకబాటతనం మొదలైనవన్నీ దైవ భావం చుట్టూ అల్లుకొని ఉన్నాయి. హేతుచింతన కొరవడిన స్థితిలో మనుషులను తప్పుడు భావజాలం నడిపిస్తూ ఉంటుంది. నాస్తికోద్యమం దీనిపై పోరాటం ఎక్కుపెట్టింది. తెలుగు సమాజాల్లో ఎందరో నాస్తిక హేతువాద ఉద్యమకారులు ఇందులో గణనీయంగా కృషి చేశారు. వారిలో అయ్యన్న ప్రముఖుడు. చాలా మందిలాగా ఆయన నాస్తికవాదం పరిధిలోనే ఉండిపోకుండా వామపక్ష, విప్లవ శక్తులతో నిరంతర సంపర్కంలో ఉండేవారు. శాస్త్రీయ దృక్పథం పట్టుపడకుండా మూఢ నమ్మకాలను, మతాన్ని, దైవాన్ని జయించలేమనే అభిప్రాయం ఆయనకు బలంగా ఉండేది.

దీనికి మార్క్సిస్టులతో కలిసి పని చేయాలని, సమాజంలో ప్రజాస్వామిక హేతు చింతన విస్తరింజేసే ఉద్యమంలో విప్లవ శక్తులు నమ్మకమైన మిత్రులనే అభిప్రాయం ఉన్న నాస్తికవాది ఆయన. ఇది నాస్తికవాదిగా ఆయనలోని ప్రత్యేకత. అందుకే 2018 జనవరిలో బ్రాహ్మణీయ హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా మహబూబ్‌నగర్‌లో విరసం రాష్ట్ర మహాసభలు తలపెట్టినప్పుడు ఆహ్వాన సంఘంలో ఉండేందుకు ఆయన సంతోషంగా అంగీకరించారు. మతాన్ని దాని భౌతిక పునాది నుంచి చూడాలనే మార్క్సిస్టుల ఆలోచనలను ఆయన చాలా ఒపెన్‌ మైండ్‌తో పంచుకునేవారు.

మంగళగిరి దగ్గర ఉండే నిడమర్రు నాస్తిక కేంద్రంలో రామకృష్ణగారి నేతృత్వంలో జరిగే నాస్తిక సభలకు అయ్యన్న తప్పక విరసం తదితర విప్లవాభిమానులను ప్రతి ఏటా ఆహ్వానించేవారు. పాలమూరు నుంచి మంగళగిరి దాకా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయ్యన్నకు విస్తృత సంబంధాలు ఉండేవి. చార్వాక పత్రిక ఎడిటర్‌గా కూడా ఆయన చేసిన కృషి చాలా విలువైనది. శాస్త్రీయ దృక్పథ ప్రచారానికి ఆయన ఉపాధ్యాయుడిగా తరగతి గదిని కూడా పోరాట క్షేత్రంగా ఎంచుకున్నారు. పిల్లల మానసికతను గుర్తించి వారిలో హేతుచింతన పెంచడానికి కృషి చేసేవారు.

ఉద్యోగ విరమణ తర్వాత అయ్యన్న ఒక రకంగా నాస్తికోద్యమానికి పూర్తి కాలం పని చేశారని చెప్పవచ్చు. నాస్తికత్వాన్ని జీవితాచరణగా మలుచున్న ఆలోచనాపరుడాయన. సాంకేతిక రంగం విస్తరించి సమాజం ముందుకుపోతోందని పాలకవర్గం ప్రచారం చేసుకుంటోంది. కానీ వాస్తవానికి మూఢ నమ్మకాలు, మతం, ఆధ్యాత్మికత విపరీతంగా పెరిగిపోయాయి. పాత ఆచారాలే కొత్త వేషాల్లో ముందుకు వస్తున్నాయి. కొత్త దేవుళ్ల రద్దీ అంతా ఇంత కాదు. బ్రాహ్మణ్యం తన సకల వికృత రూపాలను ప్రదర్శిస్తోంది. హిందుత్వ బూర్జువా రాజకీయాలతో కలిసి ఫాసిజంగా మారిపోయింది. ఈ బూర్జువా నియంతృత్వం తిరుగు లేకుండా కొనసాగాలంటే ప్రజలను సరికొత్త సంకెళ్లతో మతానికి బందీలను చేయాలి. ప్రజల హేతుదృష్టిని దెబ్బతీసి వస్తు దృష్టిని, మత దృష్టిని పెంచాలి. పాలకవర్గం ఇప్పుడు ఈ పని గతం కంటే ముమ్మరంగా చేస్తోంది. ఈ తరుణంలో హేతు దృక్పథాన్ని ప్రజల కామన్‌సెన్స్‌లో భాగం చేసే అతి పెద్ద భావజాల, సాంస్కృతిక ఉద్యమం నిర్మాణం కావాల్సి ఉంది. అయ్యన్న ఈ సమగ్ర అవగాహనతో నాస్తికోద్యమాన్ని నడిపారు. దీన్ని మరింత ముందుకు తీసికెళ్లాల్సి ఉంది. నాస్తిక, హేతువాద, దేశీయ ఆలోచనాధారలన్నీ, కుల, మత వ్యతిరేక చైతన్యాలన్నీ ఏకం కావాల్సి ఉంది. మార్క్సిస్టు లెనినిస్టు దృక్పథం వెలుగులో శాస్త్రీయతను గీటురాయి చేసుకోవాల్సి ఉంది. ఇలాంటి ప్రయత్నం చేయడం ద్వారానే అయ్యన్న ఆశయాన్ని కొనసాగించగలం.

పాణి
విరసం కార్యదర్శి
26 జూలై 2018

No. of visitors : 443
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •