భావప్రకటన స్వేచ్ఛ‌పై దాడి

| సంభాషణ

భావప్రకటన స్వేచ్ఛ‌పై దాడి

- వూకె రామకృష్ణ దొర,ఆదివాసీ రచయితల సంఘం | 03.08.2018 11:18:57am


సామాజిక ఉద్యమకారుడు, ఆదివాసీ అణగారి వర్గాల కార్యకర్త స్వామి అగ్నివేష్‌పై హిందూ మతోన్మాదుల దాడిని ఖండించాలని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు అన్నారు. ఆదివాసీ అణగారిన వర్గాలకు పౌరహక్కులకూ, మానవ హక్కులకూ దేశంలో ఎక్కడ భంగం వాటిల్లినా కూడా ప్రత్యక్షం అయి హక్కుల సాధన కోసం పోరాడే వ్యక్తి అనునిత్యం సామాజిక ఉద్యమాలకూ ఉద్యమ సంస్థలకూ ఊపిరిగా ఉండే వ్యక్తి స్వామి అగ్నివేష్‌ హిందు మతోన్మాదం, బ్రాహ్మణ ఫ్యూడలిజంపై గళమెత్తిన వ్యక్తి స్వామి అగ్నివేష్‌. ఆదివాసీల హక్కుల సాధన కోసం, బూటకపు ఎన్‌కౌంటర్ల బూజు దులపటం కోసం అనేక సార్ల న్యాయస్థానాలలో కేసులు వేసి బాధితులకూ అండగా నిలిచిన వ్యక్తి. ఛత్తీస్‌ఘడ్‌ సాల్వాజుడుం మాఫియా అరాచకాలపై అనేకసార్లు ప్రజాసంఘాలతో కలిసి సుప్రీం కోర్టులో సైతం కేసు వేసి సాల్వజుడుంని నియంత్రించిన వ్యక్తి స్వామి అగ్నివేష్‌ పాలకవర్గాల ప్రజా వ్యతిరేఖ విధానాలనూ ప్రజలలో ఎండగట్టి పౌర హక్కుల కోసం తన జీవితాంతం పోరాడే వ్యక్తి స్వామి అగ్నివేష్‌ నేడు నరేంద్ర మోడీ ఫాసిస్టు హిందు మతోన్మాద బ్రాహ్మణ ఫ్యూడలిజంపై గళమెత్తిన వ్యక్తి స్వామి అగ్నివేష్‌ నరేంద్రమోడీ కార్పోరెట్లకూ, పారిశ్రామికవేత్తకూ ఆదివాసీల భూమిలు ధారాదత్తం చేయాడానికి స్వామి అగ్నివేశ్‌ వ్యతిరేఖిస్తున్నాడు. అందుకే బీజేపి మరియు దాని అనుబంధ సంస్థల కార్యకర్తలు జార?ండ్‌ రాష్ట్రంలోని పకూర్‌లో ఆదివాసీల సభకు హాజరైన స్వామి అగ్నివేష్‌పై బిజెపి, ఎబివిపి కార్యకర్తలు జై శ్రీరాం అంటూ తీవ్రంగా దాడి చేసి దుస్తులనూ చించివేశారు. తీవ్రంగా కొట్టి అవమానపరిచారు. 70 ఏళ్ళ స్వతంత్య్ర భారతావనిలో ఇంకా రచయితలు, మేధావులు, విద్యావంతులు, ఎడిటర్స్‌, సామాజిక, ప్రగతిశీల కార్యకర్తలపై దాడులు హత్యలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని మాయని మచ్చగా మిగిలిపోతున్నాయి. భావ ప్రకటన హక్కుకు అర్థం లేకుండా ఈ పాలకవర్గాలు చేస్తున్నాయి. హిందు ఫాసిస్ట్‌ విధానాలనూ, హిందు మతోన్మాదాన్ని ప్రజలపై ప్రజాస్వామికవాదులపై, రచయితలపై మేధావులపై తీవ్రంగా రుద్దుతున్నారు. నరేంద్రమోడి పాలనకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడిన వారిపై జాతి వ్యతిరేఖ ముద్ర వేస్తున్నారు. బిజెపి అనుబంధ సంస్థలు ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి, భజరంగ్‌దళ్‌ మిగతా హిందు మత సంస్థలు కలిసి హిందూ సామ్రాజ్యావాదాన్ని హిందు బ్రాహ్మణ ఫ్యూడలిజాన్ని, హిందు మతోన్మాదాన్ని బలవంతంగా వ్యాపింపజేస్తున్న, ప్రగతిశీల కార్యకర్తలపై దాడులు చేసి మేధావులు నోరు మూయించాలని బిజేపి ప్రయత్నిస్తున్నది. అఖండ భారత నిర్మించాలని కలలు కంటున్నది. ఇందుకోసం భారత రాజ్యాంగాన్ని సవరించాలని రాజ్యాంగంలో ఉన్న సెక్యూలర్‌ పదాన్ని తీసివేయాలని మత స్వేచ్ఛ హక్కు తొలగించాలని ప్రయత్నిస్తున్నది. ఈ పరిణామాలు ఈ దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను, భావప్రకటన స్వేచ్ఛ హక్కునూ దెబ్బతీసి వేయాలా ఉన్నాయి. ఇందు భాగంగానే సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌పై ఆర్‌ఎస్‌ఎస్‌, భజరంగ్‌దళ్‌, ఎబివిపి కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాడితే ʹʹనక్సలైట్స్‌ʹʹ ముద్రవేసి అణిచివేస్తున్నారు. ఆదివాసీ పోరాటాలకూ అండగా నిలిస్తున్న మేధావులపై దాడులు చేస్తున్నారు.

స్వామి అగ్నివేష్‌పై జరిగినా దాడి అంటే ఈ దేశంలో సామాజిక కార్యకర్తలపై జరిగిన దాడిగా భావించాల్సి ఉంటుంది. స్వామి అగ్నివేష్‌పై జరిగిన దాడి అంటే భావప్రకటన స్వేచ్ఛా హక్కుపై జరిగిన దాడిగానే భావించాల్సి ఉంటుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగేటపుడు చాలాసార్లు తెలంగాణ సభల్లో పాల్గని ఢిల్లీ స్థాయిలో తెలంగాణ ఉద్యమాన్ని తీసుకువెళ్ళిన వ్యక్తి ఛత్తీస్‌ఘడ్‌ సాల్వాజుడుం ఆదివాసీలపై చేస్తున్న అరాచకులపై జాతీయ స్థాయిలో ఉద్యమం చేసిన వ్యక్తి. ఆనాడు ఛత్తీస్‌ఘడ్‌లో ఆదివాసీ హక్కుల ఉల్లంఘన జరిగితే బస్తర్‌ సుక్మా జిల్లాలో పర్యటిస్తున్న క్రమంలో కూడా స్వామి అగ్నివేష్‌ పై ఆనాటి బిజెపి కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌పై జరిగిన దాడిని ప్రజలు, ప్రజాస్వామికవాదులు మేధావులు, విద్యావంతులు, ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాలి. సామాజిక కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మేధావులు ఐక్యంగా పోరాటం చేయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అక్షరం అనే ఆయుధంతో పక్షవాతం లేకుండా ప్రజల పక్షాన నిలబడాలి. ప్రజలకు ప్రాణం పోయాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి.





No. of visitors : 301
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    ఖైదు కవి స్వేచ్చ కోసం పోరాడదాం
    అరుణతార నవంబర్ - 2018
    International Seminar on Nationality Question
    రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
    ప్రభుత్వమే అసలైన కుట్రదారు
    సూర్యాక్షరం
    శ్వాసిస్తున్న స్వ‌ప్నం
    చిరున‌వ్వే ఓ ప్ర‌క‌ట‌న‌
    వెలిసిన రంగులు
    అతనేం చేసిండు?
    సరిహద్దున సముద్రమైనా లేన‌ప్పుడు
    ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •